బెట్టింగ్ యాప్ దందా..బాలీవుడ్ ప్రముఖులు,యూట్యూబర్ హర్ష సాయి,బయ్య సన్ని యాదవ్‌కి సంబంధం..?
ఈ మధ్య కాలంలో బెట్టింగ్ యాప్, ట్రేడింగ్ యాప్‌ల మోసాలకు బలైపోతున్నారు చాలామంది. రూపాయి పెడితే పది రూపాయి పెడతాం.. లక్ష పెడితే పది లక్షలు ఇస్తాం.. కోటీశ్వరు అయిపోవచ్చు అంటూ ఎర వేస్తున్నారు. ఇక షార్ట్ కట్‌లో డబ్బు సంపాదించడానికి.. అతిగా ఆశపడి.. ఈ బెట్టింగ్ యాప్, ట్రేడింగ్ యాప్‌లతో సర్వంగా కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సామన్య ప్రజలు.Sri Media News
మెట్రోపాలిటన్ సిటీల నుండీ, పల్లె ప్రాంతాలకూ ఈ బెట్టింగ్ భూతం పాకేసింది. 2007లో ఐపీఎల్ మొదలైనప్పటి నుండీ దీని ప్రభావం మరింత పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్ భూతం వలలో కాలేజ్ పిల్లల, టీనేజ్ పిల్లలను సైతం చిక్కుకుంటున్నారు. బెట్టింగ్ అలవాటుగా, అడిక్షన్ గా మారిపోతోంది. ఆన్ లైన్ బెట్టింగ్ సైట్‌లు ఎన్నో ఇండియాకు రావడంతో ఈ ప్రభావం త్వరగా దేశం మొత్తం వ్యాపించింది.
అయితే ఈ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నది ఎవరో కాదు.. మన సెలబ్రిటీలే. ఇన్‌స్టాగ్రామ్‌లో.. ఫేస్ బుక్‌లో.. యూట్యూబ్‌లో ఇలా.. జనం ఎక్కువగా వేటినైతే చూస్తున్నారో వాటిల్లో సెలబ్రిటీలతో చట్టబద్దత లేని బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయిస్తున్నారు. ఇక అనేకమంది యాంకర్లు సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉండటంతో... వాళ్లకి డబ్బులిచ్చి మరీ.. ఈ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయిస్తున్నారు.
అయితే 2023లో చైనాతో సంబంధాలు ఉన్నాయనే కారణంతో దేశంలో కార్యకలాపాలను నిర్వహిస్తోన్న 138 బెట్టింగ్ యాప్స్‌ను నిషేధిస్తూ... కేంద్ర హోం, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ప్రజల వ్యక్తిగత సమాచారం, దేశ భద్రతకు సంబంధించిన రహస్యాలు చైనాకు చేరుతోన్నాయని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గుర్తించింది. దీనికి సంబంధించిన కీలక సాక్ష్యాధారాలను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖకు పంపించింది.
మన దేశంలో బెట్టింగ్ లీగల్ కాదు. ఆన్ లైన్ బెట్టింగ్ అయినా, ఆఫ్ లైన్ బెట్టింగ్ అయినా అనఫీషియల్ గా జరగాల్సిందే. అయితే ఆన్ లైన్ బెట్టింగ్ చాల ఇజీగా చేయ్యవచ్చు.. సో ఇప్పుడు యువత ప్రధానంగా ఆన్ లైన్ బెట్టింగ్ పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. వీళ్లు ‘Bet365, 1Xbet, Betway, 888Sport, Betrally’ వంటి సైట్ లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
అయితే గతంలో ఖేలో యార్ యాప్ ను బాలీవుడ్ కు చెందిన ప్రముఖులు ప్రమోట్ చేశారు. గోవిందా, రణదీప్ హుడా, నీల్ నితిన్ ముఖేష్, డైసీ షా, రష్మీ దేశాయ్, షెఫాలీ జరీవాలాతో సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఈ పాకిస్థాన్ ఆధారిత యాప్‌ను ప్రమోట్ చేశారు. నిజానికి ఈ ఖేలోయర్ యాప్ అనేది మహాదేవ్ బుక్ యాప్‌ని పోలిన ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్. ఇది క్రికెట్, ఫుట్‌బాల్, టెన్నిస్, క్యాసినో గేమ్‌లను అందిస్తుంది. జిన్నా కరెన్సీని ఉపయోగించి బెట్టింగ్ పెట్టొచ్చు. గెలుపొందవచ్చు. ఈ ఆపరేషన్ సౌరభ్ చంద్రకర్ , రవి ఉప్పల్ నేతృత్వంలోని పాకిస్తాన్‌లోని దావూద్ ఇబ్రహీం నెట్‌వర్క్‌తో సంబంధం కలిగి ఉంది.
అంతేకాదు... మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో నటి తమన్నా భాటియాకు మహారాష్ట్ర సైబర్ సమన్లు జారీ చేసింది. మహాదేవ్ అనుబంధ యాప్ ఐన ఫెయిర్‌ప్లే యాప్ ను ప్రమోట్ చేసినందుకు గాను కోర్టు సమన్లు జారీ చేసింది... ఇక ఇదే విషయం మరో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కి కూడా నోటీసులు అందాయి.
ఇలా ఒకరిద్దరని కాదు.. దాదాపు చాల మంది సీని సెలబ్రేటిలు, సోషల్ మీడియాలో కనిపించే చిన్నాపెద్ద సెలబ్రిటీలంతా ఈ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నారు. బయ్యా సన్నీ యాదవ్, హర్షసాయి, శివజ్యోతి ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది యూట్యూబర్స్ ఈ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నారు.
అయితే వీళ్లు చెప్పిన మాటల్ని విని.. ఈ బెట్టింగ్ యాప్‌లలో డబ్బులు పెట్టి.. నష్టపోతున్నారు. కొంతమంది అయితే ఆత్మహత్య కూడా చేసుకుంటున్నారు. అయితే పోలీసులు కూడా ఈ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టకపోవడంతో.. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసేవాళ్లు అంతకంతకూ పెరిగిపోతున్నారు. కాగా.. ఈ బెట్టింగ్ యాప్‌ల బారిన పడి చాలామంది ప్రాణాలను సైతం కోల్పోతున్న తరుణంలో వీటికి అడ్డుకట్ట పడాల్సిన అవసరం ఏర్పడింది.
అయితే ప్రస్తుతం మీడియాలో చూసిన, సోషల్ మీడియాలో చూసిన ఓ పేరు బాగా వినిపిస్తుంది... ఆ పేరే హర్ష సాయి... ఈ యూట్యూబర్ రాష్ట్రాల్లో తెలియని వాళ్ళు ఉండరు. పేద ప్రజలకు సహాయం చేస్తూ మంచి మనిషిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే పేదలకు టీవీలు, ఫ్రిడ్జ్ లు వంటివి ఇవ్వడం, డబ్బులు అవసరం ఉన్నవారికి ఆర్థిక సహాయం చేయడం, పెట్రోల్ ఫ్రీగా పోయించడం ఇలా హర్ష సాయి చాలా మంచి మంచి పనులు చేస్తున్నాడన్న పేరు తెచ్చుకున్నాడు. దీంతో హర్ష సాయికి ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రేజ్ తో ఆ మధ్య ఒక మూవీ కూడా స్టార్ట్ చేశాడు.
అయితే హర్ష సాయి జనం అనుకునేంత మంచోడు కాదని యువసామ్రాట్ రవి అనే ఆయన మీడియాకు ఇంటర్వూలు ఇస్తున్నాడు. హర్ష సాయి ఫ్రాడ్ అని, మోసగాడని ఆరోపిస్తూ యూట్యూబ్‌లో అనేక వీడియోస్ అప్లోడ్ చేశారు కూడా. అయితే ఓ ప్రముఖ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో యువ సామ్రాట్ రవి మాట్లాడుతూ... హర్ష సాయి పెద్ద మాఫియా నడుపుతున్నాడని.. ఇతని వెనుక నోయిడాకి చెందిన పెద్ద ముఠా ఉందని చెప్పాడు.
పైకి సాఫ్ట్ వేర్ కంపెనీగా ఉంటూ ఇల్లీగల్ బెట్టింగ్స్ ని ప్రమోట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చాడు. ఇన్ఫ్లుయెన్సర్స్ కి పది వేలు, 20 వేలు ఫాలోవర్స్ ఉంటే సదరు కంపెనీ వారిని కాంటాక్ట్ అయ్యి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేపిస్తుందని.. అలా చేయించినందుకు లక్షల రూపాయలు కుమ్మరిస్తుందని అన్నారు. ఇక హర్ష సాయి ఒక బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కి కనీసం 90 లక్షలు తీసుకుంటాడని.. అందులో 60 లక్షలు జీఎస్టీ కడతాడని.. మిగతా 40 లక్షలు అతని ఖాతాలో పడతాయని యువ సామ్రాట్ రవి ఆరోపించారు.
ఈ బెట్టింగ్ యాప్ వారు... ఇన్ఫ్లుయెన్సర్స్ కి బ్యాంకు ద్వారానే కాకుండా.. ఫిజికల్ గా కూడా డబ్బు ఇస్తారని.. ఆ మధ్య నోవాటెల్ హోటల్ లో హర్ష సాయి డబ్బు తీసుకున్నాడని తన దగ్గర అదారలు ఉన్నట్టు చెప్పుకొచ్చాడు.. అంతేకాదు.. డేట్, టైం చెప్తా కావాలంటే సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసుకోవచ్చునని.. అప్పుడు హర్ష సాయి అసలు రంగు బయటపడుతుందని చాలెంజ్ చేశాడు యువ సామ్రాట్ రవి.
ఇలా చేసేవారిలో హర్ష సాయి ఒక్కడే కాదని.. ఇలా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ జనాన్ని ఆర్థికంగా నష్టం చేకూర్చే వాళ్ళు చాలా మంది ఉన్నారని అన్నారు. భయ్యా సన్నీ యాదవ్ కూడా ఈ కోవకే వస్తారంటూ ఆరోపించారు. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతోమంది నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. హర్ష సాయి ఒక ఉగ్రవాదితో సమానమని యూట్యూబర్ రవి సంచలన కామెంట్స్ చేశారు.
బెట్టింగ్ యాప్‌లను నమ్మి అమాయకజనం డబ్బులు పెడుతున్నారు. కానీ డబ్బులొస్తాయని ఆశపడ్డ వాళ్ల చేతుల కాలి లబోదిబో అంటున్నారు. మరికొంతమంది అయితే అప్పులు చేసి మరీ ఈ బెట్టింగ్ యాప్‌లతో డబ్బులు పెట్టి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసే వాళ్లపై కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బెట్టింగ్ యాప్స్ పై దేశంలో పలు రాష్ట్రాలు నిషేధాన్ని విధించాయి కూడా అయినప్పటికి మర్పులేదు. కన్జ్యూమర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019, కేబుల్ టీవీ నెట్‌వర్క్ కంట్రోల్ యాక్ట్ 1995, ఐటీ నిబంధనలు 2021 ప్రకారం ఈ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్స్ తో పాటు వాటి అనుబంధ కార్యకలాపాలపై నిషేధం ఉంది.
What's Your Reaction?