ఒలిపింక్స్‌‌లో అదరగొట్టిన బాకర్! ఈ మను భాకర్ ఎవరు? టీనేజ్ నుంచి ఆమె ప్రస్థానం!!

ఒలిపింక్స్.. ప్రతి ప్లేయర్ తన సత్త చాటుకునేందుకు అడుగు పెట్టాలనుకునే వేదిక. తన జీవితంలో ప్రతి ప్లేయర్ ఒక్కసారైనా ఒలంపిక్స్‌‌లో పతకాన్ని సాధించి తన దేశం గర్వపడేలా చేయాలని కలలు కంటారు. ఆ కలలను సాకారం చేసుకోవడానికి ఎంతో శ్రమిస్తారు.Sri Media News

Jul 30, 2024 - 16:51
 0  24
ఒలిపింక్స్‌‌లో అదరగొట్టిన బాకర్! ఈ మను భాకర్ ఎవరు? టీనేజ్ నుంచి ఆమె ప్రస్థానం!!
Manu Bhaker in Olympics

అటువంటి ఒలంపిక్స్‌‌‌‌ ఈసారి పారిస్‌‌లో జరుగుతున్నాయి. ఈ పోటిల్లో 206 దేశాలు పోటి పడుతున్నాయి. పారిస్‌లో జరగుతున్న ఈ 33వ ఒలింపిక్ క్రీడలు ఇవి. అయితే గత ఒలింపిక్స్‌లో 7 పతకాలతో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చింది భారత్. ఇప్పుడు పారిస్‌లో అంతకంటే మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని పట్టుదలగా ఉంది.117 మందితో కూడిన భారత్ సైన్యం 16 క్రీడాంశాల్లో పోటీ పడుతోంది. గత మూడేళ్లలో వేర్వేరు టోర్నీల్లో మన ఆటగాళ్లు సాధించిన విజయాలు.. ఈ సారి ఒలింపిక్స్‌లో మరింత మెరుగైన ప్రదర్శన ఉంటుందని దేశంలోని ప్రజలు ఎదురు చూస్తున్నారు.

ఆ ఎదురు చూపులకు వెలుగులు నింపేలా మహిళా షూటర్‌ మను బాకర్ తొలి పతకం సాధించి భారత మాతను ముద్దడింది. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌లో మను కాంస్య పతకం గెలిచింది. ఈ పతకం ద్వారా ఒలింపిక్ గేమ్స్‌లో షూటింగ్‌లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా భాకర్ చరిత్ర సృష్టించింది. అంతేకాదు ఒలింపిక్స్‌ క్రీడల్లో భారత్‌కు పతకం అందించిన ఏడో మహిళా క్రీడాకారిణిగా మనూ భాకర్‌ నిలిచింది. జూలై 28వ తేదీ జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఫైనల్లో 22 ఏళ్ల మనూ భాకర్‌ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. మనూ భాకర్‌ 221.7 పాయింట్లు సాధించి కాంస్య పతకాన్ని సాధించింది.

మను బాకర్ హర్యానా రాష్ట్రానికి చెందిన అమ్మాయి. హర్యానాలోని ఝజ్జర్ జిల్లాకు చెందిన గోరియా అనే గ్రామంలో జన్మించింది. మను బాకర్ తండ్రి మెరైన్ ఇంజినీర్ కాగా.. తల్లి స్కూల్‌‌ ప్రిన్సిపాల్. మను బాకర్ చిన్నప్పటి నుంచి అన్ని క్రీడల్లో ప్రతిభ చాటేది. షూటింగ్ తోపాటు బాక్సింగ్, అథ్లెటిక్స్, స్కేటింగ్, జూడో కరాటే క్రీడల్లో చాల ఉత్సహంతో పాల్గొనేది. ఇలా  మను బాకర్ 14 సంవత్సరాల వయసులో తొలిసారి షూటింగ్‌ మొదలుపెట్టింది. అనేక క్రీడల్లో రాణించినప్పటికీ షూటింగ్‌నే ఆమె ఎక్కువగా ఇష్టపడింది. షూటింగ్‌లోనే కొనసాగాలని నిర్ణయించుకున్న అని తన తండ్రికి చెప్పింది. వెంటనే నాకు స్పోర్ట్ షూటింగ్ పిస్టల్ కొనివ్వామని అడిగింది. ఒక్కక్షణం కూడా ఆలోచించకుండా వెంటనే గన్ కొనిచ్చారు.

ఇలా మొదలైన మను బాకర్ షూటింగ్ ప్రయాణం... 2017 జాతీయ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఒలింపిక్ పతక విజేతగా నిలిపింది.. ప్రపంచ నంబర్-1 షూటర్‌‌గా ఉన్న హీనా సిద్ధూను ఓడించి తన సత్త చాటుకుంది మను బాకర్. అంతేకాదు.. 242.3 స్కోరు సాధించి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో చరిత్ర తిరగరాసింది.

ఆ తరువాత 2017 ఆసియా జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో రజతం గెలిచింది. 2018లో జరిగిన ఇంటర్నేషనల్ స్పోర్ట్ షూటింగ్ ఫెడరేషన్ (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచ కప్‌కు అర్హత సాధించి జూనియర్ కేటగిరిలో ప్రపంచ రికార్డు బద్దలు కొట్టింది. కేవలం 16 ఏళ్ల వయస్సులో ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్‌లో గోల్డ్ మెడల్ గెలిచిన అతి చిన్న వయసు కలిగిన అమ్మాయిగా పేరు సంపాధించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో వ్యక్తిగత, మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో బంగారు పతకాలు సాధించింది.

అలా విజయకేతనం ఎగురవేస్తున్న మను బాకర్ 2018లో ఆస్ట్రేలియాలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో బంగారు పతకాన్ని సాధించి రికార్డు సృష్టించింది. 2019లో మ్యూనిచ్ ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్‌లో నాలుగవ స్థానం సాధించి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఆ తర్వాత 2021లో న్యూఢిల్లీలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌ టీమ్ విభాగంలో స్వర్ణం, వ్యక్తిగత విభాగంలో రజతం గెలిచింది.

ఇలా తన విజయ పరంపరను కొనసాగిస్తూ... ఎన్నో అంచనాలతో టోక్యో ఒలింపిక్స్‌లో అడుగుపెట్టింది.. క్వాలిఫికేషన్ రౌండ్‌లో అగ్రస్థానంలో నిలిచిన మను బాకర్.. పిస్టల్ పనిచేయకపోవడంతో వెనుతిరిగింది. కానీ ఇప్పుడు పారిస్ ఒలంపిక్స్‌‌లో కాంస్య పతకం కోసం హోరాహోరీగా పోటీపడ్డ ఆమె 221.7 స్కోరుతో ఆఖరికి మూడో స్థానంలో నిలిచింది. క్వాలిఫికేషన్‌లో 580 స్కోర్‌ చేసి మూడో స్థానంలో నిలిచిన మను.. ఫైనల్లోనూ అదిరే ప్రదర్శన చేసింది. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో విజయ్‌ కుమార్‌ కాంస్యం, గగన్‌ నారంగ్‌ కాంస్యం గెలిచాక.. ఓ భారత షూటర్‌ పతకం గెలవడం ఇదే తొలిసారి.

ఈ విజయం పై కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ స్పందించారు. పతకం వెనక ఆమె పడ్డ కష్టాన్ని వివరించారు. మనూ బాకర్‌ శిక్షణ కోసం ప్రభుత్వం దాదాపు రూ.2 కోట్లు ఖర్చు పెట్టిందని.. శిక్షణ కోసం జర్మనీ, స్విట్జర్లాండ్‌కు పంపించామని.. ఆమెకు కావాల్సిన  కోచ్‌ను నియమించుకునేందుకు అవసరమైన ఆర్థిక సాయం అందించామని. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచే ఆటగాళ్లందరికీ ఇదే విధంగా తోడ్పాటునందిస్తున్నామని... చెప్పుకొచ్చారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow