జగన్ కు గట్టి షాక్ ఇచ్చిన మోడీ!!మోడీ సపోర్ట్ జగన్‌కు దోరుకుతుందా!
బడ్జెట్ విషయంతో ఏపీ ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత తీసుకువచ్చి ప్రజాక్షేత్రంలోకి వచ్చే ఛాన్స్ లేకుండా పోయింది జగన్‌కు. అంతేకాదు.. విభజన హామీలను నెరవేర్చడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని నిర్మలా సీతారామన్ చెప్పడం... విభజన హామీలు, రాజధాని అవసరాన్ని గుర్తించి ప్రత్యేక ఆర్థిక సాయం అందించనున్నట్టు ప్రకటించడం. విభిన్న ఏజెన్సీల సహకారంతో నిధులు సమకూర్చనున్నట్టు చెప్పడం వైసీపీ ప్రభుత్వనికి విమర్శించే ఛాన్స్ లేకుండా పోయిందని చెప్పవచ్చు.Sri Media News
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు సముచిత ప్రాధాన్యత నిచ్చింది. ఒక విధంగా వరాల వర్షం కురిపించిందని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ రీ ఆర్గనైజేషన్ చట్టంలోని అన్ని అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపించింది. ఏపీ రీ ఆర్గనైజేషన్ చట్టం ప్రకారం ఇవ్వాల్సిన రాయితీలు పదేళ్లు గడిచినా.. కేంద్ర ప్రభుత్వం ఇవ్వ లేదు. రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. కూటమిలో ప్రధానంగా టీడీపీ, జనసేన, బీజేపీలు అనుకున్న ప్రకారం విజయం సాధించాయి. దీంతో కేంద్రం తన అభిప్రాయాన్ని మార్చుకొని ఏపీ అభివృద్ధికి నిధుల కేటాయింపుల్లో పెద్ద మనసు చేసుకుంది. ప్రధానంగా రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు కేటాయించడంతో పాటు అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు విడుదల చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించటం ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు జగన్ వేసిన ప్లాన్‌ను నీరుగార్చటమే అని చెప్పవచ్చు.
బడ్జెట్ విషయంతో ఏపీ ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత తీసుకువచ్చి ప్రజాక్షేత్రంలోకి వచ్చే ఛాన్స్ లేకుండా పోయింది జగన్‌కు. అంతేకాదు.. విభజన హామీలను నెరవేర్చడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని నిర్మలా సీతారామన్ చెప్పడం... విభజన హామీలు, రాజధాని అవసరాన్ని గుర్తించి ప్రత్యేక ఆర్థిక సాయం అందించనున్నట్టు ప్రకటించడం. విభిన్న ఏజెన్సీల సహకారంతో నిధులు సమకూర్చనున్నట్టు చెప్పడం వైసీపీ ప్రభుత్వనికి విమర్శించే ఛాన్స్ లేకుండా పోయిందని చెప్పవచ్చు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏపీ రాజధాని నిర్మాణానివకి 15వేల కోట్ల రుపాయలు కేటాయించడం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయడానికి సహకరిస్తాం అని చెప్పడం.. ఏపీలో ఇండస్ట్రీ డెవలప్‌మెంట్ కోసం విశాఖపట్నం - చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ లోని కొప్పర్తి నోడ్, హైదరాబాద్- బెంగుళూరు కారిడార్ లోని ఓర్వకల్ నోడ్ కు అదనపు కేటాయింపులు చేస్తున్నట్టు చెప్పాడం... కొప్పర్తి, ఓర్వకల్లు కారిడార్‌లలో పారిశ్రామిక అభివృద్ధి కోసం విద్యుత్, రోడ్, వాటర్ సదుపాయాల కల్పన కోసం నిధులు కేటాయిస్తామని చెప్పడం.. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్రలకు వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులతో ప్రత్యేక సాయం అందిస్తున్నట్టు ప్రకటించింది కేంద్రం. గతంలో రూ. 350 కోట్ల నిధులను నాడు మోదీ ప్రభుత్వం కేటాయించింది. తర్వాత వాటిని వెనక్కు తీసుకుంది. సో ఇప్పుడు వైసీపీకి టీడీపీని టార్గెట్ చేసే ఛాన్స్ లేకుండా పోయింది.
అయితే.. రాష్ట్రంలో శాంతిభద్రతల పైన, ఏపీలో జరుగుతున్న దాడుల పైన ఢిల్లీ వేదికగా సమర శంఖం పూరించి జగన్ ఢిల్లీ వేదికగా ధర్నా చేస్తున్నారు. అయితే ఈ ధర్నా సక్సెస్ అవుతుందా అంటే లేదు అనే మాట వినిపిస్తుంది. ఎందుకంటే.. ఎన్‌డీఏ కూటమికి వ్యతిరేకంగా ఎత్తిన జెండా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్నా సక్సెస్ అయ్యే అవకాశాలు లేవనే మాటలు అధికార పక్ష కూటమి నేతల నుంచి వినిపిస్తున్నాయి. అయితే జగన్ మాత్రం ప్రధాన మంత్రి, మంత్రుల అపాయింట్‌మెంట్స్ కోరుతామని వినుకొండ వేదికగా ప్రకటించారు. అయితే కేంద్ర నేతలు జగన్ బృందానికి కలిసే అవకాశం ఇస్తారా.. లేదా.. అనేది చూడాలి.
జగన్ ఏపీకీ సీఎంగా ఉన్న సమయంలో పీఎం మోడీని అనేక సార్లు కలిసారు. గత ప్రభుత్వంలో 22 మంది ఎంపీలు వైఎస్సార్‌సీపీకి ఉండగా వారు ఎన్‌డీఏకు మద్దతు ప్రకటించారు. ఒక్క రోజు కూడా ప్రధాన మంత్రిపై కానీ, ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వంపై కానీ వ్యతిరేకంగా మాట్లాడిన దాఖలాలు లేవు. ఏపీకి రావాల్సిన విభజన హామీల గురించి కూడా ఐదేళ్లలో ఒక్కరోజు కూడా ప్రస్తావించలేదు. అందువల్ల తాము చేస్తున్న ధర్నాను కేంద్రంలోని ఎన్‌డీఏ వారు సమర్థిస్తారనే నమ్మకంతో జగన్ ఉన్నట్టు తెలుస్తుంది.
కేంద్రంలో ఎన్‌డీఏను వైసీపీ సమర్థిస్తున్నా ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌డీఏ కూటమిని వైసీపీ వ్యతిరేకిస్తోంది. కేంద్రంలోని అధికార కూటమికి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మద్దతు ఎంతో అవసరం. వారి మద్దతుతోనే దేశంలో ఒడిదుడుకులు లేని పాలనను మోదీ కొనసాగిస్తున్నారు. అలాంటప్పుడు జగన్ మంత్రం ఏమాత్రం పనిచేయదనేది రాజకీయ విశ్లేషకుల అంచనా.
What's Your Reaction?