విశాల్ కొత్త పార్టీ ? కాబోయే CM నే డీ కొట్టబోతున్నాడా ?

విశాల్ మీద మాత్రం నిర్మాతల మండలి పగబట్టింది. ఆయన్ను మాత్రం వదిలిపెట్టడం లేదు. కానీ ఇప్పుడే ఎందుకు ఇలా జరిగింది? మళ్లీ దానికి ఒక స్టోరీ ఉంది. హీరో విశాల్ స్వయంగా ఆ వివరాలు వెళ్లడించారు. ఎందుకంటే ఆయనకు వరుసగా ఇబ్బందులు వస్తున్నాయి.Sri Media News

Jul 30, 2024 - 13:50
 0  21
విశాల్ కొత్త పార్టీ ? కాబోయే CM నే డీ కొట్టబోతున్నాడా ?
Hero Vishal Political entry

తమిళ సినిమా పరిశ్రమలో భారీ వివాదం తలెత్తింది. హీరో విశాల్ పై తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆంక్షలు విధించింది. ఇక నుంచి విశాల్ సినిమా లో పనిచేసేవారెవరైనా సరే తమ అనుమతి తీసుకోవాలి. నటులైనా, టెక్నీషియన్స్ అయినా చివరకు జూనియర్ ఆర్టిస్ట్ లు అయినా సరే తమ అనుమతి తీసుకోవాలని సంచలన ఆంక్షలు పెట్టింది. ఇంతలా విశాల్ మీద పగ బట్టటానికి కారణం ఏంటంటే 2017 నుంచి 2019 వరకు తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రసిడెంట్ గా పని చేశారు. ఆ సమయంలో 12 కోట్ల మేర నిధులను తినేశారని ఆయన మీద అభియోగం. అంతేకాదు కౌన్సిల్ బ్యాంక్ ఎకౌంట్ లో ఉన్న ఫిక్స్ డ్ డిపాజిట్ ఏడు కోట్లను, మరో ఐదు కోట్లను ఆయన ఇతర ఖర్చుల పనుల పేరుతో మిస్ యూజ్ చేశారని ఆరోపించారు నిర్మాతల మండలి ప్రసిడెంట్ మురళి రామస్వామి సహా నిర్మాతలు ఆరోపించారు. ఇప్పటికే దీని మీద విచారణ కూడా సాగుతోంది.

అయితే ఈ కామెంట్స్ పై విశాల్ ఘాటుగా స్పందించారు. మీకు తెలియదా ఇది ఉమ్మడి నిర్ణయమని. ఇప్పుడు మీ కమిటీలోని మెంబర్ అయిన కత్తిరేశన్ కు తెలియదా? ఆ డబ్బులను అవసరం లో ఉన్నవారి వెల్ఫేర్ కోసం ఉపయోగించాం. మెడికల్ ఇన్సూరెన్స్ నుంచి వారి పిల్లల చదువుకు ఇచ్చాం. చివరకు పండగల సమయంలో కూడా వారికి చేయందించాం. అది మీకు తెలియదా అని ప్రశ్నించారు. మీ పని మీరు సరిగ్గా చేయండి. పరిశ్రమకు చాలా చేయాల్సి ఉంది. ఇక మీరు నా పై ఆంక్షలు విధించారు. మీకు దమ్ముంటే ఆపండి. నన్నెవడు ఆపుతాడో చూస్తాను. మీ లో చాలా మంది నిర్మాతలుగా సినిమాలు తీయకుండానే కౌన్సిల్ లో ఉన్నారు. కాస్త ముందు చూపుతో ఆలోచించండి. ఇలా మూర్ఖంగా కాదు. దమ్ముంటే ఆపి చూడండని సవాల్ విసిరారు హీరో విశాల్. అయితే ఇది ఇప్పటి వివాదం మాత్రం కాదు. కాస్త వెనక్కి వెళ్తే విశాల్ కౌన్సిల్ ప్రసిడెంట్ గా ఉన్నప్పుడు కొంత మంది ఆఫీస్ కు తాళం వేశారు. నిధుల అవకతవకలకు పాల్పడుతున్నారని ప్రసిడెంట్ అయిన విశాల్ ను ఆఫీస్ లోకి రానివ్వలేదు. దాంతో ఆయన బలవంతంగా వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇంతలో పోలీసులు రావడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. చివరకు ప్రసిడెంట్ కౌన్సిల్ ఆఫీస్ తలుపులు తీసేందుకు కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇక ఆ తర్వాత విశాల్ స్థానంలో మురళి రామస్వామి తమిల్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రసిడెంట్ అయ్యారు. నాటి నుంచి విశాల్ ను టార్గెట్ చేసింది కౌన్సిల్. అయితే నిధుల గురించి మాత్రం విచారణ సాగుతోంది. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కు చెందిన ఒక అధికారిని ప్రభుత్వం విచారణకు నియమించింది. ఆ అధికారి నిర్మాతల మండలిలో అవకతవకలపై విచారణ చేసి నిధులను విశాల్ దుర్వినియోగం చేశారా లేదంటే సరిగ్గానే వాడారా అనేది తేల్చనున్నారు. అయితే ఈ విచారణ సాగుతోంది.

దానికి ఒక స్టోరీ ఉంది:

విశాల్ మీద మాత్రం నిర్మాతల మండలి పగబట్టింది. ఆయన్ను మాత్రం వదిలిపెట్టడం లేదు. కానీ ఇప్పుడే ఎందుకు ఇలా జరిగింది? మళ్లీ దానికి ఒక స్టోరీ ఉంది. హీరో విశాల్ స్వయంగా ఆ వివరాలు వెళ్లడించారు. ఎందుకంటే ఆయనకు వరుసగా ఇబ్బందులు వస్తున్నాయి. మీడియాకు చెబితే తనకు సాయంగా ఉంటుందనుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో వెళ్లడించారు. అదేమంటే తాను ఎనిమి సినిమా విడుదల చేయాలనుకున్న సమయంలో నాకు ఇబ్బందులు ఎదురయ్యాయి. రెడ్ జెయింట్ మూవీస్ ఆఫీస్ నుంచి ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశాడు. అతను నాకు క్లోజ్. అంతే కాదు ఆ సంస్థలో పనిచేయడానికి కారణం కూడా నేనే. కానీ నా సినిమాను వాయిదా వేసుకోమని చెప్పాడు. నేను కుదరదని చెప్పాను. దాంతో ఆ సినిమాకు సినిమా థియేటర్ లు దొరకకుండా చాలా ప్రయత్నం చేశారు. కానీ తర్వాత సినిమాను విడుదల చేయగలిగాం. అయితే మళ్లీ మార్క్ ఆంటోని సినిమాకు కూడా ఈ పరిస్థితే ఎదురైంది. తన సినిమాను వాయిదా వేసుకోవాలని రెడ్ జెయింట్ నుంచి మళ్లీ కాల్ వచ్చింది. నేను తిట్టాను. నా నిర్మాతం 60 కోట్లకు పైగా వడ్డీకి డబ్బులు తెచ్చారు. నేను రిలీజ్ చేస్తానని చెప్పాను. దాంతో ఆ సినిమాను టైమ్ కి రిలీజ్ చేయడంతో మంచి లాభాలు వచ్చాయి. నాకు, దర్శకుడికి మంచి పేరొచ్చింది. నిర్మాతకు కూడాలాభాలు వచ్చాయన్నారాయన. ఇప్పుడు రత్నం సినిమాకు కూడా అలాంటి ప్రయత్నమే చేస్తున్నారు. ఒక వ్యక్తి తమిళ సినిమా ఇండస్ట్రీని తన చెప్పు చేతల్లో పెట్టుకోవాలనుకుంటున్నారు. అది ఎప్పటికి సాధ్యం కాదు,. ఇండస్ట్రీని ఏలాలనుకుంటే తానే నష్టపోతాడని హెచ్చరించారు. పేరు చెప్పమంటే మాత్రం మీ అందరికీ తెలుసన్నట్లుగా పేరు తన నోటితో చెప్పేందుకు ఇష్టపడలేదు

అయితే ఆ వ్యక్తి తమిళనాడు సీఎం స్టాలిన్ కొడుకు హీరో అయిన ఉదయనిధి స్టాలిన్ అని అందరికీ తెలుసు. ఉదయినిధి కారణంగానే విశాల్ పై నిర్మాతల మండలి ఆంక్షలు పెట్టింది. ఇప్పుడు అతన్ని హీరోగా కూడా నిలబడకుండా చేయాలనే కుట్రలు చేస్తున్నారనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అందుకే విశాల్ కూడా దమ్ముంటే ఆపి చూడమని సవాల్ విసురుతున్నాడు. నేను సినిమాలు చేస్తాను. నిర్మాతలు తనను ఏమీ చేయలేరని కూడా ఓపెన్ గానే చాలెంజ్ చేశారు. అంతే కాదు ఏకంగా పరోక్షంగా డీఎంకే సర్కారు పై సీరియెస్ అయ్యారు విశాల్. తమిళ సినిమా పరిశ్రమ కు రాయితీలు కలిపించాలని ప్రధాని మోడీ కోరారు. అంతే కాదు రెండు రెట్ల జీఎస్టీ వసూలు చేస్తున్నారు. ఏ రాష్ట్రంలో కూడా ఇలా డబుల్ పన్ను విధానం లేదు. కానీ మా రక్తం తాగుతున్నారు. మీరు ఒన్ నేషన్, వన్ టాక్సేషన్ అంటున్నారు. కానీ దీనిని ఎవరూ సీరియెస్ గా తీసుకోవడం లేదు.


బ్లాక్ క్యాప్ పై రెడ్ అనే అక్షరాలున్న క్యాప్ ధరించి:
తమిళనాడు సర్కారు మా నుంచి రెండింతల పన్ను వసూలు చేస్తుంది. ఇది సినిమా పరిశ్రమ మీద ప్రభావం చూపుతోంది. తమిళ నిర్మాతలు 8 శాతం కంటే ఎక్కువగా లోకల్ బాడీ పన్ను కడుతున్నారు. ఇది సినిమా పరిశ్రమకు కష్టం కాలం. ఎవరూ దీని గురించి బహిరంగంగా మాట్లాడటం లేదని పరోక్షంగా డీఎంకేను విమర్శించారు విశాల్. మా అందరికీ సమానమైన జీవితాన్ని ఇవ్వండి. మేం లగ్జరీ లైఫ్ అడగడం లేదని చెప్పుకొచ్చారు విశాల్. ఇవన్నీ కూడా ఉదయనిధి కి పరోక్షంగా కౌంటర్ ఇస్తున్నాడనే కామెంట్స వినిపిస్తున్నాయి. అందుకే ఇప్పుడు నిర్మాతల మండలి ద్వారా పరోక్షంగా విశాల్ ను సినిమాలు తీయకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. అంతే కాదు ఓ బ్లాక్ క్యాప్ పై రెడ్ అనే అక్షరాలున్న క్యాప్ ధరించి మరీ కామెంట్స్ చేశారు విశాల్. దీంతో ఇప్పుడు విశాల్ ను సినిమాలు తీయకుండా ఆపుతారా? విశాల్ వర్సెస్ సీఎం స్టాలిన్ కొడుకు మంత్రి అయిన ఉదయనిధి స్టాలిన్ ను ఎలా ఢీకొంటారనేది చూడాలి. ఎందుకంటే ఉదయనిధి ఇంత వరకు దీనిపై స్పందించలేదు. కానీ విశాల్ కు మద్దతుగా యంగ్ స్టార్ హీరోలు చాలా మంది ఉన్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

 అయితే ఇక్కడో కామెంట్ కూడా వినిపిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను కూడా ఎమ్మెల్యేగా బరిలోకి దిగాలనే ప్లాన్ లో ఉన్నాడట విశాల్. అవసరమైతే పార్టీని లాంచ్ చేయాలని, డీఎంకేను ఢీకొట్టాలనే వ్యూహాలు పన్నుతున్నట్లు వార్తలొస్తున్నాయి. హీరో విజయ్ ఇక భారీ ఎత్తున అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగేందుకు వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. ఇటు విశాల్ కూడా ఎమ్ ఎల్ ఏ గా పోటీ చేయాలని భావిస్తుండగా ఆయన కేరక్టర్ ను దెబ్బ తీసేందుకు నిర్మాతలను ఎగదోస్తున్నారనే విశ్లేషణ కూడా ఉంది. అవినీతి పరుడు అని ముద్ర వేసి విశాల్ పొలిటికల్ లైఫ్ ను క్లోజ్ చేయాలనే ఉదయనిధి ఇలా టార్గెట్ చేశారని కోలివుడ్ లో టాక్. మరి వీరిద్దరి ఫైట్ ఎంత వరకు వెళ్తుందో చూడాలి.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow