గ్యాంగ్‌స్టర్‌తో లేచిపోయిన ఐఏఎస్ భార్య!తిరిగొచ్చి ఆత్మహత్య..?
ఓ ఐఏఎస్ అధికారి భార్య... ఓ గ్యాంగ్‌స్టర్‌తో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అతడితో కలిసి నేరాలకు పాల్పడింది. ఓ అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ఇంటి నుంచి పారిపోయింది. భార్య చేసిన పనితో విసిగిపోయి ఉన్న ఐఏఎస్ అధికారి విడాకులకు సిద్ధమయ్యాడు.Sri Media News
ఈ విషయం తెలుసుకున్న భార్యతొమ్మిది నెలల తర్వాత ఇంటికి తిరిగొచ్చింది. అప్పటికే ఆమె తిరిగి వస్తే ఇంట్లోకి రానివ్వొద్దని సిబ్బందికి గట్టి వార్నింగ్ ఇచ్చాడు ఐఏఎస్ అధికారి. దీంతో మీరు ఇంట్లోకి రావడానికి వీల్లేదని సార్ చెప్పారని సిబ్బంది గట్టిగా ఆమెకు చెప్పడంతో మనస్థాపానికి గురై విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది..
రంజిత్ సింగ్ జె గుజరాత్ కేడర్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన గురజాత్ లోని ఎలక్ట్రిసిటీ రెగ్యూలేషన్ కమిషన్‌లో సెక్రటరీ హూదాలో విధులు నిర్వహిస్తున్నారు. గాంధీనగర్ సెక్టార్ 19 లోని అధికారిక నివాసంలో ఉంటున్నారు. రంజీత్ భార్య సూర్య జై గత ఏడాది నవంబర్‌లో తన స్వస్థలం తమిళనాడుకు చెందిన గ్యాంగ్‌స్టర్ హైకోర్టు మహరాజతో కలిసి వెళ్లిపోయింది.
అయితే తమిళనాడులో ఓ బాలుడిని కిడ్నాప్ విషయంలో ఐఏఎస్ భార్య సూర్య జై పేరు, ఈమె ప్రియుడు హైకోర్టు మహారాజా, అతని అనుచరుడు సెంథిల్ కుమార్ పేర్లు తెరమీదకు వచ్చాయి. జూలై 11న కిడ్నాప్ చేసిన వారు.. బాలుడిని విడిచిపెట్టేందుకు అతడి తల్లి వద్ద నుంచి రూ. 2 కోట్లు డిమాండ్ చేశారు. అయితే మదురై పోలీసులు బాలుడిని రక్షించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు సూర్య సహా, అతని గ్యాంగ్ కోసం వెతకడం ప్రారంభించారు. ఈ కేసులో సూర్య జై ప్రమేయం ఉన్నట్టుగా కూడా ఆరోపణలు వచ్చాయి. దీంతో బాలుడి కిడ్నాప్ కేసులో తమిళనాడు పోలీసుల అరెస్టు నుండి తప్పించుకోవడానికి సూర్య తన భర్త ఇంటికి వచ్చింది.. కానీ ఐఏఎస్ అధికారి రంజిత్ సింగ్ జె మాత్రం ఆమెను ఇంట్లోకి రానివ్వలేదు.
పిల్లల్ని, తనను కాదని వెళ్లిపోయిన సూర్య జై పై కోపంతో ఆమెకు విడాకులు ఇవ్వాలని రంజిత్ నిర్ణయించుకున్నారు. అంతేకాదు ఆమె తిరిగి వస్తే ఇంట్లోకి రానివ్వొద్దని సిబ్బందికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. దీంతో శనివారం రాత్రి సూర్య జై.. రంజీత్ ఇంటికి వెళ్లింది. కానీ.. సెక్యూరిటి ఇంట్లోకి రావడానికి వీల్లేదని.. సార్ చెప్పారని గట్టిగా చెప్పారు. దీంతో గత్యంతరం లేకో ఏమో కానీ... విషం తాగి 108కి ఫోన్ చేసింది. దీంతో.. ఆమెను 108 సిబ్బంది వచ్చి ఆస్పత్రిలో చేర్చగా.. చికిత్సపోందుతూ మృతిచెందినట్లు పోలీసులు చెబుతున్నారు.
కాగా ఈ ఘటనపై రంజిత్ సింగ్ తరఫు న్యాయవాది స్పందించారు. దంపతులిద్దరూ ఏడాది కాలంగా దూరంగా ఉంటున్నట్లు చెప్పారు. రంజిత్ విడాకుల కోసం అప్లై చేశారని... గత శనివారం భార్య ఇంటికి రాగా.. ఆమెను లోనికి అనుమతించొద్దని పనివాళ్లకు చెప్పారని.. అందుకే ఆమెను లోపలికి రానివ్వలేదని.... బయటకు వెళ్లిన రంజిత్ తిరిగొచ్చేసరికి భార్య సూర్య జై ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు. కాగా.. ఆమె మృతదేహాన్ని చూసేందుకు కూడా రంజిత్ సింగ్ నిరాకరించారని సమాచారం.
సూర్య జై చేసిన ఒక తప్పు కుటుంబన్ని నశనం చేసింది. సమాజంలో భర్తకు ఉన్న పేరును చెడగొట్టి.. భర్త దగ్గర.. నేరస్తురాలు అయ్యింది. ఒక ఐఏఎస్ అధికారి భార్య అయి ఉండి నేరాలకు కేరాఫ్ అడ్రస్ అయిన గ్యాంగ్‌స్టర్ ని నమ్మి అతనితో లేచిపోయింది. చివరికి ఆమె జీవితం విషాదంతో ముగిసింది.
What's Your Reaction?