బిగ్ బ్రేకింగ్ : అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు! నిరుద్యోగుల కోసం కేంద్రం 3 పథకాలు! కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి రూ. 15 వేలు!!
2024 పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం మొదలైన విషయం తెలిసిందే. నిన్న పార్లమెంట్‌లో నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. ఈ సమావేశాలు ఆగస్టు 12 వరకూ కొనసాగనున్నాయి. Sri Media News
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఏడోసారి ప్రవేశ పెట్టారు. ఇప్పటి వరకు వరుసగా ఏడుసార్లు పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఏకైక మంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకూ మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ పేరిట ఆరు వార్షిక బడ్జెట్‌లు ప్రవేశ పెట్టిన రికార్డు ఉంది. 1959-64 మధ్య ఐదు పూర్తిస్థాయి బడ్జెట్లు, ఒక తాత్కాలిక బడ్జెట్‌ను మొరార్జీ దేశాయ్ ప్రవేశ పెట్టారు. ఈ రికార్డును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్రేక్ చేశారు.
నిర్మలా సీతారామన్ 2019 మే 30 నుంచి ఆర్థికమంత్రిగా కొనసాగుతున్నారు. 2019లో మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక నిర్మలా సీతారామన్ తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. తర్వాత వరుసగా 2020-21, 2021-22, 2022-23, 2023-24 బడ్జెట్‌లు అందించారు. ఈ ఏడాది ఎన్నికల సంవత్సరం కావడంతో ఫిబ్రవరి 1న 2024-25కి సంబంధించిన ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టారు. ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
ఇదిలా ఉంటే.. 2024 పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం మొదలైన విషయం తెలిసిందే. నిన్న పార్లమెంట్‌లో నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. ఈ సమావేశాలు ఆగస్టు 12 వరకూ కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో ఎయిర్ క్రాఫ్ట్ చట్టం, జమ్ముకశ్మీర్ బడ్జెట్, ప్రకృతి వైపరీత్యాల యాజమాన్య చట్టం, భారతీయ వాయుయాన్ విధేయక్ బిల్లు, కాఫీ (ప్రోత్సాహం, అభివృద్ధి) బిల్లు, రబ్బర్ (ప్రమోషన్ అండ్ డెవలప్ మెంట్) బిల్లు తదితర ఆరు బిల్లును మోదీ ప్రభుత్వం ఆమోదింప చేయాలని మోదీ ప్రభుత్వం చూస్తుంది.
కాగా లోక్ సభలో నిర్మలా సీతారామన్ బడ్జెట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా.. ఆమె అంతర్జాతీయంగా ఉన్న అస్థిర పరిస్ధితుల ప్రభావం భారత్ లోనూ ద్రవ్యోల్బణానికి కారణమవుతోందని.. పేదలు, మహిళలు, యువత రైతులే లక్ష్యంగా ఇప్పటికే మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టామని... ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను మరో ఐదేళ్లకు పొడిగించిన్నామని.. దీంతో 80 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతోందని చెప్పారు.
అంతేకాదు... ఐదు పథకాల ప్రధానమంత్రి ప్యాకేజీని నిర్మల వెల్లడించారు. ఇది 2 లక్షల కోట్లతో వచ్చే ఐదేళ్లలో ఐదు కోట్ల మందికి ఉపాధి కల్పించనుందని. 1.48 లక్షల కోట్లతో విద్య, నైపుణ్యాల అభివృద్ధి, ఉపాధి కల్పన చేపడతామని.. వికసిత్ భారత్ లక్ష సాధనలో భాగంగా ఈసారి 9 రంగాలకు ప్రాధాన్యమిస్తున్నమని... ఇందులో మొదటిది వ్యవసాయంలో ఉత్పాదకత, విద్య, నైపుణ్యాల కల్పన, సమ్మిళిత మానవ వనరుల అభిృద్ధి-సామాజిక న్యాయం, తయారీ-సేవలు, పట్టణాభివృద్ధి, శక్తి భద్రత, సృజనాత్మకత, భవిష్యత్ సంస్కరణలు ఉన్నాయన్నారు.
అయితే ఈసారి కేంద్ర బడ్జెట్ లో ఎన్డీయేకు కీలకమైన భాగస్వాములు టీడీపీ, జేడీయూలను సంతృప్తి పర్చే లక్ష్యంతో ఏపీ, బీహార్ కు ప్రత్యేక కేటాయింపులు చేశారు. ఇందులో ఏపీకి అమరావతి రాజధాని కోసం రూ.15 వేల కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు... అలాగే పోలవరం త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అటు బీహార్ లో రోడ్ల కోసం రూ.26 వేల కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. బీహార్ లో కొత్త ఎయిర్ పోర్టులు, మెడికల్ కాలేజీలు, క్రీడా సదుపాయాల కోసం రాబోయే సంవత్సరాల్లో రూ.15 వేల కోట్లు ఇస్తామని ఆర్ధిక మంత్రి ప్రకటించారు.
ఏపీకి విభజన చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక సహకారం అందిస్తామని హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు అందిస్తామని.. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లోని నోడ్‌లకు ప్రత్యేక సాయం చేస్తామన్నారు. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్, రోడ్లు, హైవేల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని.. విశాఖ - చెన్నై కారిడార్‌లో కొప్పర్తికి, హైదరాబాద్-బెంగళూరు కారిడార్‌లో ఓర్వకల్లుకు నిధులు ఇస్తామని ఆర్ధిక మంత్రి ప్రకటించారు.
అంతేకాదు.. నిరుద్యోగులకు తీపి కబురు చెప్పారు. ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్సెంటివ్స్ కోసం మూడు పథకాలు తీసుకువస్తామని కొత్త ఉద్యోగాల కల్పనను ప్రోత్సహించేందుకు మొదటి నెల జీతం ప్రభుత్వమే చెల్లిస్తుందని... అదేవిధంగా కొత్త ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ చెల్లింపులలో మొదటి నాలుగేళ్లు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నమని... ప్రధానమంత్రి ప్యాకేజీలో భాగంగా, ఈపీఎఫ్‌ఓలో నమోదు ఆధారంగా ఉద్యోగ అనుసంధాన ప్రోత్సాహకాల అమలు చేస్తామని.. తొలిసారి ఉద్యోగులకు ఒక నెల వేతనం మూడు వాయిదాల్లో చెల్లిస్తామని.. గరిష్ఠంగా రూ.15 వేలు చెల్లింపుతో.. నెలకు గరిష్ఠంగా రూ.1 లక్ష లోపు వేతనం ఉన్నవారు అర్హులని... ఈ పథకాల ద్వారా 2.10 లక్షల మంది యువతకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
ప్రధానమంత్రి అర్బన్ హౌసింగ్ ప్లాన్ కోసం 10 లక్షల కోట్ల రూపాయలను ప్రకటించారు. అలాగే కోటి ఇళ్లకు ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనను ప్రకటించారు. స్టాంప్ డ్యూటీలను తగ్గించేలా రాష్ట్రాలను ప్రోత్సహిస్తామని సీతారామన్ చెప్పారు. అస్సాం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లకు వరద సహాయాన్ని కూడా ఆర్థిక మంత్రి ప్రకటించారు.
కొత్త పన్ను విధానంలో ఉద్యోగులకు స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని రూ.50 వేల నుంచి రూ.75 వేలకు పెంచారు. అలాగే కొత్త పన్ను విధానంలో స్లాబ్ లు కూడా మార్చారు. 3 లక్షల నుంచి 7 లక్షల వరకూ ఆదాయం ఉంటే 5 శాతం పన్ను, 7 లక్షల నుంచి 10 లక్షలు ఉంటే 10 శాతం, 10 లక్షల నుంచి 15 లక్షలు ఉంటే 15 శాతం పన్ను విధిస్తారు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను పరిమితి 2.5 లక్షలకు పెంచారు.
కూరగాయల సప్లయ్ చైన్ నిర్వహణకు కొత్త స్టార్టప్‌లకు అవకాశం కల్పిస్తామని... సేకరణ, నిల్వ, సరఫరాకు తగిన పెట్టుబడులు అందుబాటులోకి తెస్తామని... కూరగాయలు ఉత్పత్తి చేసే 6 కోట్లమంది రైతుల డేటా సేకరిస్తామని... సహకార రంగాన్ని సుస్థిరపరిచేందుకు నిర్మాణాత్మక విధానాలను రూపొందిస్తామన్నారు.
కాగా పార్లమెంట్‌లో నిర్మలా సీతారామన్.. చేసే ప్రసంగాలకు ఏంత క్రేజ్ ఉందో.. సందర్భానుసారంగా ఆమె ధరించే వస్త్రాలు కూడా అంతే క్రేజ్ ఉంది. అయితే.. ప్రతి సంవత్సరం బడ్జెట్ రోజున ధరించే చీరల విషయంలో ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకుంటారు నిర్మలా సీతారామన్. ఇక స్వతహాగా చేనేత చీరలను ఇష్టపడే ఆమె.. 2019లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచీ బడ్జెట్ సమావేశాలకు ఆమె చేనేత చీరనే ధరిస్తూ వస్తున్నారు. ఈ సారి కూడా ఆమె ఇదే సంప్రదాయాన్ని అనుసరించారు. ఈసారి ఆమె తెలుపు రంగు చీరను ఎంచుకున్నారు. బంగారు మోటిఫ్‌లతో ఉన్న మెజెంటా బార్డర్‌తో కూడిన తెలుపు రంగు చెక్స్ చేనేత చీరలో మెరిశారు. ఇక తెలుపు రంగు స్వచ్ఛతకు సామరస్యానికి భారతీయ సంస్కృతిలో కొత్త శకం ప్రారంభానికి శుభసూచికంగా భావిస్తారన్న విషయం తెలిసిందే.
అంతేకాదు.. దేశ చరిత్రలో సుదీర్ఘ సమయం బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డు నిర్మల పేరిట ఉంది. 2020-21 బడ్జెట్ ప్రవేశపెడుతూ 162 నిమిషాల (2 గంటల 42 నిమిషాలు) పాటు ప్రసంగించారు. ఇక, 2019-20 బడ్జెట్‌లో భాగంగా 137 నిమిషాల పాటు ఆమె చేసిన ప్రసంగం రెండో అతి పెద్దది. అంతకుముందు 2003-04 బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన జశ్వంత్‌సింగ్ 135 నిమిషాల పాటు మాట్లాడారు.
What's Your Reaction?