గొర్రెలు మేపుతున్న సిరిసిల్ల ఐఐటీ ర్యాంకర్! స్పందించిన సీఎం రేవంత్ - కేటీఆర్!!
చదువుకోవాలంటే.. చదువుకోనాలి.. ఇది ప్రస్తుత సమజం మాట. ఎందుకంటే ప్రస్తుత సమాజంలో చదువుకుంటే సరిపోదు... చదువునుకోంటేనే ఉన్నత చదువులు చదవగలం. లేదంటే లేదు.Sri Media News
చదువుకోవాలంటే.. చదువుకోనాలి.. ఇది ప్రస్తుత సమజం మాట. ఎందుకంటే ప్రస్తుత సమాజంలో చదువుకుంటే సరిపోదు... చదువునుకోంటేనే ఉన్నత చదువులు చదవగలం. లేదంటే లేదు.. అందుకే దేశంలో ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని, కుటుంబానికి అండగా నిలవాలని అనుకున్నప్పటికీ ఆర్థిక పరిస్థితి సహకరించక మధ్యలోనే చదువులు ఆపేస్తున్నారు. ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. డబ్బుల్లేక నిస్సహాయత స్థితిలో ఉంటున్నారు. తల్లిదండ్రులకు చదివించే స్థోమత లేకపోవడంతో... చివరకు చిన్న చితకా పనులకు వెళుతూ.. కాలం వెళ్లదీస్తున్నారు.
మన తెలుగు రాష్ట్రాల్లో ఎందరో పెద విద్యార్థులు నీట్, ఐఐటీ, జేఈఈ వంటి జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో సత్తా చాటుతున్నారు. కానీ చదువుల తల్లి కటాక్షం ఉన్నా.. లక్ష్మీ కటాక్షం లేకపోవడం చాలమంది విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారు. ఎలాంటి కోచింగ్, ఆర్థిక సపోర్టు లేకుండా వాటిని అధిగమించి ఉత్తమ ర్యాకుంగు సాధించిన చదువుకోనలేక.. చదువులకు దూరమవుతున్నారు.
ఇలాంటి ఓ విద్యార్థినే... రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన గిరిజన బాలిక ‘బదావత్ మధులత’. రాజన్న సిరిసిల్ల జిల్లా, వీర్నపల్లి మండలం గోనె నాయక్ తండాకి చెందిన మధులత ఎస్టీ కేటగిరీలో జేఈఈ మెయిన్స్ పరీక్షలో 824వ ర్యాంక్ సాధించింది. ఐఐటీ పాట్నాలో సీటు కూడా సాధించింది. అయితే సీటు కన్ఫర్మ్ చేసుకోవడానికి ఆమె రూ.3 లక్షలు చెల్లించాలి. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో అంత పెద్ద మొత్తం చెల్లించలేక ఐఐటీలో చదవాలనే కోరికను విరమించుకుంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆమె ఇద్దరు సోదరీమణులు తమ తండాలోని కొద్దిపాటి భూమిలో సాగు చేస్తుండగా... మధులత కూడా గ్రామంలో మేకలు, గొర్రెలను మేపడం మొదలు పెట్టింది.
మధులత పాట్నా ఐఐటీలో సీటు పొందాలంటే జూలై 27 2024 తేదీలోగా ఫీజు చెల్లించాలి. లేదంటే సీటు రద్దవుతుంది. కానీ మధులత తండ్రి రాములు దగ్గర కూతురిని ఐఐటీ చదివించే ఆర్థిక స్తోమత లేదు. అందుకే దాతల సాయం చేస్తే.. తన కూతురిని చదవిస్తానంటున్నాడు రాములు. ‘‘నేను నాభార్య సరోజ రెక్కలు ముక్కలు చేసుకుంటూ పిల్లలను పెంచి పెద్ద చేశాం. ఇద్దరు కూతుళ్లను డిగ్రీ వరకు చదివించాం. చిన్న కూతురు కూడా బాగా చదవి జేఈఈలో ఉత్తమ ర్యాంకు సాధించింది. పై చదువులు చదవాలన్న ఆశతో జేఈఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి మంచి ర్యాంకు సాధించింది. అయితే కటిక పేదరికంతో ఉన్న నేను ఫీజు కట్టలేడని తెలిసి మేకల కాపరిగా మారింది. ఎవరన్నా దాతల సహకారం చేస్తే నా కూతురు పై చదువులు చదువుతుంది’’ అని అందరిని వేడుకున్నాడు రాములు
బాలిక పరిస్థితిపై మీడియాలో వచ్చిన కథనాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి చేరగా, మధులతను హైదరాబాద్‌కు పిలిపించారు. మధులత చదువు పూర్తయ్యే వరకు ఆర్థిక సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. దీంతో గిరిజన సంక్షేమ శాఖ ద్వారా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తుంది. ఈ విషయాన్ని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ కమిషన్ అధికారికంగా ధృవీకరించింది. హాస్టల్ ఫీజులు, ఇతర ఫీజులకు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న ఆ విద్యార్ధి చదువుకు కావల్సిన ఫీజును ప్రభుత్వం సమకూరుస్తుందని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ కమిషన్ తెలియజేసింది. ఇక బాలిక పరిస్థితిపై స్పందించిన కేటీఆర్ సైతం ఆర్ధిక సహాయం చేయడానికి సిద్ధమయ్యారు. తన ఎడ్యుకేషన్‌కి అయ్యే అవసరాలను చూసుకుంటానని ప్రకటించారు.
What's Your Reaction?