దొంగతనానికి సాయం చేసిన శివుడు శిక్ష వేసిన ఆలయాధికారి.. ఆ తరువాత ఏం జరిగింది?

చిన్నపిల్లలు దేవుడితో సమానం అంటారు.. ఎందుకంటే.. వారికి ఎటువంటి దురుద్దేశాలు ఉండవు.. నిష్కల్మశంగా ఉంటారు అని.. అందుకే దేవుడు వారితో మాట్లాడుతారని అంటారు.. కానీ ఓ చోట మాత్రం పిల్లలతో కలిసి.. దొంగతనం చేశాడు.. పిల్లలు పట్టుబడటంతో.. వారితో పాటు శిక్షను కూడా అనుభవించాడు.. అస్సలు నమ్మబుద్ధి కావటం లేదు కదా? Sri Media News

Jul 11, 2024 - 13:45
 0  20
దొంగతనానికి సాయం చేసిన శివుడు శిక్ష వేసిన ఆలయాధికారి.. ఆ తరువాత ఏం జరిగింది?
దేవుడు ఏంటి.. పిల్లలతో కలిసి దొంగతనం చేయటం ఏంటి? దొరికిపోయి.. శిక్షను అనుభవించటం ఏంటి? అన్న సందేహం వస్తుంది కదా.. అయితే ఇది ఎక్కడ జరిగింది.. ఎలా జరిగింది అన్న వివరాలు తెలుసుకుందాం రండి.

అది అరుణాచల ఆలయ ప్రాంగణం.. ఇద్దరు పిల్లలు కలిసి ఆడుకుంటున్నారు.. ఇలా ఆడుకుంటుండగా.. వారి దృష్టి అరుణాచలేశ్వరుడి ఆలయ సన్నిధిలో ఉన్న హుండీపై పడింది.. భక్తుల తాకిడి కొంచెం తగ్గింది.. ఆలయ పూజారులు సైతం ఎవరి పనులలో వారు ఉన్నారు.. సరిగ్గా ఆ టైమ్‌లోనే పిల్లలు వెళ్లి హుండీలో ఉన్న డబ్బులను సన్నని రేకుతో లాగటానికి ట్రై చేస్తున్నారు.. ఇద్దరం ఇక్కడే ఉంటే పట్టుబడతాం.. నువ్వు ఎవరైనా వస్తున్నారేమో చూడు అని చెప్తాడు మెుదటి పిల్లవాడు.. 
ఇక రెండో పిల్లవాడు చుట్టూ చూసి.. ఒరేయ్‌ అరుణాచలుడు పెద్ద పెద్ద కళ్లు వేసుకొని మనల్నే చూస్తున్నాడురా అని అన్నాడు.. అప్పుడు ఇద్దరూ దేవుడి ముందు నిలబడి మా దొంగతనం బయటపడకుండా నువ్వే చూడాలి అని అన్నారు.. అందుకు పటిక బెల్లలంలో మూడో వంతు ఇస్తాం.. ముగ్గురం సమానంగా తీసుకుందాం అని దేవుడితో ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఇక ఆరోజు నుంచి వారికిది ఓ సరదాగా మారింది.. రోజూ హుండీలోని డబ్బుని ఎవరూ లేనిప్పుడు తీయటం.. పటిక బెల్లాన్ని కొనటం మూడు వాటాలుగా వేసి.. అరుణాచలుడికి ఒక వాటా ఇవ్వటం చేస్తున్నారు.. ఆ పిల్లలు ఇద్దరూ పెట్టే పటిక బెల్లం పటిక బెల్లం సైతం మాయమైపోయేది.. 
అయితే ఓరోజు.. హుండీలో నుంచి డబ్బులు తీస్తుండగా.. పూజారి చూసేశాడు.. అంతే ఇంక ఇద్దరి దొంగలను పట్టుకొని.. ఆలయ అధికారికి అప్పగించారు.. వీళ్ల వయస్సు చూస్తే ఎనిమిదేళ్లు.. చేసేది దొంగతనం.. వీరిని ఎలా శిక్షించాలి అని ఆలోచించిన ఆలయ అధికారి.. ఇద్దర్నీ 108 ప్రదక్షిణలు చేయమనీ.. ఇదే శిక్ష అని చెప్పారు.. 
ఇక పిల్లలిద్దరూ ప్రదక్షిణాలు చేయటం మెుదలు పెట్టారు.. ఆలయ పూజారి, అధికారి దూరంగా కూర్చొని ఉండగా.. పిల్లలు అదో ఆటలా ప్రదక్షిణలు చేస్తున్నారు.. పిల్లలు ప్రదక్షిణలు చేస్తున్నవైపు చూసిన ఆలయ పూజారి, అధికారి ఒక్కసారిగా తుళ్లిపడ్డారు.. ఇద్దరు పిల్లలతో పాటు మూడవ పిల్లవాడు కూడా ప్రదక్షిణం చేయడం చూశారు. మూడవ పిల్లవాడు మెరిసిపోతూ కనిపించాడు.
ఆ మూడో పిల్లవాడు ఇలా కనిపించి.. అలా మాయం అవుతున్నాడు.. ఇది గమనించిన ఆలయ అధికారి.. పిల్లల దగ్గరకి వెళ్లి.. మూడో పిల్లవాడు ప్రత్యక్షం కాగానే.. గట్టిగా పట్టేసుకున్నాడు.. అప్పుడు మూడో పిల్లవాడు కాంతి రేఖగా మారి.. గర్భాలయంలోకి వెళ్లి మాయమైపోయాడు.. 
దీంతో ఆలయాధికారి.. ఇద్దరి పిల్లలను బుజ్జగించి అసలు ఏం జరిగిందో చెప్పమని అడిగారు.. అప్పుడు ఆ ఇద్దరి పిల్లలు జరిగిందంతా చెప్పి.. అరుణాచలేశ్వరుడికి.. తమకి ఉన్న ఒప్పందం చెప్పారు.. అంటే శివుడు దొంగ పటిక బెల్లంలో మూడో వంతు తిన్నాడు కదా.. అందుకని ఆయన కూడా వచ్చి శిక్షను అనుభవించాడు అన్నమాట. 
ఇదంతా విన్న ఆలయాధికారి ఒక పక్క ఆశ్చర్యం, మరో పక్క ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు.. సాక్షాత్తు ఆ పరమశివుడే మూడవ వాటాన్ని పంచుకున్నాడు. అందుకే శిక్ష అనుభవించాడు అని అనుకున్నారు అంతా. అరుణాచలీశ్వరుడు ఓ కాంతి రూపంలో ఉంటాడని, అక్కడ ఉండేది అగ్నిలింగం అని పురాణాలు చెప్తున్నాయి.. ఆ కొండల పైన ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో ఒక కాంతి రూపంలో వచ్చి భక్తుల సమస్యలను ఆ పరమ శివుడు తీర్చిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి అని చెప్తుంటారు. 
శివుడు అనుకొని ఉంటే.. పిల్లలు పూజారికి దొరకకుండా ఉండును.. కానీ.. పిల్లలు చేసేది తప్పు అని తెలియజెప్పటం కోసం.. ఇంత నాటకం ఆడారని చెప్తుంటారు.. ఏదైనా తప్పు చేసినప్పుడు మెుదట అది ఆటలా, ఆ తరువాత వ్యవసనంలా మారి.. తీవ్ర పర్యవసనాలు ఎదుర్కోవలసి ఉంటుందని ఈ సంఘటన ద్వారా తన భక్తులకు తెలియజేశాడు శివుడు.. అంతేగాకుండా.. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సరే.. శిక్ష అనుభవించాలని చెప్పకనే చెప్పాడు అరుణాచలేశ్వరుడు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow