విశాల్ చేసిన తప్పు ఏంటి? విశాల్ టార్గెట్ ఎందుకయ్యాడు?
సినిమాలో హీరో విలన్‌ని టార్గెట్ చేసినట్లు... ప్రొడ్యూసర్లు ఓ హీరోను టార్గెట్ చేశారు. ఎంతలా అంటే... ఆయన సినిమాకి పనిచేయాలంటే టెక్నీషియన్ దగ్గర్నుంచి, ఆర్టిస్టుల వరకు ప్రతిఒక్కరూ పర్మిషన్ తీసుకోవాల్సిందే. గతంలో నిర్మాతల మండలి అధ్యక్షుడి విశాల్ చేశారు.Sri Media News
ఆ సమయంలో విశాల్ నిధులు దుర్వినియోగం చేశాడన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇకపై విశాల్‌తో ఎవరూ సినిమా చేయాలన్న తమ అనుమతి తీసుకోవాల్సిందేనని తమిళ నిర్మాతల మండలి కండిషన్ పెట్టింది. దర్శకుడి నుండి టెక్నిషియన్ వరకు ఎవరైనా సరే విశాల్‌తో కలిసి వర్క్ చేయాలనుకుంటే తప్పక తమ అనుమతి తీసుకోవాల్సిందేనని అల్టిమేటం జారీ చేసింది కూడా. ఇంతకు నిర్మాతలకు హీరో విశాల్ టార్గెట్ ఎందుకయ్యాడు? ప్రొడ్యూసర్ల పాలిట విలన్ ఎందుకయ్యాడు...?
విశాల్ చేసిన తప్పు ఏంటో... తెలుసుకుందాం.
తమిళ్ హీరో విశాల్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో తమిళ్‌తో పాటు తెలుగులో కూడా మార్కెట్ సంపాదించుకున్నాడు. అయితే మొదట్నుంచి కూడా ఉన్నది ఉన్నట్టు మాట్లాడి వివాదాల్లో నిలుస్తాడు విశాల్. ఇటీవల తమిళనాడులో థియేటర్స్ అన్ని కొంతమంది చేతుల్లోనే ఉన్నాయని, వాళ్ళు చెప్పినప్పుడే సినిమా రిలీజ్ చేయాలని, సినిమాలని వాళ్ళ కంట్రోల్ లో ఉంచుతున్నారని వాళ్లు ఎవరో కాదు... రెడ్ జాయింట్ డిస్ట్రిబ్యూటర్స్ అంటు ఇంటర్వ్యూలో చెప్పుకోచ్చారు. విశాల్ ఆరోపణలు చేసిన రెడ్ జాయింట్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ తమిళనాడు సీఎం కొడుకు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ నేతృత్వంలో నడుస్తోంది. సో అందుకే విశాల్ ఇంటర్వ్యూలో చెప్పిన మాటకు హట్ అయిన ఉదయనిధి స్టాలిన్ ఇలా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారనే తరహాలో కోలీవుడ్ వర్గాల్లో టాక్ ఉంది. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో.. లోగుట్టు పెరుమాళ్ళకే తెలియాలి.
ఇదిలా ఉంటే.. 2017 నుంచి 2019 వరకు నిర్మాతల మండలి అధ్యక్షుడిగా విశాల్ పనిచేశారు. ఆ సమయంలో విశాల్ పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం చేసినట్లు తమిళ ప్రొడ్యూసర్లు ఆరోపిస్తున్నారు. విశాల్ చేసిన దొపిడి కోటి కాదు రెండు కోట్లు కాదు... ఏకంగా 12 కోట్ల రూపాయలను దారి మళ్లించాడని విశాల్‌పై ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాదు.. విశాల్ నడిగర్ సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా నిధుల దుర్వినియోగం జరిగిందంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమిళ నిర్మాతలంతా కలిసి... విశాల్ సినిమాలో ఎవరు పనిచేయాలన్నా పర్మిషన్ కంపల్సరీ అన్న రూల్‌ను తీసుకొచ్చారు.
ఈ అల్టిమేటంపై హీరో విశాల్ సోషల్ మీడియాలో స్పందించాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ షేర్ చేశాడు. ‘‘ఇది మీ టీంలోని వ్యక్తి మిస్టర్ కతిరేషన్‌తో కలిసి సమిష్టిగా తీసుకున్న నిర్ణయమని మీకు తెలియదా? నిర్మాతల మండలిలోని వృద్ధులు, కష్టాల్లో ఉన్న సభ్యుల సంక్షేమ పనుల కోసమే ఆ నిధులు ఖర్చు చేశాం. వారి కుటుంబం, విద్య, వైద్యం అంటూ ఇలా పలు సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేశాం. కౌన్సిల్ సభ్యులు, వారి కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చేలా పండగల సమయంలో ప్రాథమిక సంక్షేమం ఇచ్చాం. ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకే నిధులు ఖర్చు చేయబడ్డాయి. మీరు అక్కడ మీ పనిని సక్రమంగా చేయండి. ఇండస్ట్రీలో చాలా పని ఉంది. డబుల్ టాక్సేషన్, థియేటర్ మెయింటైన్స్ ఛార్జెస్ అంటూ ఇలా ఎన్నో సమస్యలకు పరిష్కరాలు వెతకాల్సి ఉంది. విశాల్ ఇక్కడ కంటిన్యూగా సినిమాలు చేస్తూనే ఉంటాడు. కావాలంటే నన్ను ఆపేందుకు ట్రై చేసుకోవచ్చు. నిర్మాతలు అని పిలవబడే.. ఎప్పటికి సినిమాలు నిర్మించలేని ప్రోడ్యూసర్స్ మీరు. అసలు అక్కడ సినిమాలు తీసే నిర్మాతలున్నారా? ఆలోంచించండి’’ అంటూ విశాల్ పోస్ట్ చేశాడు.
కాగా ప్రస్తుతం స్వీయ దర్శకత్వంలో డిటెక్టివ్ 2 (తుప్పరివాలన్) తీస్తున్నాడు విశాల్. దాని మొదటి భాగం సూపర్ హిట్ అయ్యింది. ఆ తరువాత ఆ దర్శకుడు మిస్కిన్ తోనూ విశాల్ విభేదించారు. ఇదిలా ఉంటే విశాల్ సినిమాలపై ప్రోడ్యూసర్స్ ఆంక్షలు పెట్టడం తమిళనాట చర్చనీయాంశమైంది. నిర్మాతల మండలిపై ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు విశాల్ ఫ్యాన్స్. మరి ఈ ఇష్యూ ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.
What's Your Reaction?