హీరో దర్శన్ కి ఊహించని దెబ్బ!జైల్లో సిగరెట్ కోసం అడుక్కునే స్థాయికి!!!

తూగుదీప దర్శన్‌.. ఈ పేరు భారతదేశాన్ని కుదిపేసింది.. ఛాలెంజింగ్‌ స్టార్‌ అని పేరు తెచ్చుకున్న దర్శన్.. రియల్‌ లైఫ్‌‌‌లో విలన్ అయ్యాడు. రియల్‌ లైఫ్‌‌‌‌‌ని... రీల్‌ లైఫ్‌ అనుకుని.. సినిమాల్లో చూపించే హీరోయిజం వదిలి.. ఓ అభిమానిని అత్యంత క్రూరంగా హత్య చేసి రియల్‌ లైఫ్‌ విలన్‌ అయ్యాడు.Sri Media News

Jul 23, 2024 - 16:24
 0  16
హీరో దర్శన్ కి ఊహించని దెబ్బ!జైల్లో సిగరెట్ కోసం అడుక్కునే స్థాయికి!!!

ఇప్పడు పరప్పన అగ్రహార జైలులో ఊచలు లెక్కపెడుతున్నాడు. హీనాతి హీనంగా పోలీసులను సిగరెట్ అడుక్కునే స్థాయికి దిగజారిపోయాడు. రేణుక స్వామి అనే అభిమాని మర్డర్ కేసులో దర్శన్, ఆయన ప్రియురాలు పవిత్ర గౌడ, అనుచరులు విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే..

అయితే దర్శన్ తనకు జైలు ఫుడ్ సరిపడటం లేదని.. డయేరియాకి గురవుతున్నాను అని. విపరీతంగా బరువు తగ్గానని... ఇంటి భోజనం తెప్పించుకునేందుకు అనుమతి ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ వేశాడు. కానీ...  ప్రభుత్వ న్యాయవాది దర్శన్ పిటిషన్ పై అభ్యంతరం చెప్పాడు. దీంతో బెయిల్ పిటీషన్‌‌తో పాటు ఇంటి భోజనానికి అనుమతి కోరుతూ దర్శన్ వేసిన పిటిషన్ మీద  కోర్టులో విచారణ జరిగింది. కాగా దర్శన్, పవిత్ర గౌడ కస్టడీ పొడిగిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు. ఆగస్టు 1 వరకు దర్శన్, పవిత్ర గౌడ కస్టడీ ఎక్స్టెండ్ చేశారు.

అయితే.. వారికి ఇంటి భోజనం, దిండు, పరువు, పుస్తకాలు కావాలన్న దర్శన్ అభ్యర్థనను జడ్జి పట్టించుకోలేదు... నిజానికి  జైల్లో పౌష్టికాహారం, ఇంటి భోజనాలకు సంబంధించి దర్శన్ ఐజీని అభ్యర్థిస్తే సరిపోతుంది. ఆయనే ఎదో ఓ నిర్ణయం తీసుకోనేవారు.. మరి దర్శన్ ఏం అనుకున్నడో ఏమో తెలిదూ కానీ... డైరెక్ట్‌‌గా హై కోర్టును ఆశ్రయించాడు. దీంతో ప్రభుత్వ న్యాయవాది.. ఐజీ ఇచ్చే అనుమతి అని మీ వరకు రావల్సిన విషయం కాదు అని వాదించారు. దీంతో దర్శన్ అభ్యర్థనను జడ్జి పట్టించుకోలేదు.

దర్శన్‌కు ఇలాంటి వివాదాలు కొత్తేమీ కాదు... గతంలో కూడా దర్శన్ పై కొన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి. టాలీవుడ్ హీరోయిన్ నికితతో రిలేషన్ మెయిన్ టైన్ చేశాడన్న రూమర్లు ఉన్నాయి. ఈ విషయం అతడి భార్యకు తెలిసి.. నికితకు వార్నింగ్ ఇవ్వడంతో ఆమె కెరీర్ ఖతమ్ అయ్యిందంటారు. ఆ తర్వాత ఇతడి లైఫ్‌లోకి వచ్చింది పవిత్ర గౌడ. 2011లో దర్శన్ తనపై గృహ హింసకు పాల్పడ్డాడని భార్య ఆరోపణలు చేయగా.. పోలీసులు అరెస్టు చేసి.. 14 రోజుల కస్టడీ విధించారు కూడా.

ఆ తర్వాత ఈ ఇష్యూని సినిపెద్దల ముందు సెటిల్ చేసుకున్నారు. అలాగే 2016లో కూడా దర్శన్ తనపై అభ్యంతరకరంగా వ్యవహరించి కోపంతో గన్‌‌తో ఫైర్ చేయ్యడంతో తప్పిచుకున్న భార్య.... పోలీసులను కూడా  ఆశ్రయించింది. 2021లో మైసూర్ హోటల్‌లో వెయిటర్‌పై కూడా దర్శన్ దూరుసుగా ప్రవర్తించిన చరిత్ర ఉంది... ఈ సంఘటనను వెయిటర్‌‌కి 50 వేలు ఇచ్చి కప్పిపుచ్చారు. అలాగే కన్నడ సినీ నిర్మాత భరత్‌ను దర్శన్ బెదిరించిన అనేక కేసులు దర్శన్ పై ఉన్నాయి.

ఇక ఇప్పుడు... రేణుక స్వామి అనే ఫ్యాన్‌ని దర్శన్‌ చంపిన విధానం చూస్తే.. వీడు అసలు నిజంగా మనిషేనా అని అనిపించకమానదు.. ఇండస్ట్రీలో లైట్‌ బాయ్‌గా కెరియర్‌ మెుదలు పెట్టిన దర్శన్‌.. స్టార్‌ హీరోగా ఎదిగి రాజభోగాలు అనుభవించాడు.. తన ప్రేయసి పవిత్రపై  సోషల్ మీడియాలో రేణుకా స్వామి అసభ్యంగా పోస్టులు పెట్టడం మెుదలు పెట్టాడని...  నీ ఫ్యాన్ నన్ను ట్రోల్ చేస్తున్నాడు, అసభ్యంగా మాట్లాడుతున్నాడని పవిత్ర దర్శన్‌కు చెప్పడంతో రెచ్చిపోయి... లవర్ ముందు హీరోయిజం చూపించడం కోసం సినిమా స్టైల్ లో రేణుకా స్వామిని కిడ్నాప్ చేయించి.. కరెంట్ షాక్ ఇచ్చి రేణుకా స్వామి సారీ చెప్పి.. తప్పు జరిగింది ఇంకా నేను మీ జోలికి రాను అని... పవిత్ర కాళ్లపై పడి వేడుకున్న.. ప్రియురాలి కోపం తగ్గక పోవడంతో... దర్శన్ తన విలనిజాన్ని చూపించాడు. వెజ్ టేరియన్ అయిన రేణుకా స్వామి చేత చికెన్ బిర్యానీ తినిపించి హింసించి... అంతటితో ఆగకుండా.. కరెంట్ షాకిచ్చి... అతటి ప్రైవేట్ పార్ట్స్ పై కొట్టి మరీ చంపేసి...  రేణుకాస్వామి డెడ్ బాడీని రోడ్డు పక్కన కాలువలో పడేసి నాకేమీ తెలియదు అన్నట్లు ఇంటికి వెళ్లి పూజలు చేశాడు దర్శన్. ఇలా రెచ్చిపోయిన దర్శన్  ఇప్పుడు తన పోగరుతో.. అహంకారంతో  జైల్లో ఒక్క సిగరెట్ కోసం పోలీసులను ప్రాధేయ పడుతున్నాడంటే ఎంతకు దిగజారిపోయాడో మనం తెలుసుకోవచ్చు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow