ఛీ ఛీ....బావ బామ్మర్దుల పరాచకం..మల ద్వారంలోకి గాలి పంపింగ్‌!!

సరదాకు ఒక హద్దు ఉంటుంది. దాన్ని మీరి ప్రాణాలు కోల్పోయిన ఎన్నో సంఘటనలు ఉన్నాయి. కొందరు బావాబామ్మర్దులు సరదాగా మాటలు అనుకోవడం కామన్. ఒకరిని ఒకరు గేలి చేసుకుంటూ ఉంటారు. కానీ పరాచకాలు హద్దు మీరితే!Sri Media News

Jul 27, 2024 - 19:22
 0  19
ఛీ ఛీ....బావ బామ్మర్దుల పరాచకం..మల ద్వారంలోకి గాలి పంపింగ్‌!!

సరదాకు ఒక హద్దు ఉంటుంది. దాన్ని మీరి ప్రాణాలు కోల్పోయిన ఎన్నో సంఘటనలు ఉన్నాయి. కొందరు బావాబామ్మర్దులు సరదాగా మాటలు అనుకోవడం కామన్. ఒకరిని ఒకరు గేలి చేసుకుంటూ ఉంటారు. కానీ పరాచకాలు హద్దు మీరితే.. ఊహించని ఘటనలు చోటుచేసుకుంటాయి. అయితే బావాబామ్మర్దులు మధ్య ఓ ఫన్నీ కన్వర్జేషన్ నవ్వుతూ సరదగా సాగింది. అంత వరకు బాగానే ఉన్న అలా మాటలు కోటలు దాటి... వారి పరాచకాలు హద్దు మీరాయి.. సరదగా వారు చేసిన ఓ పని ఒకరి ప్రాణాలను తీసుకునేది. భూమి మీద నూకలు ఉండటంతో బతికి బయటపడ్డాడు.

అసలు విషయానికి వస్తే... హనుమకొండ జిల్లా ఐనవోలుకు చేందిన యువకుడు ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. వర్షలు కురుస్తుండటంతో పొలాలు దున్నుతున్నాడు. ఈ క్రమంలో  ట్రాక్టర్‌‌‌కు ఓ సమస్య తలెత్తడంతో... మెకానిక్‌ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ రిపేర్ చేస్తుండగా... మెకానిక్ షేడ్ దగ్గరకు తనకు బావమర్దుల వరుసయ్యే ఇద్దరు స్నేహితులు వచ్చారు.. బావను చూసి ఆటపట్టిద్దం అనుకుని.... రావడం రావడంతోనే వారు బావ వరస అయ్యే వ్యక్తిని ఆటపట్టించడం మొదలెట్టారు. ఇలా ఓ ఫన్నీ కన్వర్జేషన్ వారి మధ్య జరిగింది. సరదాగా ఓ బెట్ వేసుకున్నారు.. అందులో ఆ ట్రాక్టర్ డ్రైవర్ ఓడిపోయాడు.. దీంతో బెట్ ఒడిపోయవ్ అని గేలి చేశారు. అంతటితో ఆగలేదు... ఒడిపోయిన ట్రాక్టర్ డ్రైవర్ మలద్వారంలోకి ట్రాక్టర్లకు గాలి కొట్టే హైడ్రాలిక్ మిషన్ ద్వారా గాలి వదిలారు. గాలి తీవ్రత అధికంగా ఉండడంతో అతని పెద్ద పేగు తీవ్రంగా దెబ్బతింది. అంతేకాదు ఆ యువకుడు కూడా తీవ్రంగా అనారోగ్యానికి గురైయ్యాడు. ఒకానొక దశలో అచేతన స్థితిలోకి వెళ్ళాడు. దీంతో కంగారుపడిన  బావమర్దులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి నయం కాకపోవడంతో వరంగల్ తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు సర్జరీ చేసి.. పెద్ద పేగులోని గాలిని తొలగించారు. ఇప్పటికి లక్ష పైనే ఖర్చు చేసినా అతని పరిస్థితి మెరుగుపడలేదు. మరికొద్ది రోజులు ఆస్పత్రిలోనే మానిటరింగ్ చేయాల్సి ఉంటుందని డాక్టర్లు తెలిపారు.

సరదా శృతిమించితే ఎలాంటి దారుణాలు జరుగుతాయో ఈ సంఘటనే ఓ ఉదాహరణ. కాగా ఈ సంఘటన ఇప్పుడు హట్ టాపిక్ అవుతుంది.. ఆ గ్రామానికి చెందిన వాట్సప్ గ్రూపులలో యువకులపై పలువురు దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రస్తుతం ఆ యువకులు గ్రామం వదిలి హైదరాబాద్ వెళ్ళినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై ఇంతవరకు తమకు ఎటువంటి ఫిర్యాదు రాలేదని స్థానిక పోలీసులు చెబుతున్నారు. ఎదైతేనేం బావాబామ్మర్దుల మధ్య పరాచకం ప్రాణాల మీదకు వచ్చింది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow