జగన్ జైలుకు వెళ్తారా..? షర్మిలకు లాభం ఏంటి..?

ఇప్పుడు తన అన్న జగన్ జైలుకు వెళ్తే.. తన పార్టీని ఏపీలో బలంగా చేసుకోవచ్చు అనే ప్రయత్నాలు చేస్తుందట షర్మిల. ఏపీలో వైసీపీ ఓటమి తరువాత జగన్ పరిస్థితి దారుణంగా ఉంది. గతంలో ఉన్న జగన్ పై ఉన్న  అక్రమాస్తుల కేసులో కానీ.. బాబాయి హత్య కేసులో కానీ... అరెస్ట్ అవ్వచ్చు అనే ప్రచారం గట్టిగా జరుగుతుంది.Sri Media News

Jul 27, 2024 - 19:09
 0  24
జగన్ జైలుకు వెళ్తారా..? షర్మిలకు లాభం ఏంటి..?

జగనన్నపై తప్పడు కేసులు పెట్టి జైలుకు పంపినప్పుడు... అన్నకు సపోర్ట్‌‌గా నిలిచి అన్న వదిలిన బాణం అని చెప్పుకుంటూ.. అన్న గెలుపులో కీలక పాత్ర పోషించిన షర్మిల రాజకీయ కారణాలతో అన్నకే ఎదురు తిరగింది. అన్న వదిలిన బాణం ఇప్పుడు బూమరంగ్‌లా అన్న వైపు దూసుకోస్తుంది. తెలంగాణలో తను పెట్టిన పార్టీని కాంగ్రెస్‌‌లో విలినం చేసి.. ఏపీలో ఏపీపీసీసీ పదవి చెపట్టిన షర్మిల.. అన్న జగన్మోహన్ రెడ్డిని నిత్యం టార్గెట్ చేస్తూనే వచ్చింది. జగన్ రాష్ట్రాన్ని పట్టించుకోవడంలేదని, అటువంటి వ్యక్తి రాష్ట్రానికి అవసరమా అంటు విమర్మలు గుప్పించింది..

అంతేకాదు.. 2024 ఏపీ ఎన్నికల్లో జగన్‌‌కు వ్యతిరేఖంగా ప్రచారం చేస్తూ... సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్యలో జగన్ పాత్ర ఉందని... బాబాయ్ ని చంపిన హంతకుడిని జగన్ కాపాడుతున్నారనే ప్రచారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది షర్మిల. ఇలా సొంత షర్మిల జగన్‌‌కు బల్లెంల తయారవ్వడం... జగన్ ఒటమిని గట్టిగా కోరుకుంది షర్మిల.. ఇదిలా ఉంటే.. గత ఎన్నికల్లో వైఎస్ జగన్‌కు తోడుగా వైఎస్ షర్మిల స్టార్ కాంపైనర్‌గా ఎన్నికల ప్రచారం నిర్వహించి అన్నను దగ్గరుండి గెలిపించిన షర్మిల. ఈ సారి దగ్గరుండి జగన్‌‌ను ఓడించింది.

ఇప్పుడు తన అన్న జగన్ జైలుకు వెళ్తే.. తన పార్టీని ఏపీలో బలంగా చేసుకోవచ్చు అనే ప్రయత్నాలు చేస్తుందట షర్మిల. ఏపీలో వైసీపీ ఓటమి తరువాత జగన్ పరిస్థితి దారుణంగా ఉంది. గతంలో ఉన్న జగన్ పై ఉన్న  అక్రమాస్తుల కేసులో కానీ.. బాబాయి హత్య కేసులో కానీ... అరెస్ట్ అవ్వచ్చు అనే ప్రచారం గట్టిగా జరుగుతుంది. దీనికి కారణం లేక పోలేదు.. జగన్ అధికారంలో ఉన్నప్పుడు జగన్ మోదీతో క్లోజ్‌‌‌గా ఉంటు.. బీజేపీ పెద్దల మెప్పు పోందుతూ అవినీతి కేసులనుంచి జగన్ తప్పించుకున్నారు అన్న టాక్ ఉంది.

ఇప్పుడు కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉన్న.. జగన్‌‌కు సపోర్టు చేసే ఛాన్స్ లేదు.. ఎందుకంటే.. ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం.. ఎన్డీఏ కూటమిలో ఉంది. పైగా 2024 ఎన్నికల్లో సరైన ఫలితాలు రాక బీజేపీ టెన్షన్‌లో ఉంది. అటువంటి బీజేపీకి కేంద్రంలో టీడీపీ అండగా నిలిచింది. మోదీ 3.O ప్రభుత్వానికి ప్రాణవాయువు అందిస్తూ... టీడీపీ చక్రం తిప్పుతోంది. అందువల్ల ప్రధాని మోదీ, జగన్‌‌కు సపోర్ట్ చేసే ఆవకాశం లేదనే చెప్పాలి. సో జగన్ అరెస్ట్ అవ్వడం ఎవరు అపలేరని.. జరిగి తిరుతుందని... రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరో వైపు ఢిల్లీలో జగన్ నిరసన చేపట్టినప్పుడు ఇండియా కూటమి లోని కొన్ని పార్టీల నేతలు తప్ప ఎన్డీఏలో ఉన్న ఏ పార్టీ కూడా సపోర్టుగా రాలేదు. కాంగ్రెస్ నేతలు కూడా రాలేదు.. దీనికి కారణం... ఏపీలో షర్మిల కావచ్చు. ఆమె జగన్‌ని టార్గెట్ చేస్తూ.. ఎన్నికల్లో ప్రచారం సాగించారు. ఇప్పుడు కాంగ్రెస్, జగన్‌‌కి సపోర్ట్ ఇస్తే, అప్పుడు షర్మిల ప్రచారానికి అర్థం లేకుండా పోతుంది. పైగా.. ఒకప్పుడు జగన్‌ని అరెస్టు చేయించిందే కాంగ్రెస్ అనే వాదన ఉంది. అదీకాక, జగన్, ఇప్పటికీ బీజేపీకి మద్దతుగా ఉంటున్నారు. మొన్న స్పీకర్ ఎన్నిక సమయంలో కూడా బీజేపీ మద్దతు కోరగా, జగన్ సపోర్ట్ ఇచ్చారు. అందువల్ల కాంగ్రెస్ కూడా జగన్‌‌తో డిస్టాన్స్ మెయింటేన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే... ఇప్పుడు జగన్ అరెస్ట్ అయితే.. దాని ప్రయోజనం కాంగ్రెస్‌కి బాగా ఉంటుందని.. విశ్లేషకులు చెబుతున్నారు... జగన్ అరెస్ట్ అయితే.. ఏపీలో ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్‌‌కు ఛాన్స్ దొరుకుతుందని.. వైసీపీలో ఉన్న నేతల్లో చాలా మంది ఒకప్పుడు కాంగ్రెస్ వారే కాబట్టి.. వారిని కాంగ్రెస్ ఆకర్షించే అవకాశం ఉందని... ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలపడుతోంది కాబట్టి.. వారు కూడా కాంగ్రెస్ లోకి వెళ్తే, తమకు బెటర్ కెరీర్ ఉంటుంది అని భావించే అవకాశాలు ఉన్నాయని.. సో జగన్ అరెస్ట్‌‌ను వాడుకోని... వైసీపీని డౌన్ చేస్తే షర్మిలకు అవకాశం లభిస్తుందనే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది.

సో జగన్ అరెస్ట్ అయితే... 2029లో ఏపీలో కాంగ్రెస్‌‌కు అనుకూల పరిస్థితులు ఉంటాయని... ఏపీలో 2029కి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా, రాకపోయినా, వైసీపీని తగ్గించి, ప్రతిపక్షం స్థానంలో నిలిచేందుకు కాంగ్రెస్‌కి అవకాశాలు పెరగగలవన్న విశ్లేషణ ఉంది. అందువల్ల జగన్ అరెస్టును డైరెక్టుగా కాంగ్రెస్ కోరకపోయినా, టీడీపీ వల్ల ఆ అరెస్టు జరిగితే మాత్రం, అది షర్మిలకు ప్లస్ అవుతుందని విశ్లేషకులు అంటున్నారు.

ప్రస్తుతం జగన్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి..  ఇప్పుడు జగన్ ఏదో ఒక కేసులో అరెస్ట్ అయినా.. ప్రజల నుంచి సెంటిమెంట్ ఫీలింగ్ వచ్చే అవకాశాలు తక్కువ. కుటుంబ మద్దతూ తక్కువే. దాన్ని తమ పట్ల పాజిటివ్‌గా మార్చుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నించగలదని టాక్ నడుస్తుంది. ఐతే.. జగన్ అరెస్ట్ అవుతారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow