పెద్దిరెడ్డికి భారీ షాక్..... బీజేపీకి టచ్‌లో పెద్దిరెడ్డి!

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి... పుంగనూరు రాజకీయాలను 15 ఏళ్లుగా శాసిస్తున్న నాయకుడు. 2019 వైసీపీ ప్రభుత్వం అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలను ఎదిరించిన ప్రతిపక్ష నాయకులను కేసులతో ఇబ్బందులకు గురిచేస్తూ భయపెట్టేలా చేశారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో రాయలసీమకు తనే సీఎంగా వ్యవహరించారు. Sri Media News

Jul 2, 2024 - 15:08
 0  4
పెద్దిరెడ్డికి భారీ షాక్..... బీజేపీకి టచ్‌లో పెద్దిరెడ్డి!

పెద్దిరెడ్డి మాటకు ఎదురు లేకుండా చేసుకున్నారు. జిల్లాల్లో పెద్దిరెడ్డి ఏం చెబితే అదే... అధికారులకు శాసనం. నిబంధనలు, నియమాలు, మంచీ, చెడూతో పని లేదు.... తెలుగుదేశం జేండా కనిపించినా... కార్యకర్తలు కనిపించిన వారిపై తన అధికారంతో తెలుగు దేశం నాయకులపై అనేక సార్లు దాడులు చెయ్యించారు. అంతేకాదు... 2024 ఎన్నికల్లో చంద్రబాబు నియోజకవర్గం కుప్పంను టార్గెట్ చేసి చంద్రబాబును ఓటమిపాలు చేయలని చూశారు... దీనికోసం కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు అడుగుపెట్టకుండా చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసి... ఘర్షణలు సృష్టించారు... పోలీసులను అడ్డుపెట్టుకొని బాబుపై దాడులు చేసి సైకో ఆనందం పోందారు. కుప్పంలో ఈ సారి చంద్రబాబును ఓడిస్తామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,  జగన్ మోహన్ రెడ్డి విర్రవిగి అధికార మదంతో రెచ్చిపోయారు... అనేక సవాళ్లు  చేశారు. కానీ ప్రజా తిర్పుతో వైసీపీ షాక్ అయ్యింది. రాష్ట్రంలో  సీన్ రివర్స్ అయ్యింది. జగన్ ఐదేళ్ల అరాచక పాలనకు, జగన్‌‌ సైల్‌‌లో ఓటు బటన్‌‌ నొక్కి  వైసీపీ ప్రభుత్వానికి గట్టి గుణపాఠం చెప్పారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడిపిన జగన్‌రెడ్డికి షాక్ ఇచ్చారు. మీకు 11 సీట్లు ఇవ్వడమే ఎక్కువ అంటు చీ కొట్టడంతో... వైసీపీ నుంచి జగన్, పెద్దిరెడ్డితో సహ 11 మంది మాత్రమే ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అధికారంలో ఉన్నన్ని రోజులు పోలీసుల సహాయంతో విర్రవీగిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన గ్యాంగ్ ప్రజలు ఇచ్చిన తీర్పుతో తల ఎత్తుకోలేక... ప్రజలకు ముఖం చూపించలేక తల్లడిల్లిపోతున్నారు.



 టీడీపీ అధికారంలోకి రావడంతో వైసీపీ నుంచి వైసీపీ బానిస సంకెళ్లు తెంచుకొని.... పార్టీని వీడి బయటకు వస్తున్నారు. ఈ క్రమంలో పెద్దిరెడ్డి ఇలాకా పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీమ్ భాషతోపాటు 12 మంది మున్సిపల్ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. ఈ దెబ్బతో పెద్దిరెడ్డికి బిగ్ షాక్ తగిలింది. పెద్ది రెడ్డిని ఎదిరించి టీడీపీలో చేరడంతో పుంగనూరు మున్సిపల్ కార్యాలయంపై టీడీపీ జెండా రెపరెపలాడనుంది. మొత్తం 31 మంది సభ్యులున్న ఈ మున్సిపాలిటీలో  మరి కొంతమంది వైసీపీ కౌన్సిలర్లు తెలుగుదేశంలో చేరికకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. నాటి ఎన్నికల్లో పెద్దిరెడ్డి పోలీసుల సహకారం, వైసీపీ రౌడీయిజంతో ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు. 31 మందినీ బలవంతంగా ఏకగ్రీవం చేసుకున్నారు. వీరిలో చైర్మన్‌ సహా 11 మంది ఇప్పుడు రాజీనామా చేశారు. బయటకు వచ్చిన వీరంత చెబుతుంది ఒక్కటే... పెద్దిరెడ్డి, ఆయన కుటుంబం తమకు పదవులు ఇచ్చినా అభివృద్ధి చేయడానికి అధికారం ఇవ్వకుండా రబ్బరు స్టాంపులుగా వాడుకున్నారని... పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు మిథున్‌రెడ్డి ముస్లింలను రెచ్చగొట్టి బీజేపీకి ఓట్లు వేయొద్దని ప్రచారం చేశారని ఆరోపించారు. పెద్దిరెడ్డి వైఖరి నచ్చక చాలా మంది టీడీపీలో చేరడానికి ముందుకు వస్తున్నారు.

ఇదిలా ఉంటే... టీడీపీ ప్రభుత్వం పెద్ది రెడ్డి సెక్యూరిటీని తగ్గించింది. పెద్దిరెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వం 5ప్లస్5 సెక్యూరిటీ ఇచ్చింది. ఇప్పుడు ఎమ్మెల్యే హోదాలో ఉండటంతో 1ప్లస్1 సెక్యూరిటీ మాత్రమే ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. పెద్దిరెడ్డి కుమారుడు, ఎంపీ మిథున్ రెడ్డికి గతంలో వైసీపీ ప్రభుత్వం ఉండటంతో 4ప్లస్4  సెక్యూరిటీ ఇచ్చారు. ప్రస్తుతం కేవలం ఎంపీగా ఉండటంతో అందుకు తగిన భద్రతను ప్రభుత్వం కల్పించనుంది. దీంతో పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి తమకు భద్రత పెంచాలంటూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.

టీడీపీ ప్రభుత్వం మాపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని... తమకు ఎలాంటి సమాచారం లేకుండా సెక్యూరిటీ తొలగించిందని పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డిలు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లలో పేర్కొన్నారు. రెండు పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం కోరింది. దీనికి బదులు ఇస్తూ... చట్టపరమైన నిబంధనల ప్రకారమే పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డిలకు భద్రత కల్పిస్తామని తేల్చిచెప్పింది. దీంతో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను న్యాయస్థానం జులై 8కి వాయిదా వేసింది.

ఇదిఇలా ఉండగా... టీడీపీ విజయంతో భయంలో ఉన్న మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డిలు బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం  రాష్ట్ర ప్రభుత్వం పలు శాఖలపై శ్వేతపత్రం విడుదల చేసేందుకు సిద్ధమైంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ ప్రభుత్వంలో గనుల శాఖ మంత్రిగా, పంచాయతీ రాజ్ మంత్రిగా ఉన్న సమయలో  ఇసుక, గనుల మైనింగ్ వ్యవహారంలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో పెద్దిరెడ్డికి మిథున్‌‌ రెడ్డికి భయం పట్టుకుంది. అక్రమాలు వెలుగులోకి వస్తే జైలుఉచాలు లెక్కపెట్టక తప్పదని... అర్ధమై... బీజేపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేకుంటున్నట్లు సమాచారం.

అయితే, బీజేపీ కేంద్ర నాయకత్వం వీరిని పార్టీలో చేర్చుకుంటుందా అంటే.. లేదు అనే చెప్పాలి. ఎందుకంటే.. ఎన్డీయే ప్రభుత్వంలో చంద్రబాబు చాల కీలకం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబును కాదని వైసీపీ నేతలను బీజేపీలోకి తీసుకునే సహసం చేయదు బీజేపీ కేంద్ర న్యాయకత్వం.దీంతో ప్రస్తుతానికి మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డిలు బీజేపీలోకి వెళ్లే అవకాశాలు లేవని తెలుస్తోంది. దీంతో పెద్దిరెడ్డి, ఆయన అనుచరులను ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో వణికిపోతున్నారని ఏపీ రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తుంది. అయితే తండ్రి కొడుకులు వీటిని నిజం చేస్తారో..? లేకుంటే వైసీపీలోనే కొనసాగుతారో చూడాలి.  

అయితే... 2013లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేరారు పెద్దిరెడ్డి. 2014 , 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.ఆయన 2019లో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనుల, భూగర్భ శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి గ్రామ సచివాలయ, వాలంటీర్ల శాఖ భాద్యతలను 21 సెప్టెంబర్ 2020న ప్రభుత్వం అప్పగించింది. ఇంతటి  వైభావన్ని చూసి... వైసీపీ ప్రభుత్వంలో చక్రంతిప్పిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనే సీఎం అంటూ అధికార మదంతో కాలర్ ఎగరేసిన పెద్దిరెడ్డికి ఈ రోజు రాజకీయలు దిన దిన గండంగా గడుస్తున్నాయి.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow