వైసీపీ ఘోర పరాజయానికి కారణాలివే..

కూటమి గెలుపులో గేమ్ ఛేంజగర్‌ పవన్ కల్యాణ్ అనేవారు కొందరు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును స్కిల్ డవలప్‌మెంట్ స్కీంలో అరెస్ట్ చేయడం...  అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో వైసీపీ మూడు రాజధానులను ప్రకటించి.Sri Media News

Jul 1, 2024 - 16:26
 0  6
వైసీపీ ఘోర పరాజయానికి కారణాలివే..

ఏపీలో వైసీపీ ఘోర పరాజయానికి కారణాలివేనంటూ ఎన్నికల ఫలితాల గురించి ఎంతో మంది ఎన్నో విశ్లేషణలు ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి ప్రధాన కారణం కూటమి ఏర్పాటు అనేవారు కొందరైతే.... కూటమి గెలుపులో గేమ్ ఛేంజగర్‌ పవన్ కల్యాణ్ అనేవారు కొందరు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును స్కిల్ డవలప్‌మెంట్ స్కీంలో అరెస్ట్ చేయడం...  అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో వైసీపీ మూడు రాజధానులను ప్రకటించి... విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్.. అమరావతిని శాసన రాజధానిగా.. కర్నూలును న్యాయరాజధానిగా ప్రకటించడం... ఇతర ప్రాంత వాసులకు నచ్చలేదు. మరోవైపు ఉత్తరాంధ్రలో వైసీపీ భూ కబ్జాలకు పాల్పడుతుందనే ఆరోపణలు వైసీపీనిఇరకాటంలో పడేశాయని... దీనికి తోడు విశాఖ రాజధాని అనే విషయం దేవుడెరుగు..విశాఖ రాజధాని అయితే ఈ ప్రాంతంలో సెంటిభూమి మిగలదని... అడవిని తొలిచేస్తున్నారని టీడీపీ చేసిన ఆరోపణలు ఆ పార్టీకి ప్లస్ అవ్వగా.. వైసీపీకి మైనస్ అయ్యినట్టు తెలుస్తుంది... ఇవన్నీ ఒక ఎత్తైతే వైసీపీ అధినేత, సీఎం జగన్‌కు సొంత చెల్లెళ్లు అన్న పాలిట పక్కలో బల్లెంల... సొంత చెల్లి వైఎస్ షర్మిల రాజకీయంగా జగన్ పై చేసిన విమర్శలు వైసీపీకి పెద్దమైనస్‌ అవ్వగా... వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో చిన్నాన్న కుమార్తె వైఎస్ సునీతారెడ్డి చేసిన ఆరోపణలు సైతం తీవ్ర ప్రభావితం చూపాయని... వైసీపీ ఘోర పరాజయానికి కారణాలివేనంటూ ఎన్నికల ఫలితాల గురించి ఎన్నో విశ్లేషణలు ప్రచారంలోకి వచ్చాయి.

ఇలా ఉన్న క్రమంలో తాజాగా.. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీ ఎన్నికల ఫలితాల గురించి చేసిన కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ పార్టీ ఓటమికి కారణం విజయమ్మ అని కేతిరెడ్డి చెప్పి అందరిని షాక్‌‌కి గురి చేశారు. ఆయన ఏం చెప్పారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం... ‘‘పార్టీ ఆలోచనా విధానం, ప్రజల్ని మెప్పించలేకపోవడం, ప్రజల్లో నమ్మకాన్ని కలిగించకపోవడం వల్లే ఇలాంటి ఫలితాలు వచ్చాయి. బాబు మాటలు ఎవరూ నమ్మరని అనుకున్నాం. మా నాయకుడు జగన్ చాలా నిజాయితీగా అమలు చేసే పథకాల గురించి ప్రజలకు చెప్పారు. కానీ...చంద్రబాబు పింఛన్ ను వేగంగా అమలు చేస్తామని చెప్పడం టీడీపీకి ప్లస్ అయింది. వెల్ఫేర్ ఎక్కువగా అందిన చోటే నాకు ఓట్లు తక్కువగా వచ్చాయి. నిజానికి మాకు గ్రౌండ్ లెవెల్ లో వ్యతిరేకత కనిపించలేదు. సీఎంవోలో ఉన్న ధనుంజయరెడ్డి నుంచి సరైన రెస్పాన్స్ ఉండేది కాదు... మరోవైపు వాలంటీర్ల వల్ల ప్రజలకు పార్టీకి గ్యాప్ పెరిగింది. ఇవన్నీ ఒకెత్తు అయితే ... విజయమ్మ షర్మిలకు సపోర్ట్ చేయడం స్టేట్ వైడ్ ఎఫెక్ట్ చూపింది’’. జగన్ పార్టీ ఓటమికి ఒక విధంగా విజయమ్మ కారణమని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చెప్పకనే చెప్పేశారు.

ఎన్నికలకు కొన్ని రోజుల ముందు... వైఎస్ విజయమ్మ అమెరికా నుంచి షర్మిలకు మద్దతుగా వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో కడప లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వైఎస్ షర్మిలకు మద్దతు తెలిపారు. కడప ఓటర్లు షర్మిలకు అండగా ఉండాలని,వచ్చే ఎన్నికల్లో షర్మిల విజయం సాధించాలని విజయమ్మ అభిలషించారు. ఆ వీడియోలో ఇలా చెప్పుకొచ్చారు.‘‘కడప ప్రజలకు,వైఎస్సార్‌ను అభిమానించే,ప్రేమించే వారికి నా హృదయ పూర్వక నమస్కారాలు. వైఎస్సార్‌ బిడ్డ షర్మిలమ్మ కడప జిల్లా నుండి ఎంపీగా పోటీ చేస్తోంది. కడప జిల్లా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించండి. ఆమెను గెలిపించి పార్లమెంటుకు పంపాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నా'' అని విజ్ఞప్తి చేశారు. కాగా ఈ వీడియోలో ఎక్కడ తన కొడుకు జగన్ గురించి ప్రస్థావించలేదు... నిజానికి.. 2019 ఎన్నికల్లో ఎన్నికల్లో వైఎస్ జగన్‌కు తోడుగా వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మలు స్టార్ కాంపైనర్‌గా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కానీ ఈసారి వైఎస్ ఫ్యామిలీ నుంచి ఈ సారి జగన్‌‌కు మద్దతు ఇవ్వలేదు. కొడుకు, కూతురు మ‌ధ్య రాజ‌కీయంలో న‌లిగిపోవ‌డం కంటే దూరంగా ఉండ‌ట‌మే న‌య‌మ‌నుకున్న వైఎస్ విజ‌య‌మ్మ అమెరికా వెళ్లిపోయారు.

ఇదే సమయంలో వైఎస్ జగన్ ఓటమి చెందారు. అయినప్పటికి కుమారుడిని ఓదార్చే ప్రయత్నం కూడా విజయమ్మ చేసే ప్రయత్నం చేయలేదని వార్తలు వచ్చాయి... కనీసం ఫోన్ చేసి ఓదార్చే ప్రయత్నం కూడా చేయలేదని... జగన్ తో మాట్లాడే ధైర్యం లేకనే విజయమ్మ ఫోన్ చేయడానికి కూడా ప్రయత్నించలేదన్నది పార్టీ వర్గాలు అనుకున్నాయి. కాగా... కొన్ని రోజులకు విజయమ్మ జ‌గ‌న్‌‌ను కలిసేందుకు ఇంటికి వ‌చ్చార‌ు.. ఎన్నిక‌ల్లో దారుణ ప‌రాభ‌వంతో ఢీలా ప‌డ్డ జ‌గ‌న్‌ను ఓద‌ర్చడంతో పాటు చెల్లి ష‌ర్మిల‌తో రాజీ చేసుకోమ‌ని చెప్పేందుకు విజ‌య‌మ్మ ప్రయత్నిస్తున్నట్లు అప్పట్లో గట్టి ప్రచారం జరిగింది. మొత్తం మీద జగన్ ఈ ఓటమితో ఇప్పట్లో వైఎస్ కుటుంబంలోని ఇద్దరు కలిసే అవకాశాలు లేవన్నది అందరూ చెబుతున్న మాట.

కాగా... జగన్ రాజకీయ ప్రస్థానంలో షర్మిల పాత్రను వైఎస్ అభిమానులెవరూ మరువలేరు. జగన్ జైలులో ఉన్నప్పుడు కేడర్‌ను కాపాడుకుంటూనే పాదయాత్ర ద్వారా తమ కుటుంబానికి సానుభూతి సంపాదించి పెట్టారు. 2019 ఎన్నికల సమయంలో ఆమె ప్రజలతో మమేకమై జగన్‌ కోసం ప్రచార చేశారు. ముఖ్యంగా బై.. బై.. బాబు అంటూ ఆమె చేసిన నినాదం వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.2019లో వైసీపీ ఘన విజయం సాధించింది. అనంతరం  తెలంగాణలో రాజన్న రాజ్య స్థాపనే ధ్యేయంగా వైఎస్ షర్మిల కొత్త రాజకీయ పార్టీ స్థాపించబోతున్నట్టు... జులై 8 2021న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా పార్టీని ప్రకటించింది.

అయితే తన అన్న వైఎస్ జగన్‌తో తలెత్తిన విబేధాలు రావడంతోనే షర్మిల తెలంగాణలో కొత్త కుంపటి పెట్టుకున్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్ నడిచింది. ఇలా ఉండగా... వైయస్సార్ తెలంగాణ పార్టీ అంత సఫలం కాని సమయంలో అటు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎన్నికల్లో పుంజుకుంటోన్న వేళ షర్మిల కూడా కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధమయ్యారు. ఆ మేరకు ఆమె దిల్లీ వెళ్లి రాహుల్, సోనియాలను కలిశారు. 2024 జనవరి 4 గురువారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ఆమెకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కొన్ని రోజులకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిలను నియమితురాలైంది. అప్పటి నుంచి అన్నపై ఫోకాస్ పెట్టి అన్న ఓటమికి కారణం అయ్యింది.  అయితే అన్నా చెల్లెళ్లు కాబట్టి, రక్తసంబంధం ఎప్పటికైనా కలుపుతుందన్నది వైఎస్ అభిమానుల ఆకాంక్ష.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow