బాల్కంపేట ఎల్లమ్మ చరిత్ర ఏంటో తెలుసా?

రేణుక ఎల్లమ్మ.. జానపదుల ఇష్టదేవతగా, ప్రతి గ్రామంలో వివిధ పేర్లతో పూజలందుకుంటుందీ తల్లి. వైష్ణవంలో పరశురాముని తల్లిగా, శాక్షేయంలో పరాశక్తి సమరూపమైన చిన్నమస్తగా, శైవంలో పార్వతీస్వరూపంగా పూజలందుకుంటుందీ అమ్మ.Sri media News

Jul 23, 2024 - 12:12
 0  48
బాల్కంపేట ఎల్లమ్మ చరిత్ర ఏంటో తెలుసా?
Renuka ellamma

 జమదగ్ని పత్ని రేణుకనే జానపదుల కులదేవతగా చెప్తుంటారు. అయితే రేణుక ఎల్లమ్మ తల్లి ఎలా పుట్టారు.. ఆమె చరిత్ర ఏంటి, బాల్కంపేట ఎల్లమ్మ తల్లి హిస్టరీ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రండి.

గ్రామ గ్రామాన రేణుక ఎల్లమ్మ దేవాలయాలు ఉంటాయి. అలాగే రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయాలు వెలిసిన ప్రతి చోటా ఒక్కో చరిత్ర ఉందని చెప్తుంటారు చరిత్రకారులు. పురాణాల ప్రకారం ఎల్లమ్మ అమ్మవారు పుట్టలో జన్మించినట్లు చెప్తారు. పుట్టలో పుట్టిన ఎల్లమ్మ తల్లి గిరి మహారాజుకి దొరికిందని అతను ఎంతో గారాబంగా పెంచి పెద్ద చేసి జమదగ్ని మహా రుషికి ఇచ్చి పెళ్లి చేశారని అయితే తన భర్త చేతిలో అమ్మవారు మరణించి తర్వాత ఆమె మహిమలతో తిరిగి బతికారని అనంతపురం నగరంలోని పాతూరులో గల శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో ఈ కథను చెప్తారు.
తెలంగాణాలోని కందికట్కూర్‌ అనే గ్రామంలో అయితే అమ్మవారు ఐదేళ్ల చిన్నారి రూపంలో దర్శనమిస్తారు. కందికట్కూర్‌ గ్రామంలో ఉన్న రేణుక ఎల్లమ్మ తల్లి గురించి రెండు కథలు ముఖ్యంగా ప్రాచుర్యంలో ఉన్నాయి.
అందులో మెుదటి కథ విషయానికి వచ్చేస్తే.. కందికట్కూర్‌ గ్రామానికి ఆ పేరు రావటానికి గల కారణం.. ఓ ఐదేళ్ల అమ్మాయి. కంది అనే ఇంటి పేరున్న ఐదేళ్ల అమ్మాయి ఇంటి పేరు మీదుగా ఈ ఊరికి ఆ పేరు వచ్చింది. ఓ కుటుంబం ఇప్పుడున్న కందికట్కూర్‌ గ్రామానికి వచ్చి ఉండటం మెుదలు పెట్టారు. వారి కుటుంబంలో ఐదేళ్ల చిన్నారి కూడా ఉంది. ఓ రోజు కట్టెల కోసం అని ఐదేళ్ల చిన్నారితో పాటు మరికొంతమందిని ఆ కుటుంబం పంపించింది. ఇప్పుడు గ్రామంలో ఉంటున్న ఎల్లమ్మ తల్లి ఆలయం వద్ద అప్పుడు పెద్ద పుట్ట ఉండి.. చుట్టూ చెట్లతో గుబురుగా ఉండేది.
ఇక కట్టెల కోసం వెళ్లిన తరువాత.. ఆ ఐదేళ్ల బాలిక పుట్ట దగ్గర మాయం అయిపోయింది. దీంతో మిగిలిన వారు కంగారుపడి.. తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పారు. వారు వచ్చి చుట్టుపక్కల గాలిస్తే.. పుట్ట నుంచి చిటెకెన వేలు చూపించి.. నేను ఇక్కడే ఉన్నా అన్న వాయిస్‌ పుట్టలో నుంచి వచ్చింది. దీంతో ఆ పాప తల్లిదండ్రులు, పుట్టను తవ్వటం మెుదలు పెట్టారు. పుట్టని తవ్వే కొద్దీ పాప లోపలికి వెళ్లిపోవటం స్టార్ట్‌ అయ్యింది. దీంతో.. అక్కడున్నవారంతా కళ్లు తిరిగి పడిపోయారు. అప్పుడు ఎల్లమ్మ తల్లి వారి కలలోకి వచ్చి.. నేను ఈ పుట్టలోనే ఉంటాను.. మీ పాప నా స్వరూపమే.. నేను ఇంక పుట్ట నుంచి రాను.. నాకు ఇక్కడ గుడి కట్టించండి.. నాతో పాటు మీరు కూడా ఇక్కడే ఇల్లు కట్టుకోండి అని చెప్పిందంట అమ్మవారు.

ఇక మెళుకవ వచ్చిన ఆ తల్లిదండ్రులు.. తమ కుమార్తెనే ఎల్లమ్మ తల్లి అని పూజలు చేయటం మెుదలు పెట్టారు. మెుదటిగా అక్కడ పాక వేసి.. పూజలు స్టార్ట్‌ చేశారు. క్రమక్రమంగా అమ్మవారి మహిమలు తెలుసుకొని ఎక్కడెక్కడి నుంచో భక్తులు రావటం మెుదలయ్యారు. మహారాష్ట్ర నుంచి సైతం కందికట్కూర్‌ ఎల్లమ్మ తల్లిని దర్శించుకోవటానికి వస్తుంటారు. అలా ఇప్పుడు పాక స్థానంలో అమ్మవారికి గుడిని నిర్మించారు.

ఇక కందికట్కూర్‌ ఎల్లమ్మ తల్లికి మెుదటి బోనం కంది వంశస్థులే సమర్పించటం ఆనవాయితీగా వస్తోంది. జూన్‌, జూలై నెలలో వచ్చే బోనాల పండుగకు కంది వంశస్థులు ఎక్కడున్నా.. ఇక్కడకు వచ్చి.. నియమ నిష్టలతో ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పిస్తారు.
ఇక రెండో కథ విషయానికి వస్తే.. కందికట్కూర్‌ ప్రాంతం అంతా ఒకప్పుడు అటవీ ప్రాంతంగా ఉండేది. ఓ కుటుంబం వేరే చోటకు వెళ్లే క్రమంలో.. ఇప్పుడున్న ఆలయ ప్రాంతం దగ్గర ఆగారు. బాగా చీకటి పడటంతో.. అక్కడే పడుకున్నారు.. కానీ అర్థరాత్రి అయ్యేసరికి.. తల్లితండ్రి మధ్య పడుకున్న ఐదేళ్ల చిన్నారి కనిపించకుండా పోయింది. ఆ చిన్నారి పేరు ఎల్లమ్మ కాగా.. పేరు పెట్టి ఆ తల్లిదండ్రులు పిలిచారు. అప్పుడు అక్కడే పుట్ట నుంచి ఎల్లమ్మ వేలు కనిపించటంతో తవ్వి చూశారంట. ఎల్లమ్మ బయటకు రాకుండా.. లోపలికి వెళ్లిపోతుండటంతో.. ఆ భార్యభర్తలు కళ్లు తిరిగి పడిపోయారంట. ఇక అప్పుడు ఎల్లమ్మ వారి కలలోకి వచ్చి.. నేనే ఎల్లమ్మ తల్లిని.. నాకు ఇక్కడ గుడిని కట్టండి. మీరు కూడా ఇక్కడే ఉండండి.. ఇక్కడే ఓ గ్రామం వెలుస్తుంది అని చెప్పిందంట. అలా గుడిని నిర్మాణం జరిగిందని మరో కథ ప్రచారంలో ఉంది.

ఇక్కడ అమ్మవారు ఎంత పవర్‌ఫుల్లో చెప్పటానికి ఒక ఇన్సిడెంట్‌ని చెప్తుంటారు స్థానికులు. 1990లలో వచ్చిన వరదలకు మెుత్తం అన్నీ మునిగిపోయినా.. గుడి దగ్గరకు మాత్రం నీరు రాలేదంట. పైగా అమ్మవారి ముగ్గు వేస్తే.. అక్కడికి వరద నీరే రాలేదంట. అలాగే ఇక్కడ డ్యామ్‌ నిర్మాణంలో అమ్మవారి గుడిని తీసేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు.. గుడి సమీపంలో తవ్వుతున్నప్పుడు.. మెుత్తం పాములు.. తేళ్లు బయటకు రావటంతో.. పనివాళ్లంతా బయపడిపోయారు. ఇది అమ్మవారి మహిమే.. తన గుడిని తీసేయ్యాలంటే.. అమ్మవారు ఒప్పుకుంటారా.. అందుకే ఆమె అడ్డుకుంటుంది అని నమ్మటం మెుదలు పెట్టారు. సర్ప్రైజింగ్‌లీ.. ఆ తరువాత అసలు గుడి జోలికి పోలేదు ఏ అధికారి కూడా.

ఆషాఢ మాసం రాగానే హైద్రాబాద్‌ నగరం ముఖానికి పసుపు పూసుకుని, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో పులకించిపోతుంది. అన్ని ఆలయాల్లో బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఒక్కో ఆదివారం ఒక్కో ఆలయంలో బోనాల ఉత్సవాలు జరుగుతాయి. ఈ వేడుకలు బల్కంపేట అమ్మవారి ఆలయంలోనూ కన్నుల పండువగా జరుగుతాయి. బోనాల సందర్భంగా అమ్మవారి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరగుతుంది. ఉత్సవాలను తిలకించేందుకు నగరవాసులతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు.
బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ఆషాఢ మాసంలో నెల రోజులు బోనాలు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అమ్మవారికి ఆది, మంగళవారాలు ఎంతో ఇష్టం. ఈ రోజులలో మొక్కులు ఉన్నవారు బలులు ఇచ్చి మొక్కులు తీర్చుకుంటారు. ఆషాఢ మాసంలో భక్తులు అమ్మవారిని సొంత బిడ్డగా భావించి బోనం పెట్టి, ఒడి బియ్యం పోస్తారు. చీర సారెలతో అమ్మవారిని కొలుస్తారు. నెల రోజులు ఆలయ పరిసర ప్రాంతాలన్నీ జాతర శోభతో కళకళలాడుతాయి. ప్రతి ఏటా బోనాల సందర్భంగా ఎల్లమ్మ ఆలయంతో అమ్మవారి కల్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఆషాడ మాసం తొలి మంగళవారం నాడు అమ్మవారికి కల్యాణం నిర్వహించడం ఆచారంగా వస్తోంది.

బల్కంపేట ఎలమ్మ ఆలయం వెనుక ఏన్నో ఏళ్ల చరిత్ర ఉంది. సుమారు 700 ఏళ్ల క్రితం హైదరాబాద్ ఏర్పడక ముందే అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. భాగ్యనగర ఏర్పాటుకు ముందు ఇప్పుడున్న బల్కంపేట ప్రాంతం పంటపొలాలతో ఉండేది. ఓ రైతు తన పొలంలో నీటి కోసం బావిని తీస్తుండగా, అమ్మవారి ఆకారంలో ఉన్న ఓ బండరాయి బయటపడింది. దానిని తొలగించేందుకు ఆయన ప్రయత్నం చేశాడు. అయినా సాధ్యం కాలేదు. ఊళ్లోకి వెళ్లి జనాలను తీసుకొచ్చి ఆ బండరాయిని బయటకు తీసేందుకు ప్రయత్నించినా సఫలం కాలేదు. కనీసం విగ్రహాన్ని పక్కకు కూడా జరపలేకపోయారు. అప్పుడే గ్రామస్తులు అది బండరాయి కాదని, దేవతా స్వరూపమని భావించారు. రేణుకా ఎల్లమ్మ తల్లిగా భావించి, ఆ విగ్రహాన్ని బావిలోనే ఉంచి ఒడ్డున నిలబడి పూజలు చేశారు. అమ్మవారు బావిలో వెలిశారని తెలుసుకుని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అక్కడికి తరలి వచ్చారు. గ్రామస్తులంతా కలిసి అక్కడ ఓ చిన్న ఆలయాన్ని నిర్మించారు.   

బల్కంపేట అమ్మవారి  ప్రస్తుత ఆలయ నిర్మాణం 1919లో జరిగింది. అప్పుడు ఈ ప్రాంత సంస్థానాధీషుడిగా ఉన్న రాజా శివరాజ్ బహద్దూర్ ఈ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. భక్తుల విశ్వాసాన్ని గౌరవిస్తూ ఆలయాన్ని కట్టించారు. ఆలయంలో అమ్మవారు స్వయంభూ మూర్తిగా వెలిశారు. ఆమె తల వెనుక భాగం నుంచి నిరంతరం జలధార ప్రవహిస్తూ ఉంటుంది. ఆ జలాన్నే భక్తులు తీర్థంగా తీసుకుంటారు. ఆ నీళ్లతో ఇంటిని శుద్ధి చేసుకుంటే దుష్టశక్తులు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ జలాన్ని నీళ్లలో కలుపుకుని స్నానం చేస్తే చర్మ వ్యాధులు సహా అనారోగ్య సమస్యలు మాయం అవుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. అమ్మవారిని దర్శించుకుంటే ఎలాంటి సమస్యలైనా దూరం అవుతాయని భావిస్తారు. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow