గరుడ పురాణం ప్రాముఖ్యత ఏంటి? గరుడ పురాణం ప్రకారం శిక్షలు ఇవే? ఎవరైనా మరణించాక దీన్ని చదవాలా?

నరకం.. మానవుడు భయపడే లోకం.. ఇక్కడికి పోతే, ఎవరు చేసిన కర్మల బట్టి వారికి రకరకాల శిక్షలు యముడు విధిస్తాడని నమ్ముతారు. కర్మ సిద్ధాంతం నమ్మేవారంతా నరకం గురించి భయపడతూనే ఉంటారు. అందుకే ప్రాణాలతో ఉన్నప్పుడే, మనిషి మంచి మార్గంలో నడుస్తూ మంచి పనులు చేయాలంటారు. Sri Media News

Jul 30, 2024 - 16:57
 0  102
గరుడ పురాణం ప్రాముఖ్యత ఏంటి? గరుడ పురాణం ప్రకారం శిక్షలు ఇవే? ఎవరైనా మరణించాక దీన్ని చదవాలా?
Garuda Puran

భారత సనాతన ధర్మంలో అనేక గ్రంథాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైన గ్రంథం గరుడ పురాణం. ఈ గరుడ పురాణంలో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు, తాము చేసిన పనులను బట్టి ఎలాంటి శిక్షలు అనుభవిస్తారో వివరించబడింది. అంతేకాదు మనం పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ఏమేమి జరుగుతాయనే పూర్తి వివరాలు గరుడ పురాణంలో ఉన్నాయని పండితులు చెబుతారు. అసలు నిజంగా నరకం ఉందా? ఉంటే, నిజంగా నరకంలో మనుషులను హింసిస్తారా? అని చాలా మందికి డౌట్‌ వస్తుంది. కొంతమంది ఎవరి ఖర్మలకు వారే బాధ్యులు, ఈ జన్మలో చేసిన పాపాల ఖర్మ.. ఈ జన్మలోనే ఏదొక రకంగా అనుభవిస్తారు అని చెప్తారు.. మరి కొందరు.. కాదు కాదు.. ఈ జన్మలో తప్పు చేస్తే మరొక జన్మలో ఆ ఖర్మ అనుభవిస్తారు అనీ, గత జన్మలో చేసిన పాపాల కారణంగానే ఈ జన్మలో బాధలు పడతామని చెప్తారు.. అసలు మనిషి చనిపోయినా తరువాత ఆత్మ ఏమవుతుంది.. తప్పు చేస్తే నిజంగా నరకానికి వెళ్తారా.. అక్కడ ఎటువంటి తప్పులకు ఎటువంటి శిక్షలు వేస్తారో అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం..

నరకం.. మానవుడు భయపడే లోకం.. ఇక్కడికి పోతే, ఎవరు చేసిన కర్మల బట్టి వారికి రకరకాల శిక్షలు యముడు విధిస్తాడని నమ్ముతారు. కర్మ సిద్ధాంతం నమ్మేవారంతా నరకం గురించి భయపడతూనే ఉంటారు. అందుకే ప్రాణాలతో ఉన్నప్పుడే, మనిషి మంచి మార్గంలో నడుస్తూ మంచి పనులు చేయాలంటారు. భూలోకంలో మనుషులు సుఖాల కోసం అనేక దుర్మార్గమైన పనులు చేస్తుంటారు కొందరు.. ఇటువంటి పనులు ఫలితంగానే మనిషికి చావు తరువాత భోగదేహం వస్తుందని పురాణాలు చెప్తున్నాయి. పురాణాల ప్రకారం భోగదేహం రెండు రకాలు.. మెుదటిది సూక్ష్మ దేహం, రెండోది యాతనా దేహం.
సూక్ష్మదేహం మనిషి చేసిన సత్కర్మల వల్ల, చావు తరువాత సుఖాలను అనుభవించటానికి స్వర్గానికి వెళ్తారని, యాతనా దేహం మనిషి చేసిన పాపాల ఫలితాల వల్ల మరణానంతరం నరకానికి వెళ్తుందని పురాణాలు చెప్తున్నాయి.

సనాతన హిందూ ధర్మంలో గరుడ పురాణానికి చాలా ప్రాశస్త్యం ఉంది. దీనికి మహాపురాణ్ అని పేరు. ఈ గ్రంథం ప్రజలు చెడు పనులను విడిచిపెట్టి మంచి జీవితాన్ని గడపాలని సూచిస్తుంది. గరుడ పురాణంలో ఏ పాపాలు చేస్తే ఏ శిక్షలు అనుభవించాల్సి వస్తుందో చెప్తుంది. పురాణాల ప్రకారం నరకంలో మెుత్తం 28 రకాల శిక్షలు ఉన్నాయని చెప్తారు. వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఇతరుల డబ్బు దొంగలించటం, పర స్త్రీపై వ్యామోహం, ఇతరుల బిడ్డలను కిడ్నాప్‌ చేయటం వంటి వారికి తామిస్ర నరకం వర్తిస్తుందట. దీని ప్రకారం చీకటిలో వేసి, కర్రలతో బాదుతారట. మోసంతో డబ్బు, స్త్రీలను పొందే వారిని అంధతామిస్ర నరకం ద్వారా హింసిస్తారట. అంటే కళ్లు కనిపించని ప్రదేశంలో నరికేసి చెట్లులా పడి ఉంటారట. ఇతరుల కుటుంబాలను చంపేసి, తన కుటుంబాన్ని పోషించుకునే వ్యక్తులు రౌరవం ద్వారా శిక్షిస్తారట. నరకంలో రౌరువులు అనే జంతువులతో హింసిస్తారట. ఇతరులను బాధపెట్టి, హింసించి తనను పోషించుకునేవాడికి మహారౌరవ నరకం వర్తిస్తుందట. పచ్చి మాంసం తినే రౌరవులు వీరిని హింసిస్తాయట.

పశువులను చంపి తిన్న వారికి కుంభీపాక నరకం ద్వారా శిక్షలు అమలు చేస్తారట. సలసల కాగే నూనెలో వేసి హింసలు పెడతారట. తల్లిదండ్రులు, బ్రాహ్మణులను వేధించిన వారు, వేదానికి ద్రోహం చేసిన వారికి కాలసూత్ర నరకం ద్వారా హింసలు అమలు చేస్తారట. రాగి నేలపై నెత్తిన సూర్యూడు మండుతుండగా.. వీరిని వేసి అందులో మాడ్చుతారట.

ఇతరుల డబ్బును దోచుకునే వారు నపుంసకులు. వారిని ఒక తాడుతో కట్టి నరకంలో చంపుతారు. విపరీతంగా కొట్టిన తరువాత అపస్మారక స్థితిలో ఉంటారు. స్పృహ వచ్చిన తరువాత మళ్ళీ కొడతారు. పెద్దలను అవమానించడం, ఇంటి నుంచి తరిమికొట్టే పాపులు నరకపు అగ్నిలో మునిగిపోతారు. వారి చర్మం తొలగించే వరకు ఇది జరుగుతుంది. భర్త లేదా భార్య ఇతరులతో శారీరక సంబంధాలు కలిగి ఉంటే ఇనుమును కాల్చి వారి అవయవాలలో పోస్తారు. మహిళలపై అత్యాచారం చేసిన లేదా మహిళలను మోసం చేసిన తర్వాత వదిలివేసే పురుషులు నరకంలో జంతువులుగా మారుతారు. మలమూత్రంతో నిండిన బావిలోకి విసిరివేయబడతారు.

అమాయకులను హింసించే వారు వైతార్ని నది బాధలను అనుభవించాలి. ఈ నదిలో మానవ శరీరాలు, వాటి పుర్రెలు, అస్థిపంజరాలు, రక్తం, చీము ఉంటాయి. ప్రజ‌ల‌ను స‌రిగ్గా పాలించ‌ని, వారి స‌మ‌స్యల‌ను ప‌ట్టించుకోని అవినీతి ప‌రులైన రాజ‌కీయ నాయ‌కుల‌ను న‌ర‌కంలో దారుణంగా కొడ‌తారు. త‌రువాత వారి శ‌రీరాల‌ను రోడ్డు రోల‌ర్ కింద ప‌డేసి న‌లిపిన‌ట్టు న‌లిపేస్తారు. అనంత‌రం వారిని పీల్చి పిప్పి చేస్తారు.

ప్రజాధ‌నం, వ‌స్తువుల‌ను దోపిడీ చేసే వారిని న‌ర‌కంలో య‌మ‌భ‌టులు తాళ్లతో క‌ట్టేసి ర‌క్తం వ‌చ్చేట్లు కొడ‌తారు. కింద ప‌డిపోయే వ‌ర‌కు కొట్ట‌డం ఆప‌రు. జంతువుల‌ను హింసించే వారికి, చంపేవారికి కూడా న‌ర‌కంలో శిక్ష‌లు ప‌డ‌తాయ‌ట‌. జంతువుల‌ను వారు చంపే రీతిలోనే న‌ర‌కంలోనూ పాపుల‌ను య‌మ‌భ‌టులు అలాగే శిక్షిస్తార‌ట‌. ఆడ‌, మ‌గ ఎవ‌రైనా ఒకరినొక‌రు లైంగికంగా వేధిస్తే అలాంటి వారి జ‌న‌నావ‌య‌వాల‌ను న‌ర‌కంలో క‌త్తిరిస్తారట‌. మ‌ద్యం సేవించే వారికి య‌మ‌లోకంలో ద్ర‌వ రూపంలో ఉన్న ఇనుమును తాగిస్తార‌ట‌. జంతువుల‌ను త‌మ సంతోషం కోసం హింసించే వారిని న‌ర‌కంలో య‌మ‌భ‌టులు స‌ల‌స‌ల కాగే నూనెలో వేయిస్తార‌ట‌. పేద‌ల‌కు ఏమాత్రం సహాయం చేయ‌కుండా, అన్నం పెట్ట‌కుండా తామే తినే వారిని న‌ర‌కంలో ముక్క‌లుగా న‌రికి ప‌క్షుల‌కు ఆహారంగా వేస్తార‌ట‌. పెద్ద‌ల‌కు గౌర‌వం ఇవ్వ‌ని వారిని, దేశ భ‌క్తి క‌లిగి ఉండ‌ని వారిని న‌ర‌కంలో వేడిగా ఉన్న ప్రదేశంలో ఉంచుతార‌ట‌.

కలియుగ వైకుంఠం తిరుమలలోని పుష్కరిణిలో ఎవరైతే స్వామివారితోపాటు పుష్కరిణి కీర్తిస్తూ భక్తితో స్నానమాచరిస్తారో వారికి తామిశ్రం, మహారౌరవం, కుంభీపాకం, కాలసూత్రం, అసిపత్రతవనం లాంటి ఇరవై ఎనిమిది భయంకరమైన శిక్షలు తొలగుతాయట. ఊహాలకు అందని, వర్ణించలేని మహాపాపాలు చేయడం వల్ల నరకంలో ఈ భయంకర శిక్షలకు గురవుతారట.
స్త్రీలకు అమ్మతనం అనేది ఓ వరం.. అందుకే ప్రతి స్త్రీ అమ్మ కావాలని కోరుకుటుంది.. అయితే చిన్నపిల్లలకు తల్లులు పాలు ఇచ్చే సమయంలో పురుషులు చూడకూడదు అని గరుడ పురాణంలో ఉంది..  ఒకవేళ చూసినా, తప్పుడు దృష్టితో చూస్తే, తప్పకుండా వారు నరకానికే వెళ్తారట. మహిళలు స్నానం చేసేటప్పుడు పురుషులు అస్సలు చూడకూడదట. అలా చూసిన వ్యక్తికి పాపాలు చుట్టుకొని, అతను తన జీవితంలో చేయాలనుకున్న పుణ్యకార్యాలన్నీ నాశనం అవుతాయంట. అంతేగాకుండా నరకంలో తీవ్రమైన హింసలు అనుభవించాల్సి వస్తుందని గరుడ పురాణంలో ఉందంట.


సనతనధర్మంలో 18 మహా పురాణాలు ఉన్నాయి. అందులో మొత్తం 19 వేల శ్లోకాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 7 వేల శ్లకాలు మానవ జీవితానికి సంబంధించినవి. వీటిలో స్వర్గం, నరకం, రహస్యం, విధానం, మతం ఇతర విషయాల గురించి ప్రస్తావించబడింది. ఎవరైనా చనిపోయినప్పుడు ఈ గరుడ పురాణాన్ని పఠించడం ద్వారా, వారి ఆత్మకు మోక్షం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow