లవ్‌‌తో సె*క్స్ చేస్తుంటే చనిపోతాడా? భయపెట్టే ప్రేమ ఓ కథ!

ఓటీటీలు ఈ మధ్య కాలంలో అనేక అద్బుతమైన సినిమాలు ఓటీటీ వేధికగా స్ట్రీమింగ్ అవుతున్నాయి. సినిమా ..సీరియ‌ల్..డాక్యుమెంట‌రీ...వెబ్ సిరీస్ ఇలా ఏది రిలీజ్ అయిన ఏ భాషలో రిలిజ్ అయిన.. అన్ని భాషల్లో మనం చూడగలుగుతున్నాం అంటే.. దానికి ముఖ్య కారణం. ఓటీటీలే.. Sri Media News

Jul 18, 2024 - 16:00
 0  20
లవ్‌‌తో సె*క్స్ చేస్తుంటే చనిపోతాడా?  భయపెట్టే ప్రేమ ఓ కథ!
Vicky Koushal in Masaan

చిన్న పెద్ద అని తేడా లేకుండా... ఎవరూ ఊహించని విధంగా పెద్ద పెద్ద స్టార్ హీరోల చిత్రాలు సైతం రిలీజ్ అయిన నెల రోజులకే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. కానీ మరికొన్ని సినిమాలు మాత్రం ఎంత వెయిట్ చేసిన ఓటీటీలోకి రావు. అలాంటి ఓ సినిమా ఇప్పుడు ఓటీటీలో సంచలనాలు సృష్టిస్తుంది.ఆ సినిమా ఏంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కొంచెం డిఫరెంట్ స్టోరీ. ఎందుకంటే.. ఇది పూర్తిగా లవ్ స్టోరీ కాదు... అలా అని హర్రర్ స్టోరి కూడా కాదు... ఇది భయపెట్టే ప్రేమ కథ. ఈ సినిమాను అనురాగ్ కశ్యప్ దగ్గర అసిస్టెంట్‌గా పని చేసిన నీరజ్ ఘైవాన్ తెరకెక్కించాడు. ఇది ఆ డైరెక్టర్‌‌కి  తొలి హిందీ చిత్రం... ఆ సినిమా పేరు ‘మసాన్’... మసాన్ అంటే ‘ఒంటరిగా ఎగిరిపో’ అని అర్థం. ఈ సినిమాలో పెద్ద పెద్ద స్టార్స్ లేరు. పబ్లిసిటీ కూడా పెద్దగా లేదు. కానీ సినిమా విడుదలైన తర్వాత బాలీవుడ్ సర్కిల్‌లో హాట్ టాపిక్ అయింది. బాలీవుడ్ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.

ఈ సినిమా రెండు సపరేట్ స్టోరీలతో సాగుతుంది. అందులో ఒక స్టోరీ దేవి పాఠక్ అనే అమ్మాయి చూట్టు తిరిగితే రెండోది దీపక్ చౌదరి అనే క్యారెక్టర్ చూట్టు తీరుగుతుంది. దేవి పాఠక్ అనే అమ్మాయి తన క్లాస్ మేట్‌  పీయూష్‌‌తో ప్రేమలో పడుతుంది.  పీయూష్‌‌‌‌తో కలిసి లాడ్జ్‌‌కి వెళ్తుంది. అక్కడ పోలీసు ఇన్స్‌స్పెక్టర్ మిశ్రాకి వీరు రెడ్ హ్యాండెడ్ గా దొరికి పోతారు. భయంతో పీయూష్ సూసైడ్ అటెంప్ట్ చేస్తాడు. అతనిని హాస్పిటల్ లో అడ్మిట్ చేసి.. దేవిని పోలీస్ స్టేషన్ కు తీసుకుని వెళ్తారు. దీంతో  దేవీ లైఫ్ ఒక్కసారిగా మారిపోతుంది. ఎందుకంటే.. మిశ్రా.. పీయూష్‌‌తో లాడ్జిలో ఉన్న దేవి పాఠక్  వీడియోను తీసి డబ్బు కోసం ఆమెను, ఆమె తండ్రి విధ్యాధర్ పాఠక్ ను బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు.

మరో వైపు దీపిక్ స్టోరీ... కాశీ ఘాట్లలో శవాలను తగలబెట్టే కులానికి చెందిన దీపక్ కుమార్ ఇంజనీరింగ్ ఫైనలియర్ చదువుతుంటాడు. ఉన్నత వర్గానికి చెందిన శాలూ గుప్తాతో ప్రేమలో పడతాడు. సమాజం వారి ప్రేమను ఆమోదించే పరిస్థితిలో ఉండదు. దేవి పాఠక్, దీపిక్ కుమార్ తమ తమ సమస్యలను ఎలా అధిగమించారు?. ఆ తర్వాత ఏం జరిగింది ?  ఈ కథ ఎలా కొనసాగింది ? చివరకు ఏమౌతుంది ? తెలియాలంటే ‘‘మసాన్’’ అనే ఈ సినిమాను చూడాల్సిందే.

ఈచిత్రం 2015 కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌‌లో  మోస్ట్ ప్రామిసింగ్ న్యూ కమర్ అవార్డు,  ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిలిం క్రిటిక్స్.
అవార్డులను ఈ సినిమా గెలుచుకుంది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow