ఖుషీ మూవీ ఓ జనరేషన్‌కి ఇన్‌స్పిరేషన్..! చెప్పాలని ఉంది ఖుషీగా ఎలా మారింది?
2001 సంవత్సరం ఏప్రిల్ 27వ తేది.. కాలేజ్‌లన్నీ ఖాళీగా ఉన్నాయి.. స్టూడెంట్స్‌తో థియేటర్లన్నీ నిండిపోయాయి.. తమ అభిమాన హీరో సినిమాకి టికెట్స్ తెచ్చి అమ్మాయిల దగ్గర హీరో అయిపోవాలని కుర్రాళ్లంతా క్యూలు కట్టారు.. థియేటర్స్ దాటి రోడ్ల మీద వరకు లైన్ ఉండేదంటే యాత్‌లో ఆ హీరో క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో ఊహించుకోండి.Sri Media News
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనగానే అందరికి ఎక్కువగా గుర్తొచ్చే సినిమాల్లో 'ఖుషి' ఒకటి. ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఆ సినిమా తోనే పవన్ అభిమానులు కూడా ఒక్కసారిగా పెరిగిపోయారు. 2001 ఏప్రిల్ 27న విడుదలైన ఖుషీ మూవీ.. ఇప్పటికీ ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీగానే ఉంది. అయితే ఈ సినిమా రిమేక్ అంటూ తెగ ఫీల్ అయిపోతారు కొందరు ఫ్యాన్స్.. కానీ వాస్తవానికి ఖుషీ రిమేక్ కాదు.. అవును మీరు విన్నది నిజమే. ఖుషీకి ముందు ఈ సినిమాకు చాలా పేర్లు అనుకున్నారు. అన్ని పేర్లు మారి చివరికి ఖుషీని ఎందుకు సెలక్ట్ చేశారు? ఎస్ జే సూర్య డైరెక్టర్‌గా ఎలా వచ్చారు వంటి ఇంట్రస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం రండి.
2001 సంవత్సరం ఏప్రిల్ 27వ తేది.. కాలేజ్‌లన్నీ ఖాళీగా ఉన్నాయి.. స్టూడెంట్స్‌తో థియేటర్లన్నీ నిండిపోయాయి.. తమ అభిమాన హీరో సినిమాకి టికెట్స్ తెచ్చి అమ్మాయిల దగ్గర హీరో అయిపోవాలని కుర్రాళ్లంతా క్యూలు కట్టారు.. థియేటర్స్ దాటి రోడ్ల మీద వరకు లైన్ ఉండేదంటే యాత్‌లో ఆ హీరో క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో ఊహించుకోండి.. యూత్‌లో ‘పవర్‌స్టార్’ పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్‌ను ఎక్కడికో తీసుకెళ్లి కూర్చోబెట్టిన మూవీ ‘ఖుషి’. ప్రముఖ నిర్మాత, శ్రీ సూర్య మూవీస్ అధినేత ఎ.ఎమ్. రత్నం నిర్మించగా, తమిళ దర్శకుడు ఎస్.జె. సూర్య తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.
ఈ సినిమాను ఎస్.జె.సూర్య.. తమిళంలో విజయ్, జ్యోతిక హీరో హీరోయిన్లుగా తీస్తే.. ‘ఖుషీ’ సినిమాను తెలుగులో పవన్ కళ్యాణ్,భూమికలతో తెరకెక్కించారు. హీరోగా పవన్ కళ్యాణ్ నటించిన ఏడో సినిమా ఇది. ఒక తెలుగు సినిమాలో హీరో ఇంట్రడక్షన్ సాంగ్‌గా హిందీ పాట పెట్టడం అనేది అప్పట్లో ఓ సంచలనం. ఇటువంటి సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా పవన్ కల్యాణ్ ఉంటారు కాబట్టే.. ఆయన ట్రెండ్ ఫాలో అవ్వరు.. ట్రెండ్ సెట్ చేస్తారు అంటారు.
నిజానికి ఖుషి కథ మొదట తమిళ్ లో తెరకెక్కినప్పటికి విజయ్ కంటే ముందు పవన్ కళ్యాణ్ కు చెప్పడం జరిగింది. అయితే అప్పుడు పవన్ బిజీగా ఉండడం వల్ల ముందు తమిళ్ లో చేశారట. ఇక బద్రి అనంతరం ఖుషి లాంటి కథ రిస్క్ అని తెలిసినప్పటికీ డైరెక్టర్ మీద నమ్మకంతో పవన్ ఖుషీకి ఒప్పుకున్నాడంట. అయితే ఖుషీ మూవీ వెనుక పెద్ద కథే ఉంది. డైరెక్టర్ నుంచి.. హీరోయిన్ సెలక్షన్ వరకు.. అబ్బో సినిమాల్లోని ట్విస్టులు రియల్‌గా నడిచాయి..
అది 1999లో మద్రాస్‌లో ప్రసాద్ ల్యాబ్స్‌లో వాలీ మూవీ ప్రివ్యూ షో వేశారు మేకర్స్. ఆ సినిమా టేకింగ్.. డైరెక్షన్‌కి ఫిదా అయిపోయారు లోపలున్న వారు. ఇక అంతే.. శ్రీ సూర్య మూవీస్ అధినేత ఎ.ఎమ్. రత్నం అజిత్ దగ్గరికి వెళ్లి.. ఏం సినిమా తీశారయ్యా.. మాస్టర్ పీస్ అసలు.. ఇంతకీ డైరెక్టర్ ఎవరు అని అడిగారు. అప్పుడు ఓ యువకుడిని పిలిచాడు అజిత్. అతను బ్లూ జీన్స్ మీద గళ్ల చొక్కా వేసుకొని కాలేజీ కుర్రాడిలా ఉన్నాడు. ఇతనే ఎస్‌జే సూర్య.. మా డైరెక్టర్ అంటూ గర్వంగా రత్నం గారికి పరిచయం చేశారు అజిత్.
ఎస్‌జే సూర్యని కింద నుంచి పైకి ఒక్కసారి చూసిన రత్నం గారు.. ఏంటి వాలి సినిమా తీసింది నువ్వా.. ఫస్ట్ మూవీనే ఓ మాస్టర్ ఫిల్మ్ మేకర్‌గా తీశావు కదయ్యా.. అసలు ఇంత బాగా ఎలా తీశావంటూ పొగడటంతో.. ఎస్‌జే సూర్య ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
రెండో మూవీ తీసే ఆలోచన ఉంది కదా.. అని రత్నం అడిగితే.. ఇంకా ఏమీ అనుకోలేదు అండి చాలా వినయంగా చెప్పారు ఎస్‌జే సూర్య. వెంటనే రత్నం గారి దగ్గర చెక్ బుక్‌ని తీసుకొని.. కొన్ని లక్షల రూపాయల చెక్‌ను ఎస్‌జే సూర్య చేతిలో పెట్టి.. నీ రెండో సినిమా మా సూర్య బ్యానర్‌లో చెయ్యాలి అని అన్నారు. ఇది జస్ట్ అడ్వాన్స్ మాత్రమే.. నాకు వాలి మూవీలో ఫస్ట్ ఆఫ్‌లో ఉన్న అందమైన లవ్ స్టోరీ కావాలి అని అడిగారు రత్నం గారు.
నక్క తోక తొక్కి వచ్చానా అన్నట్లు ఫీల్ అయ్యారు ఎస్‌జే సూర్య. ఎందుకంటే.. అటువంటి ప్రేమ కథనే రాసుకొని పెట్టుకున్నాడు సూర్య. తాను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడే ఆ స్క్రిప్ట్‌ని రాసుకున్నాడట సూర్య. కాకపోతే ఆ కథకి అప్పుడు లిటిల్ హార్ట్స్ అని పేరు పెట్టుకున్నారు. చాలా క్లాసీగా ఉంది కదా పేరు?
మేడ్ ఫర్ ఈచ్ అదర్ జంట.. వారి మధ్య వచ్చిన ఈగో క్లాష్‌ని ఎలా ఓవర్‌కమ్ చేసి.. ప్రేమలో గెలిచారు అనేది కథ. డైలాగ్స్‌తో సహా సీన్ టూ సీన్ అంతా సిద్ధంగా ఉంది.
అలా చెప్పాలని ఉంది మూవీ స్టార్ట్ చేశారు. అందులో హీరోయిన్‌గా అమిషా పటేల్‌ని అనుకున్నారు. అప్పటికే మంచి మంచి హిట్స్‌లో నటించి అటు హిందీ నుంచి ఇటు తెలుగు వరకు సాలిడ్ పేరు సంపాదించుకుంది ఆమె. ఈ మూవీలో హీరోగా పవన్ కల్యాణ్ అయితేనే బాగుంటారు అని ఎస్‌జే సూర్యతో చెప్పారు రత్నం. కానీ ఎస్ జే సూర్య.. పవన్ కల్యాణ్ ఏ సినిమాను పూర్తిగా చూడలేదు. దీంతో.. అప్పుడు థియేటర్లలో ఆడుతున్న తమ్ముడు సినిమాకి వెళ్లమని ప్రత్యేకంగా టికెట్లు కూడా తెప్పించారు రత్నంగారు. అలా ఆ సినిమాకు వెళ్లిన సూర్య.. అవును మీరు చెప్పింది నిజమే.. ఈ సినిమాకి ఈ హీరో అయితేనే కరెక్ట్ అని అన్నారు.
ఇక బద్రి షూటింగ్ జరుగుతుండగా.. అందులో హీరోయిన్‌గా నటిస్తున్న హీరోయిన్ అమిషా పటేల్.. డైరెక్టర్ ఎస్‌జే సూర్య తనకు ఇచ్చిన నరేషన్ గురించి పవన్ కల్యాణ్ దగ్గర తెగ పొగిడేస్తుంది. అసలు తమిళ్, తెలుగు రాని ఓ అమ్మాయి.. ఇంతలా పొగిడేస్తుందేంటి అని అక్కడ షాట్‌లో ఉన్న పవన్ కల్యాణ్, ప్రకాష్ రాజ్ అనుకున్నారు.
అయితే తాను ఓ డైరెక్టర్‌కి కథ చెప్పటానికి అపాయింట్‌మెంట్ ఇచ్చాననీ.. కానీ వచ్చేది ఎస్ జే సూర్య అని పవన్‌కి అప్పటికింకా తెలియదు.
ఇక కట్ చేస్తే.. చెప్పాలని ఉంది మూవీ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో మెుదలయ్యింది. ఫస్ట్ సీన్‌గా నడుము సీన్ ని షూట్ చేయటానికి ప్రత్యేకంగా గార్డెన్ సెట్‌ని వేశారు. అందులో అమిషా పటేల్, పవన్ యాక్ట్ చేశారు.
ఎస్ జే సూర్య మెుత్తం సినిమాని తన నరేషన్స్‌లో చెప్తాడని చాలా ఎగ్జైట్ అయితూ చెప్పారు పవన్.. అప్పుడు విలేకర్ల సమావేశంలో.
ఇక అసలు మ్యాటర్‌లోకి వస్తే.. చెప్పాలని ఉంది మూవీలో హీరో నార్త్ ఇండియా నుంచి వస్తాడు కాబట్టి.. సినిమా టైటిల్ కూడా హిందీలో పెట్టాలని అనుకున్నాడు సూర్య. అలా చెప్పాలని ఉంది కాస్తా ఖుషీగా మారింది.
ఈ టైటిల్ సైతం పవన్‌కి పిచ్చిపిచ్చిగా నచ్చేయటంతో.. గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో.. అదే టైటిల్ కన్ఫమ్ అయ్యింది. అయితే అప్పటికే బద్రి షూటింగ్ అవుతూ ఉండటం వల్ల.. పవన్ కల్యాణ్‌కి.. టైమింగ్స్ కుదరక.. ఖుషీకి బ్రేక్ ఇచ్చారు.
ఈలోపు అమిషా పటేల్ హిందీలో నటించిన కహోనా ప్యార్ రిలీజ్ అయ్యింది. అది సూపర్ హిట్ కావటంతో అమిషా పటేల్‌కు బాలీవుడ్‌లో విపరీతమైన ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఆఫర్స్ కుప్పలు తెప్పలుగా రావటంతో.. అదే స్పీడ్‌లో కొన్ని హిందీ సినిమాలకు సైన్ చేసేసింది అమిషా.
తెలుగు, తమిళ్‌లో తన వల్ల ఖుషీ మూవీ లేట్ కాకూడదని... ఆ సినిమా నుంచి తప్పుకుంది అమిషా. అలా ఆమె స్థానంలో భూమిక వచ్చింది.
అయితే అప్పటికే బద్రి మూవీ బిజీ షెడ్యూల్ నడుస్తుండటంతో.. ఆ సినిమా కంప్లీట్ అయ్యాకే ఖుషీ మూవీ రీస్టార్ట్ చేద్దామని పవన్ కల్యాణ్ రిక్వెస్ట్ చేయటంతో.. ఎస్ జే సూర్య ఒప్పుకోక తప్పలేదు.
ఎలాగూ ఈ కథతో తమిళ్‌లో కూడా సినిమా చేద్దామని అనుకున్నారు కాబట్టి.. పవన్ కాల్షీట్స్ ఖాళీ అయ్యేలోపు.. తమిళ్‌లో ఈ సినిమా చేయటానికి రెడీ అయిపోయారు దర్శకుడు సూర్య, నిర్మాత రత్నం గారు.
అలా ఖుషీ మూవీ మెుదటిగా తమిళంలో ప్రభుదేవా గారి దగ్గరికి వెళ్లింది. ప్రభుదేవా అప్పటికే వాలి సినిమా చూసి.. ఇంప్రెస్ కావటంతో పాటు.. సూర్య వచ్చి కథ చెప్పిన విధానం సైతం మరింత నచ్చటంతో.. సినిమాకు ఓకే చెప్పారు ప్రభుదేవా. ఇదిలా ఉంటే.. వాలి మూవీ టాక్ అప్పటి స్టార్ హీరో విజయ్‌కి గట్టిగానే తాకింది.. దీంతో ఆ డైరెక్టర్‌తో పని చేయాలని అనుకున్నారు.
పవన్ కల్యాణ్ తన దగ్గరికి వచ్చిన మూడు సినిమాలను కాదని.. ఖుషీ చేస్తున్నారంటే.. ఆ సినిమాలో ఏదో మ్యాజిక్ ఉండే ఉంటుందని నమ్మిన విజయ్.. ఆ సినిమాని తమిళ్‌లో తాను చెయ్యాలని అనుకున్నాడు.
అలా విజయ్ తనకు ప్రొడ్యూసర్‌గా ఉన్న తెనెప్పను సూర్యని నెక్స్ట్ సినిమా మనతో చేస్తాడేమో కనుక్కోమని పంపారు. అయితే తాను ప్రభుదేవా, ఎం రత్నం గారితో మూవీ చేస్తున్నాననీ.. ఈ సినిమా తరువాత నాగార్జున గారితో ఓ మూవీ చేస్తున్నానీ.. తమిళ్‌లో ఆ సినిమా పేరలల్‌గా విజయ్‌తో చేద్దామని చెప్పారు సూర్య.
అయితే విజయ్ ప్రొడ్యూసర్ ఏం ఎం రత్నాన్ని కలవటం, ప్రభుదేవాని రిక్వెస్ట్ చేసి ఆ సినిమాని విజయ్ చేయాలని అనుకోవటం.. తమిళ్‌లో అప్పటికే విజయ్‌కు స్టార్ హీరో ఇమేజ్ రావటంతో.. ప్రభు దేవా నుంచి ఖుషీ మూవీ.. విజయ్‌కి వెళ్లి. ఇక విజయ్ వంటి స్టార్ హీరోతో చేస్తే.. తనకు కూడా మంచి పేరు వస్తుందని సూర్య ఒప్పుకున్నాడు.
అమిషా పటేల్ డేట్స్ దొరకకపోవటంతో.. తమిళ్ వెర్షన్‌లో జ్యోతిక హీరోయిన్‌గా వచ్చింది. అలా హీరోహీరోయిన్లతో పోస్టర్లకు ఫోటోలు తీసి.. అఫీషియల్‌గా ఫోటోలు రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. అలా ఫటాఫట్‌మని సినిమా షూటింగ్ అయిపోయింది.. రిలీజ్ అయ్యి మంచి హిట్ అయ్యింది. ముందు తెలుగులో స్టార్ట్ అయ్యి.. కొంచెం బ్రేక్ రావటంతో తమిళ్‌లో రిలీజ్ అయ్యింది ఖుషీ. అందుకే పవన్ ఖుషీ రిమేక్ కాదు అనేది.
ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఈ సినిమాని మెుదటిగా ఎస్జే సూర్య తన క్లోజ్ ఫ్రెండ్ అయిన అజిత్‌కి వినిపించారంట. అప్పుడు సినిమా టైటిల్ ముద్దు అనుకున్నారు. కానీ అప్పటికే లవర్ బాయ్ ఇమేజ్‌తో ఎన్నో సినిమాలు చేసిన అజిత్‌కి ఆ కథ నచ్చినా.. లవ్ సినిమా కాకుండా.. కొంచెం విలన్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాలని ఉంది అని చెప్పారంట. అలా వాలీ సినిమా లైన్ పుట్టుకు రావటం.. అది రిలీజ్ అయ్యాక.. హీరో, డైరెక్టర్‌కి మంచి పేరు తీసుకురావటం జరిగింది.
What's Your Reaction?