సెన్సార్ బోర్డుతో ఎన్టీఆర్ కి గొడవ ఏంటి? ఎన్టీఆర్ చేసిన పని అప్పట్లో సంచలనం!!
నందమూరి తారక రామారావు... తెలుగు సినీ వినీలాకాశంలో ఓ సంచలనం... రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంపై ఆయనో ప్రభంజనం. ఆయన పేరు తెలుగువాడి ఆత్మగౌరవం.. ఆయన తీరు రాజకీయ విశ్వరూపం... నటుడిగా ప్రజల గుండెల్లో కొలువైన దైవ రూపం.. రాముడిగా, కృష్ణుడిగా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు.Sri Media News
తన కెరీర్ చివరిదశలో సైతం గుర్తుండిపోయే పాత్రలు చేశారు. చివరి దశలో ఎన్టీఆర్ శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర అనే చిత్రాన్ని తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. అయితే సినిమా విడుదలకు ఎన్టీఆర్ పడిన కష్టాలు అన్ని ఇన్ని కాదు... 1980లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమై.. 1981కి పూర్తయింది. అయితే.. ఈ సినిమా విడుదల అంత సులభంగా అవ్వలేదు. సినిమాలోని కొన్ని అంశాలపై సెన్సార్ అభ్యంతరం చెప్పడంతో.. ఎన్టీఆర్ మూడేళ్లు న్యాయపోరాటం చేసి విజయం సాధించి.. ఈ చిత్రన్ని 1984 నవంబరు 29న విడుదల చేసి ఘన విజయం సాధించారు. అయితే ఈ సినిమా ఎన్టీఆర్ తీయడానికి పునాది ఎక్కడ పడింది.
ఈ సినిమా కోసం ఎన్టీఆర్ చేసిన న్యాయ పోరాటం ఏంటి?. సినిమాకు ఎందుకు అడ్డంకులు వచ్చాయి. అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం.
ఓ సారి.. ఎన్టీఆర్ అప్పటి కడపజిల్లా, ఇప్పటి వైఎస్‌ఆర్ జిల్లా, సిద్ధవటంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆశ్రమానికి వెళ్లారు. అప్పుడు ఒక్కసారిగా ఎన్టీఆర్‌కి కొన్ని విషయాలు గుర్తుకువచ్చాయి. వీరబ్రహ్మేంద్రస్వామి వారు... తెరమీది బొమ్మలు... ఏదో ఒకరోజు అధికారంలోకి వస్తాయి అని తన కాలజ్ఞానంలో చెప్పిన విషయం ఎన్టీఆర్‌ను బాగా ఆకర్షించింది. ఇది నిజం అని అనుకున్నారు. అప్పుడే.. ఈ సినిమాకు పునాది పడింది. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానాన్ని ఒక సినిమాగా తీయాలని ఎన్టీఆర్‌కి కోరిక కలిగింది.
ఉన్న ఫలంగా కొండవీటి వెంకట కవి అనే రచయితకు ఫోన్ చేసి వీరబ్రహ్మేంద్రస్వామి కథ సిద్ధం చేయమన్నారట. ఇలా 1980లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమై.. 1981కి పూర్తయింది. రిలీజ్ కి రెడీగా ఉంది. ఆ టైం లో మూవీ సెన్సార్ కి వెళ్ళింది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రంలో ప్రారంభంలో కొన్ని బోల్డ్ సీన్స్ ఉన్నాయి అవి మార్చాలి అని చెప్పారు. ఎన్టీఆర్ ససేమిరా అన్నారు. వేమనని.. యోగి వేమనగా ముక్తి మార్గంలో నడిపించేందుకు వాళ్ళ వదిన ఆయన ముందు నగ్నంగా కనిపిస్తుంది. ఆ సీన్ చూడడానికి చాలా అసభ్యంగా కనిపిస్తుంది. కానీ అందులో పరమార్థం వేరు అని చెప్పడమే ఎన్టీఆర్ ఉద్దేశం.
దీనితో వేమన రియలైజ్ అయి జ్ఞానం తెచ్చుకుంటాడు. శారీరక సుఖాలని విడిచిపెడతాడు. అందుకోసం ఆ సన్నివేశం పెట్టాల్సి వచ్చింది.. శృంగారం కోసం కాదు అని ఎన్టీఆర్ సెన్సార్ సభ్యులకు చెప్పారట. కానీ సెన్సార్ వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వలేదు. ఈ
ఒక్క సిన్ మాత్రమే కాదు.. వీరబ్రహ్మేంద్రస్వామి ప్రియ శిష్యుడు అయిన సిద్దప్ప పాత్రకు హీరోయిన్ కి మధ్య జరిగే సంభాషణలు హిందువులు ముస్లింల మనోభావాలను కించపరిచేలా ఉన్నాయంటూ సెన్సార్ బోర్డు సభ్యులు ఆ సన్నివేశాన్ని కత్తిరించేశారట.
కానీ ఎన్టీఆర్ మాత్రం ఆ సన్నివేశం సినిమాలు ఉండాల్సిందే అంటూ పట్టుబట్టి...అందులో తప్పేమీ లేదని ఎవరి మనోభావాలు దెబ్బతీసే విధంగా సంభాషణలు లేవు అంటూ వాదించిన సెన్సర్ వినక పోవడంతో ఎన్టీఆర్ కోర్టుకి వెళ్లాల్సి వచ్చింది.
కోర్టులో కూడా అదే విధంగా ఎన్టీఆర్ ఈ చిత్రం గురించి వాదించారు. మూడేళ్ళ తర్వాత ఎన్టీఆర్ వాదనతో ఏకీభవించిన కోర్టు రిలీజ్ కి అనుమతి ఇచ్చింది. దీంతో సినిమాలో ఎటువంటి సీన్స్ కట్ చేయకుండా... ఈ చిత్రన్ని 1984 నవంబరు 29న విడుదల చేశారు. నిజానికి ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు.. కాబట్టి బిగినింగ్‌లో తక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేయాలని ఎన్టీఆర్ అనుకున్నారట. కానీ కోర్టులో కేసు నెగ్గిన తర్వాత భారీ స్థాయిలో రిలీజ్ చేశారు.
ఈ సినిమా తీస్తున్నప్పడు ఎన్టీఆర్‌తో పాటు ఆయన డ్రైవర్ కూడా ఈ సినిమాను దగ్గర ఉండి చూడటంతో ఓ రోజు కార్ డ్రైవర్ మనసులో మాట బయట పెట్టాడట.. ‘‘అన్నగారు డిస్కో డాన్స్‌లు, యాక్షన్ ఫైట్‌లు ఉన్న సినిమాలు వస్తున్నాయి. 1983లో ఇలాంటి సినిమా ఎవరు చూస్తారు. ఈ సినిమా జాగ్రత్తగా దాచిపెట్టుకోవడానికి పనికొస్తుంది అని చెప్పాడట. కానీ కట్ చేస్తే మొదటి వారంలోనే కోటి రూపాయలు వసూ చేసి లాంగ్ రన్‌లో ఆరు కోట్లు వసూలు చేసింది.
ఏకంగా 300 రోజులపాటు ఈ సినిమాకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అప్పటికే జనాల్లో ఎన్టీఆర్ అంటే ఒక రాముడు ఒక కృష్ణుడు ఈ సినిమా తర్వాత నిజంగానే పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఇలాగే ఉండేవారేమో అని ప్రేక్షకులు థియేటర్స్ కి వచ్చి ఎగబడి సినిమా చూశారు.
ఈ సినిమాలో తెరమీద బొమ్మలు... రాష్ట్రాలేలతాయి అన్న దానికి ఉదాహరణగా ఎన్టీఆర్ ఎంతగానో గౌరవించే ఎం.జి.రామచంద్రన్‌ను చూపించారు. అంతేకాదు.. ఈ సినిమాలో ఎన్టీఆర్ కూడా సీఎం అవుతారన్న అర్థం ఉందన్న వాదనను కొందరు ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ చెవినవేశారు. దీంతో ఆ సినిమాకు ఏడాదిపాటు మద్రాసులో ఉన్న సెన్సార్ బోర్డువారు క్లియరెన్స్ ఇవ్వలేదనే వాదన ఉంది.
చివరికి ఆ సినిమా విడుదలయ్యేనాటికి... ఎన్టీఆర్ నిజంగానే సీఎం అయ్యారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతి సంవత్సరం ఈ సినిమా రిలీజయింది. భగవంతుడు బహుశ ఇలాగే ఉండునేమో అన్నట్టు ఎన్టీఆర్ గారు బ్రహ్మము గారి పాత్రలో అలా జీవించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ గౌతమ బుద్ధ, వేమన, రామానుజ, ఆది శంకరాచార్య, పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి.. ఇలా అయిదు పాత్రలు వేసి అలరించారు. అంతే కాకుండా ఈ సినిమాకు దర్శకుడు, నిర్మాత కూడా ఎన్టీఆర్ కావడం విశేషం. సినిమాకు అన్ని తానై నడిపించారు.
What's Your Reaction?