హీరోయిన్ అశ్విని గుర్తు ఉందా..? అనాథలా ఎందుకు మరణించింది?

ఒకప్పుడు టాప్ హీరోయిన్‌‌గా టాప్ సినిమాలు చేసి సత్తా చాటిన నటి.. ఇండియాలోనే అగ్రస్థానంలో కొనసాగిన ఆ హీరోయిన్ జీవితం మాత్రం చాలా డిఫరెంట్. చైల్డ్ ఆర్టిస్టుగా ప్రయాణం మొదలు పెట్టి హీరోయిన్ స్థాయికి ఎదిగిన ఈ హీరోయిన్. వందకు పైగా సినిమాల్లో నటించి స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ అందుకుంది. Sri Media News

Jul 27, 2024 - 19:04
 0  32
హీరోయిన్ అశ్విని గుర్తు ఉందా..? అనాథలా ఎందుకు మరణించింది?

వెండితెరపై వెలుగు వెలిగిన ఈమె చివరి రోజుల్లో అత్యంత దయనీయ స్థితిలో కన్నుమూసింది. ఆమె ఎవరో కాదు... అందాల తార అశ్విని.. సినీ ప్రపంచంలో స్టార్‌డమ్‌‌‌తో వెండితెరపై ఓ వెలుగు వెలిగిన అశ్విని సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని జీవితాన్ని నశనం చేసుకుందా? అశ్వినిని భర్త మోసం చేశాడా?  తన జీవితం ఎలా ముగిసింది? అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం

టాలీవుడ్ టాప్ హీరోల సరసన నటించిన అమ్మడు.. అశ్విని. 90ల్లోనే తెలుగులో నటించడం మానేసింది. ఆ తర్వాత తమిళ సినిమాలకే పరిమితం అయిపోయింది. నెల్లూరు జిల్లాలో పుట్టిన ఈ అచ్చతెలుగు ముద్దుగుమ్మ చైల్డ్ ఆర్టిస్టుగా నటించి.. ఆ తర్వాత హీరోయిన్ అయ్యింది. 1967 జూలై 14న పుట్టిన అశ్విని.. సీనియర్ నటి భానుమతి తీసిన భక్త ధృవ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది. ఆ తర్వాత చదువులపై శ్రద్ధ పెట్టి కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉంది. ఇంటర్ చదువుతున్న సమయంలోనే ఓ తమిళ సినిమా ఆఫర్ రావడంతో కథానాయికగా అడియన్స్ ముందుకు వచ్చింది.

ఆ సినిమా సుపర్ హిట్.. ఫస్ట్ మూవీ సూపర్ హిట్ కావడంతో తెలుగు, తమిళంలో వరుస ఆఫర్స్‌‌‌‌తో బిజీగా మారిపోయింది. అనాదిగా ఆడది, భలే తమ్ముడు, అరణ్య కాండ, కలియుగ పాండవులు, చూపులు కలిసిన శుభవేళ, పెళ్లి చేసి చూడు, కొడుకు దిద్దిన కాపురం ఇలా తెలుగు, తమిళం, మలయాళం భాషలలో మొత్తం 100కు పైగా చిత్రాల్లో నటించింది.

ఇలా కెరీర్ మంచి ఫాంలో ఉండగానే రచయిత పువియరుసు మనవడిని రహస్యం వివాహం చేసుకుందని వార్తలు వచ్చాయి. అయితే వైవాహిక జీవితం సరిగ్గా సాగలేదు.. కొంతకాలానికే ఆమె భర్త తనను మోసం చేసి విడిచిపెట్టి వెళ్లిపోయాడన్న రూమర్స్‌ కూడా వచ్చాయి. ఒంటరిగా ఉన్న అశ్విని కార్తీక్‌ అనే పిల్లవాడిని దత్తత తీసుకుని పెంచుకుంది. అయితే భర్త చేసిన మోసాన్ని తలుచుకుని అశ్విని ఎంతగానో కుంగిపోయింది. అది ఆమె ఆరోగ్యాన్ని దెబ్బకొట్టింది. గుండె నిండా శోకం నింపుకున్నా పైకి మాత్రం నవ్వుతూ కనిపిస్తూ సినిమాలు చేసుకుంటూ పోయింది. కానీ అటు కెరీర్‌ గ్రాఫ్‌ కూడా పడిపోసాగింది. మొదట సీరియల్స్‌లో నటించడానికి ఇష్టపడని ఆమె తర్వాత వెండితెరపై అవకాశాలు తగ్గిపోవడంతో బుల్లితెరపైనా మెరిసింది. ఒకానొక సమయంలో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో సినిమాలోనే కాదు, ఏ సినీ ఫంక్షన్‌లోనూ కనిపించలేదు. పేరుకు పెద్ద హీరోయిన్నే కానీ.. ఆమె ఏ ఆస్తులు కూడ బెట్టలేదు. చెన్నైలో ఓ ఇల్లు మాత్రమే ఉండేదట. చివరి రోజుల్లో ఆర్థికంగా ఇబ్బందులకు గురై అది కూడా అమ్మేసిందని వార్తలు వచ్చాయి. అశ్విని చివరి రోజుల్లో ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో దాన్ని కూడా అమ్మేసి అద్దె ఇంట్లో నివసించిందని సమాచారం.

2012లో ఆమె రీఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఓ సీరియల్‌కు సంతకం కూడా చేసింది. కానీ ఆమె శరీరం సహకరించలేదు. తీవ్ర అనారోగ్యంతో చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్‌ కాలేజీ ఆసుపత్రిలో చేరింది. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆమెను బతికించలేకపోయారు. అశ్విని 45 ఏళ్లకే తుదిశ్వాస విడిచింది. 2012 సెప్టెంబర్ 23న మరణించింది
ఆమె కోరిక మేరకు తన సొంతూరైన నెల్లూరులో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఆమెను చెన్నై నుంచి నెల్లూరుకు తీసుకువెళ్లడానికి కూడా ఆమె కుటుంబం దగ్గర డబ్బులు లేకపోవడంతో దర్శకుడు పార్తీబన్‌ ఆర్థిక సాయం చేశాడు. ఈ విషయాన్ని ఆయన్ని ఆయనే స్వయంగా చెప్పారు. ఇలా ఓ వెలుగు వెలిగిన ధ్రువతార.. అనాధలా మరణించింది.

ఓ ఇంటర్వ్యూలో అశ్విని గురించి డైరెక్టర్‌ పార్తీబన్‌ ఇలా చెప్పుకోచ్చారు.. ‘‘మా పరిచయం పొందట్టి తెవై సినిమాతో మొదలైంది. ఆ సినిమాకు నేను మొదట వేరే హీరోయిన్‌ను అనుకున్నాను. కానీ ఆమె డేట్స్‌ ఇవ్వకపోవడంతో అశ్వినిని తీసుకున్న. ఆ పాత్రకు తను బాగా సెట్టయింది. ఆ సినిమా రిలీజైన కొంతకాలం తర్వాత నేను మళ్లీ ఆమెను కలవలేదు. అయితే మధ్యలో తన పెళ్లిపత్రిక పంపించింది. కవి, రచయిత పువియరుసు మనవడిని పెళ్లాడుతున్నట్లు తెలిపింది. నేను అవుట్‌డోర్‌ షూటింగ్‌లో ఉండటంతో పెళ్లికి వెళ్లలేకపోయాను. ఆ తర్వాత ఓ రోజు నా కొడుకు రాధాకృష్ణన్‌ తన స్నేహితుడు కార్తీక్‌ తల్లి ఆస్పత్రిలో ఉందని, ఆమె చికిత్స కోసం డబ్బులు సేకరిస్తున్నామని చెప్పాడు. ఆమె మరెవరో కాదు, అశ్విని అని ఆలస్యంగా తెలిసింది. కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. చివరికి 2012 సెప్టెంబర్‌ 23వ తేదీన 45 ఏళ్ల వయసులో ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో ఆమె కన్నుమూసింది. తన కొడుకును చదివించే బాధ్యత నేను భుజాన వేసుకున్నాను’’ అని చెప్పాడు పార్తీబన్‌.

అనేక చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుని... సినీ ఇండస్ట్రీలో హోమ్లి హీరోయిన్‌‌గా పేరుతెచ్చుకున్న అశ్విని 1985లో నందమూరి బాలకృష్ణ నటించిన భలే తమ్ముడు మూవీతో హీరోయిన్ గా ప్రవేశించింది. కలియుగ పాండవులు మూవీలో విక్టరీ వెంకటేష్ మేనత్త కూతురిగా నటించింది. ఇలా దాదాపు 10 ఏళ్లపాటు ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన తార లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతూ.. మరణించడం బాధాకరం.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow