ఢిల్లీలో జగన్ ధర్నా.. ఏపీ సర్కారుపై మండిపాటు!ధర్నా సక్సెస్ అవుతుందా?
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత అరాచక పాలన, హింసాత్మక రాజకీయాలు ఏపీలో చోటు చేసుకుంటున్నాయని విటిపై ఢిల్లీలో ధర్నాకు పిలుపును ఇచ్చిన సంగతి తెలిసిందే.. కాగా ఈ రోజు జగన్ ఢిల్లీలోని ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఢిల్లీలో భారీ ధర్నా నిర్వహించారు.Sri Media News
అయితే జంతర్ మంతర్‌లో ధర్న చెపట్టడానికి ముందే.. జగన్ స్పందించారు. ‘‘ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 45 రోజుల్లోనే 35 రాజకీయ హత్యలు జరిగాయి. వందల ఇళ్లను ధ్వంసం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల్ని ధ్వంసం చేశారు. వెయ్యికి పైగా అక్రమ కేసులో పెట్టారు. గిట్టని వారి పంటలను కూడా నాశనం చేశారు. మా హయాంలో ఏనాడూ ఇలాంటి దాడులు, దౌర్జన్యాల్ని ప్రొత్సహించలేదు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా?. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు.
లోకేష్ రెడ్‌బుక్ పేరుతో హోర్డింగ్‌లు పెట్టారు. తనకు నచ్చనివారిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి. మీడియా.. ప్రత్యేకించి జాతీయ మీడియా ఈ విషయాన్ని అందరి దృష్టికి తీసుకెళ్లి ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేయాలి’’ అన్నారు జగన్
ఇదిలా ఉంటే వైసీపీ చేపట్టిన ధర్మాకు సమాజ్‌వాదీ పార్టీ వైఎస్ జగన్‌ను కలిసి మద్దుతు ప్రకటించింది. అఖిలేష్ యాదవ్ కూటమి ప్రభుత్వం పై విమర్శలు చేశారు. ‘‘ ఏపీలో ప్రజాస్వామ్యం లేదు. అధికారంలోకి వస్తుంటారు.. పోతుంటారు. కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. రేపు మళ్ళీ జగన్ సీఎం కావచ్చు. ప్రత్యర్థుల ప్రాణాలు తీయడం సరికాదు. ప్రత్యర్థుల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. కార్యకర్తల కోసం జగన్ పోరాటం చేస్తున్నారు. కార్యకర్తలే మళ్లీ జగన్‌ను సీఎం చేస్తారు. టిడిపి ప్రభుత్వం ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటుంది. భయంతో ప్రజాస్వామ్యంలో గెలవలేరు. అధికారంలో ఈరోజు ఉండొచ్చు లేకపోవచ్చు. ఏపీలో శాంతియుత వాతావరణం నెలకొనాలి. ప్రత్యర్ధుల ప్రాణాలు తీయడం సరికాదు’’ అని వైసీపీకి మద్దతు ప్రకటించారు.
మొదటి నుంచి కేంద్రంలో ఎన్‌డీఏను జగన్ సమర్థిస్తు వస్తున్నారు. కానీ.. ఏపీలో ఎన్‌డీఏ కూటమిని వైసీపీ వ్యతిరేకిస్తోంది. వైఎస్సార్‌సీపీకి ప్రస్తుతం నలుగురు ఎంపీలు ఉన్నారు. రాజ్య సభలో 11 మంది ఎంపీలు ఉన్నారు. వీరి మద్దతు ఎన్‌డీఏ కూటమికే ఉంటుందని జగన్ ప్రకటించారు కూడా... దీని అర్ధం ప్రధాన మంత్రి మోదీ సానుభూతి తప్పకుండా తమపై ఉంటుందనే నమ్మకం జగన్‌కు ఉందనే చెప్పాలి. గత ప్రభుత్వంలో 22 మంది ఎంపీలు వైసీపీకి ఉండగా వారు ఎన్‌డీఏకు మద్దతు ప్రకటించారు. ఒక్క రోజు కూడా ప్రధాన మంత్రిపై కానీ, ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వంపై కానీ వ్యతిరేకంగా మాట్లాడిన దాఖలాలు లేవు. ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన విభజన హామీల గురించి కూడా ఐదేళ్లలో ఒక్కరోజు కూడా ప్రస్తావించలేదు. అందువల్ల తాము చేస్తున్న ధర్నాను కేంద్రంలోని ఎన్‌డీఏ వారు సమర్థిస్తారనే నమ్మకంతో జగన్ ఉన్నారని చెప్పవచ్చు.
అందరికి ఇక్కడ ఓ సందేహాం రావచ్చు. ఢిల్లీలోనే ధర్న ఎందుకు నిర్వహించాలి... ఏపీలో ఎందుకు నిర్వహించకూడదు.. అని.. ఇక్కడే జగన్ చాల తెలివిగా ఆలోచించారు... ఏపీలో ధర్నా నిర్వహిస్తే దేశమంతా తెలిసే అవకాశం ఉండదు.. వారు అనుకున్నది జరిగే ఛాన్స్ కూడా లేదు.. అందుకే జగన్ పార్లమెంట్ సమావేశాలు మొదలవుతున్న సమయంలో వైసీపీ సత్తా చూపించాలనే ఆలోచనతో ఈ దారి ఎంచుకున్నారు. 11 మంది ఎమ్మెల్యేలతో ఏం సత్త చూపిస్తారు అనుకోవచ్చు.. వైసీపీ శాసనసభ ఎన్నికల్లో ఓటమి చెందినా 4గురు పార్లమెంట్ సభ్యులు, 11 మంది రాజ్యసభ సభ్యులు, 45 మంది శాసన మండలి సభ్యులు ఉన్నారు. వీరితో కలిసి ఇతర పార్టీలకు చెందిన వారిని కలుపుకుని తమ సత్తా చూపేందుకు ఢిల్లీని వేదికగా చేసుకున్నారు జగన్.
ఇలా చేయడం వల్ల పార్లమెంట్ సమావేశాల సందర్భంగా దేశమంతా ఒక్కసారి వైఎస్సార్‌సీపీ వైపు చూసే విధంగా జగన్ ప్లాన్ చేసి ధర్నాకు పిలుపు నిచ్చారు. అయితే.. జగన్ మొదటి ఆరు నెలల కాలం ఎటువంటి ఆంధోళనలకు పిలుపు ఇవ్వకుండా ఉండాలని అనుకున్నరట. కానీ రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు ఎక్కువయ్యాయని, పలువురు వైసీపీ కార్యకర్తలను నరికి చంపుతున్నారని తెలియజెప్పడం ద్వారా ప్రధాని దృష్టిని వాటిని తీసుకువెళ్లే ఆలోచనతో జగన్ ఈ ధర్న నిర్వహించాడని చెప్పవచ్చు.
కాగా మంగళవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, నేతలు ఇప్పటికే రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంశాఖ మంత్రితో సహా కేంద్రమంత్రుల అపాయింట్‌మెంట్ కోరారు. రాష్ట్రంలో 45 రోజులుగా కొనసాగుతున్న హింసాత్మక ఘటనలు, దాడులపై జగన్ వారికి ఫిర్యాదు చేయనున్నారు.
ఇదిలా ఉంటే... మొదటి సారిగా జగన్ ఢిల్లీ కేంద్రంగా ఆంధోళనకు దిగారు. దీనిని ప్రధాన మంత్రి కానీ, ఎన్‌డీఏ కూటమి కానీ సమర్థిస్తుందా? లేదా? అనేది ఆలోచించాల్సి ఉంది. ఎన్‌డీఏ కూటమికి వ్యతిరేకంగా ఎత్తిన జెండా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్నా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయా? లేదా.. అనేది చూడల్సి ఉంది.
What's Your Reaction?