అయ్యో పాపం జగన్ మోదీ హ్యాండ్ ఇచ్చాడు!! కాంగ్రెస్‌‌కు జగన్ సై? చెల్లితో వచ్చిన తంట?

ఇదిలా ఉంటే...తన తండ్రి మరణం తర్వాత సీఎం పదవిని వారసత్వంగా తనకు ఇవ్వలేదనే కారణంతో కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చి సోనియా గాంధీపై పోరాటం చేసి జైలుకెళ్లిన జగన్.. జనంలో మాత్రం కావాల్సినంత సానుభూతి తెచ్చుకున్నారు. Sri Media News

Jul 27, 2024 - 19:40
 0  19
అయ్యో పాపం జగన్ మోదీ హ్యాండ్ ఇచ్చాడు!! కాంగ్రెస్‌‌కు జగన్ సై? చెల్లితో వచ్చిన తంట?

అయ్యో పాపం.. అంతలా ఎవరిని చూసి పాపం అని అనుకుంటున్నారని డౌటా..? ఇంకెవరిని ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్‌ రెడ్డిని చూసే. అలా ఉంది ప్రస్తుతం వైసీపీ అధినేత పరిస్థితి. ఏపీ ఎన్నికల్లో కూటమి గెలిచినప్పటి నుంచి జగన్ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ప్రస్తుత పరిస్థితులు కూడా ఆయనకు ఏం అనుకూలంగా లేవనే చెప్పాలి. ఢిల్లీ ఎపిసోడ్ పరిశీలిస్తే... రెండు జాతీయ పార్టీల జంక్షన్‌లో జగన్ చిక్కుకున్నట్లే కనిపిస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హత్యా రాజకీయాలు పెరిగాయని.. విధ్వంసకర ఘటనలు జరిగాయని.. ఏపీలో జరుగుతున్న అరాచకాలపై ఢిల్లీ వేదికగా గళం ఎత్తాలని వైసీపీ అధినేత జగన్ చేపట్టిన ధర్నా జగన్‌‌కు కొత్త చిక్కులు తెచ్చి పెట్టాయి. ఆధార్న వల్ల జగన్ రెండు జాతీయ పార్టీల నడుమ నారీ నారీ నడుమ మురారి అన్నట్టుగా ఉంది. తటస్థంగా ఉన్నానని చెబుతూ.. పరోక్షంగా ఎన్డీఏ కూటమికి ఇన్నాళ్లు సహకరించిన జగన్‌ ఇప్పడు తప్పని పరిస్థితుల్లో తన రూటు మార్చుకున్నారా? ఇండియా కూటమిలో చేరేందుకు జగన్ సిద్దంగా ఉన్నారా? జగన్ ఇండియా కూటమితో జతకడితే చెల్లి షర్మిలతో రాజీపడతారా? ఢిల్లీ బీజేపీ పెద్దలను ఎదిరించి రాజకీయం చేయగలరా..? తెలుసుకుందాం.

వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి.. అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని పరాజయం పోందారు. కేవలం 11 సీట్లకు పరిమితమైన జగన్.. నలుగురు లోక్‌సభ సభ్యులు, 11 మంది రాజ్యసభ సభ్యుల అండతోనే రాజకీయం నెట్టుకురావాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు.  ఎన్నికలకు ముందు జగన్.. తోడేళ్లన్నీ గుంపుగా వస్తాయని.. తాను సింహంలా సింగిల్‌గా వస్తానని వినుకొండ బహిరంగ సభలో ప్రసంగించారు. దీనికి తగ్గట్టుగానే టీడీపీ- జనసేన- బీజేపీ కలిసి వచ్చి జగన్‌‌ను గద్దె దింపారు. దీంతో సింహం సింగిల్‌‌ అయ్యింది. తన పార్టీ నాయకులు.. కార్యకర్తలు కూడా జగన్‌‌ను పట్టించుకోకుండా సింగిల్‌‌గా వదిలేశారు.

 ఈ పరిస్థితుల్లో జగన్ నిలదొక్కుకోవాలంటే జాతీయస్థాయిలో బలమైన అండ లభించాల్సి వుంది?. అయితే 2019 జగన్ అధికారంలో ఉన్న సమయం నుంచి గత ఐదు సంవత్సరాలుగా బీజేపీతో అనుబంధం కొనసాగిస్తు వచ్చాడు జగన్. అంతేకాదు.. మొదటి నుంచి కేంద్రంలో ఎన్‌డీఏను జగన్ సమర్థిస్తు వస్తున్నారు. 2024 ఎన్నికల్లో ఓటమి చెందిన తరువాత కూడా జగన్ తన మద్దతు ఎన్‌డీఏ కూటమికే అని ప్రకటించారు.

దీంతో ప్రధాన మంత్రి మోదీ సానుభూతి తప్పకుండా తమపై ఉంటుందనుకున్నారు జగన్. కానీ ప్రస్తుత పరిస్థితలు అలా లేవు. ఎందుకంటే కేంద్రలో బీజేపీ బలం తక్కువ ఉంది. అంతేకాదు మోదీ 3.O ప్రభుత్వానికి టీడీపీ ప్రాణవాయువులా పనిచేస్తుంది. సో ఇటువంటి సమయంలో మోదీ జగన్‌‌ను దగ్గరకు తీసుకుంటే.. చంద్రబాబు ఒప్పుకోనే పరిస్థితి లేదు.. అలా అని చంద్రబాబును కాదు అని మోదీ జగన్‌‌ను దగ్గరకు తీసుకోలేరు.

సో ఈవిషయం గ్రహించిన జగన్.. ఆలోచన మార్చుకుని టీడీపీ - జనసేన బీజేపీతో పొత్తులో ఉండటంతో.. ఎన్డీఏకి సపోర్టు ఇవ్వడం వల్ల తనకు వచ్చేది ఏం లేదని..  అర్ధం చేసుకున్నారు జగన్. అందుకే ఇంకా సైలెంట్‌‌గా ఉంటే.. రాజకీయ జీవితానికే యండ్ కార్డ్ పుడుతుందనే ఆలోచనతో.. రాష్ట్రంలో తన రాజకీయ భవిష్యత్ కాపాడుకోవడం కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేసిన ధర్నా చేశారు. ఇలా ఢిల్లీలో జగన్ ఊహించని విధంగా ఇండియా కూటమి నుంచి మద్దతు లభించింది. అంతేకాదు.. ఢిల్లీలో చేసిన ధర్నాచేసిన జగన్ తనకు ఇండి కూటమితో కూడా మంచి సంబంధాలు ఉన్నాయని, అవసరమైతే ఆ కూటమిలోకి జంప్ చేయగలనని బీజేపీకి తన సత్త చూపించుకున్నారు.

జగన్‌తో ఇండియా కూటమికి ఎంతో అవసరం ఉంది. అంతేకాదు జగన్‌కు కూడా జాతీయ పార్టీల అండ అవసరం. సో ఇండియా కూటమి జగన్‌‌తో స్నేహనికి సై అంటే.. జగన్ కూడా ఇండియా కూటమితో స్నేహనికి సై అంటున్నారు. నిజానికి అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేయడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలలేదు. దీనివల్ల వైసీపీ నష్టపోయింది. లేదంటే వైసీపీనే మరోసారి ప్రభుత్వం చేపట్టేది అనడంలో సందేహాం లేదు.. ఇదే విషయాన్ని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారు.
.
ఇదిలా ఉంటే...తన తండ్రి మరణం తర్వాత సీఎం పదవిని వారసత్వంగా తనకు ఇవ్వలేదనే కారణంతో కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చి సోనియా గాంధీపై పోరాటం చేసి జైలుకెళ్లిన జగన్.. జనంలో మాత్రం కావాల్సినంత సానుభూతి తెచ్చుకున్నారు. ఇప్పుడు అవసరమైతే ప్రధాని మోడీపైనా అదే తరహా పోరాటం చేసి అవసరమైతే జైలుకెళ్లి అయినా వచ్చే ఎన్నికలకు రాష్ట్రంలో సానుభూతి తెచ్చుకోవాలనేది జగన్ వ్యూహంఅని... దీనికోసం నేను మీ కూటమిలోకి వచ్చేందుకు సిద్దంగా ఉన్నను అని చెప్పకనే చెబుతూ సోనియాకు సందేశాలు పంపుతున్నారని రాజకీయ పండితులు అంటున్నారు.

కాంగ్రెస్‌ను వ్యతిరేకించి... సొంత పార్టీ పెట్టుకున్న జగన్ మళ్లీ కాంగ్రెస్ పార్టీతో స్నేహంగా మెలగడం కుదురుతుందా? అంటే మనం ఒకటి బాగా గుర్తు పెట్టుకోవాలి... రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరు. ప్రస్తుతం బీజేపీతో స్నేహంగా ఉన్న టీడీపీ.. కాంగ్రెస్‌తో స్నేహం చేస్తున్న తృణమూల్, డీఎంకే వంటి పార్టీలు గతంలో వ్వతిరేఖించుకున్న పార్టీలే.. అయితే జగన్‌ను ఇండియా కూటమిలోకి ఆహ్వానించడానికి ఆ పార్టీలు సిద్ధంగా ఉన్నప్పటికీ... స్థానికంగా జగన్ టార్గెట్‌గా రాజకీయం చేస్తున్న పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఎంత వరకు సహకరిస్తుంది అనేదే పెద్ద ప్రశ్న. అన్ని సర్ధుకుని షర్మిల జగన్ కలిస్తే.. రాజకీయలు మరింత ఆసక్తికరంగా మారనున్నాయి. ఏం జరుగుతుంతో వేచి చూడాలి.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow