శివుడి జన్మ రహస్యం ఏంటి?

హిందూపురాణాల ప్ర‌కారం త్రిమూర్తుల‌లో శివుడు ఒక‌డు. మొద‌టివాడు బ్ర‌హ్మ, విష్ణు, శివుడు. అయితే శివుడిని చాలా మంది స్వ‌యంభుగా వెలిసిన‌ట్లు భావిస్తారు. అంటే మ‌హిళ ద్వారా జ‌న్మించ‌లేద‌ని అర్థం. శివుడిని ఆదిదేవుడిగా భావిస్తారు. హిందూ పురాణాల ప్ర‌కారం శివుడిని పురాత‌న దేవుడిగా భావిస్తారు. Sri Media News

Jun 9, 2024 - 19:45
 0  49
శివుడి జన్మ రహస్యం ఏంటి?
ఇంకొన్ని రోజులలో దేశ వ్యాప్తంగా శివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. కొన్ని పండగులు ఒక్కోచోట ఒక్కోలా జరుపుతారు.. కానీ శివ‌రాత్రిని మాత్రం దేశ వ్యాప్తంగా ఒకేవిధంగా జ‌రుపుకుంటారు. శివుడ‌ని అత్యంత శ‌క్తివంత‌మైన దేవుడిగా పూజిస్తారు హిందువులు. హిందూ పురాణాల ప్ర‌కారం శివుడిని ప్ర‌త్యేక‌త చాలా ఉంది. కానీ ప్రతి ఒక్కరిలో శివుడి కోసం ఉన్న ఏకైక డౌట్‌.. తల్లిదండ్రులు లేకుండా ఎలా పుట్టాడు? ఎలా అంత శక్తివంతుడిగా మారాడు అనేది.. అవునా? మరి అసలు శివుడి జన్మవృత్తాంతం ఏంటి? ఆయన ఎలా పుట్టారు? తెలుసుకుందాం రండి.
హిందూపురాణాల ప్ర‌కారం త్రిమూర్తుల‌లో శివుడు ఒక‌డు. మొద‌టివాడు బ్ర‌హ్మ, విష్ణు, శివుడు. అయితే శివుడిని చాలా మంది స్వ‌యంభుగా వెలిసిన‌ట్లు భావిస్తారు. అంటే మ‌హిళ ద్వారా జ‌న్మించ‌లేద‌ని అర్థం. శివుడిని ఆదిదేవుడిగా భావిస్తారు. హిందూ పురాణాల ప్ర‌కారం శివుడిని పురాత‌న దేవుడిగా భావిస్తారు. పురాణాల ప్ర‌కారం మాన‌వుల నుంచి పుట్ట‌లేద‌ని శివుడి గురించి చెబుతారు. శివుడి జ‌న్మ ర‌హ‌స్యం గురించి పురాణాలలో చాలా ఆస‌క్తిక‌ర క‌థ ఒకటి ఉంది. 
ఒక రోజు బ్రహ్మ, విష్ణు ఇద్దరి మధ్య ఈ విశ్వంలో ఎవరు గొప్ప అనే చర్చ జరిగింది. నేను గొప్ప అంటే నేను గొప్ప అనే వాదన మెుదలవుతుంది.. అప్పుడే వాళ్ల మధ్య మెరుస్తూ ఒక స్తంభంలా శివుడు ప్రత్యక్షమయి ఎవరైతే ఈ స్తంభం చివరకు చేరుకుంటారో వాళ్లే గొప్ప అనే స్వరం వినిపిస్తుంది. దీంతో బ్రహ్మ ఒక పక్షిలా మారి ఆ స్తంభం చివరికి చేరుకోవడానికి ప్రయత్నిస్తాడు. విష్ణువు వరాహ అవతారం ఎత్తి స్తంభం చివరకు వెళ్లడానికి ప్రయత్నిస్తాడు.
బ్రహ్మ పక్షి రూపంలో ఎగురుతూ ఉంటున్నా.. ఆ స్తంభం చివరకు చేరుకోలేకపోతాడు.. ఇక వరాహ రూపంలో భూమిని తవ్వుతూ లోపలికి వెళ్లాలనుకున్న విష్ణువుకి వెళ్లే కొద్దీ స్తంభం కనిపిస్తూనే ఉంటుంది తప్ప చివర మాత్రం కనిపించదు. దీంతో ఇద్దరూ ఓటమిని అంగీకరిస్తారు. దీంతో శివుడు.. స్తంభంలో నుంచి ప్రత్యక్షం అవుతాడు. దీంతో ఈ విశ్వంలో శివుడే గొప్ప అని విష్ణువు, ఒప్పుకుంటాడు.. కానీ బ్రహ్మ మాత్రం.. నేను స్తంభం చివరిని కనిపెట్టాను అని అబద్ధం చెప్తాడు.. దీంతో కోపోద్రిక్తుడైన శివుడు.. నువ్వు ఎంత పెద్ద జ్ఞానివి.. అయినా సరే అబద్ధం చెప్పావు.. ఇక నీకు శిక్ష తప్పదు అని శివుడు అంటాడు..  ఎంతటి జ్ఞానులైనా సరే సృష్టి గురించి తెలుసుకునే దశలో చివరికి వారు శూన్యానికే చేరుతారు అని చెప్తాడు శివుడు. కేవలం గొప్పవాడు అని అనిపించుకోవటం కోసం అబద్ధపు మాటలతో నిండిన ఆ తలలలో ఒకటి నేల రాలాలని శపిస్తాడు శివుడు. ఇంత పెద్ద అబద్ధం చెప్పినందుకు త్రిలోక పూజలకు నువ్వు అనర్హుడువి అని శాపం ఇచ్చాడు బ్రహ్మకు. దీంతో ప్రళయకారుడి బీభత్సవాన్ని తట్టులేక.. ఆయన్ను శాంతపరుస్తాడు విష్ణువు.. ఈ ఘటనతో బ్రహ్మ, విష్ణువు ముక్తకంఠంతో శివుడే గొప్ప అనీ, ఆదీ, అంతం లేని శక్తి శివుడు అని ఒప్పుకున్నారు.
శివుడికి తల్లిదండ్రులు లేరు కానీ… ఆ పరమేశ్వరుడినే తన బిడ్డగా భావించి.. చిన్నపిల్లలకు చేయాల్సిన సమర్యలు చేసింది బెజ్జమహాదేవి. శివుణ్ణి అభవుడు అంటారు కదా... అదేంటి.... ఆయనకు పుట్టుక లేదా.. ఏ తల్లి కడుపున పుట్టలేదా.... చాలా ఆశ్చర్యంగా ఉందే.  మరి శివుడు స్వయంభువుడుగా ఎలా పుట్టాడు... అంతా అయోమయంగా ఉంది అనుకుంది ఆమె. ఇంతకు ఆమె ఎవరు అనుకుంటున్నారా.. ఆమె బెజ్జమహాదేవి. ఆమె ముత్తవ్వగా, అమ్మవ్వగా శంకరుని చేతనే కీర్తించబడింది. నిత్యత్వాన్ని పొందింది. అమె లింగ పూజలు చేస్తున్నంత సేపు ఆమెలో తెలియని బాధ చోటుచేసుకుంది. శివుడు తల్లి చిన్నప్పుడే చనిపోయిందేమో.. అని బాధ పడింది. చివరకు బెజ్జమహాదేవికి తన ప్రశ్నకు సమాధానం దొరికింది. బెజ్జమహాదేవి బాలపరమేశ్వరుని చేసుకొని అతనికి ఎన్నో సేవలు, ఎన్నెన్నో పరిచర్యలు చేసింది. ఒక్క క్షణం కూడా ఊరుకోకుండా బాలుడై ఒడిలో చేరిన లింగడికి సర్వోపచారాలు చేసింది. అవి ఉపచారాలు అని ఆమెకు తెలియదు. తల్లి లేని శివుడికి తల్లియై పసిబాలుని అలా పెంచాలన్నదే ఆమె ఆలోచన. శివునికి ఏ కొరత లేకుండా చేయాలి అన్నదే ఆమె కోరిక. శివుడు శిశివు రూపంలో ఉన్నాడు కదా.. ఆ శివుడికి నీళ్లు పోయటం దగ్గర నుంచి అన్ని పనులు చేయసాగింది.
ఆమె తన కాళ్లను బారచాపి పసి లింగ మూర్తిని కాళ్లపై వేసుకొని లాల పోచింది. కనుముక్కు తీరు సక్రమంగా ఉండాలని వాటిని చక్కగా వత్తి తీర్చిదిద్దింది. పొట్టను వత్తి బోర్లా పడుకోబెట్టి నీళ్ల దోసిళ్లతో చరచి వీపు నిమిరింది. ఇదంతా ప్రతి తల్లి తన బిడ్డల శారీరక ఎదుగుదలకు చేసేదే... అదే చేసింది ఈ తల్లి కూడా. ఉగ్గుపోసింది. పసివాడి మీద పక్షుల నీడ పడకుండా జాగ్రత్త చేసింది. పసివాడిని తన పొట్ట మీద పడుకోబెట్టి జోలపాడి నిద్ర పుచ్చింది. ఆ తల్లి నిశ్వార్ధ ప్రేమకు లొంగిపోయాడు భోళాశంకరుడు. కైలాస నాధుడినే లాలించిన ఆ అమ్మను అనుగ్రహించే ముందు పరీక్షించాలనుకున్నాడు. అంతే... అంగిట ముల్లు రోగం తెచ్చుకున్నాడు. లింగమూర్తి పాలు త్రాగటానికి వెన్న తినటానికి నోరు తెరవటం లేదు. తల్లిపాలు కూడా త్రాగటం లేదు. ఆ తల్లి బాధ అంతాఇంతా కాదు. రకరకాల ప్రయత్నాలు చేసింది. నాయనా ఒక్కగానొక్క కొడుకువి కదరా... నీవు లేకపోతే నేను ఎలా జీవించాలి అని తల్లి ఎంతో బాధ పడింది. చివరకు ఆ తల్లి నీవు లేక జీవించలేను అంటూ తన ప్రాణం తీసుకోవటానికి నిర్ణయించుకుంది. తన తలను నరుక్కోపోయింది. తల్లి ప్రేమను చూసి నిశ్చేష్టుడైన విటలాక్షుడు తటాలున సాక్షాత్కరించాడు. తల్లి ప్రేమను పరీక్షించి ఓడిపోయాడు. తల్లీ... నీకు ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. నాయనా నాకేం తక్కువ తండ్రి. నువ్వు ఏ రోగం లేకుండా ఆయురారోగ్యాలతో సుఖంగా ఉంటే నాకంతే చాలు అని కోరుకుంది. తల్లి కోరికకు  సదాశివుడు పరమానందభరితుడై నీ వంటి తల్లి ఉండగా రోగాలు ఎలా ఉంటాయి అమ్మ అంటూ తల్లిని అక్కున చేర్చుకున్నాడు. ముల్లోకాలకు తండ్రినైన నాకే తల్లివి గనుక నువ్వు ముత్తవ్వగా ప్రసిద్ధి చెందుతావు అని వరమిచ్చాడు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow