బ్రహ్మ తలని శివుడు నరికాడా? పరమేశ్వరుడికి పార్వతికి మధ్య వచ్చిన గొడవ ఏంటి?

సకల జీవులకు తిండిని ప్రసాదించే దేవతగా అన్నపూర్ణేశ్వరి పూజలు అందుకుటుంది... లోకాలు ఏలే శివుడు ఓ సారి శాపానికి గురయ్యాడు.. అప్పుడు శాపగ్రస్తుడైన శివుడిని శాప విముక్తుడిని చేసిన అన్నపూర్ణేశ్వరి గురించి మీకు తెలుసా? అసలు శివుడు ఎందుకు శాపానికి గురయ్యాడు? శివ పార్వతుల మధ్య జరిగిన గొడవ ఏమిటి?Sri Media News

Jul 11, 2024 - 13:32
 0  34
బ్రహ్మ తలని శివుడు నరికాడా? పరమేశ్వరుడికి పార్వతికి మధ్య వచ్చిన గొడవ ఏంటి?
భూమిమీది ప్రతి జీవికీ తిండిని ప్రసాదించే దేవత "అన్నపూర్ణేశ్వరి". అందుకే ఈ అమ్మవారిని దర్శించి, మనసారా ప్రార్థిస్తే జీవితంలో అన్నానికి లోటుండదని భక్తుల నమ్మకం. ఇంతటి మహిమ గల పార్వతీ అవతారమైన అన్నపూర్ణేశ్వరీ అమ్మవారు కర్నాటక రాష్ట్రంలోని చిక్‌మగళూరుకు నైరుతీ దిశలో వంద కిలోమీటర్ల దూరంలోగల హోరనాడు ప్రాంతంలో కొలువై దివ్యశోభతో అలరారుతున్నారు.
హోరనాడు ఆలయంలో అన్నపూర్ణేశ్వరి అమ్మవారి విగ్రహాన్ని అగస్త్య మహర్షి ప్రతిష్టించినట్లు పూర్వీకుల కథనం. ఆదిశక్త్యాత్మక శ్రీ అన్నపూర్ణేశ్వరిగా కొలువబడే అమ్మవారి ఐదు అడుగుల విగ్రహం నాలుగు చేతులతో, ప్రసన్న వదనంతో దర్శనమిస్తారు.
ఈ ఆలయాన్ని శ్రీ ఆదిశక్త్యాత్మక అన్నపూర్ణేశ్వరి లేదా శ్రీ క్షేత్ర హొరనాడు దేవాలయం అని కూడా అంటారు. ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని ఆదిశంకరాచార్యుల వారు స్థాపించారని నమ్ముతారు స్థానికులు. అన్నపూర్ణేశ్వరి దేవత నూతన విగ్రహం 1973లో ఆలయంలో ప్రతిష్టించబడింది. 
పురాణాల ప్రకారం శివ పార్వతుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆహారంతో సహా ప్రపంచంలోని ప్రతిదీ మాయ లేదా భ్రమ అని శివుడు ప్రకటించాడు. ఆహారం భ్రమ కాదు అని నిరూపించడానికి పార్వతీ దేవి అదృశ్యమయ్యింది, ఫలితంగా ప్రకృతి నిశ్చలంగా మారింది. వాతావరణంలో మార్పు లేకపోవటంతో, మెుక్కలు పెరగలేదు, విత్తనాలు మెులకెత్తలేదు.. పంటలు పండలేదు.. ఫలితంగా ముల్లోకాల్లోని జీవులు ఆకలితో అలమటించాయి.. పరిస్థితిని గ్రహించి, పార్వతీదేవి ప్రత్యక్షమై అందరికీ భోజనం పంచింది. అప్పటి నుండి ఆమెను దేవి అన్నపూర్ణ అని పిలుస్తారు. 
ఈ ఆలయానికి సంబంధించి మరొక ఆసక్తికరమైన పురాణం ఉంది. శివుడు బ్రహ్మదేవుని తల నరకటంతో, అతని పుర్రె శివుని చేతిలో ఇరుక్కుపోయిందంట. పుర్రె నిండా ఎప్పుడైతే తిండి, ధాన్యాలు నిండుతాయో.. అప్పుడే ఆ కపాలం చేతిని వీడుతుందని శాపం పొందాడట శివుడు. దీంతో ఆ పుర్రెతోనే శివుడు ప్రతిచోటా వెళ్లి భిక్ష అడిగేవాడట.. కానీ పుర్రె ఎప్పుడూ నిండలేదు. శాప విమోచనం కోసం పుర్రె పట్టుకొని తిరుగుతూ..  చివరకు ఈ ఆలయానికి వచ్చాడట..  అప్పుడు అనపూర్ణ దేవి కపాలాన్ని ధాన్యాలతో నింపిందంట.. దీంతో శివుడి శాప విముక్తుడయ్యాడని పురాణాలలో ఉంది.
అన్నానికి ప్రతిరూపమైన ఆ పార్వతీ దేవిని పూజిస్తే సకల శుభాలు జరుగుతాయని చెబుతారు. అంతేకాకుండా ఇంటిలో ఎటువంటి సమస్యలు రావని నమ్ముతారు. 
అన్నపూర్ణ దేవినే వాసవిగా కూడా పిలుస్తారు. ‘వసు’ అనగా అన్ని రకాల సుఖాలను అందించేది అని అర్థం. శంకరునికి సైతము భిక్షవేసిన తల్లిగా అన్నపూర్ణ దేవి అని చెప్తుంటారు.. అయితే ఒక అసురుడు శంకరుని వేషంలో అమ్మ వద్దకు భిక్షకు రాగా కపట రూపాన్ని గ్రహించిన అమ్మ ఆ అసురుడిన కింద పడవేసి తన కాలి కింద తొక్కిపెట్టి అన్నార్తులకు అన్నం పెట్టిందంట.. కొన్ని చోట్ల అన్నపూర్ణాదేవి కాలి కింద కనిపించే వ్యక్తి ఆ అసరుడే అంట.
ప్రతి సంవత్సరంలో మే నెలలో హోరనాడు ఆలయంలో రథోత్సవం కన్నులపండువగా జరుగుతుంటుంది. ఇక్కడ ఐదు రోజులపాటు వార్షిక బ్రహ్మోత్సవాలను కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. హోరనాడు ఆలయ ప్రత్యేకత ఏంటంటే.. అమ్మవారి దర్శనానికి వెళ్లే పురుషులంతా చొక్కాలను తీసివేసి శాస్త్రోక్తంగా ఉత్తరీయాన్ని కప్పుకుని దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది.
ఈ అమ్మవారి ఆలయాన్ని సందర్శించేందుకు వచ్చే ప్రతి ఒక్కరికీ కుల, మత, వర్ణ, వర్గ బేధాలు లేకుండా ఉదయాం పూట ఫలహారాలు.. మధ్యాహ్నం, రాత్రి వేళల్లో భోజన సదుపాయాలను ఏర్పాటు చేస్తుంటారు. ఇక్కడ నిత్యాన్నదానం కార్యక్రమం నిర్విరామంగా జరుగుతుంటుంది.
హోరనాడు ఆలయానికి చేరుకునేందుకు శృంగేరి నుంచి కలశ ప్రాంతాల మీదుగా సాగిపోయే ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుంది. మార్గమధ్యంలో కాఫీ తోటల సుగంధ పరిమళాలు, చల్లటి గాలి స్పర్శ, తీర్చిదిద్దినట్లుగా ఉండే పచ్చటి ప్రకృతిలో ప్రయాణం మాటల్లో చెప్పలేం. కేరళలోని మున్నార్ అందాల కంటే.. అందంగా, ప్రకృతి శోభను తనలో ఇముడ్చుకున్న ఈ ప్రాంతం పచ్చదనంతో చూపరులని ఆకర్షిస్తుంది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow