ఆంధ్రప్రదేశ్ లో ఎగ్జిట్ పోల్స్, కాబోయే సీఎం అతనే

ఆంధ్రప్రదేశ్ లో ఎగ్జిట్ పోల్స్ హీట్ పీక్స్ కు చేరింది. ఆయా సంస్థలు ఇప్పుడు సర్వే ఫలితాలను ఎగ్జిట్ పోల్స్ గా ప్రకటిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఏపీలో కేకే సర్వే సంచలనం కలిగిస్తోంది. Sri Media News

Jun 1, 2024 - 21:38
Jun 1, 2024 - 21:50
 0  203
ఆంధ్రప్రదేశ్ లో ఎగ్జిట్ పోల్స్, కాబోయే సీఎం అతనే
ap exit polls

ఆంధ్రప్రదేశ్ లో ఎగ్జిట్ పోల్స్ హీట్ పీక్స్ కు చేరింది. ఆయా సంస్థలు ఇప్పుడు సర్వే ఫలితాలను ఎగ్జిట్ పోల్స్ గా ప్రకటిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఏపీలో కేకే సర్వే సంచలనం కలిగిస్తోంది. ఎందుకంటే కేకే గతంలో చేసిన సర్వేస్ ఫలితాలకు చాలా దగ్గరిగా ఉంది. దీంతో అందరూ కేకే సర్వేస్ మీద ఆసక్తి చూపించారు. ఇక పోలింగ్ ముగియగానే కేకే సర్వేస్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకటించారు కేకే సర్వేస్ ప్రతినిథి. అయితే ఈ సర్వే సంస్థ అంచనాల ప్రకారం టీడీపీతో కూడిన ఎన్డీయే కూటమి బంపర్ మెజారిటీ తో అధికారంలోకి వస్తుంది. అంటే క్లీన్ స్వీప్ అన్నమాట. ఈ సర్వే ప్రకారం వైఎస్ జగన్ కలలో కూడా ఊహించని చేదు ఫలితాలను చూడబోతున్నారు. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఏపీలో ఉంది. మరీ ముఖ్యంగా ఎన్నికల ముందు ల్యాండ్ టైటిలింగ్ చట్ట ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపించిందనేది ఈ సర్వే చెబుతున్న ముఖ్య కారణం. ఇక స్థానిక ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత, అవినీతి, దోపిడి ప్రజల్లో కోపాన్ని చూపించింది. ఆ ఆగ్రహాన్ని ఓట్ల రూపంలో కోపం తీర్చుకున్నారనేది కేకే సర్వేస్ చెబుతున్నమాట. అయితే ఈ సంచలన ఫలితాలను జిల్లాల వారిగా చూద్దాం.

శ్రీకాకులం జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేయబోతోంది. అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కలిపి పదికి పది సీట్లు గెలవబోతున్నాయి. అంటే వైసీపికి జీరో. ఇక విజయనగరం జిల్లా తీసుకుంటే కూడా ఈ జిల్లాలో ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేయబోతోంది. అంటే 9 స్థానాలకు కాను తొమ్మిది కూటమి గెలవబోతోంది. వైసీపీకి ఈ జిల్లాల్లో కూడా సున్నా స్థానాలు వస్తాయనేది కేకే సర్వేస్ చెప్పే విషయం. ఇక విశాఖలో కూడా 15 స్థానాలకు 14 కూటమి గెలుస్తుంది. వైసీపీకి కేవలం ఒక స్థానం దక్కుతుంది. తూర్పు గోదావరి జిల్లాల్లో 19 సీట్లకు గాను 18 స్థానాలు గెలవబోతోంది. ఈ జిల్లాలో పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ విపరీతంగా పని చేసిందని తెలుస్తోంది. వైసీపీకి ఈ ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లాలో కేవలం ఒక స్థానంతోనే సరిపెట్టుకోనుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్, టీడీపీల ప్రభంజనం పశ్చిమ గోదావరిలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ జిల్లాలో పదిహేను ఎమ్మెల్యే సీట్లకు కాను 15 స్థానాలను టీడీపీ కూటమి గెలుచుకుంటుంది. అంటే వైసీకి ఈ పెద్ద జిల్లాలో కూడా వచ్చేది సున్నానే. అంటే అంతలా వైఎస్ జగన్ దారుణమైన ఫలితాలను చూడబోతున్నారనేది కేకే సర్వేస్ ఎగ్జిట్ పోల్స్ అంచనా. ఇక క్రిష్ణా జిల్లాలోనూ ప్రభుత్వ వ్యతిరేకత బలంగా ఉంది. రాజధాని ఏర్పాటులో వైసీపీ చేసిన అలసత్వం పై ఇక్కడి ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. అందుకే క్రిష్ణా జిల్లాలో 16 స్థానాలకు కూటమికే కట్టబెట్టారు. అంటే వైసీపీకి పరిపాలనా కేంద్రంలో కూడా సున్నా సీట్లని ఈ సర్వే తేల్చిన విషయం. టీడీపీకి 13, జనసేనకు ఒకటి, బీజేపీ  రెండు స్తానాలను గెలుచుకుంటుంది.

ఇక గుంటూరు లో కూడా అదే సీన్ రిపీట్ కానుంది. వైసీపీకి ఈ జిల్లాలో కూడా ఒక్క స్థానం గెలుచుకునే ఛాన్స్ లేదు. పదహారకు పదహారు స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంటుంది. ఇక పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం కూడా బంపర్ మెజారిటీతో దక్కించుకుంటుంది. ప్రకాజం జిల్లాలో మాత్రం వైసీపీ ఒక స్థానం గెలుచుకునే అవకాశం ఉండగా మిగతా పదకొండు స్థానాలను టీడీపీ భారీ ఆధిక్యతతో గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో కూడా వైసీపీ పెద్దగా ప్రభంజనం లేదని కేకే సర్వేస్ చెబుతున్నమాట. ఈ సంస్థ ప్రకారం కేవలం రెండు స్థానాలు వైసీకి వస్తే మిగతా 8 స్థానాలను టీడీపీ గెలుచుకుంటుంది. చిత్తూరు జిల్లాలో కూడా 14 స్థానాలను టీడీపీ ఏకపక్షంగా గెలుచుకుంటే కేవలం మూడు చోట్ల మాత్రమే ఫ్యాన్ ప్రభావం ఉన్నట్లు తెలుస్తోందని ప్రజా నాడిని బట్టి మేము చెబుతున్నామని కేకే సర్వేస్ చెబుతున్నవిషయం. ఇక వైసీపీ అధినేత పవన్ కళ్యాణ్ సొంత జిల్లా లో కేవలం మూడు స్థానాలే ఫ్యాన్ కు దక్కుతాయి. అంటే సొంత జిల్లాలో కూడా ప్రజలు వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా ఉన్నారనేది ఈ సంస్థ ఎగ్జిట్ పోల్స్ లో తేలిన విషయం. ఏడు చోట్ల పోటీ చేసిన టీడీపీ ఐదు స్థానాల్లో గెలుస్తుంది. జనసేనకు ఒకటి, బీజేపీ కి ఒక విజయం దక్కుతుంది.

ఇటు కర్నూలులో కూడా ప్రజలు ఏకపక్షంగా చంద్రబాబు నాయుడే సీఎం కావాలని కోరుకున్నారని మా సర్వేలో తేలిందని చెబుతోంది కేకే సర్వేస్ మాట. మొత్తం 14 స్థానాల్లో పదకొండు కూటమికి దక్కుతాయి. కేవలం మూడు స్థానాల్లో మాత్రమే వైసీపీ గెలుస్తుంది. అంటే ఈ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం వైసీపీ కి బలమైన కేంద్రంగా ఉన్న రాయలసీమలో కూడా ప్రజలు టీడీపీ వైపు మొగ్గు చూపారనేది ఈ ఎగ్టిట్ పోల్స్ చెప్పే విషయం. మొత్తంగా చూస్తే వైసీపీ దారుణ పరాజయం చవిచూడబోతోంది. కేవలం 14 స్థానాలు మాత్రమే గెలిచే చాన్స్ ఉంది. ఇక టీడీపీతో కూడిన కూటమి 161 స్థానాల్లో విజయం సాధించి అధికార పీఠం దక్కించుకుంటుంది. ఈ లెక్కన చూస్తూ కూటమి ప్రభంజనం పీక్స్ లో ఉందని కేకే సర్వేస్ తమ సర్వేతో పాటు తీవ్రమైన కసరత్తు చేసిన తర్వాత చేసిన ఫలితాలని చెబుతున్నారు. అంటే ఎగ్జిట్ పోల్స్ ని ఎగ్జాక్ట్ నెంబర్స్ తో చెబుతున్నామనేది వారి మాట. మరి వీరి అంచనాలు నిజమవుతాయా లేదా బొక్కా బోర్లా పడుతుందా అనేది జూన్ నాలుగున తేలిపోతుందనడంలో సందేహం లేదు. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow