ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోన్న ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్స్

ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్స్ ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఎందుకంటే గత ఎన్నికల సమయంలో వైసీపీ 130 స్థానాలు గెలుచుకుంటుంది.

Jun 1, 2024 - 21:42
 0  7
ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోన్న ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్స్
aara mastan exit polls ycp 100 tdp 75

ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్స్ ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఎందుకంటే గత ఎన్నికల సమయంలో వైసీపీ 130 స్థానాలు గెలుచుకుంటుంది. ప్లస్ ఆర్ మైనస్ పది సీట్లకు అటు ఇటుగా ఉంటుందని చెప్పారు. ఆయన అన్ని సీట్లు వైసీపీకి ఇస్తే అంతా నవ్వారు. ఎవరూ నమ్మలేదు. కానీ అంతకు మించి 2019లో వైఎస్ జగన్ గెలుచుకున్నారు. 151 స్థానాలు గెలుచుకుంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా నమ్మలేదు. అంతలా ఏపీ ప్రజలు వైఎస్ జగన్ సీఎం కావాలనుకున్నారు. ఈ సారి కూడా ఆరా మస్తాన్ గతంలో కంటే కూడా మెరుగైన శాంపిల్స్ తో ఎగ్జిట్ పోల్స్ నిర్వహించామని ఫలితాలను ప్రకటించారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో మరోసారి వైఎస్ జగన్ సీఎం గా అధికారం చేపట్టబోతున్నారు. ఖచ్చితంగా 94 నుంచి 104 సీట్లు గెలవబోతున్నారు. వైసీపీకి ఈ సారి గతం కంటే కాస్త తక్కువగా 49.4 శాతం ఓట్లు వస్తాయని ఆరా మస్తాన్ అంచనా వేశారు.

ఇక టీడీపీకి 47.5 శాతం ఓట్లతో 71 నుంచి 81 స్థానాలు వస్తాయనేది ఆరా మాస్తాన్ ఎగ్జిట్ పోల్స్ అంచనా. ఇతరులకు 3.01 శాతం ఓట్లు పోలయ్యాయి. అయితే వైసీపీకి ప్రభుత్వ వ్యతిరేకత నెగెటివ్ గా ఉన్నప్పటికి 50 స్తానాల వరకు తగ్గినా కూడా అధికారం చేపడతారని తెలిపారాయన. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల వైసీపీ చాలా స్థానాలు కోల్పోవాల్సి వస్తోంది. చాలా మంది ప్రజలు తమ భూములను కోల్పోతారనే భయం వలన కూటమికి ఓటేశారు.  ఇన్ని స్థానాలు ఎందుకు వస్తున్నాయంటే రూరల్ ఓట్ బ్యాంక్ గంపగుత్తగా వైసీపికి పడింది. గ్రామీణులు సంక్షేమానికి పట్టం కట్టారు. అదే రూరల్ లో టీడీపీకి ఓట్లు పెరిగాయి. అన్నింటికి మించి సోషల్ ఇంజనీరింగ్ పాజిటివ్ గా వైసీపీకి కలసి వచ్చింది. రిస్క్ తీసుకుని మరి కులాల వారిగా లెక్కలు వేసుకుని పదవులు, పోస్ట్ లు ఇవ్వడమే కాదు నాన్ లోకల్స్ ను కూడా ఆయన అభ్యర్దులుగా పెట్టి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఇక పేదలు పెత్తందార్లు అనే నినాదం కలిసి వచ్చింది. సమాజంలో కొంత మేర చీలిక తెచ్చి జగన్ వైపు మళ్లేందుకు కలిసి వచ్చింది. ఇక రాజకీయ ప్రభావం చూపించి శెట్టిబలిజ, గౌడ, యాదవ కుటుంబాలను ఆయన తన వైపుకు తిప్పుకున్నారు. అది భాగా కలిసి వచ్చింది. బీసీలను కూడా భాగా కలుపుకుని వచ్చారు. టీడీపీకి బలమైన బీసీ ఓటు బ్యాంక్ కు సోషల్ ఇంజనీరింగ్ ద్వారా చెక్ పెట్టారని చెప్పారు. అందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దెబ్బ తీసింది. అంతే కాదు రాజధాని అమరావతి వద్దన్నందుకు గుంటూరు, క్రిష్ణ ప్రాంతాల్లో నష్టపోయింది. అదే వైజాగ్, ఉత్తరాంధ్రలో కలిసి వచ్చింది. ఈ విషయంలో టీడీపీకి కూడా అమరావతి చుట్టు పక్కల ప్రాంతంలో కలిసి వస్తే వైజాగ్, ఉత్తరాంధ్రలో నష్టపోయిందనేది ఆరామస్తాన్ సర్వే ఫలితం. ఈ లెక్కన అన్ని విశ్లేషించిన తర్వాత వైసీపీ 94 నుంచి 104 స్థానాలతో అంటే నెక్ టూ నెక్ ఫైట్ వచ్చినా గెలుపు ఫ్యాన్ దేనని ఆయన ఢంకా బజాయించి మరీ చెప్పారు.

ఇక టీడీపీ ఈ సారి గతం కంటే మరిన్ని స్థానాలు గెలుచుకుంటుంది. 71 నుంచి 81 స్థానాలు గెలుచుకుని ఈ సారి కూడా అధికారానికి దూరమవుతుందని ఆరా మస్తాన్ తెలిపారు. టీడీపీకి ప్రభుత్వ ఉద్యోగులు, అర్బన్ ఓటర్లు, రాష్ట్రం లో అభివ్రుద్ది కనిపించాలని కోరుకునే ఉన్నత చదువులు చదువుకున్న వారు బలంగా మద్దతు తెలిపారని వివరించారాయన. పేద, దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి ఓటర్లంతా వైసీపికి మొగ్గు చూపారు. సంక్షేమ పథకాలదే విజయమని చెప్పారాయన. ఇక జనసేన గురించి కూడా ఆసక్తికర ఫలితాలను వెల్లడించారు ఆరా మస్తాన్. మొత్తం 21 స్థానాల్లో పోటీ చేస్తే 14 నుంచి 16 స్థానాలను పవన్ కళ్యాణ్ పార్టీ గెలుచుకుంటుందని తెలిపారు. అంతే కాదు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పొకొచ్చారాయన.  ఆరా మస్తాన్ సర్వేకు మంచి క్రెడిబులిటీనే ఉంది. సరిగ్గా పోలింగ్ జరిగిన రోజున ఒక టీవీ ఛానల్ లో కూర్చున్న ఆరా మస్తాన్ గట్టి పోటీ ఉంటుంది. టీడీపికి ఎడ్జ్ ఉండే చాన్స్ కనిపిస్తోంది. కాకపోతే పూర్తి ఓటింగ్ అయ్యాక నే ఫలితాలు చెబుతాను. ఇప్పుడు చెప్పలేనన్నారు. కానీ పూర్తి ఓటింగ్ అయ్యాక తీసుకున్న శాంపిల్స్ తో వైసీపీ మరోసారి అధికారం చేపట్టబోతుందని ఆరా మస్తాన్ అంచనా వేశారు. మేము కష్టపడి శాంపిల్స్ తీసుకుని ఫలితాలను ప్రకటించాం. మరి జూన్ నాలుగున ఫలితాలు మా అంచనాలకు దగ్గరగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారాయన.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow