దక్షిణ ఉజ్జయినీ మహాకాళేశ్వర ఆలయం ఎక్కడ ఉందో మీకు తెలుసా?
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ మహాకాళేశ్వరుని ఆలయం గురించి అందరికి తెలుసు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి ఈ క్షేత్రం. నిత్యం వేలాది మంది భక్తులతో ఎప్పుడు ఈశ్వరుడి నామాలతో ఉజ్జయినీ మారుమ్రోగుతుంది. కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఇక్కడ పరమేశ్వరుడు పూజలందుకుంటున్నాడు.Sri Media News
ఈ ఆలయంలో ఉండే ఈశ్వరుడిని.. దక్షిణామూర్తి అని పిలుస్తారు. ఎందుకంటే ఈ శివలింగం ముఖం దక్షిణం వైపు ఉంటుంది. ఇలా మరే శివాలయంలో ఉండదు... అంతేకాదు.. ఇక్కడ కొలువైన మహాకాళుడికి తెల్లవారుజామున విశిష్టమైన హారతిస్తారు. అదే భస్మహారతి. ఈ హారతి రెండు రకాలుగా మహాకాళుడికి ఇస్తారు. ఒకటి గోమయంతో చేసిన పిడకల్ని విభూతిగా మార్చి.. రెండు మూటల్లో నింపి వాటిని ఒకదానితో మరొకటి తాడనం చేస్తూ ఆ విభూతి లింగంపై పడుతూ ఆ గర్భగుడి నిండా ఆవరిస్తుంది… మరొకటి శ్మసానంలో మొదట కాలిన శవం బూడిదతో ఇచ్చే హారతి...దీనిని నాగసాధువు ఇస్తారు.
ఇంత ప్రముఖ్యత కలిగిన మహాకాళుడు.. మన దక్షిణ భారతదేశంలో కూడా ఉన్నాడని మీకు తెలుసా?.. మన దక్షిణ భారత దేశంలో ఉన్న ఈ మహాకాళేశ్వరుడు గోదావరిని అనుకోని ఉంటాడు. ఇంత ప్రాముఖ్యం కలిగిన ఈ ఆలయం మరెక్కడో లేదు... ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఉంది. ఇక్కడ మహాకాళుడిని చూసిన భక్తులు భక్తిపారవశ్యంలో మునిగి తెలుతారు. ఈ పరమ శివుడిని దక్షిణ కాళేశ్వరుడు అని అంటారు.. రాజమహేంద్రవరం రెండో ఉజ్జయినిగా ప్రసిద్ధికెక్కింది. అంతేకాదు.. ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడికి నిర్వహించే భస్మాభిషేకం రాజమహేంద్రవరం మహాకాళేశ్వరుడి ఆలయంలోనూ నిర్వహిస్తారు. ఉజ్జయినిలో అయితే మహాకాళుడికి జరిగే భస్మహారతిని చూసేందుకు మహిళల్ని అనుమతించరు.
రాజమహేంద్రవరం మహాకాళేశ్వరుడి ఆలయంలో ఈ నిబంధన ఉండదు... మహిళాలు సైతం చూడవచ్చు. ఈ ఆలయాన్ని పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి చెందిన వాసు అనే శిల్పి అద్భుతమైన నమూనాతో రూపొందించారు. ఈ మహాకాళేశ్వరుడి ఆలయ నిర్మాణం భూమి ఉపరితలం నుంచి 55 అడుగుల పునాదితో అత్యంత ఆధునికత ఉట్టిపడేలా చేపట్టారు. ఈ ఆలయం గర్భాలయం 109 అడుగుల నిర్మాణం. అంతేకాదు... 75 అడుగుల ఎత్తైన నాలుగు గాలిగోపురాలు, 50 అడుగులతో అతి విశాలమైన నాలుగు మండపాలు, 55 అడుగుల ఎత్తైన నాలుగు ధ్వజస్తంభాలు, నాలుగు బలిపీఠాలు, నాలుగు త్రిశూలాలు, ఇక్కడ ఉన్న నాలుగు నందులను తిలకించారంటే భక్తులు ఆనందపారవశ్యంతో మునిగితేలాల్సిందే. గర్భాలయానికి నాలుగు వైపుల గుమ్మాలతో ఆలయాన్ని నిర్మించడం ఇక్కడ మరో విశేషం. 32 ద్వైత, 32 అద్వైత ఆలయాలతో కలిపి మొత్తంగా 64 ఉపాలయాలు ఆకట్టుకుంటాయి. ఈ ఉప ఆలయాలను దర్శించుకుంటూనే మహాకాళేశ్వర గర్భాలయంలోకి వెళ్లేలా ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు.
రాజమహేంద్రవరం మహాకాళేశ్వరుడి ఆలయాన్ని ఇక్కడ నిర్మించాడానికి కారణం ఉంది. ఓసారి ఉజ్జయిని మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న రోటరీ క్లబ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పట్టపగలు వెంకట్రావు అక్కడ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించారు. దేశం గర్వించదగ్గ ఇలాంటి ఆలయాన్ని రాజమహేంద్రవరంలో గోదావరి తీరాన నిర్మించాలని..ఉజ్జయిని మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న అనుభూతే భక్తులకు కలిగేలా చేయాలని నిర్ణయించుకున్నారు. పవిత్ర గోదావరి నదీ తీరంలో గౌతమీ ఘాట్‌లో రెండు ఎకరాల విస్తీర్ణంలో అత్యంత సుందరంగా మహాకాళేశ్వర ఆలయం రూపుదిద్దుకుంది. ఉజ్జయిని వెళ్లలేని వాళ్ళు ఒక్కసారైనా ఈ ఆలయాన్ని దర్శించుకోండి..
What's Your Reaction?