కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోన్న తృప్తి డిమ్రీ!సౌత్ లో ఆ నటుడితో నటించాలని ఉందన్న తృప్తి డిమ్రీ ?

‘యానిమల్‌’ సినిమా సెకండ్ హీరోయిన్ ‘జోయా’... ఈ పేరు చెబితే చాలు కుర్రకారు గుండెలు ఒక్కసారిగా పులకరిస్తాయి. అంతగా ‘యానిమల్‌’ మూవీలోని పాత్రలో ఒదిగిపోయింది ఈ అమ్మడు.. రణబీర్‌తో నటించిన రస రమ్యమైన సన్నివేశాలు.. తృప్తిని నయా ‘నేషనల్‌ క్రష్‌’గా మార్చేశాయి అనడంలో సందేహం లేదు. Sri Media News

Jul 23, 2024 - 12:51
 0  19
కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోన్న తృప్తి డిమ్రీ!సౌత్ లో ఆ నటుడితో నటించాలని ఉందన్న తృప్తి డిమ్రీ ?

ఏడెనిమిదేళ్ల కిందట ‘పోస్టర్‌ బాయ్స్‌’తో ప్రారంభమైంది తృప్తి కెరీర్‌. థియేటర్‌లో వచ్చిన సినిమాల్లో కంటే.. ఓటీటీలో విడుదలైనవే ఎక్కువ. అటువంటి తృప్పికి ‘యానిమల్‌’ మంచి బ్రేక్‌ ఇచ్చిందనే చెప్పాలి.  కొద్దిమందికే తెలిసిన తృప్తి పేరు... ‘యానిమల్‌’ సినిమాతో దేశవ్యాప్తంగా వినిపిస్తుంది...  ‘యానిమల్’ విడుదలకు ముందు ఆమె ఇన్స్టాగ్రామ్‌‌లో సుమారు 600K ఫాలోవర్లు ఉంటే.. ఈ సినిమా తరువాత ఆమెకు 3.5 మిలియన్ల మంది ఫాలోవర్స్ యాడ్ అయ్యారు.. అంతేనా  ఈ సినిమాలో తృప్తి డిమ్రీ రణబీర్ కపూర్ మధ్య ఉన్న ఇంటిమేట్ సీన్స్ ఇప్పటికీ చర్చనీయామే..

ఈ ఇంటిమేట్ సీన్స్ చూసి తృప్తి తల్లిదండ్రులు చాల బాధపడ్డి...  ‘‘నువ్వు అలాంటి పని చేస్తానని మేం ఊహించలేదు. ఇంతకు ముందు ఏ సినిమాలోనూ ఇలాంటి సన్నివేశాలు మేం చూడలేదు. ఇంకా ఎప్పుడు అలాంటి సన్నివేశాలు చేయకూడ ఉంటే మంచిది. అని వారు బాధపడ్డారట’’ ఈ విషయాన్ని తృప్తి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అయితే ఈ ఇంటిమేట్ సీన్స్ తీస్తున్నప్పుడు తృప్తి, రణబీర్‌, డైరెక్టర్, కెమెరామన్‌ మాత్రమే సెట్‌లో ఉన్నారట. తృప్తికి ఏ ఇబ్బందీ కలగకుండా ఈ సిన్స్ చేశారట. అంతేకాదు.. ఈ సిన్స్ చెస్తున్నప్పుడు అసౌకర్యంగా అనిపించలేదట.... ‘నేను చేస్తున్నది తప్పు కాదని నమ్మినప్పుడు... ఎవరో ఏదో అన్నారని పట్టించుకోవాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం’ అని నవ్వుతూ సమధానం ఇచ్చింది తృప్తి.

తృప్తి పుట్టి పెరిగిందంతాఉత్తరాఖండ్‌లోని గఢవాల్‌ ప్రాంతంలోనే ఆ తరువాత కొన్నేళ్లకు కుటుంబం ఉత్తరప్రదేశ్‌ ఘజియాబాద్‌కు మారింది. అక్కడి ‘ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌’లో చదువుకుంది. ఆ తరువాత ఢిల్లీలోని ‘శ్రీ అరబిందో కాలేజీ’ నుంచి సైకాలజీలో డిగ్రీ చేసింది.. కానీ తృప్తి చదువులో బ్యాక్ బెంచ్ స్టూడెంట్ . దీంతో తను జీవితంలో ముందుకు వెళ్లాలి అంటే.. చదువుతో సంబంధం లేకుండా వేరే ఏదన్నా చేయాలని అనుకందట... అలా తన ప్రమేయం లేకుండానే సినిమాల్లోకి అడుగు పెట్టిందట ఈ అమ్మడు.

ఆ సంఘతులన ఆమె ఇలా పంచుకున్నారు...  నా సోదరుడి స్నేహితుడు ఫొటోగ్రాఫర్‌. ఓ రోజు నన్ను చూసి ‘టెస్ట్‌ ఫొటో షూట్‌ చేద్దాం’ అన్నాడు. ఆ షూట్‌ చేశాం. తరువాత తను నా ఫొటోలను ఎవరికో పంపించాడు. ఇక అక్కడి నుంచి అవకాశాలు మొదలయ్యాయి. తొలుత ప్రింట్‌ షూట్స్‌ చేశాను. ఆ షూట్స్‌ చూసి ఆడిషన్స్‌కు రమ్మని కాల్స్‌ వచ్చాయి. క్రమంగా నటనతో ప్రేమలో పడ్డాను. అప్పుడు అనుకున్నాను... ఇప్పడు నటనే నా కెరీర్‌ అని’ తృప్తి చెప్పింది.

అయితే ‘యానిమల్’ స‌క్సెస్ తో బాలీవుడ్ లో బిజీ బ్యూటీగా మారిపోయిన ఈ అమ్మడు. ‘‘సౌత్ సినిమాల్లో నటించాలని ఉందని.. జూనియర్‌ ఎన్టీఆర్‌ అంటే ఎంతో ఇష్టమని నటించాలని ఉందని మనసులో మాట చెప్పుకొచ్చింది’’. అయితే తాజాగా ఈ అమ్మడు సౌత్‌‌ సినిమాకు సంతకం చేసింది. అదికూడా కోలీవుడ్ స్టార్ ధ‌నుష్ సినిమాకు. ధనుష్ హీరోగా ఆనంద్ ఎల్ రాయ్ ఓ చిత్రానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రక‌టించి ఏడాది అవుతున్నా? ఇంత‌వ‌ర‌కూ సెట్స్ కి వెళ్లలేదు. ధ‌నుష్ వేర్వేరు సినిమాల‌తో బిజీగా ఉండ‌టంతో అది సాధ్యప‌డలేదు. కానీ ఈ ఏడాది అక్టోబ‌ర్‌‌లో ఈ సినిమా ప్రారంభించాల‌ని డైరెక్టర్ అనుకుంటున్నాడు. అయితే ఈ సినిమాకు `తేరే ఇష్క్ మే అనేది ఈ సినిమా టైటిల్‌‌గా ఖ‌రారు చేసారు. ఈ సినిమా విషాధంతో కూడిన ప్రేమ క‌థగా ఉండనుందని.... ఇందులో హీరోయిన్ గా త్రిప్తీ డిమ్రీని ఎంపిక చేసిన‌ట్లు స‌మాచారం. యానిమ‌ల్ ఆమె పెర్పార్మెన‌స్ చూసి ఆనంద్ ఛాన్స్ ఇచ్చారుట‌. దీంతో ఈ ప్రాజెక్ట్ తో  త్రిప్తీ డిమ్రీ  సౌత్‌‌లోకి ఎంట్రీ ఇస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాతో సౌత్‌‌లో నటించాలి అన్న ఈ అమ్మడు కోరిక కూడా తీరే చాన్స్ ఉంది.

యానిమన్ మూవీతో త్రిప్తి దిమ్రీ లైఫ్ .. ఒక్కసారిగా మారిపోయింది. ముంబైలోని బాంద్రాలో 14 కోట్లు పెట్టి ఓ ఖరీదైన ఇళ్లు కొనుగోలు చేసింది. తాజాగా విక్కీ కౌశల్‌తో బ్యాడ్ న్యూజ్‌ అనే సినిమాలో నటిస్తోంది. ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న బ్యాడ్ న్యూస్ సినిమాలో నటించింది. ఈ సినిమాలో హీరోగా విక్కీ కౌశల్ లీడ్ రోల్ పోషిస్తుండగా ఆయన సరసన త్రిప్తి డిమ్రీ, అమీ వర్క్ ప్రధాన పాత్రల్లో నటించారు.

2017లో పోస్టర్ బాయ్స్ అనే హిందీ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఆ సినిమాలో గుర్తింపు రాలేదు. 2018లో వచ్చిన లైలా మజ్ను కూడా ఆమె కెరీర్‌కు పెద్దగా కలిసి రాలేదు. 2020లో వచ్చిన బుల్‌బుల్ మూవీ పర్వాలేదనిపించింది...  ఆ తరువాత 2022లో వచ్చిన కళా మూవీ త్రిప్తికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది. అప్పడే తృప్తి సందీప్‌ వంగా దృష్టిలో పడింది. తను తీస్తున్న యానిమల్ మూవీలో త్రిప్తికి ఓ స్పెషల్ క్యారెక్టర్ ఇచ్చాడు. ఆ అవకాశమే ఆమె సినీ కెరీర్‌గా మార్చేసింది. రాత్రికి రాత్రే ఆమెకు స్టార్డమ్‌ వచ్చేసింది. వరుస పెట్టి ఆఫర్లు రావడంతో ఆమె తన రెమ్యూనిరేషన్ కూడా అమాంతంగా పెంచేసింది. ఇప్పడు తృప్తి చేతిలో ప్రస్తుతం ఆరు సినిమాలు ఉన్నాయి. కార్తీక్ ఆర్యన్ సరసన భూల్ బులయ్య 3 అనే సినిమాలో అవకాశం దక్కించుకుంది. అదే విధంగా సిధ్దాంత్ చతుర్వేది సరసన ధడక్ 2 సినిమాలో కూడా నటిస్తోంది. అదే విధంగా ఆనంద్ రాయ్‌ ట్రాజెడీ మూవీ తేరే ఇష్క్ మే సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది. ఈ ముద్దు గుమ్మ.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow