‘గేమ్ ఛేంజర్’ సినిమాకి షేర్ వద్దు రెమ్యూనరేషన్ ముద్దు....రామ్ చరణ్!
‘గేమ్ ఛేంజర్’ కోసం రామ్ చరణ్‌కి రూ.90 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వనున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు ముందు రూ.30 నుంచి రూ.40 కోట్లు తీసుకునే చరణ్.. ఈ చిత్రానికి భారీగానే కోట్ చేసారు.Sri Media News
1993లో జెంటిల్ మెన్ సినిమాతో దర్శకుడిగా మారిన శంకర్... తమిళ సినిమాని కమర్షియల్ గా పైకి లేపిన డైరెక్టర్. ఇందులో సందేహం లేదు. ఎంతోమంది 80s, 90s లో స్టార్ డైరెక్టర్ శంకర్. తాజాగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు 2 సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకోవడంతో హీరో రామ్ చరణ్ జాగ్రత్త పడ్డాడు అని అంటున్నారు. దీనికి కారణం ఏంటి? రామ్ చరణ్ ఏ విషయంలో జాగ్రత్త పడ్డాడు?. శంకర్ సినిమాలు మిస్ ఫైర్ ఎందుకవుతున్నాయి?
‘‘ఆర్ఆర్ఆర్’’ సినిమా తర్వాత రామ్ చరణ్ హీరోగా చేస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా షూటింగ్ మూడేళ్ల క్రితం మొదలు పెట్టారు. కానీ ఇప్పటికీ సెట్స్ మీదే ఉంది. దీనికి కారణం డైరెక్టర్ శంకర్ ఈ సినిమా చేస్తూ ‘భారతీయుడు 2’ తీసుకుంటు రావడమే.. ఒకే సారి రెండు పడవలపైన కాలు వేసిన శంకర్.. భారతీయుడు నిరశపెట్టింది. ఘోరమైన టాక్ తెచ్చుకుంది. ఈ ఎఫెక్ట్... చరణ్-శంకర్ మూవీపై పడటంతో... రామ్ చరణ్.. ఓ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నాట్లు తెలుస్తుంది. ఈ మూవీ నుంచి వచ్చే లాభాల్లో షేర్ తీసుకుందామని ఫిక్స్ అయిన... చరణ్ ఆలస్యమయ్యే కొద్ది నిర్మాత వడ్డీల భారం పెరుగుతుందని తెలి తన నిర్ణయాన్ని చరణ్ మార్చుకున్నట్టు తెలుస్తుంది.
కాగా ‘గేమ్ ఛేంజర్’ కోసం రామ్ చరణ్‌కి రూ.90 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వనున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు ముందు రూ.30 నుంచి రూ.40 కోట్లు తీసుకునే చరణ్.. ఈ చిత్రానికి భారీగానే కోట్ చేసారు. అయితే దిల్ రాజు ఓ ప్రపోజల్ పెట్టారట. నిర్మాతగా తను, హీరో, డైరక్టర్ ముగ్గరూ 33% చొప్పున సమానంగా షేర్ బిజినెస్ నుంచి తీసుకుందామనుకున్నారు. ఈ బిజినెస్ లో థియేటర్, డిజిటల్, శాటిల్, మిగతా అన్ని రైట్స్ ఉంటాయి. ఇలా చేయటం వల్ల శంకర్ కు, హీరో రామ్ చరణ్ కు ఇమ్మీడియట్ గా రెమ్యునరేషన్ లు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఆ డబ్బుని సినిమాలో పెట్టుబడిగా పెట్టవచ్చు అనుకున్నారు. అయితే షూటింగ్ లేటు అవటంతో బడ్జెట్ అంతకంతకూ పెరుగుతూ వచ్చింది.
250 కోట్లు బడ్జెట్ అనుకున్న ఈ ప్రాజెక్టు 400 కోట్ల మార్క్‌కు రావడం. ఈ క్రమంలో రామ్ చరణ్ తన తరుపు నుంచి నిర్మాతకు సాయిం చేయాలని నిర్ణయించుకున్నారట. తను మొదట అనుకున్న షేర్ లాగ కాకుండా ఇంత ని ఎమౌంట్ తన రెమ్యునరేషన్ గా తీసుకుంటానని చెప్పారట. షేర్ బట్టి చూస్తే ఇది కాస్త తక్కువ మొత్తమే.. ఇదిలా ఉంటే ఈ సినిమా వర్క్ దాదాపు పూర్తయింది. మరో 15 రోజులు షూట్ పూర్తి చేస్తే అంతా కంప్లీట్ అయిపోతుంది. ఇకపోతే ఈ ఏడాది దీపావళి లేదా క్రిస్మస్‌కి 'గేమ్ ఛేంజర్'.. థియేటర్లలో రిలీజ్ ఉండొచ్చని అంటున్నారు. కొన్నిరోజులు ఆగితే గానీ దీనిపై క్లారిటీ వచ్చేలా లేదు.
1993లో జెంటిల్ మెన్ సినిమాతో దర్శకుడిగా మారిన శంకర్ మొదటి సినిమాతోనే భారీ హిట్ కొట్టాడు. ఆ తర్వాత ప్రేమికుడు, భారతీయుడు, జీన్స్, ఒకేఒక్కడు, బాయ్స్, అపరిచితుడు, శివాజీ, రోబో.. ఇలా ఒకదానికి మించి ఒకటి పెద్ద హిట్ అయ్యాయి. ఇవన్నీ కమర్షియల్ గా భారీ సక్సెస్ అయ్యాయి. ఇవన్నీ తమిళ్ సినిమాలే అయినా తెలుగులో కూడా రిలీజయి, ఇక్కడ కూడా పెద్ద హిట్ అయి తమిళ్ హీరోలని, శంకర్ ని, ఏఆర్ రహమాన్ ని తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసాయి.
శంకర్ సినిమా అంటే ఒక మెసేజ్ ఉంటుంది. శంకర్ సినిమాల్లో ఎమోషన్ కరెక్ట్ గా పండి ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. గ్రాండ్ విజువల్స్ ఉంటాయి, భారీ ఖర్చుతో కూడిన అద్భుతమైన పాటలు ఉంటాయి. వీటన్నిటికీ మించి సాధారణ ప్రజల తాలూకు ఆలోచనలు ఆయన సినిమాల్లో ఉంటాయి. కానీ ఇప్పుడు అవన్నీ మిస్ అవుతున్నాయని టాక్ వినిపిస్తుంది. దీనికి కారణం కూడా ఉందని అంటున్నారు మూవీ లవర్స్..
తమిళ లెజండరీ రైటర్లలో ఒకడైన సుజాత రంగరాజన్ లేకపోవడమే దీనికి కారణం అనేవారు ఉన్నారు. ఎందుకంటే... శంకర్ తీసిన సినిమా భారతీయుడు నుంచి ఒకే ఒక్కడు, బాయ్స్, అపరిచితుడు, శివాజీ, రోబో సినిమాలకు ఆయన శంకర్‌తో పని చేశారు. ఐతే రచయితగా మంచి ఫాంలో ఉండగానే 2008లో సుజాత చనిపోయారు. అంతటితో శంకర్ వైభవం కూడా అయిపోయింది. తర్వాత వచ్చిన ఐ, 2.0 సినిమాలు అంచనాలను అందుకోలేకపోయాయి.
ఇప్పుడు ‘భారతీయుడు-2’ సంగతి చెప్పాల్సిన పనే లేదు. సాహితీవేత్తగా, రచయితగా మంచి పేరున్న జయమోహన్‌తో 2.0, ఇండియన్-2 సినిమాలకు పని చేయించుకున్నాడు కానీ.. ఆయన సుజాతలా మెరుపులు మెరిపించలేకపోయారు.
What's Your Reaction?