ఫస్ట్ సినిమా తరువాత.. ఒకటీ అరా మూవీస్‌తో హిట్ అనే టాక్ తెచ్చుకోలకపోయినా.. ఫర్వాలేదు అనిపించుకున్నాడు.. ఇక ఆ తరువాత నుంచి.. ఫ్లాప్ మీద ఫ్లాప్ తీసి.. ఏం సినిమాలు తీస్తున్నాడయ్యా అనిపించేలా చేశాడు రాజ్ తరుణ్.. ఆ మధ్య ఓ కారుతో యాక్సిడెంట్ చేసి.. హెల్ప్ చేయటం మానేసి.. కారుని వదిలేసి పారిపోతే.. పాపం పిల్లోడుకి ఎంత భయమో అని అనుకున్నారు.. కానీ ఎవరికీ తెలియని మరో యాంగిల్ కూడా ఈ బాబులో ఉందని.. ఈయన గారి లవర్ చెప్పే వరకు తెలియలేదు.
రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ డైరెక్టుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లిన లవర్ లావణ్య.. రిటన్ కంప్లైంట్ ఇచ్చింది. తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. ఇప్పుడు వేరే వారితో ఉంటున్నాడని నార్సింగి పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. నన్నే పెళ్లి చేసుకుంటానని ముందు నుంచి నన్ను నమ్మించాడు.. ఇప్పుడు ముఖం చాటేశాడు అంటూ వాపోయిందామె. ఇదేంటని నిలదీయటానికి ఫోన్ చేస్తున్నా.. తన కాల్ లిఫ్ట్ చేయటం లేదని ఆరోపిస్తుంది లావణ్య. పదే పదే కాల్ చేస్తున్నానని. నా నెంబర్ బ్లాక్ లిస్ట్‌లో పెట్టేశాడు అని ఫిర్యాదులో పేర్కొంది.
గత 11 ఏళ్లుగా తాను రాజ్ తరుణ్‌తో రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు వివరించింది. “శారీరకంగానూ ఒకటయ్యాం.. ఒకే ఇంట్లో కలిసి ఉండేవాళ్లం. రాజ్ తరుణ్ తన కొత్త సినిమాలోని హీరోయిన్‌తో ఎఫైర్ పెట్టుకున్నాడు. ప్రశ్నించినందుకు నన్ను చంపుతామని బెదిరిస్తున్నారు. అతడిపై చర్యలు తీసుకోండి అంటూ” పోలీస్ స్టేషన్‌లో రిటన్ కంప్లైంట్ ఇచ్చింది లావణ్య. అంతేగాకుండా తమ ప్రేమ విషయం కారణంగా రాజ్ తరుణ్ సోదరుడు తనను అనేక సార్లు బెదిరింపులకు గురిచేశాడని అని కూడా ఫిర్యాదు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా తనపై కేసు నమోదు అయిన విషయంపై హీరో రాజ్ తరుణ్ స్పందించారు. లావణ్యతో రిలేషన్‌షిప్‌లో ఉన్న మాట వాస్తవమే. కానీ కొంత కాలంగా ఆమె డ్రగ్స్ వాడుతోంది. వేరే వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుంది. అందుకే దూరం పెట్టాను. ఆమెకు నా డబ్బు కావాలి. అందుకే ఈ డ్రామా. లావణ్య నన్ను చాలా టార్చర్ పెట్టింది. కన్న తండ్రిని కూడా మోసం చేసింది. నేను ప్రేమించి మోసం చేశానన్న ఆరోపణలల్లో నిజం లేదన్నారు రాజ్ తరుణ్.
అయితే గతంలో డ్రగ్స్ కేసులో లావణ్య పట్టుబడ్డింది. గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు గుర్తించిన ఎస్‌వోటీ పోలీసులు.. ఆమె వద్ద 4గ్రాముల MDMA డ్రగ్స్ సీజ్ చేశారు. డ్రగ్స్ కేసులో ఈమె పట్టుబడటంతో.. అప్పటికే తగ్గిపోయిన రాజ్‌తరుణ్ ఫేమ్.. గ్రౌండ్ లెవల్‌కి వెళ్లిపోయింది. ఈ కారణంతోనే ఆమెను దూరం పెట్టినట్లు కనిపిస్తుంది. కొత్తగా అమల్లోకి వచ్చిన చట్టం ప్రకారం ఇలా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేస్తే.. కఠిన కారాగార శిక్ష వేసే అవకాశం ఉంది. మరి రాజ్ తరుణ్ కేసులో పోలీసులు, న్యాయస్థానం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.