ఇంత అందంగా ఉంది.. సినీ ఫీల్డ్ నుంచి వచ్చారా అని గుసగుసలు వినిపించాయి.. కానీ ఆమె బ్యాక్‌గ్రౌండ్ తెలిసి.. అమ్మో అని అనుకున్నారు. ఈమె రిలీజ్ చేసిన ఒక్క వీడియోతో.. వైసీపీకి కంచుకోటలా ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో.. టీడీపీ గెలుపొందింది.. ఇంతకీ ఎవరీమె.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటి?
అది విజయవాడ గన్నవరం సమీపంలోని కేసరాపల్లి ఐటీ పార్క్ వద్ద చంద్రబాబు ప్రమాణ స్వీకారం కార్యక్రమం.. గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్.. ఆయనతో ప్రమాణం చేయించారు. అనంతరం పవన్ కల్యాణ్, నారా లోకేష్, కింజరాపు అచ్చెన్నాయుడు.. ఇలా వరుసగా 24 మంత్రులు ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం ముగిసిన అనంతరం పవన్ కల్యాణ్, మెగాస్టార్ చిరంజీవిలతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభకు అభివాదం చేయడం హైలైట్ అయ్యింది.
ఈ కార్యక్రమానికి, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్రమంత్రులు జీ కిషన్ రెడ్డి, బండి సంజయ్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మ హాజరయ్యారు. అంతేగాకుండా తాజాగా బాధ్యతలు స్వీకరించిన ఇతర కేంద్ర మంత్రులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాజకీయ.. సినీ రంగాలకు చెందిన వారే కాదు.. వ్యాపార.. ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. వందలాది ప్రముఖులు హాజరైన ఈ వేడుకలో ఒకరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ఆమె ఎవరో కాదు ఆమె పులివర్తి త్రిషా రెడ్డి. చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన పులివర్తి నాని కోడలే ఈ త్రిషారెడ్డి. ఓత్ సెరోమణీలో ప్రత్యేక ఆకర్షణగా మారిన ఆమె.. తన అత్తమామలు.. భర్తతో కలిసి ఈ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయ్యారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే పులివర్తి నానిది లవ్ మ్యారేజ్ కాగా.. ఆయన కుమారుడు వినీల్.. డాక్టర్ అయిన త్రిషారెడ్డిని ప్రేమించి పెళ్లాడారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన పులివర్తి నాని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సుధారెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నారు. అదే తరహాలో నాని కుమారుడు వినీల్ కూడా రెడ్డి సామాజిక వర్గానికే చెందిన డాక్టర్ త్రిషా రెడ్డిని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు.
కాగాచంద్రగిరి నియోజకవర్గంలో చిన్న పిల్లల కోసం మెడికల్ క్యాంపుల్ని నిర్వహించటం ద్వారా మంచి పేరును సొంతం చేసుకున్నారు త్రిషారెడ్డి.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తన మామ గెలుపు కోసం ఆమె చేసిన ప్రచారం అందరిని ఆకర్షించింది. తన మామ పులిపర్తి నానికి ఓటేయాలని కోరుతూ ఆమె చేసిన వీడియో వైరల్ గా మారింది. వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రాతినిధ్యం వహించే చంద్రగిరిలో ఈసారి తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ఈసారి చెవిరెడ్డి చంద్రగిరి నుంచి ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేయగా.. ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి చంద్రగిరి నుంచి పోటీ చేసి ఓటమిపాలైన పాలయ్యారు.
ఈమె చేసిన మంచి పనులు ప్రజల్లోకి బాగా వెళ్లటం, తన మామను గెలిపించాలని చేసిన వీడియో సైతం ప్రజలకు నేరుగా చేరటంతోనే.. చంద్రగిరిలో వైసీపీ ఓటమి చవిచూసిందని చెప్తుంటారు. ఎందుకంటే.. త్రిషా రెడ్డి పెట్టే మెడికల్ క్యాంప్స్‌కు ఎక్కువుగా పేద వాళ్లు, మధ్యతరగతి ప్రజలే వస్తారు.. వచ్చిన వారితో ఆప్యాయంగా మాట్లాడుతూ.. వైద్యంతో పాటు.. తన వంతు సాయంగా ఆర్థిక సాయాలు చేసిన రోజులూ కూడా ఉన్నాయి. మామకు తగ్గ కోడలిగా పేరు తెచ్చకుంటుంది త్రిషా రెడ్డి.