రాధా కృష్ణులు ఎందుకు పెళ్లి చేసుకోలేదు?

బృందావనంలో చిన్నతనం నుంచి రాధా కృష్ణులు కలిసి పెరిగారు. బృందావనంలో ఎంత మంది గోపికలు ఉన్న రాధ శ్రీ కృష్ణుడికి ప్రత్యేకం. రాధను అమితంగా ప్రేమించేవాడు. రాధ కూడా శ్రీకృష్ణుడిని ఎంతగానో ప్రేమించేది. చిన్నతనంలో సంతోషంగా గడిచిన వీరి స్నేహం.Sri Media News

Jun 9, 2024 - 20:57
 0  121
రాధా కృష్ణులు ఎందుకు పెళ్లి చేసుకోలేదు?
మనమందరం చిన్నప్పటి నుంచి రాధాకృష్ణుల ప్రేమ కథలు వింటూ పెరిగాము. ఇద్దరి స్నేహం, ప్రేమ చూస్తే మన జీవితంలో కూడా అలాంటి వ్యక్తి ఉంటే బాగుంటుందని అనిపించకుండా ఉండదు... అంత గొప్పగా ఉంటుంది వారి ప్రేమ.. అందుకే వారి ఇరువురి పేరు ప్రేమకు ప్రతి రూపంగా మారింది. ఎన్నిసార్లు వారి ప్రేమ కథ విన్నా మళ్ళీ వినాలనిపిస్తుంది. అంతటి గొప్ప ప్రేమికులు పెళ్లి చేసుకోలేదు అని మీకు తెలుసా..?  అంతగా ప్రేమించుకున్న రాధా కృష్ణులు ఎందుకు పెళ్లి చెసుకోలేదు. వాళ్లిద్దరూ ఎందుకు విడిపోయారు? చివరికి రాధ ఏమైంది?   కృష్ణుడు మధుర వెళ్ళిపోయాక రాధ ఎలా బ్రతికింది. అసలు అందరూ రాధ కృష్ణ అని ఎందుకు అంటారు, ఎందుకని కృష్ణ రుక్మిణి అని అనరు ఈ విషయాలు మీరు ఎప్పుడైన ఆలోచించారా? ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం.
బృందావనంలో చిన్నతనం నుంచి రాధా కృష్ణులు కలిసి పెరిగారు. బృందావనంలో ఎంత మంది గోపికలు ఉన్న రాధ శ్రీ కృష్ణుడికి ప్రత్యేకం. రాధను అమితంగా ప్రేమించేవాడు. రాధ కూడా శ్రీకృష్ణుడిని ఎంతగానో ప్రేమించేది. చిన్నతనంలో సంతోషంగా గడిచిన వీరి స్నేహం...
వారు పెరుగుతున్న కొద్ది అనేక ఒడుదుడుకులకు గురైంది. మేనమామ కంసుడిని వధించడం కోసం శ్రీ కృష్ణుడు ద్వారకకు బయలుదేరతాడు. ఆ సమయంలో తనను కూడా పెళ్లి చేసుకుని వెంట తీసుకెళ్లమని ప్రార్ధిస్తుంది రాధ. కానీ, కృష్ణుడు అలా చేయలేదు. అనంతరం రాధకు వేరే వివాహం చేస్తారు. అయినప్పటికీ తన మనసులో ఎల్లప్పుడూ రాధనే తలుస్తుంటాడు శ్రీ కృష్ణుడు. మదురకు వెళ్లిన కృష్ణుడు తన మేనమామను సంహరించి, రుక్మిణీ సత్యభామలను వివాహం చేసుకుని, అక్కడే రాజ్యానికి రాజుగా రాజ్యపాలన చేస్తుంటాడు. రాధ మాత్రం అక్కడే బృందావనంలో ఒంటరిగా  కృష్ణుడిని తలచుకుంటూ ఉండిపోయింది. అసలు రాధను కృష్ణుడు ఎందుకు విడిచిపెట్టేశాడు అనే సందేహం మీకు వచ్చి ఉండవచ్చు.... శ్రీ కృష్ణుడు రాధను  విడిచి వెళ్తున్న సమయంలో ఇలా చెబుతాడు. ఇద్దరు వేర్వేరు ఆత్మలకు బంధం కావాలి. ప్రేమతో కలిసిన  రెండు మనసులు కలిసే ఉండాలంటే, వారు పెళ్లి చేసుకోవాలి.  కానీ, రెండు వేర్వేరు శరీరాలు.. ఒకే ఆత్మగా ఉన్న మనం ఎలా పెళ్లి చేసుకోవాలి.? అని ప్రశ్నించాడు. అప్పుడు అర్ధమైంది రాధకు. తాను ఎప్పుడో కృష్ణుడిలో ఐక్యమైందని.... కృష్ణుడి నుండి వేరు చేయడం, వేరు కావడం అనే ప్రశ్నే లేదని...  అందుకే రాధా కృష్ణుల ప్రేమ పూర్తిగా భిన్నమైనది. వారు ఒకరి కోసం ఒకరు కాదు. ఇద్దరూ ఒక్కటే. అందుకే వారి ప్రేమకు చరిత్రలో అంత గొప్ప స్థానం ఉంది. అదీ రాధా కృష్ణుల అపూర్వ ప్రేమ గాధ. 
ఇదిలా ఉంటే  రాధా కృష్ణుల వివాహం జరగకపోవడానికి గల కారణాల గురించి అనేక కథలు ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకుందాం.
శ్రీకృష్ణుని ప్రియమైన స్నేహితులలో ఒకరైన శ్రీదాముడు రాధ కృష్ణుల ప్రేమ విషయం తెలుసుకున్నప్పుడు, కృష్ణుడి పట్ల రాధ చేసిన దుర్భాషలు ఆయనకు ఆగ్రహం తెప్పించింది. ఆమె తన భాదను వ్యక్తపరచే పద్దతికి దుర్భాషలాడడం సరైన మార్గం కాదని చెప్పడానికి ప్రయత్నించాడు. కృష్ణుడు రాధ పై పెంచుకున్న ప్రేమ గురించి రాధకు వివరించే ప్రయత్నం కూడా చేశాడు. కానీ రాధ కృష్ణుడిపై కోపంతో  ఉండటంతో క్షమించే ఆలోచన లేదు. దీంతో శ్రీదాముడిని కూడా దుర్భాషలాడడం మొదలుపెట్టింది.  శ్రీదాముడికి రాధపై కోపం  కట్టలు తెంచుకు రావడంతో...  మరుసటి జన్మలో కూడా నువ్వు వివాహం చేసుకోలేవు అని శపించాడు.
ప్రాణంగా ప్రేమించిన రాధ కృష్ణుడిని ఎందుకు ఎందుకు దుర్బషలు అడింది అని మీకు అనుమానం మీకు వచ్చిందా? అందుకు కారణం ఇప్పుడు చెప్తాను.... బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం కృష్ణుడు, రాధ వారి పూర్వ జీవితంలో గోలక్‌లో నివసించేవారు. ఒకరోజు కృష్ణుడు భార్య అయిన వీర్జతో కలిసి తోటలో కూర్చున్నాడు. వీరిద్దరిని పక్కపక్కనే చూసిన రాధకు కృష్ణుడిపై కోపం వచ్చింది. ఆయనతో గొడవపడింది. ఈ గొడవ వీర్జకు నచ్చలేదు. ఆ కోపంతో వీర్జ ఒక నదిగా మారి ఎప్పటికి కృష్ణుడి దరి చేరకూడదని అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయింది. దీంతో కృష్ణుడు నిరాశ చెందాడు. రాధ కూడా కృష్ణుడితో మాట్లాడకుండా దూరంగా ఉన్నది. వీరిద్దరి మధ్య దూరం పెరిగింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా రాధ మనసు కరుగలేదు.
కృష్ణుడు, శ్రీదాముడు మంచి మిత్రలు. ఒకరంటే ఒకరికి ఇష్టం. వీరు స్నేహానికి మారుపేరులా ఉంటారు. అయితే.. రాధ, కృష్ణుడుపై గొడవ పడ్డ విషయం దామునికి తెలిసింది. దాముడు రాధకు నచ్చచెప్పాలని చూశాడు. అయినా రాధ ఏ మాత్రం చలించలేదు. పైగా కృష్ణుడిని తిట్టుడంతోపాటు, దామునిని కూడా తిట్టసాగింది. ఇది దామునికి మరింత కోపాన్ని తెచ్చింది. కోపానికి గురైన దాముడు మరుసటి జన్మలో కూడా ప్రేమించిన వారిని వివాహం చేసుకోలేదు అని రాధను శపించాడు.
శ్రీకృష్ణుడిని అంతగా అరాధించి ప్రేమించిన రాధ కృష్ణుడిని వివాహం చేసుకోకుండా అయాన్ (అభిమన్యు)ను ఎందుకు వివాహం చేసుకుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
రాధ భర్త పేరు అభిమన్యు. ఆయాన్ గా పిలుస్తూ ఉంటారు. ఆయాన్, రాధల కథ ఎక్కువగా జానపదల్లో కనిపిస్తుంది. అభిమన్యు కృష్ణుడి పెంపుడు తల్లి యశోద కజిన్ సోదరుడు. అతను గోకుల్ సమీపంలోని జరత్ అనే గ్రామంలో నివసించాడు. అభిమన్యు పాల వ్యాపారం చేసే వాడు, గొప్ప కాళీ భక్తుడు. అతనికి ప్రాపంచిక విషయాలపై ఆసక్తి ఉండేది కాదు. రాధతో అతని వివాహాన్ని కృష్ణుడి పెంపుడు తండ్రి నంద నిర్వహించారు. చాలా జానపద కథల్లో అభిమన్యు నపుంసకుడిగా చెబుతుంటారు.
రాధ అయాన్‌‌ని ఎందుకు వివాహం చేసుకుంది అనే దానికి కూడా ఓ కథ ఉంది. అభిమన్యు గత జన్మలో లక్ష్మిని భార్యగా పొందాలని తపస్సు చేశాడు. దానికి నారాయణుడు ఒప్పుకోలేదు.. దీంతో అభిమన్యు తన తప్పస్సును మరింత కఠినం చేసి తనకు తాను అగ్నివలయంలో ఉంచుకున్నాడు. ఈ సారి నారాయణుడు స్పందించకుండా ఉండలేకపోయాడు. ఆయన తపస్సుకు మెచ్చి సరే. ద్వాపర యుగంలో నా కృష్ణ అవతారంలో నీకు లక్ష్మి భార్యగా లభిస్తుంది. లక్ష్మి రాధగా అవతరిస్తుంది. ఆ సమయంలో, నీవు అయాన్ అని పిలవబతావు. రాధ నిన్ను పెళ్లి చేసుకుంటుంది. కానీ నువ్వు  నపుంసకుడిగా పుడతావు అని వరం ఇచ్చాడట నారాయణుడు. .
రాధాకృష్ణులు ఒక ఆత్మతో కూడిన రెండు శరీరాలుగా  ఉండేవారు. అంతేకాక రాధ కృష్ణుడికి ఆత్మబంధువుగా ఉండేది. కృష్ణుడు, విష్ణువు అవతారం. అందరి దేవతల వెనుక ఉన్న బలమైన శక్తి స్వరూపుడు. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow