నెరవేరిన 500 యేళ్ళనాటి భారతీయుల కల... ఆ హనుమంతుడే వచ్చి నాకు ఆహ్వానం ఇచ్చాడు.....
ప్రతి ఒక్క భారతీయుని కల నెరవేరిన రోజు జనవరి 22 2024. 500 ఏళ్ల కల సాకారమైన తరుణం. ప్రతి భారతీయుడు ఎన్నో దశాబ్దాలుగా వేచి చూసిన క్షణమిది. అయోధ్యలో శ్రీరామమందర నిర్మాణం 500 ఏళ్లనాటి కల నెరవేరింది. ఇంతటి అద్భుతమైన ఈ మహాఘట్టాన్ని వీక్షించేందుకు ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు.Sri Media News
ప్రతి ఒక్క భారతీయుని కల నెరవేరిన రోజు జనవరి 22 2024. 500 ఏళ్ల కల సాకారమైన తరుణం. ప్రతి భారతీయుడు ఎన్నో దశాబ్దాలుగా వేచి చూసిన క్షణమిది. అయోధ్యలో శ్రీరామమందర నిర్మాణం 500 ఏళ్లనాటి కల నెరవేరింది. ఇంతటి అద్భుతమైన ఈ మహాఘట్టాన్ని వీక్షించేందుకు ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు.. చివరికి ఆ మహా ఘట్టాన్ని వీక్షించి తరించారు.
సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరి కళ్లు అయోధ్య వైపే. ఆ క్షణాలను భక్తితో ఆస్తాదించేందుకు అయోధ్యాపురికి చేరుకున్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రముఖ అగ్ర సినీ తారలంతా శ్రీరామనామం జపిస్తూ అయోధ్యలో అడుగుపెట్టారు. ఈ అద్భుతమైన మహాత్తర వేడుకను వీక్షించేందుకు వెళ్లిన సినీతారలపై ఓ లుక్కేద్దాం.
ఆ హనుమంతుడే వచ్చి నాకు ఆహ్వానం ఇచ్చాడు.....
అయోధ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి హాజరు కావాలంటూ అగ్ర కథానాయకుడు చిరంజీవి ఆహ్వానం అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్లో ఆనందం వ్యక్తం చేశారు. తన కోసం ఆంజనేయస్వామి పంపిన ఆహ్వానంగా భావిస్తున్నట్లు చెప్పారు.
చరిత్రలో నిలిచిపోయేలా ప్రాణ ప్రతిష్ట మహోత్సవం...
‘‘చరిత్ర సృష్టించేలా.. చరిత్రను పునరావృతం చేసేలా.. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా అయోధ్యలో జరిగే రామలల్లా ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి అందిన ఆహ్వానం దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశంగా భావిస్తున్నా. ఇది నాకు మాటల్లో చెప్పలేని గొప్ప అనుభూతి. 500 సంవత్సరాలుగా తరతరాలు వేచి చూసిన అద్భుతమైన అధ్యాయం ఆవిష్కృతమవుతోంది. అంజనాదేవి కుమారుడు, ‘చిరంజీవి’ అయిన ఆ హనుమాన్.. భువిపై ఉన్న ఈ అంజనాదేవి కుమారుడనైన నాకు వెలకట్టలేని గొప్ప క్షణాలను బహుమతిగా ఇచ్చినట్లు అనిపిస్తోంది. దీనిని మీతో పంచుకోవడానికి నాకు మాటలు సరిపోవడం లేదు. ఎన్నో జన్మల పుణ్యఫలం. ఇంత మహోన్నత కార్యక్రమం చేస్తున్న ప్రధాని నరేంద్రమోదీకి నా హృదయపూర్వక అభినందనలు. అలాగే ఉత్తర్ ప్రదేశ్ముఖ్యమంత్రి యోగిజీకి కూడా శుభాకాంక్షలు. ఈ బృహత్ కార్యక్రమంలో భాగస్వాములవుతున్న ప్రతి ఒక్కరికీ శుభాభినందనలు. రేపటి ఆ బంగారు క్షణాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా.. జై శ్రీరామ్’’ అని ట్వీట్ చేశారు.
ప్రాణ ప్రతిష్ట రోజు మెగాస్టార్ చిరంజీవి దంపతులు, ఆయన కుమారుడు రామ్ చరణ్ అయోధ్యకు ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. వీరితో పాటు పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు అయోధ్యకు బయలుదేరి వెళ్లారు.
తరలి వచ్చిన భారతీయ సినీ తారాగణం..
శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ వీక్షించేందుకు బాలీవుడ్ అగ్రతారలంతా హాజరయ్యారు. బిగ్బీ అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, మాధురీ దీక్షిత్ నానే, జాకీ ష్రాఫ్, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్, ఆయుష్మాన్ ఖురానా, రణబీర్ కపూర్, అలియా భట్, నిర్మాతలు రాజ్కుమార్ హిరానీ, మహావీర్ జైన్, రోహిత్ శెట్టి రామ మందిరంలో జరిగే ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమానికి వెళ్లారు. వీరితో పాటు అనుపమ్ ఖేర్, కంగనా రనౌత్, సినీ నిర్మాత మధుర్ భండార్కర్, వివేక్ ఒబెరాయ్, సింగర్ సోనూ నిగమ్, మనోజ్ జోషి అయోధ్యలో అడుగుపెట్టారు. సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్ సైతం అయోధ్య చేరుకున్నారు. అలనాటి టాప్ హీరో అయిన సుమన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
What's Your Reaction?