కౌరవుల పుట్టుక రహస్యం? వంద మంది పేర్లు ఏమిటి? కౌరవుల పేర్లు ఎందుకు పెట్టుకోరు!

పాండవులు ఏలా పుట్టారు అనేది చాల మందికి తెలుసు అయితే... కౌరవులు ఏలా పుట్టారు. గాంధారికి వంద మంది పిల్లలు పుడతారు అని వరం ఎవరు ఇచ్చారు. కౌరవుల పుట్టుక వెనుక ఉన్న రహస్యం ఏమిటి? కౌరవుల వంద మంది పేర్లు ఏమిటి? కౌరవుల చెల్లి ఎవరు? అనేది చాల మందికి తెలియాదు. Sri Media News

Jul 18, 2024 - 18:13
 0  113
కౌరవుల పుట్టుక రహస్యం? వంద మంది పేర్లు ఏమిటి? కౌరవుల పేర్లు ఎందుకు పెట్టుకోరు!
The Birth Secret of Kauravas

పాండవుల తల్లి అయిన కుంతి దేవి కంటే ముందే గాంధారి దేవి గర్భం ధరిస్తుంది. కానీ కుంతి దేవికి ఉన్న వరం కారణంగా పాండవులకు గాంధారి కంటే ముందే జన్మనిస్తుంది కుంతి దేవి... దీంతో గాంధారి అసూయతో రగిలిపోతుంది. కుంతి కంటే ముందు గర్భం దాల్చినా... బిడ్డను ప్రసవించలేకపోయానని ఆవేదనతో తన గర్భాన్ని కొట్టుకుంది. దీంతో గాంధారి దేవికి గర్భస్రావం జరిగి.. కడుపు నుంచి మాంసపు ముద్ద బయటపడుతుంది. అది చూసి భయపడిన గాంధారి వేద వ్యాసుడి వద్దకు వెళ్లి విషయం గురించి చెప్తుంది.  విషయం తెలుసుకున్న  వేద వ్యాసుడు అక్కడకు వచ్చి ఆ మాంసం ముద్దలను నూట ఒక్క నేతి కుండలలో భద్రపరిచి వాటి నుంచి వందమంది కుమారులు ఒక కుమార్తె జన్మిస్తారని చెప్తాడు.

కొన్ని రోజులకు ఓ నేతి కుడంను చీల్చుకొని కౌరవుల్లో పెద్ద వాడు మొదటివాడు దుర్యోధనుడు అందరి కంటే ముందుగా బయటకు వస్తాడు. ఆ తర్వాత రోజు రెండవవాడు దుశ్సాసనుడు.. ఇలా రోజుకు ఒకరి చోప్పున నూటోక్క మంది ఒకరి తర్వాత మరొకరు బయటకు వస్తారు. అయితే ఈ కౌరవుల పేర్లు పెట్టుకునేందుకు ఎవరు ఇష్టపడరు.. మ‌న దేశంలో చాల మంది తల్లిదండ్రులు తమకు ఇష్టమైన దేవుడి పేర్లు, వ్యక్తుల పేర్లు పెడుతుంటారు.
మహా భారతం విషయానికి వస్తే... కృష్ణ, ధర్మరాజు, భీమా, అర్జున్‌ ఇలా పాండవుల పేర్లు పెట్టడం మనం చూసే ఉంటాం. కానీ కౌరవుల పేర్లు తమ పిల్లలకు పెట్టుకునేందుకు ఎవరు ఇష్టపడరు.. అలా ఇష్టపడి కౌరవుల పేర్లు పెట్టిన వారు ఎవరైనా ఉన్నారా?. లేదా ఈ వీడియో చూస్తున్న వారిలో ఎవరి పేరైనా.. కౌరవుల పేరా?.. లేదా మీ స్నేహితుల్లో ఎవరైన కౌరవుల పేర్లు ఉన్న వారు ఉన్నారా? ఓ సారి చెక్ చేయండి.

1. దుర్యోధనుడు. 2. దుశ్సాసనుడు. 3. దుస్సహుడు. 4. దుశ్శలుడు.
 5. జలసంధుడు.  6. సముడు.  7. సహుడు.  8. విందుడు. 9. అనువిందుడు. 10. దుర్దర్షుడు. 11. సుబాహుడు.
12. దుష్పప్రదర్శనుడు. 12. దుర్మర్షణుడు. 13. దుర్మఖుడు. 15. దుష్కర్ణుడు. 16. కర్ణ. 17. వివింశతుడు. 18. వికర్ణుడు. 19.శలుడు. 20. సత్వుడు. 21. సులోచనుడు. 22. చిత్రుడు. 23. ఉపచిత్రుడు. 24. చిత్రాక్షుడు. 25. చారుచిత్రుడు.26. శరాసనుడు. 27. ధర్మధుడు. 28. దుర్విగాహుడు. 29. వివిత్సుడు. 30. వికటాననుడు.

31. నోర్ణనాభుడు. 32. నునాభుడు. 33. నందుడు. 34. ఉపనందుడు. 35. చిత్రాణుడు. 36. చిత్రవర్మ. 37. సువర్మ. 38. దుర్విమోచనుడు. 39. అయోబావుడు. 40. మహాబావుడు. 41. చిత్రాంగుడు. 42. చిత్రకుండలుడు. 43. భీమవేగుడు. 44. భీమలుడు. 45. బలాకుడు. 46. బలవర్థనుడు. 47. నోగ్రాయుధుడు. 48. సుషేణుడు. 49. కుండధారుడు. 50. మహోదరుడు.
 
51. చిత్రాయుధుడు. 52. నిషింగుడు. 53. పాశుడు. 54.బృఎందారకుడు. 55. దృఢవర్మ. 56. దృఢక్షత్రుడు. 57. సోమకీర్తి. 58. అనూదరుడు. 59. దఢసంధుడు. 60. జరాసంధుడు. 61. సదుడు. 62. సువాగుడు. 63. ఉగ్రశ్రవుడు. 64. ఉగ్రసేనుడు. 65. సేనాని. 66. దుష్పరాజుడు. 67. అపరాజితుడు. 68. కుండశాయి. 69. విశాలాక్షుడు. 70. దురాధరుడు. 71. దుర్జయుడు. 72. దృఢహస్థుడు. 73. సుహస్తుడు. 74. వాయువేగుడు. 75. సువర్చుడు.
 
76. ఆదిత్యకేతుడు. 77. బహ్వాశి. 78. నాగదత్తుడు. 79. అగ్రయాయుడు 80. కవచుడు. 81. క్రధనుడు. 82. కుండినుడు. 83. ధనుర్ధరోగుడు. 84. భీమరధుడు. 85. వీరబాహుడు. 86. వలోలుడు. 87. రుద్రకర్ముడు. 88. దృణరదాశ్రుడు. 89.అదృష్యుడు. 90. కుండభేది. 91. విరావి. 92. ప్రమధుడు. 93. ప్రమాధి. 94. దీర్గరోముడు. 95. దీర్గబాహువు. 96.ఉడోరుడు. 97. కనకద్వజుడు. 98. ఉపాభయుడు. 99. కుండాశి. 100. విరజనుడు.
101వ బిడ్డగా దుశ్శల అనే ఆడపిల్ల జన్మిస్తుంది

ఈ 101 పేర్లలో ఏ పేరైన మీరు విన్నారా ? 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow