తప్పు చేసినట్టు తెలిసిన శిక్ష విధించలేని కోర్టు.!

రెడ్‌వుడ్ సిటీ జైలులో ఉన్న ఓ ఇండో అమెరికన్ రేడియాలజిస్ట్ చేసిన పనికి ప్రపంచం ఉలిక్కి పడింది. తన భార్య బిడ్డలను కాపాడు కోవడం కోసం కాలిఫోర్నియాలోని 250 అడుగుల డెవిల్ స్లైడ్ కొండపైకి కారును తీసుకువెళ్లి అక్కడి నుంచి కారుతో సహా దూకేశాడు. Sri Media News

Jun 28, 2024 - 14:14
 0  3
తప్పు చేసినట్టు తెలిసిన శిక్ష విధించలేని కోర్టు.!

రెడ్‌వుడ్ సిటీ జైలులో ఉన్న ఓ ఇండో అమెరికన్ రేడియాలజిస్ట్ చేసిన పనికి ప్రపంచం ఉలిక్కి పడింది. తన భార్య బిడ్డలను కాపాడు కోవడం కోసం కాలిఫోర్నియాలోని 250 అడుగుల డెవిల్ స్లైడ్ కొండపైకి కారును తీసుకువెళ్లి అక్కడి నుంచి కారుతో సహా దూకేశాడు. దీంతో జనవరి 2023లో పోలీసులు ఆ రేడియాలజిస్ట్‌ కేసును నామోదు చేశారు.. తాజాగా ఈ కేసులో రెడియాలజిస్ట్ చేసిన తప్పు లేదని కాలిఫోర్నియా కోర్టు తీర్పు ఇచ్చింది దీంతో ఈ కేసు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాఫిక్‌‌గా మారింది... ఈ ఘటన పై భార్య స్పందన ఏంటీ?. అసలు ఆ వ్యక్తి ఎందుకు అలా చేశాడు?. ఆ రోజు ఏం జరిగింది..? కోర్టు తెలుసుకున్న షాకింగ్ విషయాలు ఏంటో తెలుసుకుందాం.

2023 జనవరిలో కాల్నిఫోర్నియాలో జీవిస్తున్న ధర్మేష్.. భార్య నేహాతో పాటు ఏడు, నాలుగేళ్ల చిన్నారులతో కలిసి బయటకు వెళ్లాడు. కారును ఓ కొండపై నుండి 250 అడుగుల లోతులోకి పోనిచ్చాడు. దీంతో కారు తీవ్రంగా ధ్వంసమైనప్పటికీ.. కుటుంబ సభ్యులంతా సురక్షితంగా బయటపడ్డారు. అయితే అతడు ఉద్దేశపూర్వకంగానే చంపేందుకు ప్రయత్నించాడని భార్యకు తెలుసు కానీ బయటకు చెప్పలేదు.. తాజాగా ఉద్దేశపూర్వకంగానే కుటుంబన్ని చంపేందుకు ప్రయత్నించాడని కోర్టు గుర్తించినప్పటికి అతడికి శిక్ష వెయ్యలేదు.. దీనికి కారణం... కేసు విచారణలో విస్తుపోయే విషయాలు కోర్టు తెలుసుకోవడమే..

ధర్మేష్‌‌కు స్కిజోఆఫెక్టివ్ డిజార్డర్‌ ఉంది. ఈ డిజార్డర్ ఉన్న వ్యక్తి అతిగా ఆలోచిస్తాడు. ఇలా ఆలోచించే  ధర్మేష్.. భార్య నేహాతో పాటు ఏడు, నాలుగేళ్ల తన పిల్లల్ని చంపేందుకు యత్నించినట్లు తెలిసింది. అయితే  ఈ ఘటన జరగడానికి వారం ముందు నుండి తనను ఎవరో ఫాలో అవుతున్నారని భయపడుతూ ధర్మేష్ ఉండేవాడని తెలిసింది. ఈ స్కిజోఆఫెక్టివ్ డిజార్డర్‌ వల్ల తన పిల్లలను కిడ్నాప్ చేస్తారని, లైంగిక వేధింపులు జరుగుతాయని, అక్రమ రవాణా జరిగే అవకాశాలున్నాయని తనలో తను బాధపడాడు... అంతేకాదు బలంగా నమ్మాడు. తన కుటుంబాన్ని అలాంటి పరిస్థితుల్లో చూడలేక.. చంపేయాలని నిర్ణయించుకుని ఈ దారుణానికి ఒడిగట్టినట్టు విచారణలో తెలిసింది. ఇదే విషయాన్ని ఆయన తరుఫున లాయర్స్ కోర్టుకు వాదనలు వినిపించాడు. అతడు స్కిజో ఆఫెక్టివ్ డిజార్డర్, మేజర్ డిప్రెసివ్ డిజార్డర్‌తో బాధపడుతున్నాడని, మతి స్థిమితం, భ్రమ కలిగించే ఆలోచనతో బాధపడుతున్నాడని చెప్పడంతో ఆయన శిక్షకు బదులు.. మానసిక చికిత్స అందించాలని న్యాయ స్థానం. తీర్పు ఇచ్చింది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow