చెల్లితో భర్త జంప్.. భర్త తండ్రితో తల్లి జంప్..ఈమె కష్టం పగవాడికి కూడా రాకూడదు
కట్టుకున్న భర్త సొంత చెల్లితో పరారయ్యాడు... పుట్టింటికి వచ్చి తల్లికి తన కష్టం చెప్పుకుని కన్నీరు పెట్టుకుంటే.. అత్తింటి వారి నిర్వాకాన్ని కడిగిపారేస్తానంటూ విసురుగా వెళ్లిన ఆమె తల్లి ఎన్నాళ్లైనా తిరిగి రాలేదు.Sri Media News
కట్టుకున్న భర్త సొంత చెల్లితో పరారయ్యాడు... పుట్టింటికి వచ్చి తల్లికి తన కష్టం చెప్పుకుని కన్నీరు పెట్టుకుంటే.. అత్తింటి వారి నిర్వాకాన్ని కడిగిపారేస్తానంటూ విసురుగా వెళ్లిన ఆమె తల్లి ఎన్నాళ్లైనా తిరిగి రాలేదు.... తల్లి, చెల్లి, భర్త.. ఈ ముగ్గురూ ఏమైపోయారో తెలియక కంగారు పడుతున్న ఆ ఇల్లాలికి ఊహించని ట్విస్టులు ఒకటి తర్వాత ఒకటిగా తెలిసాయి.
దీంతో ఏడాది వయసున్న చిన్నారితో కలిసి న్యాయ పోరాటం చేస్తుంది. బీహార్‌లోని ముజఫర్‌పూర్ ఫరీద్‌పూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఏం చేయాలో తెలియక చివరకు పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది.... బీహార్ లోని ముజఫర్‌పూర్ ఫరీద్‌పూర్ గ్రామానికి చెందిన సుధా కుమారి అనే మహిళకు బోచాహన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిరాజీ భగత్ కుమారుడు ఛోటూ అనే యువకుడితో 2021లో వివాహం జరిగింది. ఇక ఈ దంపతులకు ఓ కూతురు ఉంది. అయితే కొంతకాలం వీరి కాపురం సజావుగానే సాగింది. కానీ, గత కొన్ని నెలలుగా హఠాత్తుగా భర్త ఛోటూ ప్రవర్తనలో మార్పు వచ్చింది. భర్త ఛోటూ ఓ యువతితో ఫోన్ లో మాట్లాడటం గమనించింది... ఇలా జరుగుతుండగా... భర్త మాట్లాడుతుంది... వేరెవరితోనో కాదు.. తన సోంత చెళ్లితో అని తెలుసుకుంది.. ఇది గమనించిన సుధ క్యాజువల్‌గా తీసుకుంది. ఇదే సుధ చేసిన పెద్ద తప్పు... తను చేసే ఆ తప్పు వల్ల తన సంసారం చెదిరిపోతుందని ఆ రోజు ఆమే అనుకోలేదు.... తన చెళ్లి తన భర్త రోజు ఫోన్‌లో మాట్లాడుకుంటు ప్రేమలో పడ్డారు. ఓ రోజూ భర్త ఛోటు, సుధా సోదరిని లేపుకు పోయాడు.
అయితే ఆ విషయాలు ఏమీ తెలియాని సుధా ఆరా తీయగా భర్త ఛోటూ జూన్ 2వ తేదీన తన సోదరిని వివాహం చేసుకుని, ఇద్దరూ కలిసి పారిపోయాడని తెలిసి తెలుసుకుంది. దీంతో పుట్టింటికి వెళ్లి తల్లి తల్లి ఫూల్ కుమారికి విషయం చెప్పింది. దీంతో సుధ తల్లి ఫూల్ కుమారి.. వారి సంగతి తేలుస్తానంటూ అత్తవారింటికి వెళ్లింది. ఇలా వెల్లిన తల్లి తిరిగి రాలేదు. దీంతో తల్లి కోసం వెదుక్కుంటూ మెట్టింటికి వెళ్లగా అక్కడ స్థానికులు చెప్పింది విని ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఎందుకంటే.. సుధ తల్లి తన మామ బిరజి భగత్‌తో కలిసి గ్రామం విడిచి పారిపోయిందని తెలిసింది. వీరిద్దరు కూడా ఢిల్లీలో నివసిస్తున్నట్లు ఎలాగో తెలుసుకుంది. దీంతో ఏం చేయాలో పాలుపోక పోలీసులను ఆశ్రయించింది.
తన తల్లి, కట్టుకున్న భర్త ఇద్దరికీ ఫోన్లు చేస్తుంటే ఎవరూ స్పందించడం లేదని.. తన పరిస్థితి ఏమిట్ అర్ధం కావడంలేని తన ఏడాదిన్నర కూతురుతో పోలీసుల వద్ద వాపోయింది. ఇక పోలీసులు కూడా సుధ చెప్పిన విషయం విని షాక్ అయ్యారు. ఇక ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే దర్యాప్తులో వారికి మరో షాకింగ్ విషయం తెలిసింది.అల్లుడు చోటుతో తన భార్య సుధ సోదరిని పెళ్లి చేసుకోమని.. తన అత్తగారే పదేపదే బలవంతం చేసిందని, అందుకే ఆమెను పెళ్లి చేసుకున్నానని, బదులుగా కారును కూడా బహుమతిగా ఇస్తానని చెప్పిందని తెలిసి పోలీసులు షాక్ తిన్నారు. అయితే ఈ కేసులో అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేసిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
What's Your Reaction?