బెట్టింగ్ యాప్స్ వార్..... స్పందించిన హర్ష సాయి!
బెట్టింగ్ యాప్స్ వార్ రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. యూట్యూబర్ హర్ష సాయి ఈ దాందాకు తల్లివేరు అని... హర్షసాయిని కట్టడి చేస్తే.. మిగిలిన యూట్యూబర్స్ భయంతో తప్పుకుంటారని సోషల్ మీడియాలోయువ సామ్రాట్ రవి అనే వ్యక్తి ఆరోపణలు చేస్తున్నాడు.Sri Media News
బెట్టింగ్ యాప్స్ వార్ రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. యూట్యూబర్ హర్ష సాయి ఈ దాందాకు తల్లివేరు అని... హర్షసాయిని కట్టడి చేస్తే.. మిగిలిన యూట్యూబర్స్ భయంతో తప్పుకుంటారని సోషల్ మీడియాలోయువ సామ్రాట్ రవి అనే వ్యక్తి ఆరోపణలు చేస్తున్నాడు. అంతేకాదు... తన దగ్గర హర్షసాయి చేస్తున్న బెట్టింగ్ దాందా గురించి పూర్తి ఆధారాలు ఉన్నాయని చెపుతువచ్చాడు... అంతే కాదు.. మీడియాకు ఇంటర్వులు ఇస్తూ... హర్ష సాయి జనం అనుకునేంత మంచోడు కాదని... హర్ష సాయి ఫ్రాడ్ , మోసగాడని... హర్ష సాయి పెద్ద మాఫియా నడుపుతున్నాడని.. ఇతని వెనుక నోయిడాకి చెందిన పెద్ద ముఠా ఉందని... పైకి సాఫ్ట్ వేర్ కంపెనీగా ఉంటూ ఇల్లీగల్ బెట్టింగ్స్ ని ప్రమోట్ చేస్తున్నారని.. ఇన్ఫ్లుయెన్సర్స్ కి పది వేలు, 20 వేలు ఫాలోవర్స్ ఉంటే సదరు కంపెనీ వారిని కాంటాక్ట్ అయ్యి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేపిస్తుందని.. అలా చేయించినందుకు లక్షల రూపాయలు కుమ్మరిస్తుందని... ఇక హర్ష సాయి ఒక బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కి కనీసం 90 లక్షలు తీసుకుంటాడని.. అందులో 60 లక్షలు జీఎస్టీ కడతాడని.. మిగతా 40 లక్షలు అతని ఖాతాలో పడతాయని యువ సామ్రాట్ రవి ఆరోపించారు.
ఈ విషయం బాగా వైరల్ కావడంతో యువ సామ్రాట్ రావి చేసిన ఆరోపణలకు ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో హర్ష సాయి స్పందించారు... బెట్టింగ్ యాప్స్‌ని మేము ప్రమోట్ చేయకపోతేనే పెద్ద తప్పు అని కొన్ని కంట్రవర్సియల్ కామెంట్స్ కూడా చేశారు. దీంతో హర్షసాయి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారయి. అసలు హర్షసాయి ఏం మాట్లాడారో మనం ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.
మేము ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం లేదు. నాన్ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ నే ప్రమోట్ చేస్తున్నాం. ఒకవేళ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం తప్పైతే.. ఎందుకు బ్యాన్ చేయడం లేదు. టిక్ టాక్ యాప్ ని బ్యాన్ చేశారు కదా. ఎవరైనా వాడగలుగుతున్నారా? అలానే బెట్టింగ్ యాప్స్ ని కూడా బ్యాన్ చేస్తే సమస్య ఉండదు కదా. అయినా పెద్ద పెద్ద సెలబ్రిటీలు చేసే దానితో పోలిస్తే మేము చేసేది చాలా చిన్నది. ఒకవేళ మేము బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయకపోతే మాకు వచ్చే డబ్బులు చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఇచ్చి చెయ్యిస్తారు... ఇదే అతి పెద్ద నష్టం చేస్తుంది... ఎందుకంటే.. వాళ్ళు నాలెడ్జ్ లేకుండా, డిస్క్లైమర్ కూడా వేయకుండా ప్రమోట్ చేస్తారు. బాధ్యత లేకుండా ఉంటారు. నేను అయితే జాగ్రత్తలు చెప్తాను ఇది రిష్క్ అని హెచ్చరిస్తాను. నేను ప్రజలకు బెట్టింగ్ యాప్స్ నుంచి దూరంగా ఉండెందుకు సహయ చేస్తున్న... వాటితో వచ్చే డబ్బుతో ఇంకో ఇద్దరికి సహయం చేస్తున్న అని చెప్పుకోచ్చారు.
కొంతమంది యూట్యూబర్స్ టెలిగ్రామ్ గ్రూప్స్ లో ఇన్వైట్ చేసి బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పెట్టించి నష్టపోయేలా చేస్తున్నారని.. తాము మాత్రం అలా చేయడం లేదని అన్నారు. కాబట్టి బెట్టింగ్ యాప్స్ ని మేము ప్రమోట్ చేయకపోతేనే నష్టమని.. మేము చేయకపోతే చిన్న చిన్న వాళ్ళు ప్రమోట్ చేసి ఎక్కువ నష్టం చేకూరుస్తారని అన్నారు. అందుకే బాధ్యతగా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నామని హర్ష సాయి కామెంట్స్ చేశారు.
ఇది ఇలా ఉంటే... హర్ష సాయి జనం అనుకునేంత మంచోడు కాదని యువసామ్రాట్ రవి అంటున్నారు. ఈ బెట్టింగ్ యాప్ వారు... ఇన్ఫ్లుయెన్సర్స్ కి బ్యాంకు ద్వారానే కాకుండా.. ఫిజికల్ గా కూడా డబ్బు ఇస్తారని.. ఆ మధ్య నోవాటెల్ హోటల్ లో హర్ష సాయి డబ్బు తీసుకున్నాడని తన దగ్గర అదారలు ఉన్నట్టు చెప్పుకొచ్చాడు.. అంతేకాదు.. డేట్, టైం చెప్తా కావాలంటే సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసుకోవచ్చునని.. అప్పుడు హర్ష సాయి అసలు రంగు బయటపడుతుందని చాలెంజ్ చేశాడు. దీనికి కూడా హర్ష సాయి కౌంటర్ ఇచ్చాడు.. యువసామ్రాట్ రవి చూపిస్తున్న ఆధారాలు ఇన్వాయిస్లని.. వాటిని ఎవరికి.. ఎవరైన ఇవ్వచ్చాని... ఇంటర్యూ చెస్తున్న యాంకర్ పేరు మీద కోటి రూపాయలు తీసుకున్నట్టు... ఓ ఇన్వాయిస్ చేసి చూపించాడు.. అంతేకాదు... నోవాటెల్ హోటల్ లో డబ్బులు తీసుకున్న అనే ఆరోపణలు కొట్టి పడేశాడు. ఏ హోటల్‌కి వెళ్లాలి అన్న చెక్కింగ్ ఉంటుందని... మనతో తెచ్చిన లగేజి చెక్ చేస్తారని... అందులో యువసామ్రాట్ చెప్పినట్టు డబ్బు ఉంటే వాళ్లు హోటల్‌లో ఉండటానికి ఒప్పుకోరని.. క్లారిటి ఇచ్చాడు.
అయితే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేవారిలో హర్ష సాయి ఒక్కడేలేడు.. మోటో ట్రావెలర్ యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ కూడా ఈ కోవకే వస్తాడు. ఇతని పై కూడా గతంలో నా అన్వేషణ అన్వేష్.. సోషల్ మీడియాలో యుద్ధమే చేశాడు. భయ్యా సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తూ ఎంతోమంది అమాయకుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని సంచలన ఆరోపణలు చేశాడు. బెట్టింగ్ యాప్ ల ద్వారా డబ్బు సంపాదించడానికే పేదలకు సాయం చేస్తున్నట్టు నటిస్తున్నాడని కామెంట్స్ చేశాడు కూడా. ఈ బెట్టింగ్ యాప్స్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
What's Your Reaction?