వాయిస్‌ బాగోలేదని డబ్బింగ్‌ చెప్పనివ్వలేదు! ట్రెండ్‌ సెట్‌ చేసిన విలన్‌!!

సెగట్రీ! సూరీడు నెత్తుటి గడ్డలా లేడూ! ఆకాసంలో ఎదో మర్డరు జరిగినట్టు లేదూ…. ఎప్పుడూ యదవ బిగినెస్సేనా. మడిసన్నాక కుసంత కలాపోసనుండాల. తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకూ తేడా ఏముంటది? అని సింపుల్‌గా డైలాగ్స్‌ చెప్పిన విలన్‌ ఆయన.Sri Media News

Jul 23, 2024 - 13:08
 0  24
వాయిస్‌ బాగోలేదని డబ్బింగ్‌ చెప్పనివ్వలేదు! ట్రెండ్‌ సెట్‌ చేసిన విలన్‌!!

హీరోలకు విలన్‌ వణకటం కాదు.. విలన్‌కు హీరో వణకాలి అంటూ ట్రెండ్‌ సెట్‌ చేసిన విలక్షణమైన విలన్‌ ఆయన.. ఈపాటికే అర్థం అయ్యి ఉంటుంది.. మనం ఎవరి గురించి చెప్పుకోబుతున్నామో.. రావు గోపాలరావు గురించే. అసలు ఆయన సినిమాల్లోకి ఎలా వచ్చారు? ఆయనతో డబ్బింగ్‌ చెప్పించటానికి ఎందుకు భయపడేవారు.. ఆయన చనిపోయాక సినీ పెద్దలు ఎందుకు వెళ్లలేదు? వంటి ఫ్యాక్ట్స్‌ని ఈ వీడియోలో తెలుసుకుందాం రండి.

రావు గోపాలరావు వీలైనంతవరకూ విలనిజాన్ని మార్చేశారు. నాగభూషణంలా కామెడీ విలనిజం చేయకుండా, కామెడీ  కోసం తన పక్కన అల్లు రామలింగయ్యను పెట్టేసుకుని, తను మాత్రం సీరియస్ విలనిజాన్నే కదను తొక్కించారు. హీరోను కంగారు పెట్టాలేగానీ .. విలన్ టెన్షన్ పడకూడదు  అన్నట్టుగా నిదానంగా .. నిబ్బరంగా .. తాపీగా తన విలనిజాన్ని చూపించేవారు. హీరో ఎదురుగా వచ్చి ఆవేశంతో  భారీ  డైలాగు చెప్పినా, ఒక సామెతనో .. నానుడినో చెప్పి చాలా సింపుల్ గా పాలపై మీగడను తీసేసినంత తేలికగా తేల్చిపారేసేవారు.
రావు గోపాల్‌ రావు 1937 జనవరి 14న కాకినాడ దగ్గరలో ఉన్న గంగనపల్లిలో పుట్టారు. మధ్యతరగతి కుటుంబమే కావటంతో.. మిడిల్‌ క్లాస్‌ కష్టాలను అనుభవించారు.


ఏ పాత్రను ఇచ్చినా ఆయన అద్భుతంగా నటించటానికి కారణం ఆయన నాటక రంగం నుంచి రావడమే. కాకినాడ సమీపంలోని ‘గంగనపల్లి’లో జన్మించిన రావు గోపాలరావుకి, నాటకాలపై ఆసక్తి పెరుగుతూ వెళ్లింది. తనే ఒక నాటక సంస్థను ఏర్పాటు చేసుకుని, అనేక నాటక ప్రదర్శనలిస్తూ వెళ్లారు. అలా ఒకసారి ఒక నాటక ప్రదర్శన ఇస్తూ ఉన్నప్పుడు ఆయన ఎస్వీ రంగారావు కంటపడ్డారు.
రావు గోపాలరావు నటనను చూసిన ఎస్వీ రంగారావు అభినందించారు. అంతేగాకుండా మద్రాసు వచ్చి తనని కలవమని చెప్పి వెళ్లారట. ఆ తరువాత ఆయన మద్రాసు వెళ్లి ఎస్వీఆర్ ను కలవడం .. ఆయన రావు గోపాలరావును దర్శకుడు గుత్తా రామినీడుకి పరిచయం చేయడం జరిగిపోయింది. గుత్తా రామినీడు దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేస్తూ .. చిన్నచిన్న పాత్రలను చేస్తూ రావు గోపాలరావు ముందుకు వెళ్లడం మొదలుపెట్టారు. అలా ఆయన ఒక నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడానికి కొంత సమయం పట్టింది. అయితే రావు గోపాలరావుకి ఒక చిత్రమైన పరిస్థితి ఎదురైంది.


ఏ వాయిస్ కారణంగా తాను నాటకాల్లో ఫేమస్ అయ్యాడో .. సినిమాల్లోకి వచ్చాక  ఆ వాయిస్ పనికి రాదని అంటూ ఉంటే ఆయన చాలా బాధపడ్డాడు.. తాను చేసిన కొన్ని పాత్రలకి వేరేవారితో డబ్బింగ్ చెప్పించడంతో రావు గోపాల్‌ రావుని పూర్తిగా నిరాశ పరిచింది. అలాంటి పరిస్థితుల్లోనే ఆయన వాయిస్ లోను … డైలాగ్ డెలివరీలోను ఉన్న ప్రత్యేకతను బాపు – రమణ గుర్తించారు.


ఆయన బాడీ లాంగ్వేజ్ కి తగిన డైలాగ్స్ రాసి, ‘ముత్యాల ముగ్గు‘ సినిమాతో ప్రోత్సహించారు. ఈ సినిమాలో ‘కైలాసనాథ శాస్త్రి’ పాత్రలో ఆయన చేసిన విశ్వరూప విన్యాసం అందరికీ తెలిసిందే. ముత్యాల ముగ్గు సినిమాతో రావు గోపాల్‌ రావు వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. ఆరోజుల్లో ఈ సినిమాలో ఆయన చెప్పిన డైలాగులు మారుమోగిపోయాయి. ఆయన డైలాగుల్నీ ఆడియో క్యాసెట్స్ రూపంలో అమ్మారు. అంతలా ఆకట్టుకున్నాయి ఆయన డైలాగ్స్. ఇక ఆ సినిమా తరువాత నుంచి తెలుగు సినిమాలో విలనీజం కొత్త ట్రెండ్ సృష్టించింది. కొత్త విలనీజానికి రావుగోపాలరావు కొత్త రూపునిచ్చారు. ఇక ఆ సినిమా తర్వాత ఆయన నటించిన వేటగాడు సినిమాలో కూడా రావుగోపాలరావు తన డైలాగ్ మాడ్యూలేషన్‌తో తెలుగు వారి హృదయాల్ని మరోసారి దోచుకున్నాడు. ఇక మావూళ్ళో మహాశివుడు, స్టేషన్ మాస్టర్, వింత దొంగలు, మనవూరి పాండవులు, ఈనాడు వంటి చిత్రాలలో నటించి ఆయన తన నట విశ్వరూపాన్ని చూపించాడు.


‘ముత్యాల ముగ్గు’లో కాంట్రాక్టరు పాత్రలో “ఆకాశంలో ఏదో మర్డర్ జరిగినట్టుగా లేదూ ..” అంటూ ఆయన చెప్పిన డైలాగులు .. ” నిన్న రాత్రి యథా ప్రకారం కైలాసం వెళ్లి వచ్చాను .. “ అంటూ ‘భక్త కన్నప్ప’లో చెప్పిన డైలాగులు .. ‘వేటగాడు’లో ప్రాస వచ్చేలా గుక్కతిప్పుకోకుండా ఆయన పేల్చినా మాటల తూటాలను ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేదు. ‘ఫర్ సపోజు’ అనే ఊతపదం వాడుతూ ‘ఆ ఒక్కటీ అడక్కు’  సినిమాలో ఆయన పోషించిన రొయ్యల నాయుడు పాత్ర, ‘క్రమశిక్షణ తప్పినవారిని దారిలో పెట్టడం నా ధర్మం’ అంటూ అన్న కొడుకును దండించే ‘యముడికి మొగుడు’లోని పాత్ర అంతేలా గుర్తుండిపోతాయి.


విలనిజంలోనే ఆయన వీలైనన్ని పాత్రలను చేశారు. పైకి పెద్ద మనిషిలా కనిపిస్తూ పగ .. పన్నాగాలు .. కుట్రలు .. కుతంత్రాలకు సంబంధించిన హావభావాలను ఆయన అద్భుతంగా పలికించారు. కార్పొరేట్ స్థాయి విలన్ గా .. గ్రామీణ స్థాయి ప్రతినాయకుడిగా ఆయన అద్దినట్టుగా సరిపోయేవారు. ఆయా పాత్రల్లో చెలరేగిపోయేవారు. ఎన్టీఆర్ .. ఎన్నార్ .. కృష్ణ .. శోభన్ బాబు వంటి సీనియర్ స్టార్ హీరోలకు తన విలనిజంతో కుదురు ఉండనీయలేదు. ఆ తరువాత తరం వారైన చిరంజీవి .. బాలకృష్ణ వంటి హీరోలకు సైతం తన విలనిజంతో కునుకుపట్టనీయలేదు.
రావు గోపాలరావు ఓ వైపు నటిస్తూనే పార్లమెంటు సభ్యునిగా ఆరేళ్ళపాటు కొనసాగారు. సినీ ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవలకు 1990 సంవత్సరంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.


నటనలో ఎన్నో గొప్ప గొప్ప అవార్డులు అందుకున్నారు.. రీల్‌ జీవితంలో అందర్నీ మోసం చేసే విలన్‌ పాత్రలో నటించి మార్కులు కొట్టేస్తే.. రియల్‌ జీవితంలో అందర్నీ నమ్మి మోసపోయి చివరకు డబ్బులేని స్థితికి వచ్చేశారు రావు గోపాల్‌ రావు గారు.
హరికథ కళాకారిణి అయిన కమల కుమారిని లవ్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. కాకినాడలో ఆమె హరికథ చెప్తుండగా విన్న రావుగోపాల్‌ గారు.. ముగ్ధులయ్యి.. పెళ్లి ప్రపోజల్‌ పెట్టారు. అలా లవ్‌ మ్యారేజ్‌ చేసుకోగా.. వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా రావు రమేష్‌, మరొక అమ్మాయి పుట్టారు. ఇక అప్పటికే స్టార్‌ యాక్టర్‌ హోదా వచ్చిన రావుగోపాల్‌ రావు గారు రెండు షిఫ్టుల్లో యాక్టింగ్‌ చేయటం, టైమ్‌కి తినకపోవటం, రెస్ట్‌ లేకుండా పని చేయటం వల్ల ఆరోగ్యం బాగా దెబ్బతినటం మెుదలయ్యింది.


స్మోకింగ్‌కు బాగా అలవాటు పడిపోయిన ఆయన.. తీవ్రమైన దగ్గుతో ఇబ్బంది పడుతున్నా.. స్మోకింగ్‌ని మాత్రం ఆపలేకపోయేవారట. సినిమా ఒత్తిడి తగ్గటం కోసం మద్యాన్ని కూడా అలవాటు చేసుకున్నారు. ఆరోగ్యం చెడిపోతున్నా.. అంతగా కేర్‌ చేయలేదు. చివరికి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్న తరువాత ఆసుపత్రికి వెళ్లారు. మధుమేహ వ్యాధి పూర్తిగా ఆరోగ్యాన్ని దెబ్బతీసేసింది. అలా కిడ్నీలు చెడిపోవటం వల్ల 1994, ఆగష్టు 13 న రావు గోపాలరావు చనిపోయారు.


అయితే అందరిని నమ్మి డబ్బులు ఇచ్చి, చివరి రోజుల్లో తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యారు.. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయన ట్రీట్మెంట్ తీసుకోవడానికి కూడా డబ్బులు లేక, ఉన్న కొంత డబ్బును కూడా చికిత్స కోసమే ఖర్చు పెట్టాడు.. పరిస్థితి విషమించి ఆయన చికిత్స పొందుతూ మరణించాడు.. రావు గోపాల్‌ రావు మరణించే సమయానికి చిత్ర పరిశ్రమ ఇంకా చెన్నై నుంచి హైద్రాబాద్‌కి షిఫ్ట్‌ అవుతున్న రోజులు. ఇక ఆయన మరణవార్త తెలిసి సినీ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద నిర్మాతలు, దర్శకులు కూడా ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించడం కోసం ఎవరూ రాలేదు… పి.ఎల్.నారాయణ ,అల్లు రామలింగయ్య, రేలంగి నరసింహారావు, నిర్మాత జయకృష్ణ వంటి కొంత మంది వచ్చారు. హైద్రాబాద్‌ నుంచి ప్రముఖులు ఎవరూ రాలేదు. అయితే ఆయన కొడుకులు అగ్ని కారం చేస్తున్న సమయంలో కొంతమంది తమిళ సోదరులు వచ్చి ఆపండి అంటూ.. భౌతిక కాయానికి నివాళులు అర్పించారు ఇక చుట్టూ చూసి అల్లు రామలింగ ఎవరు రాలేదని చెప్పడంతో తో ఆయనకు దహన సంస్కారాలు చేశారు.


ఇక తల్లి కోరిక మేరకు.. రావు రమేష్‌.. తండ్రి రావు గోపాల్‌రావు వారసత్వాన్ని కంటిన్యూ చేస్తున్నారు. మెుదట చిన్న తెరపై కనిపించి.. ఆ తరువాత.. క్రమంగా తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకుంటున్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow