సింగర్ ప్రాణం తీసిన అభిమాని!! అసలేం జరిగిందంటే..?

బ్రెజిల్ స్థానిక సింగర్ ఐరెస్ ససాకి రాక్ విచిత్రంగా మరణించారు. ఓ లైవ్ ఈవెంట్ లో ప్రదర్శన ఇస్తూ ఉండగా.... ఓ అభిమాని యముడిగా మారి ప్రాణాలు తీశాడు. అభిమాని ఎంతో ప్రేమగా వచ్చి రాక్‌‌ను కౌగిలించుకోవడంతో ఉన్న చోటనే మరణించాడు. Sri Media News

Jul 23, 2024 - 13:02
 0  15
సింగర్ ప్రాణం తీసిన అభిమాని!! అసలేం జరిగిందంటే..?

ఈ ఘటన వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం అని అక్కడ మీడియా చెబుతుంది. అసలు లైవ్ ఈవెంట్‌‌లో ప్రదర్శన ఇస్తూన్న వ్యక్తి ఎలా  ప్రాణాలు కోల్పోయాడు?. అభిమానిని చేసిన తప్పు ఏంటి?. కౌగిలించుకుంటే ప్రాణం పోవడం ఏంటి? తెలుసుకుందాం..

సింగర్ ఐరెస్ ససాకి రాక్‌‌కి స్థానికంగా మంచి పేరు ఉంది. అతడి పాటలకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. కుదిరినప్పుడల్ల ఫ్యాన్స్ కోసం లైవ్ ఈవెంట్స్ చేస్తూ... ప్రదర్శన ఇస్తూ ఉండేవాడు. ఇలా రాక్ చేసే లైవ్ ఈవెంట్స్ రాక్  ప్రాణాలు తీస్తాయని ఊహించి ఉండడు. అందుకే బ్రెజిల్‌లోని సాలినోపోలిస్ సోలార్ హోటల్‌లో జూలై 13 శనివారం ఓ లైవ్ ఈవెంట్‌‌లో ప్రదర్శన ఇచ్చాడు. ఈ ప్రదర్మనే రాక్ చివరి ప్రదర్శన. ఆ రోజు ఓ అభిమాని రాక్ పర్ఫామెన్స్ చూస్తూ అనందంతో వచ్చి కౌగిలించుకున్నాడు. ఆ సమయంలో ఓ కేబుల్ వైర్ టచ్ కావడంతో ఇద్దరికి విద్యుత్ షాక్ కొట్టింది... దీంతో సింగర్ రాక్ 35 ఏళ్లకే.. స్టేజ్ పైనే మరణించాడు.

ఈ విషయాన్ని సోలార్ హోటల్ జూలై 14 ఆదివారం ఒక ప్రకటనతో విడుదల చేసింది, దర్యాప్తుకు తమ పూర్తి సహకారాన్ని అందిస్తామని తెలిపింది. హోటల్ యాజమన్యం ఇన్‌స్టాగ్రామ్‌‌లో ఇలా పోస్ట్ చేసింది.‘‘ రాక్ కుటుంబానికి సపోర్టుగా చర్యలు తీసుకోవడానికి మేము అంకితభావంతో ఉన్నాం. ఈవెంట్‌‌‌కు సంబంధించిన అన్ని విషయాల్లో అధికారులకు పూర్తిగా సహకరిస్తాం. ఐరెస్ కుటుంబానికి, స్నేహితులకు సానుభూతి తెలుపుతున్నాము’’ అని పోస్ట్ చేసింది.

కాగా సింగర్ రాక్ మరణం ఇప్పుడు బ్రెజిల్‌‌లో హాట్ టాపిక్ అయ్యింది. కాగా రాక్‌‌ను కౌగిలించుకోవడం కోసం వచ్చిన అభిమాని ఆ సమయంలో తడిగా ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో కెబుల్ వైర్స్ నుంచి కరెంట్ పాస్ కావడంతో సింగర్ మరణించాడు. రంగంలోకి దిగిన పోలీసులు.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. అసలేం జరిగింది? మృతికి కారణం ఏంటి? అనే వివరాలు సేకరిస్తున్నారు. కేసును అన్ని కోణాల్లో ఎంక్వైరీ చేస్తున్నారు.

ఈ ఘటన పై బ్రెజిల్ డైరెక్టర్ రాఫెల్ మాసిడో రాక్ మరణం పై స్పందించాడు. రాక్ మంచి స్నేహితుడని...  ‘‘ఇప్పటికీ నమ్మలేక పోతున్న.. ఈ వార్తను జీర్ణించుకోవడం కష్టంగా ఉంది’’ అని ఎక్స్‌‌లో పోస్ట్ చేశారు.

కాగా తమ అభిమాన సింగర్ ఇలా ఉన్నట్టుండి మరణించడం తన అభిమానులు తీసుకోలేక పోతున్నారు. రాక్ మరణం తీరని లోటు అని.. అతడికి ఇలా జరిగి ఉండకూడదని.. రాక్ మరణం చాల దారుణం అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా సంతపం తెలుపుతున్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow