కూతురితో కలిసి బావిలో దూకి తల్లి సూసైడ్ ......అసలు ఏం జరిగింది..?
నవమాసాలు నొప్పులు భరిస్తూ బిడ్డలను కంటుంది తల్లి.. అక్కడితోనే అయిపోదు తమ బిడ్డలు తమకాళ్లపై తాము నిలబడే వరకు.. ఎన్నో కష్టనష్టాలు భరిస్తుంది. కడపులో బిడ్డ పడినప్పటి నుంచి బిడ్డ నిలదొక్కుకునే వరకు.. అమ్మ చేసే త్యాగాలు ఎన్నో.Sri Media News
నవమాసాలు నొప్పులు భరిస్తూ బిడ్డలను కంటుంది తల్లి.. అక్కడితోనే అయిపోదు తమ బిడ్డలు తమకాళ్లపై తాము నిలబడే వరకు.. ఎన్నో కష్టనష్టాలు భరిస్తుంది. కడపులో బిడ్డ పడినప్పటి నుంచి బిడ్డ నిలదొక్కుకునే వరకు.. అమ్మ చేసే త్యాగాలు ఎన్నో.. బిడ్డ ఆకలి తీర్చడానికి పస్తులు ఉండేందుకు కూడా సిద్ధపడుతుంది. బిడ్డ వేసే బుడిబుడి అడుగులు చూసి మురిసిపోతుంది. ఇక మాటలు వచ్చాక.. అమ్మా అని పిలుపు విని ఉబ్బితబ్బిబ్బయిపోతుంది. తన అంత అదృష్టవంతురాలు లేదని సంబరపడిపోతుంది. కానీ కాపురంలో కలహాల వచ్చినప్పుడు మనస్థాపంతో తనతో పాటు బిడ్డను కూడా వెంట తీసుకెళ్లిపోతుంది ప్రతి తల్లి. అయితే ఓ తల్లి తన బిడ్డను తనతో పాటు అనంతలోకాలకు తీసుకు పోయింది... తను లేక పోతే బిడ్డ బ్రతకలేదు అనుకుందో ఏమో కానీ... తల్లి క్షణిక ఆవేశం ముక్కు పచ్చలు అరని ఓ బిడ్డ ప్రాణాలు తీసింది.
ఈ విషాదకర సంఘట జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం అర్పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. అర్పల్లి గ్రామానికి చెందిన బొండ్ల మౌనిక, సురేష్ దంపతులు ఉన్నారు. సాహితీ అనే నాలుగేళ్ల కూతురు ఉంది. భర్త అడవికి వెళ్లి వేటాడుతూ ఉండేవాడు. భర్త వేటడటం భార్యకు నచ్చలేదు. ఈ విషయంపై తరచూ గొడవపడుతూ ఉండేది మౌనిక . మూగ జీవాలను వేటాడకుండా ఏదైనా పని చేసుకుని బతుకుదాం అని చెప్పింది. అయిప్పటికీ భర్త వినిపించుకోలేదు.
ప్రతి రోజు ఈ విషయం పై ఇంట్లో భార్యా భర్తల మధ్య గొడవలు జరుగుతు ఉండేవి. జూన్ 26 బుధవారం రాత్రి మరోసారి తగాదా జరగింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన మౌనిక.. కూతురు సాహితీని తీసుకుని సమీపంలో ఉన్న వ్యవసాయ భూమి వద్దకు వెళ్లి అక్కడ ఉన్న బావిలో అందులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఉదయం గ్రామ శివారులోని బావిలో మృతదేహాలు తేలడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వాటిని బయటకు తీశారు. మౌనిక సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాధితురాలి భర్త సురేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే.. కూతురు చావుకు కారణమైన సురేష్ ఇంటిని ధ్వంసం చేసేందుకు మౌనిక బంధువులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తల్లీ బిడ్డల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
What's Your Reaction?