కేసీఆర్ పై పూరి కి కోపం ఎందుకు? గంగతో రాంబాబు ఘటన ఇంకా మరిచిపోలేదా?పవన్ కళ్యాణ్ ఏమన్నాడు?
'డబుల్ ఇస్మార్ట్' మూవీ నుంచి రిలీజ్ అయిన ‘మార్ ముంత చోడ్ చింత’ సాంగ్ పై వివాదం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రల్లో హాట్ టాఫిక్ అవుతుంది. అయితే పూరి కావాలనే కేసిఆర్ మాటలను ఈ పాటలో పెట్టాడాని బీఆర్ఎస్ నాయుకులు అంటున్నారు.Sri Media News
పూరి జగన్నాథ్‌కి కేసిఆర్ అంటే ముందునుంచే పడదని అందుకే కేసిఆర్ పై నెగిటివిటి ప్రచారం చేస్తున్నాడని బీఆర్ఎస్ నాయకుల వాదన.. తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా పూరి జగన్నాథ్ ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా తీసి.. తెలంగాణ ఉద్యమాన్ని అవమానించాడని... సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఇదే టాఫిక్ వినిపిస్తుంది.. మొదటి నుంచి పూరికి కేసీఆర్ అంటే పడదా?. కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా కేసిఆర్‌ను కించపరిచేల తీశాడా?. గంగతో రాంబాబు తెలంగాణ ఉద్యమంపై కక్కిన విషమా?
కెమెరామెన్ గంగతో రాంబాబు- చిత్రంలో తెలుగుతల్లి.. అంటూ కొత్తగా తెలుగువారంతా ఏకం కావాలంటూ.. తెలంగాణా ఇష్యూని తెలంగాణా మాతను పెట్టి పూజించడం... ఉద్యమంగా ప్రకాష్‌రాజ్ నడపడం వంటివి అప్పట్టో తెలంగాణ ప్రజలకు కోపం తెప్పించాయి. ఇదికాక... పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చాడంటూ.... వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డిని పోలిన పాత్రను నాజర్ చేత చేయించారు. ఆ పాత్ర పేరు కూడా చంద్రశేఖర్ రెడ్డి అని పెట్టడం ఈ గొడవకు మరింత బలం చెకురింది. అంతేకాదు.. ఆయన పాదయాత్రలో రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారంటూ.. ప్రతిపక్షనాయకుడి పి.ఎ.గా చేసిన తనికెళ్ళ భరణి ఆ సినిమాలో అంటాడు. ఏదో గొడవ సృష్టించి అధికారంలోకి రావాలని చూసే కోట శ్రీనివాసరావు పేరు జవహర్ నాయుడుగా చూపించారు.
అవసరమైతే తండ్రిని చంపేసి ఆ పేరును క్యాష్ చేసుకోవాలనే కపట కొడుకుగా ప్రకాష్‌రాజ్ నటించాడు. ఇది వైఎస్ కుటుంబానికి చెందిందనే కామెంట్లు వచ్చాయి. అలాగే పోరాట భావాలు కల్గిన వ్యక్తిగా రాంబాబు పాత్రలో పవన్ నటించాడు. ఆయన కనపడినప్పుడుల్లా చెగువేరా బొమ్మ, శ్రీశ్రీ కవితలే చెబుతుంటాడు. టోటల్‌గా ఇదంతా అభ్యుదయం వైపు తీసుకెళ్లేదిగా చూపించాడు. అప్పట్లో ఈ సినిమా తీవ్ర దూమరం రెపింది. గంగతో రాంబాబు సినిమా ఆడుతున్నఅనేక థియేటర్లలో ప్లెక్సీలను తెలంగాణ వాదులు తగులపెట్టాకూడా... అయితే గతం లో ఈ విష్యం పై పవన్ కళ్యాణ్ కి పూరి జగన్నాథ్ కి గొడవ జరిగినట్టు సమాచారం. పవన్ కళ్యాణ్ పూరి పై త్రీవ కోపాన్ని చూపించాడు.. అందుకు పూరి జగన్నాథ్ ఇక పవన్ తో సినిమా తీయను అని తన బాధ ని సోషల్ మీడియా లో పంచుకున్నారు.
గతంలో రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సిక్వెల్‌గా ఈ డబుల్ ఇస్మార్ట్ సినిమా తీస్తున్నాడు పూరి. దీంతో సినిమా ప్రమోషన్స్ చేస్తూ సినిమా పాటలను రిలీజ్ చేస్తుంది మూవీ టీం. సో 'మార్ ముంత చోడ్ చింత..' అనే 'కల్లు కంపౌండ్' లిరికల్ సాంగ్‌ను విడుదల చేసింది. అయితే ఈ సాంగ్‌లో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ వాయిస్‌లో ‘ఏం చేద్దామంటావ్ మరీ’ అనే డైలాగ్ పెట్టారు. ఈ పాటలో హీరో, హీరోయిన్ కల్లు బాటిళ్లు పట్టుకొని చిందేస్తుంటారు. పాట మధ్యలో కేసీఆర్ పాపులర్ ఊతపదం 'ఏం జేద్దామంటవ్ మరీ..' పదాల్ని యథాతథంగా ఆయన వాయిస్‌నే ఉపయోగించారు. ఇది బీఆర్ఎస్ నేతల మనో భావాలను హర్ట్ చేసింది. తమ మాజీ సీఎంని కేసీఆర్‌ను కించపరిచేలా ఈ చర్య ఉందంటూ దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో పాటు పాట రచయిత కాసర్ల శ్యామ్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌పై మండిపడుతున్నారు... ఆ డైలాగ్‌ను పాట నుంచి తొలిగించాలని బీఆర్ఎస్ నాయకుల డిమాండ్. నిజం చెప్పాలంటే మార్ ముంత చోడ్ చింత అంటూ సాగిపోయే ఈ పాట జనాల్లోకి ఇనిస్టెంట్‌గా వెళ్లిపోయింది. ఈ పాటలో రామ్ ఎనర్జీకి, కావ్య పాప అందాల ప్రదర్శన బాగా సెట్ అయ్యింది. కాస్లర్ శ్యామ్ రాసిన పాటకు ఓ హైప్, ఊపు తెస్తోందనే చెప్పాలి.
చాల సార్లు వివాదమే సినిమాలకు ప్లస్ అవుతుంది. ఫ్రీ పబ్లిసిటీ కూడా తెచ్చిపెడుతుంది. జనాల దృష్టిని సినిమా వైపుకు తిప్పుకునేలా చేస్తుంది. గతంలో సెన్సార్ దగ్గర సినిమా ఆగి రిలీజ్ అయ్యిందంటే జనాలు అందులో ఏముందో అని ఎగబడేవారు. దాంతో సెన్సార్ వద్ద పోరాటం చేసి మరీ రిలీజైన సినిమా అని ప్రకటించేవారు. రామ్ గోపాల్ వర్మ అయితే వివాదాలతో తన సినిమాలకు పబ్లిసిటీ తెచ్చుకుని, ఆ ఖర్చులు మిగుల్చుకునే వాడు. ఇప్పుడు ఆయన శిష్యుడు పూరి జగన్నాథ్ సైతం ఆయన దారిలోనే వెళ్తున్నాట్టు కనిపిస్తుంది.
అంతేకాదు.. సోషల్ మీడియాలో మ్యూజింగ్స్ పేరుతో సామాజిక అంశాలపై నీతులు చెబుతున్న పూరీ జగన్నాథ్ ఇలాంటి చవకబారు
పాటలో ఒక మాజీ ముఖ్యమంత్రి మాటలు ఎలా పెట్టాడు అని అంటున్నారు. ఈ పాటలో కేసీఆర్ మాటలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు... ఇదిలా ఉంటే.. పూరీ జగన్నాథ్‌పై చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ నాయకులు రజితారెడ్డి, గర్రెపల్లి సతీశ్ ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్‌కు కంప్లైంట్ చేశారు.
అయితే ఇప్పటి వరకు పూరి జగన్నాథ్ టీమ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఈ వివాదంతో జనాల్లోకి ఈ సినిమా , పాట బాగా వెళ్తోంది. అసలు ఏముందా ఆ పాటలో, ఎలా కేసీఆర్ డైలాగుని పెట్టారా ఆని ఆసక్తితో పాటను వింటున్నారు. అదే సమయంలో పూరి జగన్నాథ్ కు సైతం కొందరు సోషల్ మీడియా అభిమానుల నుంచి మద్దతు దొరుకుతోంది. కేసీఆర్ చెప్పిన ఆ మాట...ఓ మీమ్ డైలాగుగా పాపులర్ అయ్యిపోయింది. కాబట్టి ఎక్కడైనా ఎవరైనా వాడుకోవచ్చు అంటున్నారు.
What's Your Reaction?