వినుకొండ హత్యా!వైసీపీ vs టీడీపీ..?టీడీపీ అరాచకం అంటూ జగన్ ట్వీట్!

పల్నాడులో పాత కక్షలు రాజకీయ రంగు పులుముకొంటున్నాయి. పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన ఓ మర్డర్‌ ఇప్పడు తెలుగు రాష్ట్రల్లో హాట్ టాఫిక్ అవుతుంది. నిన్న (బుధవారం) రాత్రి... వినుకొండ బస్టాండ్‌ సెంటర్‌లో అందరూ చూస్తుండగానే వైసీపీ కార్యకర్త రషీద్‌ను కత్తితో తెగనరికాడు జిలానీ అనే వ్యక్తి.Sri Media News

Jul 18, 2024 - 15:32
 0  15
వినుకొండ హత్యా!వైసీపీ vs టీడీపీ..?టీడీపీ అరాచకం అంటూ జగన్ ట్వీట్!
Ex-CM Jagan reacted on vinukonda murder case
పల్నాడులో పాత కక్షలు రాజకీయ రంగు పులుముకొంటున్నాయి. పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన ఓ మర్డర్‌ ఇప్పడు తెలుగు రాష్ట్రల్లో హాట్ టాఫిక్ అవుతుంది. నిన్న (బుధవారం) రాత్రి...  వినుకొండ బస్టాండ్‌ సెంటర్‌లో అందరూ చూస్తుండగానే వైసీపీ కార్యకర్త రషీద్‌ను కత్తితో తెగనరికాడు జిలానీ అనే వ్యక్తి. ఈ హత్యను లైవ్‌‌లో చూసిన వారి వెన్నులో వణుకు పుడుతుంది. అంత దారుణంగా జరిగింది ఈ హత్య..  17 బుధవారం 2024 రాత్రి ఓ మద్యం షాపులో క్యాషియర్‌గా పనిచేస్తున్నా రషీద్ పని ముగించుకుని ఇంటికి వస్తున్న సమయంలో ఒక్కసారిగా జిలానీ దాడి చేశాడు. తనతో తెచ్చుకున్న కత్తితో ముందు చేతులపై నరికాడు. ఆ వేటుకు రషీద్ చెయ్యి ఒకటి.. రోడ్డుపైనే తెగిపడింది. ఆ వెంటనే మరో చెయ్యిపై వేటు వేశాడు. ఒక్కసారిగా తెరుకున్న రషీద్ తనను చంపవద్దు అని వేడుకున్న వదలలేదు... తలపై ఓ వేటు.. మెడపై ఓ వేటు వేశాడు జిలానీ. దీంతో రషీద్‌ కుప్పకూలిపోయాడు. పోలీసులు అక్కడికి చేరుకునేలోపే రషీద్‌ రక్తపుమడుగులో రోడ్డుపై పడిఉన్నాడు. కొన ఊపిరి ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు రషీద్‌.

రషీద్‌ను నరికిన తర్వాత పోలీసులకు లొంగిపోయాడు జిలానీ. పక్కా ప్లాన్‌తోనే దాడి చేసినట్లు తెలుస్తోంది. కత్తి ఎక్కడ నుండి సేకరించాడు, దాడి వెనుక జిలానికి సహకరించింది ఎవరన్నది తేలాల్సి ఉంది. అయితే ఈ మర్డర్‌ పాతకక్షలతోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు అంటున్నారు. ఇద్దరూ ఒకే సామాజికవర్గానికి చెందిన వారు అయినప్పటికీ...మొహర్రం రోజు హత్య జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తక్షణం పట్టణంలో 144 సెక్షన్ విధించారు.  

ఈ హత్యతో  వైసీపీ, తెలుగుదేశం పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. హత్యకు గురైన రషీద్‌ వైసీపీ యువజన విభాగం నాయకుడు కాగా.... జిలానీ తెలుగుదేశం పార్టీకి చెందినవాడు కావడంతో ఈ విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఇది పాతకక్షలతో జరిగిన దాడి అని పోలీసులు అంటున్నారు.

మరోవైపు ఈ ఘటనపై పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు స్పందించారు. వినుకొండలో జిలాని అనే వ్యక్తి రషీద్ అనే వ్యక్తి నరికి చంపారని.. వినుకొండ పట్టణంలో 144వ సెక్షన్ అమలు చేస్తున్నామన్నారు. ఇలాంటి చర్యలు పునరావృతం అయితే చాలా కఠినమైన చర్యలు తీసుకుంటామని.. ఇలాంటి ఘటనలు ఎవరైనా ప్రోత్సహించినా వారి పైన కూడా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వ్యక్తిగత కక్షల వల్లే ఈ హత్య జరిగినట్టు కనిపిస్తోందన్నారు. వినుకొండ వైఎస్సార్‌సీపీ మైనారిటీ సెల్ నేత షేక్‌ జిలానీ, వైసీపీలో తిరిగే షేక్‌ రషీద్‌‌ని వ్యక్తిగత కక్షలతో దాడి చేసి చంపేసారని తెలుస్తోందన్నారు. పల్నాడులో శాంతిభద్రతలు విఘాతం కలిగిస్తే, కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదిలా ఉంటే ఈ ఘటనపై టీడీపీ, వైఎస్సార్‌‌సీపీల మధ్య మాటల యుద్ధ నడుస్తోంది. రషీద్‌ను హత్య చేసిన జిలానీ టీడీపీ అని వైఎస్సార్‌సీపీ ఆరోపిస్తుంటే.. కాదు, కాదు జిలానీ వైఎస్సార్‌సీపీ నేత అంటూ టీడీపీ కౌంటర్ ఇస్తోంది. ఇరు పార్టీల నేతలతో జిలానీ దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కాగా వినుకొండ మర్డర్‌పై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసింది వైసీపీ. సోషల్‌ మీడియా ద్వారా రాష్ట్రపతి ముర్ము దృష్టికి తీసుకెళ్లారు. ఏపీలో రాజకీయ దాడులు ఆపేలా చర్యలు తీసుకోవాలని కోరింది వైసీపీ. కాగా ఈ ఘటన పై వైసీపీ నేత అంబటి రాంబాబు ట్విట్టర్‌‌లో స్పందించారు..  మల్లికా గార్గ్‌ ఎస్పీగా ఉన్నట్లయితే హత్య జరగకపోయి ఉండేదంటూ ట్వీట్ చేశారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow