పెరుగుతున్న అకీరా డిమాండ్... పవన్ ప్లాన్ ఏంటి..?
అకీరా నందన్ హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు... తల్లి రేణు దేశాయ్ మాత్రం ‘‘నా కుమారుడిని జూనియర్ పవర్ స్టార్ అనొద్దు. అది పవన్ కళ్యాణ్ గారికీ ఇష్టం లేదు. అకిరానందన్ కూడా దాన్ని ఇష్టపడడు..’’ అంటూ పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది.Sri Media News
అకీరా నందన్ అనే పేరిప్పుడు దేశ వ్యాప్తంగా మారుమ్రోగుతుంది. దీనికి కారణం. అకీరా నందన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు... కావడమే.. టాలీవుడ్ జూనియర్ పవర్ స్టార్ అంటు పవన్ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. అకీరా నందన్ హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు... తల్లి రేణు దేశాయ్ మాత్రం ‘‘నా కుమారుడిని జూనియర్ పవర్ స్టార్ అనొద్దు. అది పవన్ కళ్యాణ్ గారికీ ఇష్టం లేదు. అకిరానందన్ కూడా దాన్ని ఇష్టపడడు..’’ అంటూ పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది.. అయితే రేణు దేశాయ్ ఇలా చెప్పడం పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం తీసుకోలేక పోతున్నారు.. ఎవరు ఎన్ని చెప్పిన అకీరా నందనే జూనియర్ పవర్ స్టార్ అంటూ ఫ్యాన్ అంటున్నారు.
అయితే ఇప్పుడు పవన్ అభిమానుల్లో ఉన్న సందేహం ఒక్కటే... సినిమాలపై అకిరానందన్‌కి ఆసక్తి వుందా.? లేదా.?... ఉంటే అకీరా నందన్ ఎంట్రీ ఎప్పుడు?. ఎన్నికల్లో గెలిచిన తరువాత పవన్ కుమారుడు అకినందన్‌ని వెంటేసుకుని, మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యలయానికి తీసుకు వెళ్లి టీడీపీ అధినేత చంద్రబాబుకి, ఢిల్లీకి తీసుకెళ్ళి, ప్రధాని నరేంద్ర మోడీకి పరిచయం చేశారు పవన్ దీంతో పవన్ కళ్యాణ్ కొడుకు గురించి ఏం ఆలోచిస్తున్నారు? అసలు అకీరా నందన్ సీనిమాల్లో ఎంట్రీ ఇస్తాడా.? లేకా తండ్రికి తోడుగా రాజకీయల్లోకి ఎంట్రీ ఇస్తాడా? అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం.
ఇప్పటి వరకూ మీడియా కెమెరా వెనుక ఉన్న అకీరాని పవన్ తానే స్వయంగా ముందుకు తీసుకొచ్చారు. ఏనాడు సినిమా సెట్స్‌కి అకీరాను తీసుకు వెళ్లినట్టు చూడలేదు... కానీ.. పవన్ గెలిచిన తరువాత నేరుగా పెద్ద పెద్ద రాజకీయ నేతలకి అకీరా నందన్‌ను పరిచయం చేశారు పవన్.
ప్రస్తుతం అకీరా వయసు 20 అయినా వచ్చే ఎన్నికల సమయానికి 25 వస్తాయి. సో వచ్చే ఎన్నికల కోసం కొడుకును సిద్ధం అవుతాడాని అందుకే పవన్ రాజకీయ నాయకులకు పరిచాయం చేస్తున్నాడనే వెర్షన్ ఒకటైతే... మరో వెర్షన్ కూడా అభిమానుల్లో ఉంది. పవన్ ఇక పూర్తిగా రాజకీయాల్లోనే ఉండనున్నారు. ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలు పూర్తి చేసి సినిమాలకు దూరం అయ్యి... దేశ సేవ, రాష్ట్ర సేవలో పూర్తి జీవితం గడపాలని పవన్ పెద్ద ప్లాన్ వేసుకున్నట్టు తెలుస్తోంది.
అందుకే అకీరాని నటుడిగా లైన్‌లోకి తేవాలనే ఆలోచనతోనే అకీరాను ఇప్పుడు తెరపైకి తెస్తున్నాడని అంటున్నారు ఫ్యాన్స్. సినిమాలో కష్ట నష్టాలు పవన్ కళ్యాణ్ కి తెలుసు. అక్కడ సక్సెస్ మాత్రమే నిలబెడుతుంది. ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా? సక్సెస్ లేకపోతే నిలబడటం కష్టమైన పనే. కోట్ల రూపాయల వ్యాపారంలో సక్సెస్ లేకపోతే వారసుడికి కూడా అవకాశాలుండవు అనడానికి ఎన్నో ఉదాహరణలున్నాయి.
సో వీటన్నిటిని ఆలోచించిన పవన్ అకిరానందన్ లాంఛింగ్ బాధ్యతలను రామ్ చరణ్‌కు వదిలేసినట్టు తెలుస్తుంది. అంతేకాదు... ఇకపై అకీరా పూర్తి భాధ్యత నాదే అంటూ చరణ్ బాబాయికి హామి ఇచ్చినట్టు సమాచారం. దీంతో అకిరానందన్‌కు నటనతో పాటు పలు విషయాల్లో ట్రైయిన్ చేయించే బాధ్యతలను చరణ్ తీసుకున్నరట. అంతేకాదు అకిరానందన్ లాంఛింగ్ కోసం ఇప్పటికే కథలను రెడీ చేయించే పనిలో పడ్డాడు రామ్ చరణ్. 2026లో అకిరానందన్ హీరోగా గ్రాండ్ లాంఛింగ్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం పవన్ కళ్యాణ్ ఇప్పటికే కొడుకు రంగప్రవేశం గురించి ఒక అగ్ర నిర్మాతతో మాట్లాడి ఉంచాడట. సరైన కథ, దర్శకుడు దొరికితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. పవన్ ఫుల్ టైం పొలిటిక్స్ లో బిజీ అయిపోయాడు కాబట్టి తండ్రి లెగసి అనే పెద్ద బరువు తన భుజాల మీద ఉంటుంది. అది మోయడం ఛాలెంజే... సో దీని కారణంగా... సీనిమాల్లో ఐనా రాజకీయల్లో అయినా అకీరా ఎంట్రీకి డిమాండ్ రోజు రోజుకు పెరుగుతుంది.
అయితే... అకీరా నందన్ మాత్రం హీరోగా కాకుండా, సంగీత దర్శకుడిగా అవతారమెత్తి పవన్ ఫ్యాన్స్‌ని సర్ ప్రైజ్ చేశాడు. 'రైటర్స్ బ్లాక్' అనే షార్ట్ ఫిల్మ్ కి అకీరా సంగీతం అందించాడు. ఈ షార్ట్ ఫిల్మ్ కి కార్తికేయ యార్లగడ్డ దర్శకత్వం వహించాడు. 4 నిమిషాల 34 సెకన్ల నిడివి గల ఈ చిత్రానికి అకీరా అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది.
ఇదే సమయంలో ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీర మల్లు’ చిత్రంలో అకీరా స్పెషల్ కామియోలో నటిస్తున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. క్రిష్ దర్శకత్వంలో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అకీరా ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడట.. ఇందుకోసమే అకీరా కర్రసాము నేర్చుకున్నాడని తెలుస్తుంది. అయితే ప్రస్తుతం 50% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర షూటింగ్ లో త్వరలో అకీరా సందడి చేయనున్నాడంట. తండ్రి- కొడుకల మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా నిలవనున్నాయని టాక్. ఈ వార్తలో నిజం ఎంత ఉన్నది తెలియదు కానీ, ఈ వార్త విన్నాకా పవన్ అభిమానులు, మెగా అభిమానుల ఆనందానికి మాత్రం అవధులు లేవనే చెప్పాలి. ఒక వేళ ఇదే కనుక నిజమైతే థియేటర్లలో ఈ సీన్స్ కి అభిమానుల రచ్చ మాములుగా ఉండదు మరి.. ఏది ఏమైనా జూనియర్ పవర్ స్టార్ ఎంట్రీ కోసం ఇప్పటి నుంచే అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.
అయితే... 2029 ఎన్నికల్లో పవన్, అకీరాను పొలిటికల్ బరిలోకి దించే అవకాశాలూ లేకపోలేదు... వచ్చే ఎలక్షన్స్‌కు జనసేన తరపును 175 స్థానాల్లో పోటీ చేసేలా పార్టీని రెడీ చేయాలంటే ఈ టైమ్ లో పవన్ పక్కన కొడుకుగా అకీరా అవసరం ఎంతో ఉంది కూడా. అసలే రాజకీయాల్లో ఎవరినీ నమ్మలేం. అవన్నీ దృష్టిలో ఉంచుకునే పవన్, అకీరాను తన వెంట తిప్పుతున్నాడని... పైగా తెలుగు సినిమా పాన్ ఇండియా మార్కెట్ లో దూసుకుపోతున్న రోజులు ఇవీ... సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే పవన్ కళ్యాణ్...కుమారుడు అకీరానందన్‌ను తన వెంట తిప్పుకున్నాడు అని తెలుస్తుంది. ప్రధాని మోదీ పరిచాయంతో అకీరాకు పాన్ ఇండియా లెవల్‌లో ప్రత్యేకమైన గౌరవం, గుర్తింపు దక్కుతాయి. ఈ ఇమేజ్ సినిమా మార్కెట్‌ని ఎన్ క్యాష్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని.... ఇదంతా నిజమైతే... అకీరా తెరంగేట్రానికి ఎంతో సమయం పట్టదు. ఏదీ ఏమైనా అకీరాని మీడియా ముందుకు తేవడం అన్నది.. ఇటు సీనిమా పరంగానూ... రాజకీయ పరంగానూ కలిసొచ్చేదే...
అయితే అకీరా పెద్దనాన్న మెగాస్టార్ చిరంజీవి స్వయంకృషితో వచ్చి పెద్ద స్టార్‌గా ఎదిగారు. ఆయన తర్వాత ఇదే ఫ్యామిలీ నుంచి నాగబాబు, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నిహారిక ఇలా ఎంతో మంది పరిచయం అయ్యారు. వీరిలో చాలా మంది ఇప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోలుగా సత్తా చాటుకుంటున్నారు... అయితే భవిష్యత్తులో అకీరా అడుగులు సంగీతం దిశగా పడతాయా.. లేక పవర్ స్టార్ అభిమానుల కోరిక మేరకు హీరోగా ఎంట్రీ ఇస్తాడా... అందరి అంచనాలకు మించి.. రాజకీయల్లోకి ఎంట్రీ ఇస్తాడా వేచి చూడాల్సిందే...
What's Your Reaction?