చిరంజీవి పరువు తీయటం కోసం.. ఛీ.. మరీ ఇంత నీచంగానా?
అన్ని టీవీ ఛానెల్స్‌లో బ్రేకింగ్ న్యూస్.. మెగాస్టార్ చిరంజీవి రెండో కూతురు లేచిపోయి పెళ్లి చేసుకుందని.. దీంతో ఒక్కసారిగా మూవీ ఇండస్ట్రీ మెుత్తం అవాక్కు అయ్యింది.. మెుదట ఎవరూ నమ్మలేదు.. ఏదో రూమర్ అనుకున్నారు.. కానీ పెళ్లి తంతు వీడియో సైతం ప్లే చేయటంతో.. అది నిజమే అని నమ్మారు.Sri Media News
అది 2007 అక్టోబర్ నెల పదిహేడో తారీఖున.. అన్ని టీవీ ఛానెల్స్‌లో బ్రేకింగ్ న్యూస్.. మెగాస్టార్ చిరంజీవి రెండో కూతురు లేచిపోయి పెళ్లి చేసుకుందని.. దీంతో ఒక్కసారిగా మూవీ ఇండస్ట్రీ మెుత్తం అవాక్కు అయ్యింది.. మెుదట ఎవరూ నమ్మలేదు.. ఏదో రూమర్ అనుకున్నారు.. కానీ పెళ్లి తంతు వీడియో సైతం ప్లే చేయటంతో.. అది నిజమే అని నమ్మారు.. అల్లారుముద్దుగా పెంచుకున్న తన కూతురు చేసిన పనికి చిరు కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు.. ఈ పెళ్లినాటికి శ్రీజ వయస్సు 19 ఏళ్లు కాగా, శిరీష్‌కు 22 ఏళ్లు. అప్పటి వరకు అసలు శిరీష్ అంటే ఎవరో కూడా తెలియదు. శిరీష్‌కు ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ కూడా పెద్దది ఏమీ కాదు.. ఓ చిన్న మధ్యతరగతి కుటుంబమే.. అయినా సరే.. శ్రీజను పెళ్లి చేసుకునేటప్పుడు.. వ్యవస్థలను మ్యానేజ్ చేయగలిగాడు.. శిరీష్ వెనుక ఎవరో బడాబాబులు ఉన్నారని, కావాలనే ఇలా మెగా ఫ్యామిలీలో చిచ్చు పెట్టారని కొందరు అన్నా.. అంతా ట్రాష్ అని కొట్టిపడేశారు అంతా.. పైగా వీరి పెళ్లి విషయంపై ఢిల్లీ హైకోర్టు సైతం ఆగమేఘాల మీద స్పందించటం అనుమానాస్పదమే అయినా.. ఆ తరువాత అందరూ శ్రీజ విషయాన్ని మర్చిపోయారు కానీ.. బాబాయ్‌గా పవన్ మాత్రం ఆ ఘటనను మర్చిపోలేకపోయారు.. 16 ఏళ్ల చిన్న పిల్లని.. మా ఇంటి పిల్లని ట్రాప్ చేసి.. కాంగ్రెస్, ఇతర పార్టీలకు చెందిన కొందరు నేతలు చిరంజీవి కుటుంబ పరువు తీసేందుకు శ్రీజు ఇష్యూని వాడుకున్నారని పవన్ జనసేన కవాతు కార్యక్రమంలో పబ్లిక్‌గా ఆరోపించారు. తమ పరువును బజారుకీడ్చి ఢిల్లీలో రియాలిటీ షోలు చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి రాజకీయాల్లోకి వస్తే తమకు నష్టం వస్తుందని భయంతో ఇంతకు ఒడిగట్టారని జనసేనాని ఆరోపించారు. పవన్ మాటలతో అందరూ ఒక్కసారి జరిగిన తతంగం అంతా గుర్తు చేసుకుంటే.. శిరీష వెనుక నిజంగా ఎవరో ఉన్నారు అర్థం అయ్యింది.
అసలు మెగా ఫ్యామిలీ పరువు తీయాలని అనుకున్నది ఎవరు? మెగాస్టార్‌ని అడ్డుకోవటం కోసం కాంగ్రెస్ నేతలు కావాలనే చేశారా? శిరీష్ వెనుక ఉన్న ఆ బడా కాంగ్రెస్ నేత ఎవరు?
జూన్ 19 2024 ఉదయాన్నే ఓ ఫ్లాష్ న్యూస్ హల్‌చల్ చేసింది.. అది మెగా డాటర్ శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ అనారోగ్య కారణాలతో మృతి చెందాడు అని.. ఇక శ్రీజ పెళ్లి నాటకీయ పరిణామాల మధ్య చాలా కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. చిరంజీవి స్టార్ హీరోగా ఇండస్ట్రీని ఏలుతున్న టైమ్ అది.. అప్పుడే రాజకీయాల వైపు చిరంజీవి చూస్తున్నారన్న పుకార్లు షికార్లు చేశాయి.. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు చిరంజీవి ప్రకటించకపోయినా.. పరోక్షంగా హింట్లు ఇచ్చారు.. కరెక్టుగా అప్పుడే.. 2007 అక్టోబర్ నెల పదిహేడో తారీఖున చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ ఇంట్లో నుంచి లేచిపోయి.. శిరీష్ భరద్వాజ్ అనే ఓ కామన్ ఫ్యామిలీకి చెందిన యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది.
అది కూడా తెల్లవారుజామునే జీన్స్ ప్యాంటు, టీ షర్టు వేసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేసింది శ్రీజ. అనంతరం శిరీష్ భరద్వాజ్‌తో కలిసి సికింద్రాబాదులోని న్యూబోయినపల్లిలో ఉన్న ఆర్య సమాజ్‌కు వెళ్లారు. దాదాపు గంట సేపు వారి పెళ్లి తంతు జరిగింది. వీరి పెళ్లి వెనుక ఆనాటి కాంగ్రెస్ సీనియర్ నేత, అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన పి.జనార్థన్ రెడ్డి ఉన్నారన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు. పీజేఆర్ హవా అప్పట్లో ఏ రేంజ్‌లో ఉండేదో కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఇప్పుడైతే ఆయన వారసులకు ఛరిష్మా తగ్గిపోయింది కానీ.. పీజీఆర్ బతికి ఉండే రోజుల్లో హైద్రాబాద్‌లో ఆయన చెప్పిందే శాసనంలా ఉండేది. పేద, బడుగు, బలహీన వర్గాలకు ఆశాదీపంలా పీజేఆర్‌ని కొలిచేవారు.
పీజేఆర్ కుమారుడుకి, ఈ శిరీష్ భరద్వాజ్ మంచి ఫ్రెండ్. ప్రాణ స్నేహితులనే చెప్పుకోవచ్చు.. ఆ చనువు కొద్దీ ఫ్రెండ్ లవ్‌కు హెల్ప్ చేయాలని కోరాడు శిరీష్.. అలా.. పీజేఆర్ దగ్గరకు వెళ్లిన శిరీష్ తన ప్రేమ గురించి చెప్పాడు.. అంకుల్ చిరంజీవి గారి చిన్నమ్మాయి, నేను ప్రేమించుకుంటున్నాం.. పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం.. కానీ చిరంజీవి గారి ఇంట్లో ఒక్కరు కూడా మా ప్రేమను యాక్సెప్ట్ చేయటం లేదు.. కొన్ని నెలలుగా ఆమెను బయటకు రానివ్వటం లేదు.. ఎలాగోలా కష్టపడి.. ఫోన్లు, మెసేజులు చేసి.. టచ్‌లో ఉంటుంది.. మీకు అనుమానం ఉంటే.. శ్రీజతో మీరు మాట్లాడండి.. మీకు నమ్మకం ఉంటేనే మాకు సాయం చేయండి అని శిరీష్ కోరటంతో.. పీజేఆర్ కన్విన్స్ అయ్యారు. శ్రీజతో కూడా మాట్లాడిన తరువాత.. వీరి ప్రేమ పెళ్లికి సాయం చేశారు.
ఆ టైమ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటంతో.. అంతా స్మూత్‌గా వెళ్లిపోయింది.. అంతా పీజేఆర్ చెప్పినట్లే జరిగింది.. ఇక పోలీసులు సైతం.. మెగా ఫ్యామిలీకి సహకరించకుండా.. శిరీష్-శ్రీజ జంటకు అండగా నిలిచింది. పెళ్లి విషయం తెలిసిన తరువాత చిరంజీవి కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఇక పెళ్లి జరిగిన ఆ మరుసటి రోజే.. చిరంజీవే స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి.. శిరీష్‌పై పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. శిరీష్ అనే యువకుడికి క్రైమ్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది.. నా కూతురు మేజర్ కాగానే ముప్ఫై కోట్ల రూపాయలకు వారసురాలు అయ్యేలా ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను.. ఆస్తిపాస్తులు కూడా శ్రీజ పేరు మీద రాసి ఉంచాను. ఆ ఆస్తి కోసమే.. అతడు ప్రేమ పేరిట నాటకం ఆడుతున్నాడు.. అతని వల్ల నా కుమార్తె ప్రాణాలకు హాని ఉందని చిరంజీవి ఆరోపించారు. కానీ పోలీసులు చిరంజీవి ఫిర్యాదుపై ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు.
మీరు చెప్పినట్లు అతడిపై క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి.. కానీ.. ఏ ఒక్క కేసులోనూ అతడు నిందితుడిగా తేలలేదు. సో మీరు పెట్టిన కేసుపై ఎటువంటి చర్యలు తీసుకోలేము అని చేతులెత్తేశారు. ఇక ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్న అనంతరం శ్రీజ, శిరీష్ ఢిల్లీకి వెళ్లి ఆశ్రయం పొందారు. వీరిద్దరూ మీడియా ముందుకు వచ్చి మెగా ఫ్యామిలీ నుంచి తమకు ప్రాణహాని ఉందని చెప్పడం సంచలనం కలిగించింది. మా నాన్న కంటే.. మా బాబాయ్ అంటేనే భయంగా ఉందని శ్రీజ చేసిన కామెంట్స్.. ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ వ్యవహారంపై చిరంజీవి మౌనంగానే ఉండిపోగా.. పవన్ కళ్యాణ్ మాత్రం మీడియా ముందుకు వచ్చి తన దగ్గర లైసెన్స్ రివాల్వర్ ఉందని చూపించడం దుమారం రేపింది.
ఈ ఘటన తరువాత చిరంజీవి ఒక వీడియోని రిలీజ్ చేశారు.. మా పిల్లల ఇష్టా ఇష్టాలకు మేము గౌరవం ఇస్తాం.. శ్రీజ ఇలా చేయటం వల్ల ఒకింత బాధపడింది వాస్తవమే కానీ.. నిజాలను బేరీజు వేసుకున్న తరువాత.. తను హ్యాపీగా ఉండటమే మేము కోరుకుంటున్నాం.. అమ్మా శ్రీజ.. నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండు అని చిరంజీవి ఆశీర్వదించారు. ఆ తరువాత జరిగిన పరిణామాలతో పవన్ కళ్యాణ్ తన వద్ద ఉన్న 60 ఎంఎం రివాల్వర్‌ను జూబ్లీహిల్స్ పోలీసులకు సరెండర్ చేశారు. ఎప్పుడైతే పవన్ రివాల్వర్ సరెండర్ చేశారో.. అప్పుడే శ్రీజ ఢిల్లీ నుంచి హైద్రాబాద్‌కు వచ్చింది.
ఇక ఢిల్లీలో శ్రీజ దంపతులకు అప్పటి కాంగ్రెస్ నేతలు అయిన లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్ కుమార్ ఆర్థిక సాయం అందించారు. అంతేకాదు లీగల్‌గా సపోర్ట్ ఇస్తూ.. ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించటానికి సాయం చేశారు. అందుకే ఢిల్లీ హైకోర్టు కూడా శ్రీజ దంపతుల పిటిషన్‌పై తక్షణమే స్పందిస్తూ.. వారికి రక్షణ కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇలా ఆదేశాలు రావటం, అలా పవన్ గన్ సరెండర్ చేయటం.. ఆ తరువాత డైరెక్టుగా ఈ జంట హైద్రాబాద్‌కు రావటం చకచకా జరిగిపోయింది..
ఈ విషయాన్ని మీడియా హైలెట్ చేస్తూ.. ఆ జంటతో లైవ్ ఇంటర్వ్యూలను చేసింది ప్రతి ఛానెల్.. ఇక ప్రతి రోజూ ఏదొక బడా న్యూస్ పేపర్.. వీరిద్దరి ఇంటర్వ్యూలతో పెద్ద పెద్ద ఆర్టికల్స్ పబ్లిష్ చేసేవి. ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే.. కాంగ్రెస్ నేతలతో పాటు శ్రీజ దంపతులకు హెల్ప్ చేసిన సినీ ప్రముఖులు ఎవరో కాదు.. నాటి స్టార్ డైరెక్టర్ దాసరి నారాయణరావు గారు. శ్రీజ పెళ్లి విషయం నుంచి.. ఢిల్లీకి వెళ్లటం, తిరిగి రావటంలో దాసరి గారికి ఎటువంటి సంబంధం లేదు.. కానీ.. వారు హైద్రాబాద్‌కు తిరిగి వచ్చిన తరువాత.. కాంగ్రెస్ నేతల సూచనలతో దాసరి ఇంటికి వెళ్లారు శ్రీజ దంపతులు.
కుశల ప్రశ్న తరువాత.. ఆర్థిక పరిస్థితి గురించి అడిగారు దాసరి దంపతులు.. తమ ఆర్థిక పరిస్థితి అస్సలు బాగోలేదని శ్రీజ చెప్పటంతో.. అప్పటికప్పుడు కోటి రూపాయల చెక్కుని శ్రీజ పేరిట రాసి ఇచ్చారు.. దాసరి పద్మగారు.. దానితో పాటుగా జూబ్లీహిల్స్‌లో వారికి ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో కాపురం పెట్టమని కీస్ కూడా ఇచ్చారు.
శ్రీజ పెళ్లితో మనస్థాపం చెందిన చిరంజీవి తండ్రి వెంకట్రావ్ మరణించారు. కరెక్టుగా పెళ్లి జరిగిన రెండు నెలలకు తాత చనిపోవటంతో.. శ్రీజ మెగాస్టార్ ఇంటికి వచ్చింది.. మెుదట ఆమెను రానివ్వకూడదని మెగా ఫ్యామిలీ అనుకుంది.. కానీ.. ఇప్పటికే జరిగిన రచ్చ చాలు అని చిరంజీవి చెప్పటంతో.. శ్రీజ దంపతులను ఎవరూ అడ్డుకోలేదు.. కానీ.. శ్రీజను గేటు లోపలికి రానిచ్చారు కానీ.. శిరీష్‌ని గేటు దగ్గరే అడ్డుకున్నారు.. పవనే అడ్డుకున్నారు.. అని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తరువాత ఈ విషయంపై స్పందించిన శిరీష్.. శ్రీజను లోపలికి రమ్మన్నారు.. ఆ తరువాత నా కుమార్తెని కూడా చేరదీశారు.. అంటే మా పెళ్లిని చిరంజీవి యాక్సెప్ట్ చేసినట్లే కదా.. అని అన్నారు. ఇక మీ పెళ్లి వెనుక పీజేఆర్ ఉన్నారు కదా.. అంటే.. పీజేఆర్ కొడుకు నాకు ఫ్రెండ్.. నిజంగా వారు మాకు అండగా ఉంటే.. ఢిల్లీ ఎందుకు వెళ్లిపోతాం అని ప్రశ్నించాడు. మరి మీపై శ్రీజ కేసు ఎందుకు పెట్టిందని అడిగితే.. మెున్నటి వరకు బాగానే ఉన్నాం.. సడెన్‌గా తాను ఇలా చేయటం నాక్కూడా షాకింగ్‌గానే ఉంది.. మీరే తనని అడగండి అంటూ సమాధానం చెప్పకుండా దాటవేశాడు. ఇక ఆ తరువాత శ్రీజ-శిరీష్‌లు విడిపోవటం, శ్రీజ మరొకరిని రెండో పెళ్లి చేసుకోవటం మనందరికీ తెలిసిన విషయమే. శిరీష్ కూడా ఓ డాక్టర్‌ని పెళ్లి చేసుకొని చెన్నైలో సెటిల్ అయ్యాడు.. ఆ తరువాత బీజేపీ జాయిన్ అయ్యి యాక్టీవ్‌గా పార్టీ కార్యకలాపాల్లో పాల్గొన్నాడు.. అయితే లంగ్స్ సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన శిరీష్.. కన్నుమూయటంతో.. మరోసారి వీరి పెళ్లి వ్యవహారం ట్రెండింగ్‌లోకి వచ్చింది. కేవలం చిరంజీవిని రాజకీయంగా దెబ్బకొట్టేందుకే అప్పటి కాంగ్రెస్ నేతలు.. శ్రీజను పావుగా వాడుకొని.. చిరంజీవిని దెబ్బకొట్టారు అని నమ్మలేని నిజం.. ఈ నిజాన్ని చాలా లేటుగా అర్థం చేసుకున్న శ్రీజ.. రియలైజ్ అయినా ఫలితం లేకుండా పోయింది.. అప్పటికే మెగా ఫ్యామిలీకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
What's Your Reaction?