మధ్యలో ఆగిపోయిన టాప్ హీరోల సినిమాలు

సినిమా ఇండస్ట్రీలో ఒక్కోసారి క్రేజీ కాంబినేషన్‌లో ప్రారంభమైన చిత్రాలు సెట్స్ పైకి వెళ్లే లోపే ఆగిపోతుంతాయి. ఏ చిత్ర పరిశ్రమలోనైనా ఇది అత్యంత సాధారణం.  సినిమా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకోని కొబ్బరికాయ కొట్టిన వేంటనే అగిపోయినా సినిమాలు ఉన్నాయి.Sri Media News

Jun 17, 2024 - 14:35
 0  6
మధ్యలో ఆగిపోయిన టాప్ హీరోల సినిమాలు

సినిమా ఇండస్ట్రీలో ఒక్కోసారి క్రేజీ కాంబినేషన్‌లో ప్రారంభమైన చిత్రాలు సెట్స్ పైకి వెళ్లే లోపే ఆగిపోతుంతాయి. ఏ చిత్ర పరిశ్రమలోనైనా ఇది అత్యంత సాధారణం.  సినిమా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకోని కొబ్బరికాయ కొట్టిన వేంటనే అగిపోయినా సినిమాలు ఉన్నాయి. సినిమాను తీయడం అంటే యజ్ఞం. ఎక్కడ ఏ చిన్న అడ్డంకి తలెత్తినా అర్ధాంతరంగా ఆగిపోతుంది. ఇటు డబ్బులు పెట్టిన నిర్మాతకు, అటు కథను సిద్ధం చేసుకున్న దర్శకులకే కాదు... నటీనటులకు కూడా నష్టమే... అలా రకరకాల ఇబ్బందులతో అగిపోయిన చిత్రాలు చాలానే ఉన్నాయి. ఆ సినిమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం.

మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు తెలియని భారతీయులు ఉండరు. ఎన్నో బ్లాక్ బ్లస్టర్‌ సినిమాలతో ప్రజా అభిమానాన్ని పొంది, చిరంజీవి మెగాస్టార్ స్థాయికి ఎదిగారు. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా తన స్వయం కృషితో సినిమాల్లో నిలదొక్కుకొని, యావత్ సినీ లోకం తిరిగి చూసేలా చేశారు. హీరోగా ఎన్నో రికార్డులను సెట్ చేసిన చిరంజీవి చేసిన కొన్ని సినిమాల షూటింగ్‌ మెుదలు పెట్టిన తరువాత మధ్యలోనే ఆగిపోయాయి ఈ లిస్ట్ కూడా పెద్దదే...

ఈ లిస్ట్‌లో మెుదటగా భూలోక వీరుడు అనే సినిమా ఉంటుంది. అప్పటికే బాలయ్యతో ఆదిత్య 369, భైరవ ద్వీపం లాంటి సినిమాలు చేసిన సింగీతం శ్రీనివాసరావు.. చిరంజీవితో కూడా భూలోక వీరుడు అంటూ ఓ జానపద చిత్రాన్ని ప్లాన్ చేసారు. సినిమా మొదలు పెట్టిన తర్వాత  క‌థ‌లో కొన్ని మిస్టేక్లు ఉన్నాయ‌ని, మ‌ధ్యలోనే  ఈ సినిమాను డ్రాప్ చేసేశారు చిరు.

రెండోది ఎస్వీ కృష్ణారెడ్డి సినిమా. ఎస్వీ కృష్ణారెడ్డి మాంచి ఫామ్‌లో ఉన్న టైమ్‌లో ఆయ‌న‌ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఓ సినిమా ఎనౌన్స్ అయ్యి కూడా మ‌ధ్యలో ఆగిపోయింది. ఎందుకు ఆపేశారన్న వివరాలు మాత్రం బయటకు రాలేదు.

ఇక మూడో సినిమాగా అబూ బాగ్దాద్ గజదొంగ అనే సినిమా అని చెప్పాలి. చిరు హీరోగా పాన్ ఇండియా లెవెల్‌లో అబూ బాగ్దాద్ గజదొంగ సినిమా అనౌన్స్ చేశారు. ఈ సినిమాను ఇండియాలోని అన్ని భాషలతో పాటు ఇంగ్లీష్‌లో కూడా రిలీజ్ చేయాల‌నుకున్నారు. మాస్టర్ సినిమా హిట్ త‌ర్వాత ఆ సినిమా డైరెక్టర్‌ సురేష్ కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా అనుకున్నారు. కానీ భారీ బ‌డ్జెట్ నేప‌థ్యంలో ఈ సినిమా మ‌ధ్యలోనే ఆపేశారు. ముందు అనుకున్నంత దాని కంటే బడ్జెట్‌ ఎక్కువ అయిపోతుండటంతో, ఈ సినిమా అర్థంతరంగా ఆగిపోయింది.

ఈ వరసలో నాలుగో స్థానంలోకి వచ్చేది వ‌జ్రాల దొంగ మూవీ. కోదండ రామిరెడ్డి డైరెక్షన్‌లో శ్రీదేవి నిర్మాణంలో వజ్రాల దొంగ అనే సినిమాను ఎనౌన్స్‌ చేశారు. పూజా కార్యక్రమం కూడా జరిగింది. కానీ ఆ తర్వాత చిరు – శ్రీదేవి ఈగో క్లాషెస్ వ‌ల్ల‌ ఈ సినిమాకు బ్రేక్ పడింది.

 ఐదో సినిమాగా వినాలని ఉంది సినిమా చెప్పుకోవచ్చు. రామ్ గోపాల్ వర్మ కెరీర్ పీక్స్‌లో ఉన్నపుడు ఆయన దర్శకత్వంలో చిరంజీవితో వినాలని ఉంది సినిమా మొదలు పెట్టాడు. ఇందులో టబు, ఊర్మిళ హీరోయిన్లు. కొంత భాగం షూట్ కూడా అయిన తర్వాత సంజయ్ దత్ జైలు నుంచి రిలీజ్ కావడంతో బాలీవుడ్ వెళ్లిపోయాడు వర్మ. దీంతో.. వినాలని ఉంది సినిమా థియేటర్స్‌ వరకు రాకుండానే షూటింగ్‌ మధ్యలోనే ఆగిపోయింది..

ఇక ఆరో సినిమా విషయానికి వస్తే.. అదే ఇద్దరు పెళ్లాల కథ మూవీ. కోదండరామి రెడ్డి దర్శకత్వంలో ఇద్దరు పెళ్లాల కథ నేపథ్యంలో చిరంజీవితో ఓ సినిమా ప్లాన్ చేసారు. దివ్యభారతితో పాటు మరో హీరోయిన్‌ను కూడా అనుకున్న తర్వాత స్క్రిప్ట్ ఫైనలైజ్ కాకపోవడంతో ఆపేశారు. ఆ తర్వాత ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో దివ్యభారతి‌తో పాటు మరో హీరోయిన్‌గా ఇద్దరు పెళ్లాల స్టోరీతో చిరు ఓ సినిమా చేయాలనుకున్నారు. ఎందుకో ఆ  ప్రాజెక్ట్ స్టార్ట్‌ చేసే ముందు కథ క్లైమాక్స్ సరిగా కుదరక,  రేపు పూజా కార్యక్రమాలు స్టార్ట్ చేద్దామనుకున్న సమయంలో ఈ  ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆ తర్వాత ఏ. కోదండరామిరెడ్డితో చిరంజీవి ముఠామేస్త్రీ సినిమా చేశారు.

చిరుకు సంబంధించి ఆగిపోయిన సినిమాల్లో ఏడోదానిగా వీఎన్‌. ఆదిత్య సినిమా అని చెప్పుకోవచ్చు. అప్పట్లో మ‌నసంతా నువ్వే సినిమా క్రియేట్‌ సన్షేషన్‌ అస్సలు మర్చిపోలేరు సినీ ప్రియులు. ఆ సినిమా డైరెక్టర్‌ అయిన వీఎన్‌. ఆదిత్యతో చిరంజీవి ఓ సినిమా చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాలతో అది మధ్యలోనే ఆగిపోయింది.

ఇక ఎనిమిదో సినిమా విషయానికి వస్తే.. అదే శాంతి నివాసం మూవీ. చిరంజీవి హీరోగా అప్పట్లో శాంతి నివాసం అనే ఫ్యామిలీ సబ్జెక్ట్ ఒకటి అనుకున్నారు. కానీ అది కూడా మధ్యలోనే ఆగిపోయింది.

తొమ్మిదో సినిమాగా ఆంధ్రావాలాను చెప్పుకోవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా పూరీ తెరకెక్కించిన ఆంధ్రావాలా సినిమాను ముందు చిరంజీవితోనే చేయాలనుకున్నాడు. కానీ ఆయన ఒప్పుకోలేదు. అలా చిరు ఓ డిజాస్టర్ నుంచి తప్పించుకున్నాడు.

ఇక పదో సినిమాగా వడ్డీ కాసుల వాడు అనే సినిమా వరుసలో ఉంటుంది. చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చే ముందు వడ్డీ కాసుల వాడు అనే సినిమా చేయాల్సింది. కానీ ఎందుకో అది మిస్ అయింది.

పదకొండో సినిమా ఆటోజానీ. చిరంజీవి 150వ సినిమాగా ఆటోజానీని ప్రకటించాడు నిర్మాత రామ్ చరణ్. పూరీ దర్శకత్వంలో ఇది ఉంటుందని చెప్పారు. కానీ తర్వాత అది ఆగిపోయింది.

అయితే ఈ లిస్ట్‌‌లో ఉన్న సినిమాల్లో కొన్ని సినిమాలు అందాల తార శ్రీదేవి కారణంగా అగిపోయాయి... ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో శ్రీదేవి మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో వజ్రాల దొంగ సినిమా స్క్రిప్ట్ రెడీ చేశారు. ఈ సినిమాకు నిర్మాతగా శ్రీదేవి వ్యవహరించారు. అయితే ఇందులో శ్రీదేవి పాత్రను హైలెట్ చేయాలనే కండిషన్లు పెట్టడంతో చిరంజీవిని తక్కువ చేసి చూపించడం ఇష్టంలేక దర్శకుడు సినిమాని క్యాన్సిల్ చేశారు. ఆ తర్వాత కొండవీటిదొంగ సినిమాలో ముందుగా చిరంజీవి సరసన శ్రీదేవి భావించారు అయితే ఈ సినిమాలో చిరంజీవితో సమానంగా తనకు ఫైట్ సన్నివేశాలు పెట్టాలని కొండవీటి దొంగ బదులు కొండవీటి రాణి అనే టైటిల్ పెట్టాలని కండిషన్ పెట్టడంతో దర్శకులకు ఇది ఇష్టం లేక ఈ సినిమా నుంచి ఆమెను తప్పించారు.

బాలకృష్ణ విషయానికి వస్తే... సుదీర్ఘ సినీ కెరీర్‌లో పౌరాణికం, జాన‌ప‌దం, యాక్షన్, ఫాంట‌సీ ఇలా అన్ని జాన‌ర్స్ ట‌చ్ చేశారు. స‌మ‌కాలీన హీరోల‌కు సాధ్యంకానీ క‌థాంశాల‌తో సినిమాలు తీసి ప్రేక్షకుల‌ను మెప్పించారు. ఈ హీరో లిస్ట్‌‌లో కూడా  అర్థాంత‌రంగా ఆగిపోయిన సినిమాలు ఉన్నాయి.

1986లో నిర్మాత జి.సుబ్బారావు జంధ్యాల ‘నటరత్న’టైటిల్‌తో ఒక మూవీ చేద్దాం అనుకున్నాడు.‘నటరత్న’ సినిమా షూట్‌ను అమెరికాలో పూర్తి చేద్దామని జంధ్యాల నిర్ణయించుకున్నారు. కానీ వీసాలు రావడం ఆలస్యం అయ్యింది. మరోవైపు బాలకృష్ణ వేరే ప్రాజెక్టులతో బిజీ అయిపోయాడు. అందువల్ల ఈ సినిమా చేయలేకపోయాడు చివరికి అందులో ఘట్టమనేని రమేష్‌బాబు హీరోగా చేశాడు. అయితే దీనికి నటరత్న అని కాకుండా ‘చిన్నికృష్ణుడు’గా టైటిల్‌ను పెట్టారు.

గోపాలరెడ్డి, సుధాకర్‌రెడ్డి కలిసి బాలకృష్ణను హీరోగా పెట్టి ‘శపథమ్‌’అనే 3D సినిమా రూపొందించాలని ప్లాన్ చేశారు.కథ కూడా రాసుకున్నారు.క్రాంతికుమార్‌కు దర్శకత్వ బాధ్యతలు ఇవ్వాలనుకున్నారు కానీ, తెలియని కారణం వల్ల ఈ మూవీ ప్రారంభం కాకుండానే ఆగిపోయింది.

ప్రముఖ నిర్మాత కోగంటి హరికృష్ణ... బాలకృష్ణతో ‘బాలకృష్ణుడు’ మూవీ చేస్తున్నట్లు ఒకానొక సమయంలో ప్రకటించారు. ఎస్‌.ఎస్‌.రవిచంద్రను దీనికి దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు. కథ కూడా పూర్తిగా ఫినిష్ చేశారు కూడా. బాలకృష్ణ హీరోగా అశోక చక్రవర్తి సినిమా రూపొందింది. అయితే అశోకచక్రవర్తి, ధ్రువ నక్షత్రం సినిమాలు ఒకే కథతో వచ్చాయి. పైగా ధ్రువ నక్షత్రం సినిమా రిలీజ్ అయ్యింది.  ఈ విషయం తెలిసిన బాలకృష్ణ బాగా కోపం తెచ్చుకున్నాడు. రెండు కథలు ఎలా ఒకటయ్యాయని ఫీలయ్యాడు.‘బాలకృష్ణుడు’ సినిమా చేయడానికి ఒప్పుకోలేదు.

 2001లో బాలయ్య హీరోగా ఓ జానపద చిత్రాన్ని ప్రారంభించారు గోపాలరెడ్డి. ఆ చిత్రానికి కోడి రామకృష్ణ దర్శకుడు. బాలకృష్ణకు ఇది ద్విపాత్రాభినయ చిత్రం. విక్రమసింహ భూపతి, ప్రతాప్‌ పాత్రలను ఆయన పోషించారు. పూజా బాత్రా, అంజలా జవేరి, రోజా హీరోయిన్లు. హాలీవుడ్‌ చిత్రం ‘గ్లాడియేటర్‌’ స్ఫూర్తితో ఆ తరహా చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించాలని గోపాలరెడ్డి ప్లాన్‌ చేశారు. సగానికి పైగా చిత్రం పూర్తయింది. అంతా సవ్యంగా జరిగిపోతుందనుకుంటున్న తరుణంలో హఠాత్తుగా ఈ చిత్ర నిర్మాణానికి బ్రేక్‌ పడింది. మళ్లీ మొదలు కాలేదు.

తండ్రి సీనియ‌ర్ ఎన్టీఆర్ హీరోగా న‌టించిన న‌ర్తన‌శాల మూవీ స్ఫూర్తితో మైథ‌లాజిక‌ల్ మూవీ చేయాల‌ని బాల‌కృష్ణ అనుకున్నారు. 2004లో ఆ సినిమాకు శ్రీకారం చుట్టారు బాల‌కృష్ణ. తండ్రి సినిమా టైటిల్‌ను తీసుకొని హీరోగా న‌టిస్తూనే స్వీయ ద‌ర్శక‌త్వంలో న‌ర్తన‌శాల సినిమాను బాల‌కృష్ణ మొద‌లుపెట్టాడు.  ఈ సినిమాలో అర్జునుడు, బృహ‌న్నల‌తో పాటు మ‌రో పాత్రను చేయాల‌ని బాల‌కృష్ణ అనుకున్నారు. ద్రౌప‌ది పాత్ర కోసం సౌంద‌ర్యను తీసుకున్నారు. భీముడిగా శ్రీహ‌రి, న‌కులుడిగా ఉద‌య్‌కిర‌ణ్‌, ధ‌ర్మరాజుగా శ‌ర‌త్‌బాబుల‌ను ఎంచుకొని ఈ సినిమా షూటింగ్‌ను మొద‌లుపెట్టారు బాల‌కృష్ణ. ఉత్తర పాత్ర కోసం అసిన్‌ను ఫిక్స్ చేశారు. వ్యాసుడి భాగవతాన్ని ఫాలో అవుతూ ఈ చిత్రం స్క్రిప్ట్ తయారు చేశారు బాలకృష్ణ. అంతా సాఫీగా జరిగిపోతుందనుకుంటున్న తరుణంలో ఈ సినిమాకు ఎన్నో అడ్డంకులు వచ్చాయి... హీరోయిన్ సౌందర్య చనిపోయింది. దీంతో సినిమా షూటింగ్ మధ్యలోనే అగిపోయింది.

దీంతో షూటింగ్ పూర్తికాకుండానే ఆగిపోయిన‌ న‌ర్తన‌శాల మూవీకి సంబంధించి ప‌దిహేడు నిమిషాల వీడియోను  శ్రేయాస్ ఈటీ ఓటీటీలో బాల‌కృష్ణ రిలీజ్ చేశారు. న‌ర్తన‌శాల మూవీ వీడియో నంద‌మూరి అభిమానుల‌తో సినీ ల‌వ‌ర్స్‌ను ఆక‌ట్టుకుంది. 17 నిమిషాల సినిమానే అయినా ఓ ప్రధాన సినిమాకు రావలసినంత హైప్ వచ్చింది.


విక్టరీ వెంకటేశ్‌ కెరీర్‌లో ఆగిపోయిన చిత్రాలు ఐదు ఉన్నాయి. సీనియర్‌ దర్శకుడు కే బాపయ్య హిందీ చిత్ర పరిశ్రమలో బిజీ గా ఉన్న రోజుల్లో అయన దర్శకత్వంలో వెంకటేశ్‌ హీరోగా ‘బాలరాజు’ చిత్రాన్ని ప్రారంభించింది సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ. ఒక ఫైట్‌, కొన్ని సీన్లు తీసిన తర్వాత ఆ సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత యాడ్‌ ఫిలిమ్స్‌ చేసే.. జయంత్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ మరో సినిమా మొదలెట్టారు సురేష్‌ బాబు. కొన్ని రోజులు షూటింగ్‌ జరిగిన తర్వాత ఆ సినిమా కూడా ఆగిపోయింది. కొత్త దర్శకుడు కెరీర్‌ దెబ్బ తినకూడదని, కొంత కాలం విరామం తీసుకుని, కథ రూపకల్పనకు వర్కవుట్‌ చేసి జయంత్‌ దర్శకత్వంలోనే ‘ప్రేమించుకుందాం రా’ చిత్రాన్ని నిర్మించారు సురేశ్‌బాబు.

అలాగే ‘గురు’ చిత్రం విడుదలైన కొంత కాలానికి వెంకటేశ్‌, దర్శకుడు తేజ కాంబినేషన్‌లో ‘ఆట నాదే - వేట నాదే’ సినిమాను ప్రకటించారు నిర్మాతలు సురేష్‌ బాబు, అనిల్‌ సుంకర. వెంకటేశ్‌ ఇందులో ప్రొఫెసర్‌గా నటిస్తారని చెప్పి ఆ లుక్‌ కూడా విడుదల చేశారు. హీరోయిన్‌ పాత్ర కోసం నయనతారను సంప్రదించారు కానీ ఆమెకు తీరిక లేకపోవడంతో శ్రియను తీసుకున్నారు. నారా రోహిత్‌ ఇందులో మరో హీరోగా నటిస్తారని ప్రకటించారు కూడా. సరిగ్గా ఆ సమయంలోనే ఎన్టీఆర్‌ బయోపిక్‌ చేసే అవకాశం తేజకు వచ్చింది. వెంకటేశ్‌ సినిమా చేస్తూ ఎన్టీఆర్‌ బయోపిక్‌ స్ర్కిప్ట్‌వర్క్‌ చేసుకోవచ్చని తేజ అనుకొన్నారు. అలా కుదరదని బాలకృష్ణ స్పష్టం చేయడంతో ఏదో ఒక చిత్రాన్ని తేజఎన్నుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలోనే నిర్మాత సురేష్‌ బాబుతో క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌ రావడంతో ‘ఆట నాదే.. వేట నాదే’ చిత్రాన్ని వదిలేసి బాలకృష్ణ క్యాంపులో చేరిపోయారు తేజ.ఎన్టీఆర్‌ బయోపిక్‌ ఓపెనింగ్‌ వరకే తేజ ఉన్నారు. ఆ తర్వాత స్ర్కిప్ట్‌ విషయంలో బాలకృష్ణతో అభిప్రాయ భేదాలు రావడంతో తేజ సినిమాను వదులుకోక తప్పలేదు.

 ఇక వెంకటేశ్‌, దర్శకుడు మారుతిల ‘రాధా’ చిత్రానిది మరో కథ. చిత్ర ప్రారంభోత్సవం కూడా జరిగింది. వెంకటేశ్‌ లుక్‌ స్టిల్స్‌నూ వదిలారు. చిత్ర కథ విషయంలో కాపీరైట్‌ సమస్యలు తలెత్తడం, అది వివాదాస్పదం కావడంతో ‘రాధ’ ఆగిపోయింది. ఆ తర్వాత వెంకటేష్‌, మారుతి కలయికలో ‘బాబు బంగారం’ వచ్చింది. ‘నేను.. శైలజ’తో హీరోల దృష్టిని ఆకట్టుకొన్న దర్శకుడు కిశోర్‌ తిరుమలను పిలిచి అవకాశం ఇచ్చారు వెంకటేశ్‌. రెండో సినిమానే పెద్ద హీరోతో అనగానే కిశోర్‌ చాలా ఆనందపడ్డాడు. ఆ చిత్రం పేరు ‘ఆడోళ్లు మీకు జోహార్లు’. పి. రామ్మోహనరావు నిర్మాత. మరో సినిమా గురించి ఆలోచించకుండా స్ర్కిప్ట్‌ మీద పని చేశారు కిశోర్‌. చివరకు సెట్‌ మీదకు రాకుండానే ఆగిపోయింది. ఇదే టైటిల్‌తో శర్వానంద్‌ హీరోగా సినిమా చేశారు కిశోర్‌.

పవన్‌ కళ్యాణ్‌, తమిళ దర్శకుడుసూర్య కాంబినేషన్‌లో ‘ఖుషి’ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే.. అయితే ఆ సినిమా కంటే ముందే వీరిద్దరి కలయికలో ‘చెప్పాలని ఉంది’ పేరుతో ఓ సినిమా మొదలై ఆగిపోయింది. ఎ.ఎం.రత్నం ఆ చిత్ర నిర్మాత. నూతన సహస్రాబ్దికి స్వాగతం పలుకుతూ డిసెంబర్‌ చివరి రోజున హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్‌ ప్రారంభమైంది. అప్పటికే మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా వచ్చిన ‘చూడాలని ఉంది’ హిట్‌ అయింది. అందుకే దీనికి ‘చెప్పాలని ఉంది’ అన్న పేరును ఖరారు చేసుంటారని అనుకున్నారంతా. అమీషా పటేల్‌ ఈ చిత్ర కథానాయిక. ప్రారంభోత్సవానికి వెంకటేశ్‌ ముఖ్య అతిథిగా వచ్చారు. కొన్ని రోజులు షూటింగ్‌ చేశాక ‘చెప్పాలని ఉంది’ ఆగిపోయింది. ఆ తర్వాత పవన్‌ కళ్యాణ్‌, సూర్య కాంబినేషన్‌లో ‘ఖుషి’ చిత్రాన్ని నిర్మించారు ఎ.ఎం.రత్నం.
‘జానీ’ తరువాత ప్రారంభమైన మరో చిత్రం ‘సత్యాగ్రహి’. ఈ స్టోరీ లైన్‌ నచ్చిన దిల్‌ రాజు సినిమా తీయాలని ముచ్చట పడ్డారు. కొన్ని రోజులు కథా చర్చల్లో పాల్గొన్నారు కూడా. ఆ తర్వాత అయన తప్పుకోవడంతో నిర్మాతగా ఎ.ఎం. రత్నం లైన్‌లోకి వచ్చారు. ఓ విద్యార్థి నాయకుడిగా సమాజంలో జరిగే అన్యాయాల్ని ప్రశ్నించే పాత్ర పవన్‌ కళ్యాణ్‌ది. అయితే ఈ స్ర్కిప్ట్‌ నచ్చకపోవడంతో ఆయన సినిమా చేయలేదు. జీసస్‌ జీవితకథపై ఇప్పటి వరకు చాలా చిత్రాలే వచ్చాయి. కానీ వాటిలో ఏ ఒక్కటీ బాలనటులతో తీయలేదు. అందుకే పన్నెండు, పద్నాలుగు ఏళ్ల వయసున్న పిల్లలతో జీసస్‌ జీవితంలోని ముఖ్య ఘట్టాలతో నిర్మాత కొండా కృషంరాజు ఓ చిత్రాన్ని ప్రారంభించారు. ప్రయోగాలకు పెట్టిందిపేరైన సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాకు దర్శకుడు. ఇందులో పవన్‌ కళ్యాణ్‌ నటించడానికి అంగీకరించడం ఆ రోజుల్లో విశేషంగా చెప్పుకొన్నారు.  ఎందుకో కొన్ని రోజులు షూటింగ్‌ జరిగిన తర్వాత పవన్‌ నటించకుండానే సినిమా ఆగిపోయింది.

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో సినిమా తీయాల‌ని లారెన్స్ చాలాకాలంగా అనుకున్నాడు. ప‌వ‌న్ కోసం ఒక అద్భుత‌మైన క‌థ రాసిన‌ట్టు కూడా అప్పట్లో లారెన్స్ చెప్పాడు. ప‌వ‌ర్‌ఫుల్ క‌థ‌తో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఈ సినిమా చేయ‌బోతున్నట్లు కూడా ప్రక‌టించాడు. కానీ ఈ సినిమా అడుగు ముందుకుప‌డ‌లేదు.

మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ ద‌ర్శక‌త్వంలో రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్‌లో ఒక సినిమా తెర‌కెక్కాల్సింది. దీనికి కోబ‌లి అని టైటిల్ కూడా అనుకున్నారు. కానీ ఈ సినిమా కూడా ప‌ట్టాలెక్కలేదు. అయితే ఇదే క‌థ‌లో ప‌లు మార్పులు చేసి జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ సినిమా చేసిన‌ట్లు టాక్  ఉంది. వీవీ వినాయ‌క్ కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఒక సినిమా తీయాల‌ని చాలా ఏండ్లుగా అనుకున్నాడు. వీళ్లిద్దరి కాంబినేష‌న్‌పై ఒక అనౌన్స్‌మెంట్ కూడా వ‌చ్చింది. కానీ ఆదిలోనే ఈ సినిమా ఆగిపోయింది.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్‌ను మ‌లుపుతిప్పిన సినిమా ఖుషీ. ఏఎం ర‌త్నం నిర్మించిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్‌బ‌స్టర్ హిట్ సాధించింది. ఈ సినిమాకు సీక్వెల్ చేయాల‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ చాలాసార్లు అనుకున్నాడు. ఖుషీ త‌ర్వాత ఖుషీ 2 సినిమా చేయాల‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ చాలాసార్లు అనుకున్నాడు. ఇదే విష‌యాన్ని బ‌య‌ట కూడా చెప్పాడు ప‌వ‌న్‌. కానీ ఇప్పటివ‌ర‌కు ఈ సినిమా ప‌ట్టాలెక్కలేదు.

ఖుషీ వంటి బ్లాక్‌బ‌స్టర్ హిట్ ఇచ్చిన ఎస్‌జే సూర్యతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒక సినిమా చేయాల‌ని అనుకున్నాడు. కాట‌మ‌రాయుడు సినిమాకు ముందు ఈ సినిమాను ప్రారంభించారు. కానీ ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లకుండా ఆగిపోయింది.

అజిత్ హీరోగా ఏఎం ర‌త్నం నిర్మించిన‌ వేదాళం సినిమాను ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో రీమేక్ చేయాల‌ని అనుకున్నారు. ఈ సినిమాకు త‌మిళ డైరెక్టర్ నీస‌న్ ద‌ర్శక‌త్వం వ‌హించాల్సింది. కానీ ఈ సినిమా ఓపెనింగ్‌కు ముందే ఆగిపోయింది. ఇదే సినిమాను భోళా శంక‌ర్ పేరుతో మెగాస్టార్ చిరంజీవి  రీమేక్ చేశారు. ఇందులో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేశ్ న‌టించింది

రామ్‌చరణ్‌ కెరీర్‌లోనూ ఆగిపోయిన చిత్రాలు రెండు ఉన్నాయి. తమిళ దర్శకుడు ధరణి దర్శకత్వంలో రామ్‌చరణ్‌తో మెరుపు చిత్రాన్ని ప్రారంభించారు సూపర్‌ గుడ్‌ ఫిలిమ్స్‌ అధినేత ఆర్‌.బి.చౌదరి. కాజల్‌ కథానాయిక. కొన్ని సన్నివేశాలు, ఓ పాట చిత్రీకరించిన తర్వాత సినిమా నచ్చక ఆపేశారు. అలాగే కొరటాల శివ, రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో బండ్ల గణేష్‌ ప్రారంభించిన చిత్రం కూడా ప్రారంభం తర్వాత ముందడుగు పడలేదు. హీరోకు, దర్శకుడికి మధ్య అభిప్రాయ భేధాలే దీనికి కారణం.

యువ కథానాయకుల్లో మంచు విష్ణుతో దర్శకుడు తేజ మొదలెట్టిన ‘వస్తాడు నా రాజు’ చిత్రం కూడా నిలిచిపోయింది. ఇది పూర్తి గ్రామీణ నేపథ్యంలో సాగే విభిన్న ప్రేమ కథ. ఓ పాట మాత్రమే తీసిన ఈ సినిమా ముందుకు కదలలేదు. దర్శకుడు గుణశేఖర్‌ తొలి సినిమా ‘లాఠీ’. అయితే ఆ సినిమా కంటే ముందు ఆగిపోయిన చిత్రం ఒకటుంది. డాక్టర్‌ రాజశేఖర్‌ హీరోగా నటించిన ‘ఎవడైతే నాకేంటి’. రెండు షెడ్యూల్స్‌ పూర్తయిన తర్వాత గుణశేఖర్‌ను తొలగించి జీవితను దర్శకురాలిగా నియమించారు. మొదట సుకన్య, తపస్య ఈ సినిమాలో హీరోయిన్లు. అయితే దర్శకుడిని మార్చేసిన తర్వాత ఆ ఇద్దరు హీరోయిన్లను వద్దని, శిల్పా శిరోద్కర్‌ను ఓకే చేశారు. ఇలా దర్శకుడిని మార్చేసినా సినిమా మాత్రం పూర్తి కాలేదు. ఆ తర్వాత కొంతకాలానికి అదే పేరుతో రాజశేఖర్‌ హీరోగా సముద్ర, జీవిత సంయుక్త దర్శకత్వంలో మరో సినిమా వచ్చింది.

దర్శకుడు శ్రీను వైట్ల తొలి సినిమా సైతం కష్టాల్లో పడింది. ‘అపరిచితుడు’ పేరుతో మొదలైన ఆ చిత్రంలో రాజశేఖర్‌, సాక్షి శివానంద్‌, మహేశ్వరి నటీనటులు. నలభై శాతం షూటింగ్‌ పూర్తయ్యాక నిర్మాత చేతులు ఎత్తేయడంతో, సీనియర్‌ నిర్మాత కె.వి.వి.సత్యనారాయణ ముందుకొచ్చారు. హీరో మాఫియా లీడర్‌ కావడంతో సినిమా పేరును ‘డాన్‌’గా మార్చి షూటింగ్‌ కొనసాగించారు. అయినా చిత్రం పూర్తి కాలేదు. ఆ తర్వాతే తన పేరును శ్రీను వైట్లగా మార్చుకొని‘నీ కోసం’ చిత్రంతో దర్శకుడిగా మొదలయ్యాడు.

విజయ్‌ దేవరకొండ ‘కామ్రేడ్‌’ చిత్రం వచ్చింది కదా... అయితే దాని కంటే ముందు రాజశేఖర్‌ ‘కామ్రేడ్‌’ ప్రారంభమైనా ముందుకు వెళ్లలేదు. కృష్ణ కన్నెగంటి దర్శకత్వంలో దమ్మాలపాటి శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని తొమ్మిదేళ్ల క్రితం ప్రారంభించారు. ఓపెనింగ్‌ మాత్రమే జరిగింది. స్టోరీ పాయింట్‌ రాజశేఖర్‌కు బాగా నచ్చినా, కథా చర్చల్లో జీవిత జోక్యం ఎక్కువై, అనేక మార్పులు సూచించడంతో భరించలేక నిర్మాత సినిమాను ఆపేశారు.  ఇలా ఎన్నో సినిమాలు అనేక కారణాల వల్ల పూర్తికాకుండా అగిపోయాయి...

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow