విజువల్ వండర్ మూవీ కల్కి 2898 ఏడీ రివ్యూ సినిమా టాక్ ఎలా ఉందంటే?
ఫైనల్లీ .. కోట్లాది మంది ఫ్యాన్స్ ఎదురు చూసిన కల్కి మూవీ రిలీజ్ అయింది. కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయిన కల్కి సినిమా సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అవుతుంది అంటూ ఫ్యాన్స్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్నారు . ఇప్పటికే అమెరికాలో షోస్ పడిపోయాయి సినిమాకి సంబంధించిన మొదటి రివ్యూ కూడా బయటకు వచ్చేసింది . Sri Media Nes
సినిమా చూసిన జనాలు ఓ రేంజ్ లో కల్కి సినిమాను పొగిడేస్తున్నారు. నాగ్ అశ్వీన్ డైరెక్షన్ వేరే లెవల్ అని .. ప్రభాస్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో చూసినట్లు మరి ఏ సినిమాలో చూసి ఉండమని ..నిజంగా రెబెల్ అభిమానులకు ఇది ఒక ఫుల్ మీల్స్ సినిమా అని చెప్పుకొస్తున్నారు .
పురాణాలను లింక్ చేసుకొని టెక్నాలజీని ఉపయోగించి నాగ్ అశ్వీన్ అద్భుతమైన ప్రపంచాన్ని చూపించారు.. థియేటర్స్లోకి వెళ్లి సినిమా స్టార్ట్ అయిన తర్వాత మనం సరికొత్త లోకంలోకి వెళ్ళిపోతాం . అంతేకాదు పురాణాలను ఆధునిక ప్రపంచాన్ని కంబైండ్ చేసి నాగ్ అశ్వీన్ విజువల్ వండర్‌తో కథను మలచిన తీరు ఓ రేంజ్ లో ఉంటుంది. సినిమాకి మెయిన్ హైలెట్ వి ఎఫ్ ఎక్స్ ఎఫెక్ట్స్ కచ్చితంగా ప్రతి ఒక్క అభిమానిని అలాగే జనాలని మంత్రముగ్ధులను చేస్తుంది.
క్లైమాక్స్ అయితే అసలు ఎవరు ఊహించని విధంగా ట్విస్టులు ఇచ్చి సప్రైజ్ చేస్తాడు నాగ్ అశ్విన్ ప్రభాస్ సినిమా కావడంతో ఓవర్సీస్ సహా దేశంలోని అన్ని థియేటర్లలోనూ ప్రేక్షకులు భారీ సంఖ్యలో సీనిమాను చూస్తున్నారు. ఓవర్సీస్ ప్రీమియర్స్ భారీ బ్లాక్ బస్టర్ అని చెప్పాలి.యూఎస్ఏ ప్రీమియర్స్‌లో "కల్కి యూనానిమస్ ఎపిక్ బ్లాక్ బస్టర్. అద్భుతమైన విజువల్ వండర్ మాస్టర్పీస్. ఇండియన్ సినిమాలో ఎప్పుడు చూడనటువంటి చిత్రమిది. కళ్లు చెదిరే విజువల్ స్టోరీ టెల్లింగ్తో ప్రతి ఒక్కరు స్టన్ అవ్వడమే. ఇక మాటల్లేవ్ అంతే." అని చెబుతున్నారు. ఓపెనింగ్స్ డే అడ్వాన్స్ సేల్స్ రూ.100 కోట్లు దాటేశాయని అంటున్నారు.
కథని పూర్తిగా రివీల్ చేయను కానీ... సినిమా ఓపెన్ అవ్వడం చాలా ఆసక్తిగా ఓపెన్ అవుతుంది. మహాభారతం టైంలో తాను చేసిన తప్పుని సరిదిద్దుకోవాలని చూస్తున్న అశ్వద్ధామ కలియుగం ముగింపు దశలో ఒక అమ్మాయి కడుపులో దైవం ఉందని తెలిసి తనని కాపాడాలని నిర్ణయం తీసుకుంటాడు... కానీ ఆ అమ్మాయి కడుపులో ఉన్న బిడ్డ వలన తనకి ప్రమాదం అని తెలిసిన క్రూరుడు అయిన యాస్కిన్ తనని చంపాలని చూడగా స్వర్గాన్ని తలపించే కాంప్లెక్స్ లో ఎంటర్ అవ్వాలి అంటే ఆ అమ్మాయిని విలన్స్ కి అప్పగించాల్సిన అవసరం హీరోకి ఏర్పడగా తర్వాత ఏం జరిగింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే అని చెప్పాలి... సినిమా స్టార్ట్ అవ్వడం ఆసక్తిగా స్టార్ట్ అయ్యి తర్వాత కొంచం స్లో అయినట్లు అనిపించినా తర్వాత కథ టేక్ ఆఫ్ అయినప్పటి నుండి మాత్రం మంచి ఇంటెన్స్ సీన్స్ తో, మంచి యాక్షన్ సీన్స్ తో అబ్బురపరిచే విజువల్స్ ఇంటర్వెల్ ఎపిసోడ్ సెకెండ్ ఆఫ్ పై అంచనాలను ఓ రేంజ్ లో పెంచగా…
సెకెండ్ ఆఫ్‌లో అయితే సినిమా చూసే ప్రేక్షకుడు... సీన్ ఏమవుతుందా అన్న ఆసక్తిని సినిమా ఆసాంతం కొనసాగాలే చేసి ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ ఎపిసోడ్ లు ట్విస్ట్ లను రివీల్ చేస్తూ ఎండింగ్ బాగా మెప్పిస్తుంది. ఓవరాల్ గా సినిమా అక్కడక్కడా కొంచెం స్లో అయినట్లు లెంత్ పెరిగినట్లు అనిపించినా కూడా ఎక్కడ ఆ ఫిల్ రాకుండా చేశాడు నాగ్ ఆశ్విన్. ఈ కథను మార్వెల్ సినిమాలకు ఏ మాత్రం తగ్గని విధంగా లార్గెన్‌దేన్ లైఫ్ విజువల్స్, గ్రాఫిక్స్‌తో చెప్పాలని నాగ్ అశ్విన్ ప్రయత్నించాడు. ప్రతి సీన్, యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయి. కాంప్లెక్స్, శంబాల వరల్డ్‌లోకి తీసుకెళతాయి. సినిమాలో ఉపయోగించే గన్స్, వెహికిల్స్ తో పాటు క్యారెక్టర్ లుక్స్ వరకు ప్రతిదీ డిఫరెంట్‌గా క్రియేట్ చేశాడు నాగ్ అశ్విన్. ఒక్కమాటలో చెప్పాలంటే సినిమా అయ్యే సరికి ఆడియన్స్ మాత్రం ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ తోనే బయటికి రావడం ఖాయం
అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్, సుప్రీం యాస్కిన్‌గా కమల్‌హాసన్ తమ పాత్రల్లో జీవించారు. దాదాపు 40ఏళ్ల విరామం తర్వాత వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో కనిపించడం ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్. ముఖ్యంగా కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్ పాత్ర లుక్ చాలా బాగుంది. అదేవిధంగా 81 సంవత్సరాల వయసులో కూడా అశ్వత్థామ పాత్రలో అమితాబ్ తన యాక్షన్ తో అదరగొట్టారు.
ఇక భైరవ పాత్రలోని షేడ్స్ ను ప్రభాస్ చాలా బాగా పలికించాడు. ప్రభాస్ – అమితాబ్ మధ్య సాగే యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. తన పాత్రకు ప్రభాస్ ప్రాణం పోశారు. మొత్తానికి ప్రభాస్ తన లుక్స్ అండ్ యాక్షన్ తో ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాడు. దీపికా పదుకొనేకి చాలా మంచి పాత్ర దొరికింది. ఆమె భగవంతుడ్ని కనే అమ్మగా అలరించింది. నటి శోభన తన పాత్రలో మెరిశారు. మరో కీలక పాత్రలో రాజేంద్ర ప్రసాద్ కూడా చాలా బాగా నటించాడు. అలాగే, దిశా పటానీ, పశుపతి, అన్నా బెన్ లతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
మార్వెల్ సిరీస్ సూపర్ హీరో సినిమాలు వరల్డ్ వైడ్‌గా సినీ అభిమానులను మెప్పించాయి. అలాంటి సూపర్ హీరో మూవీని మన పురాణాల నేపథ్యంలో తెరకెక్కితే ఎలా ఉంటుంది అనడానికి పర్‌ఫెక్ట్ ఎగ్జాంపుల్ కల్కి మూవీ. మహాభారతంలోని కొన్ని పాత్రలు, వారికి ఉన్న అతీత శక్తులకు ఓ ఫిక్షనల్ వరల్డ్‌ను జోడించి దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ మూవీని తెరకెక్కించాడు. కల్కి 2898 ఏడీ విజువల్ వండర్ మూవీ. హాలీవుడ్ సినిమాలకు మరిపించే సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ను పంచుతుంది. ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు ప్రతి ఒక్కరిని మెప్పిస్తుంది.
What's Your Reaction?