అల్లు అర్జున్ సినిమా నుంచి అట్లీ అవుట్! మెగా ఫ్యామిలీ ఎఫెక్ట్..?

‘పుష్ప’ సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌. ఈ సినిమాతో అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా తిరుగులేని హీరోగా ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నాడు. ‘పుష్ప’ సినిమాకు నేషనల్ అవార్డు రావడంతో ఇప్పుడు మన ఐకాన్ స్టార్ సినిమాలకు మాములు డిమాండ్ లేదు.Sri Media News

Jul 17, 2024 - 14:13
Jul 17, 2024 - 17:23
 0  16
అల్లు అర్జున్ సినిమా నుంచి అట్లీ అవుట్! మెగా ఫ్యామిలీ ఎఫెక్ట్..?

అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2’లో బిజీగా ఉన్నాడు. సుకుమార్ ద‌ర్శక‌త్వంలో వ‌స్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుండ‌గా.. త్వర‌లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే ఆయన అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది.  అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిన‌ట్లు తెలుస్తుంది. ఈ అల్లు అర్జున్ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ  ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు అప్పట్లో టాక్ న‌డిచింది.. అయితే ఈ సినిమా కోసం డైరెక్టర్ అట్లీ ఏకంగా రూ.80 కోట్లు డిమాండ్ చేశాడట. దీంతో అంత మొత్తం ఇవ్వలేని మేక‌ర్స్ ఈ ప్రాజెక్ట్‌ను ర‌ద్దు చేసుకున్నారు. ఈ కారణంగా అట్లీ, అల్లు అర్జున్ సినిమా ఆటకెక్కింది. ఈ సమయంలోనే జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ అల్లు అర్జున్‌‌ని కలిసి కథ చెప్పాడట. నెల్సన్ చెప్పిన స్టోరీ అల్లు అర్జున్ బాగా ఇంప్రెస్ అయినప్పటికి...  స్క్రిప్ట్ రెడీగా లేదు.. దీంతో కంప్లీట్‌‌గా స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పారట. సో ఈ సినిమా కూడా ఇప్పట్లో ఉండే అవకాశం లేదు.

అయితే అట్లీ.. అల్లు అర్జున్ సినిమా నుంచి తప్పుకోవడం వెనుక మెగా ఫ్యామిలీ హస్తం ఉందని అల్లు అర్జున్ అభిమానులు అంటున్నారు. దీనికి కారణం ఎన్నికల సమయంలో మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కల్యాణ్‌కు అండగా నిలిస్తే.. అల్లు అర్జున్ మాత్రం నంద్యాల వైసీపీ అభ్యర్థి, తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్దతు ప్రకటించడంతో కొద్ది రోజులుగా మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే.  అప్పటి నుంచి మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. ఇక ఈ ఎన్నికల్లో జనసేన విజయం సాధించడం..అల్లు అర్జున్ మద్దతు ప్రకటించిన శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి ఓడిపోవడంతో మెగా అభిమానులకు అల్లు అర్జున్ ఒక్కసారిగా టార్గెట్ అయ్యారు. దీంతో మెగా ఫ్యామిలి అల్లు అర్జున్ సినిమాకు అడ్డుపడిందని అభిమానులు అంటున్నారు. దీనికి తోడు అట్లీతో సినిమా క్యాన్సిల్ కావడంపై అల్లు అర్జున్ ఇప్పటి వరకు స్పందించలేదు.

దీంతో అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో అనే సందేహం ఐకాన్ స్టార్ అభిమానుల్లో మొదలైంది. అయితే  అల్లు అర్జున్ ఇమీడియట్ ప్రాజెక్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌‌తో ఉండే అవకాశం కనిపిస్తోంది. పుష్ప రిలీజ్ అయిన తర్వాత 2025 మేలో త్రివిక్రమ్ అల్లు అర్జున్‌‌తో సినిమా మొదలుపెట్టే అవకాశం కనిపిస్తోంది. అయితే  త్రివిక్రమ్ సబ్జెక్ట్ కల్కిలా ఉంటుందని.. సమాచారం. ఈ సినిమాను 2027 జనవరి రిలీజ్ చేస్తారని ఓ వార్త ప్రచారంలో ఉంది. ఇప్పటివరకు  త్రివిక్రమ్ తీసిన సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఉండనుందని టాక్.

అయితే ఇక్కడ మరో సమస్య ఉంది. నిజంగా మెగా ఫ్యామిలి అల్లు అర్జున్‌‌కు వ్యతిరేఖంగా ఉంటే... త్రివిక్రమ్ సినిమా ఎలా తీస్తాడు.. సినీ పరిశ్రమలో పవన్ కళ్యాణ్.. త్రివిక్రమ్ బెస్ట్ ఫ్రెండ్స్ అని అందరికి తెలిసిందే.. సో నిజంగా అల్లు అర్జున్‌‌‌‌ని మెగా ఫ్యామిలి టార్గెట్ చేస్తే... త్రివిక్రమ్ అల్లు అర్జున్‌‌తో సినిమా చేస్తాడా... చెప్పండి?. దీని బట్టి అర్థం చేసుకోవచ్చు.. మెగా, అల్లు ఫ్యామిలిల్లో గొడవలు లేవని...

కాగా త్రివిక్రమ్, అల్లు ఈ కాంబోలో  వచ్చిన. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురంలో సినిమాలు రిలీజ్ అయ్యి ఏ రేంజ్ హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక నాలుగోసారి ఈ కాంబో రిపీట్ అవుతుంది.  త్రివిక్రమ్ మాములు సినిమాల్లోనే పురాణాల గురించి చెప్పుకొస్తాడు. అలాంటిది ఈ సినిమా మొత్తం పురాణాలకు సంబంధించిదే ఉండబోతుందంటే.. ఏరేంజ్‌‌లో ఉంటుందో... మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలి.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow