రాజ్ తరుణ్ కేసులో మరో ట్విస్ట్ 3 కత్తిపోట్లు.. ఏం జరిగిందంటే..!

హీరో రాజ్‌తరుణ్‌ ట్రయాంగిల్ లవ్ స్టోరీ రోజుకో మలుపు తిరుగుతుంది. పెళ్లి చేసుకుంటానని చెప్పి.. ఇప్పుడు తనను మోసం చేశాడంటూ రాజ్ తరుణ్ లవర్ లావణ్య పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు ఇవ్వడంతో... ఒక్కసారిగా రాజ్‌ తరుణ్‌ ట్రెండింగ్‌లోకి వచ్చేశాడు.Sri Media News

Jul 17, 2024 - 14:06
 0  16
రాజ్ తరుణ్ కేసులో మరో ట్విస్ట్ 3 కత్తిపోట్లు.. ఏం జరిగిందంటే..!
Raj Tarun Lavanya Live-in case

ప్రస్తుతం ‘తిరగబడరా సామి’ అనే సినిమాలో నటిస్తున్న రాజ్ తరుణ్.. ఈ సినిమాలో హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో ఎఫైర్ పెట్టుకున్నాడని రాజ్ తరుణ్ లవర్ లావణ్య రాజ్‌ తరుణ్‌ మీద సంచలన ఆరోపణలు చేయడమే కాక..  నటి మాల్వి మల్హోత్రాతో పరిచయం తర్వాతే రాజ్‌ తనను దూరం  పెట్టాడని.. మాల్వి, ఆమె సోదరుడు తనను బెదిరిస్తున్నారని ఆరోపించింది. అలానే మాల్వి మల్హోత్రా కూడా లావణ్య మీద ఆరోపణలు చేయడమే కాక.. ఇద్దరూ ఒకరి మీద ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో రాజ్ తరుణ్‌‌ను ఏ1గా, మాల్వి మల్హోత్రాను ఏ2గా, ఆమె తమ్ముడు మయాంక్ మల్హోత్రాను ఏ3గా  చేర్చి పోలీసులు కేసునమోదు చేశారు. రాజ్ తరుణ్‌‌కి నోటీసులు పంపించారు.

ఇదిలా ఉండగా.. ఈ కేసు విషయంలో తాజాగా ఓ షాకింగ్ విషయం బయటకు వచ్చింది. మాల్వి మల్హోత్రా మీద కత్తితో అటాక్‌ చేశారట.. మూడు సార్లు కత్తితో పొడిచారట.. ఈ ఘటనలో గాయపడిన మాల్విని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స కూడా అందించారట... అయితే ఈ దాడి జరిగింది. ఇప్పుడు కాదు.. 4 సంవత్సరాల క్రితం.. 2020 అక్టోబర్‌‌‌లో జరిగింది.

2020 సమయంలో మాల్వికి, యోగేష్‌ అనే ప్రియుడు ఉండేవాడు.. వీరిద్దరికి సోషల్‌ మీడియా ద్వారా పరిచయం ఏర్పడగా కొద్ది రోజులకు ఇద్దరూ ప్రేమలో పడ్డారు. అలా ఇద్దరూ కొన్ని రోజులు రిలేషన్‌లో ఉన్నారు. ఆ తర్వాత ఇద్దరికి గొడవలు రావడంతో.. విడిపోయారు. ఆ తరువాత కూడా యోగేష్ మాల్విని వదిలి పెట్టకుండా.. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చేవాడు. కానీ మాల్వి అంగీకరించలేదు. దీంతో మాల్వి పై పగ పెంచుకున్నయోగేష్‌.. మాల్విని కత్తితో పొడిచి పారిపోయాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మాల్విని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఆమె వేలికి శస్త్రచికిత్స కూడా జరిగింది. ఈ ఘటనపై అప్పట్లో పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో మర్డర్ అటెంప్ట్ కేసులో యోగేష్‌ అరెస్ట్ అయ్యాడు.

ఇక తాజాగా యోగేష్‌ తల్లి.. మాల్వి మల్హోత్రా మీద కేసు పెట్టింది. మాల్వి మల్హోత్రా ప్రేమ పేరుతో తన కొడుకు యోగేష్‌ని ట్రాప్ చేసి, ఆస్తులు కాజేసి జైలుపాలు చేసిందని ఫిర్యాదులో చెప్పుకొచ్చింది. మాల్వి మీద కత్తితో దాడి చేసింది అనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. మాల్వి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.

కాగా.. ఈ కేసులో రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. లావణ్యకు డ్రగ్స్ అలవాటు ఉందని... అందుకే దూరం పెట్టాను అని చెబుతున్నాడు.  2017 నుంచి తనకు దూరంగా ఉంటు వస్తున్నాను అని.. అంతకు ముందు రిలేషన్‌‌లో ఉన్న మాట వస్తవమే కానీ... 2017 నుంచి మా మధ్య ఎటువంటి శారీరక సంబంధం లేదని..  నా పరువు పోతుందని అన్ని మూసుకొని ఉన్నను అందువల్లే ఈ రోజు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నను అని చెబుతున్నాడు.  

ఇదిలా ఉంటే గతంలో లావణ్య మీడియాతో మాట్లాడుతూ..‘రాజ్ తరుణ్, నేను 11 ఏళ్లుగా రిలేషన్‌లో ఉన్నాం.. 2012లో మా ఇద్దరి రిలేషన్ మొదలైంది. 2014, మే 11 నుంచి ఇద్దరం సహజీవనంలో ఉంటున్నాం.. 11 ఏళ్లుగా ఒకే ఇంట్లో ఉంటున్నాం.. మా ఇద్దరి మధ్య శారీరకంగా, మానసికంగా విడదీయలేని అనుబంధం ఉంది.. నన్ను, గుడిలో రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నాడు. అయితే సినిమాల్లోకి వెళ్లిన తర్వాత మాల్వి మల్హోత్రా ఎఫైర్ పెట్టుకుని, నన్ను పట్టించుకోవడం మానేశాడు. ‘తిరగబడరా సామి’ సినిమా షూటింగ్ సమయంలోనే ఈ ఇద్దరూ డీప్ రిలేషన్‌లోకి వెళ్లారు. ఆమెని కలవడానికి రాజ్ తరుణ్ ముంబైకి వెళ్తున్నాడు. రాజ్, 3 నెలలుగా ఇంటికి రావడం లేదు. నాతో పరిచయం లేనట్టుగా ప్రవర్తిస్తున్నాడు.. అతను నా ప్రపంచం.. నాకు రాజ్ తరుణ్ కావాలి. హీరోయిన్ హైదరాబాద్‌కి వచ్చినప్పుడు డైరెక్టర్ సాంటో మోహన్ వీరంటి ఇంట్లో రాజ్ తరుణ్‌తో కలిసి ఉంటోంది. ఇద్దరూ కలిసి గోవా, చెన్నై, పుదుచ్చేరి వెళ్తున్నారు. అని మీడియాకు చెప్పిన  సంగతి తెలిసిందే. మరి రాజ్‌ తరుణ్‌ కేసులో పోలీసులు, న్యాయస్థానం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow