హత్య కేసు లో స్టార్ హీరో అరెస్ట్..

దర్శన్ అంటే ప్రాణం ఇచ్చే ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో రేణుకా స్వామి కూడా ఉన్నాడు. ఈ యువకుడికి దర్శన్ అంటే చాలా ఇష్టం. కానీ పవిత్ర గౌడ అంటే అసహ్యం.Sri Media News

Jun 12, 2024 - 14:28
 0  13
హత్య కేసు లో స్టార్ హీరో అరెస్ట్..
Darshan, Renuka swami, Pavithra Goud

దర్శన్ అంటే ప్రాణం ఇచ్చే ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో రేణుకా స్వామి కూడా ఉన్నాడు. ఈ యువకుడికి దర్శన్ అంటే చాలా ఇష్టం. కానీ పవిత్ర గౌడ అంటే అసహ్యం. 33 ఏళ్ల రేణుకా స్వామి చిత్ర దుర్గలోని అపోలో ఫార్మసీలో పని చేస్తు కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కానీ నటి పవిత్ర తో దర్శన్ రిలేషన్ ను మనోడు జీర్ణించుకోలేకపోయాడు. ఆమె పెట్టే పోస్టులకు రేణుకా స్వామి అసభ్య సమాధానాలతో రిప్లైలు ఇచ్చేవాడు. వాటిని పవిత్ర తట్టుకోలేకపోయింది. అసభ్య పదాలతో పోస్ట్ లు పెడుతుండటంతో తన ప్రియుడు దర్శన్ కు విషయం చెప్పింది. దీంతో ఒక సారి ఇంతకు ముందే పవిత్ర జోలికి రావొద్దని దర్శన్ తన మనుషుల ద్వారా చెప్పించాడట.

కానీ దర్శన్ అంటే పిచ్చి సైకో ప్రేమ పెంచుకున్న రేణుకా స్వామి వ్యక్తిగతంగా తీసుకున్నాడు. పవిత్రను ప్రతి సారి అసభ్య మెసేజ్ లతో కామెంట్ లు పెడుతూ చిరాకు పెట్టాడు. దాంతో పవిత్ర గౌడ హర్ట్ అయింది. రేణుకా స్వామి అంతు చూడాలని దర్శన్ కు చెప్పింది. అతను తన బౌన్సర్లను రంగంలోకి దించాడు. చిత్రదుర్గలో రేణుకా స్వామి ఉంటాడని తెలుసుకున్నారు దర్శన్ అనుచరులు. వారు చిత్రదుర్గలోని దర్శన్ ఫ్యాన్స్ అద్యక్షుడి సహకారంతో బెంగళూరుకు రేణుక స్వామిని రప్పించాడు. అక్కడే దర్శన్ ఫ్యాన్ అయిన రేణుకా స్వామిని కిడ్నాప్ చేశారు. దర్శన్ అనుచరుడికి చెందిన కారు షెడ్ లో జూన్ ఎనిమిదిన బంధించారు. అక్కడ చిత్ర హింసలకు గురి చేసి రేణుకస్వామిని హత్య చేశారు. ఆ తర్వాత కార్ షెడ్ దగ్గర్లో ఉన్న మురుగు కాలువలో రేణుకస్వామి మృతదేహాన్ని పడేశారు. మరుసటి రోజున అపార్ట్మెంట్ వాచ్ మన్ మృతదేహాన్ని చూశాడు. కుక్కలు మురుగుకాలువలోని రేణుకాస్వామి మృతదేహాన్ని ఒడ్డుకు లాక్కొచ్చేందుకు ప్రయత్నిస్తుండగా అరుపులు విని వాచ్ మన్ వెళ్లి చూశాడు. మనిషి శవమని గుర్తించిన వాచ్ మన్ కుక్కలను వెళ్లగొట్టి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు విచారణ చేయడంతో మిస్సింగ్ కేసు ఆధారంగా రేణుకస్వామిని గుర్తించారు పోలీసులు. అయితే శరీరం పై గాయాలు కనిపించడంతో పోలీసులు అనుమానించారు. పోస్టుమార్టం చేయగా చిత్రహింసలకు గురిచేసి హత్య చేశారని నివేదికలో తేలింది. అంతే కాదు ఐరన్ రాడ్ లాంటి వాటితో తీవ్రంగా బాధినట్లు గుర్తించారు డాక్టర్లు. పోలీసులు వెంటనే సీసీటీవీ ఫుటేజ్ లను విశ్లేషించడం మొదలు పెట్టారు. మరోవైపు సాంకేతిక ఆధారాలను గుర్తిస్తున్న సమక్షంలో పోలీసుల చుట్టూనే తిరుగుతున్న హంతకులు ఇక దొరికినట్లేనని కొత్త డ్రామా మొదలు పెట్టారు. దర్శన్, అతని ప్రియురాలు పవిత్ర, అనుచరులు నయా స్క్రీన్ ప్లే స్టార్ట్ చేశారు. దర్శన్ అనుచరులు కామాక్షి పాళ్య పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. ఆర్ధిక లావాదేవీల కారణంగానే రేణుక స్వామిని హత్య చేశామని ఒప్పుకున్నారు. ఎందుకంటే దర్శన్ ను నటి పవిత్రను కాపాడేందుకు ఇదంతా వాళ్లు వేసిన స్కెచ్. కానీ పోలీసులకు అనుమానం కలిగింది. తమకు తాముఎందుకు లొంగిపోతారని భావించి తమదైన శైలిలో విచారణ చేసి ట్రీట్ మెంట్ ఇవ్వడంతో అసలు కథ బయటకు వచ్చింది. హీర్ దర్శన్ సూచనల మేరకు హత్య చేశామని ఒప్పుకున్నారు. దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడను వేధిస్తుండటంతో హత్య చేశామన్నారు. కానీ మొత్తం సీన్ ను పవిత్ర గౌడ నడిపనట్లు పోలీసులు గుర్తించారు. ఆమెనే వారికి దర్శకత్వం వహించడమే కాదు దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేసింది. అందుకే ఏ వన్ గా పవిత్ర గౌడ, ఏటూ గా ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ లను చేర్చి అరెస్ట్ చేశారు. ఇప్పుడు కోర్టులో ప్రవేశపెట్టగా పోలీస్ కస్టడిలో ఉన్నాడు దర్శన్. మీడియా కనిపించగానే నాకేమి తెలియదు. నేను రేణుకస్వామిని హెచ్చరించి వెళ్లిపోయాను. ఆ తర్వాత నాకేమీ తెలియదంటున్నాడు దర్శన్. వాస్తవానికి ఇది సిల్లీ ఇష్యూ. ఫ్యాన్స్ అన్నప్పుడు లక్షల రకాలు ఉంటారు. వారి మెస్సేజ్ లను కామెంట్ లను పట్టించుకోకుంటే సరిపోయేది. కానీ పవిత్ర గౌడ అతి కాస్త హాయిగా స్టార్ హీరో గా చెలామణి అవుతున్న దర్శన్ కెరీర్ మాత్రమే కాదు లైఫ్ కూడా డేంజర్ లో పడిందని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

దర్శన్ మొదట డిగ్రీ పూర్తైన తర్వాత అసిస్టెంట్ కెమరామన్ గా పనిచేశాడు. తర్వాత టీవీ సీరియెల్స్ లో కూడా నటించారు. అయితే శివరాజ్ కుమార్ మూవీ దేవర మగ లోని క్యారెక్టర్ కి  మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత వరుసగా సపోర్టింగ్ రోల్స్ చేశాడు దర్శన్. చిన్న రోల్స్ చేస్తున్న సమయంలో మేజస్టిక్ అనే మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు. ఇది హిట్ కావడంతో క వెనక్కి తగ్గలేదు. ఆ తర్వాత వరుసగా నినగోస్కర, దాస, కరియా, నమ్మ ప్రీతియ రాము లాంటి హిట్స్ వచ్చాయి. తర్వాత దత్త, భూపతి మూవీస్ తో ఏకంగా ఛాలెంజింగ్ స్టార్ అయ్యాడు. అంతే కాదు తెలుగు పోకిరిని కూడా రీమేక్ చేసుకుని హిట్ కొట్టి స్టార్ అయ్యాడు దర్శన్. ఇలా స్టార్ గా సెటిలైన దర్శన్ మీద అతని భార్య విజయలక్ష్మి 2011 లో గృహ హింస కేసు పెట్టింది. తనను కొడుతున్నాడని, బయట హీరో, ఇంట్లో విలన్ అంటూ ఏకంగా కేసు పెట్టింది. దీంతో 14 రోజుల జ్యుడిషయల్ రిమాండ్ లో కూడా గడిపాడు దర్శన్. ఇంతకీ విజయలక్ష్మి ఎవరంటే అదో పెద్ద సినిమా కథ. సపోర్టింగ్ రోల్స్ చేస్తున్న సమయంలోనే విజయలక్ష్మి అనే దూరపు బంధువు పరిచయమైంది. అప్పుడు సరిగ్గా ఇంటర్మీడియెట్ పాస్ అయింది. కానీ ఆమెను ఒక పార్టీలో మొదటిసారి కలుసుకున్నాడు. తన ఫ్రెండ్స్ ద్వారా ఫంక్షన్ కు వచ్చింది. ఆక్కడ చూడగానే విజయలక్ష్మితో లవ్ లో పడ్డాడు. ఆ తర్వాత వరుసకు మరదులు కూడా అయ్యే విజయలక్ష్మితో డీప్ లో లవ్ లో పడ్డాడు.

చిన్న పాత్రలు చేస్తున్న దర్శన్ మేజిస్టిక్ మూవీతో సడెన్ స్టార్ లా సడెన్ హిట్ కొట్టాడు. ఇంకేముంది ఒక్క హిట్ తో సెటిలైపోయాడు. అప్పుడే కెమికల్ ఇంజనీరింగ్ చదువుతున్న 19 ఏళ్ల లక్ష్మితో డీప్ గా లవ్ లో పడి కెమికస్ట్రీ కుదిరిందని ఆవేశపడ్డాడు. ఆ తర్వాత విజయలక్ష్మి తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో లేపుకెళ్లి ధర్మస్థలిలో పెళ్లి చేసుకున్నాడు. అలా సెన్సేషన్ క్రీయేట్ చేశాడు. ఇక ఆ తర్వాత వీరికి వినీష్ అనే కొడుకు పుట్టాడు. 2010 వరకు వీరి పెళ్లి బాగానే సాగింది. కానీ ఆ తర్వాత పవిత్ర గౌడ అనే నటి కమ్ ఫ్యాషన్ డిజైనర్ తో రిలేషన్ షిప్ మొదలు పెట్టాడు. ఈమెకు పెళ్లై కూతురు కూడా ఉంది. పవిత్ర గౌడతో అక్రమ సంబంధం నెరుపుతున్నాడనే వార్తలు వచ్చాయి. మరోవైపు దర్శన్ కు విజయలక్ష్మి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆమె మీద చేయి చేసుకోవడంతో ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారామె. గృహ  హింస కేసు పెట్టడంతో 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నాడు. ఈ వివాదం దర్శన్ పరువు తీసిందని చెప్పొచ్చు. కానీ కోర్టు బయట భార్యతో బంధువుల మధ్య వివాదాన్ని సెటిల్ చేసుకున్నాడు. ఇక మీదట బుద్దిగా నడుచుకుంటానని చెప్పాడు. కానీ భార్యతో వివాదం కొనసాగుతూనే వచ్చింది. ఏదో ఒక సందర్భంలో వారికి విభేదాలు రావడం కామనయ్యాయి. విడాకుల కోసం భార్య మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు. ఇద్దరూ వేర్వేరుగానే ఉంటున్నారు.

ఇక భార్య విజయలక్ష్మితో దూరం కాగానే పవిత్ర గౌడకు మరింత దగ్గరయ్యాడు దర్శన్.  ఆ టైమ్ లోనే నటి పవిత్ర గౌడతో రిలేషన్ మెయింటెయిన్ చేస్తున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ ఎప్పుడూ వాటిని దర్శన్ కానీ పవిత్ర గౌడ కాని ఖండించలేదు. ఇన్ స్టాలో మాత్రం దర్శన్ తో ఉన్న ఫోటోలను పెడుతుండేది. దర్శన్ ఫ్యాన్స్ మాత్రం నువ్వెవరు మా హీరోతో ఫోటోలు పెట్టుకుంటున్నావని ట్రోల్ చేసేవారు. దీంతో ఆమె డిలీట్ చేసేది. ఇక దర్శన్ భార్య విజయలక్ష్మి, తన కొడుకు వినీష్ తో ఉన్న ఫ్యామిలీ ఫోటోను ఇన్ స్టాలో షేర్ చేసింది. దిస్ ఈజ్ అస్ అంటూ క్యాప్షన్ పెట్టింది. నేను, నా భర్త, నా కొడుకంటూ విజయలక్ష్మి షేర్ చేసిన ఫోటో వైరల్ అయింది. దాంతో పవిత్ర గౌడ కూడా తన ప్రియుడు దర్శన్ తో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ఇప్పటికే పదేళ్ల మనిద్దరి తీపి ప్రేమ తాలుకు గుర్తులు పూర్తయ్యాయి. ఇంకా సాగుతూనే ఉందని కౌంటర్ ఇచ్చింది. దీంతో వెంటనే దర్శన్ బార్య విజయలక్ష్మి కౌంటర్ ఇచ్చింది. నీకు సిగ్గు లేదా? వేరే వారి భర్తతో ఫోటోలు దిగి షేర్ చేసేందుకు..నీమీద నేను లీగల్ యాక్షన్ తీసుకుంటానని హెచ్చరించింది. అయినా పవిత్ర గౌడ లెక్క చేయలేదు. హార్డ్ టైమ్స్ టుగెదర్, ఫరెవర్, లవ్ ఫరెవర్ అంటూ హ్యాష్ టాగ్ లతో రెచ్చకొట్టింది దర్శన లవర్ పవిత్ర గౌడ.

ఆ వెంటనే మరింత వివాదం చేసింది విజయలక్ష్మి. పవిత్ర గౌడ మాజీ భర్త సంజయ్ సింగ్, కూతురు ఖుషీలతో కూడిన ఫోటోను షేర్ చేసింది. బహుషా ఈమెకు ఇప్పుడైనా తెలివి వస్తుందనుకుంటున్నాను. వేరే వారి మొగుడిని నా మొగుడని చెప్పుకుంటుంది. నైతిక విలువలు లేవు, క్యారెక్టర్ కూడా లేదంటా ఫైర్ అయింది. వ్యక్తి గత విషయాలను ఇలా ఆన్ లైన్ లో చేయడం తప్పే… కానీ నేను వాయిస్ రెయిజ్ చేయాల్సిన సమయం వచ్చిందని విజయలక్ష్మి రాసుకొచ్చింది. దీంతో దర్శన్ ఫ్యాన్స్ కూడా విజయలక్ష్మి వైపే మొగ్గు చూపారు. మా హీరో, మా అన్న, మా వదిన ల కుటుంబంలోకి నువ్వెందుకు వచ్చావు. నీ వల్లే మా హీరో ఇబ్బందులు పడుతున్నారంట దర్శన్ ఫ్యాన్స్ ఎటాక్ చేయడం మొదలు పెట్టారు. దీంతో ఆమె వెనక్కి తగ్గేది. మళ్లీ పోస్టులు పెడుతూనే ఉండేది. ఈ విషయంలో దర్శన్ ఫ్యాన్స్ మొత్తం పవిత్రకు వ్యతిరేకంగా మారారు. అలా మారిన వారిలో రేణుక స్వామి కూడా ఉన్నాడు. రేణుక స్వామి అసభ్యకరంగా పోస్టులు పెట్టాడు . 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow