కొన్నిరోజులైతే మరీ దారుణంగా పెట్రోల్ బంకుల వద్ద పడుకునేవాడు. రోజుల తరబడి పస్తులుండి, అన్నం కోసం అలమటించారు. కానీ అనుకోకుండా అసెస్టెంట్ డైరెక్టర్‌గా అవకాశం వచ్చింది.. ఆ తరువాత అనూహ్యంగా హీరోగా అవకాశం వచ్చింది. అంతే ఉయ్యాల జంపాలలో హీరోగా వచ్చిన తరువాత అవకాశాల కోసం వెతుక్కోవాల్సిన అవసరం రాలేదు. సినిమా చూపిస్తా మామ , కుమారి21F మూవీలతో వరుసగా మూడు హిట్లు తన ఖాతాలో వేసుకోవటంతో.. ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాడు. ఎంత కష్టపడి సినిమాల్లోకి వచ్చిన రాజ్‌తరుణ్ ఫేమ్ సడెన్‌గా పడిపోవటానికి గల కారణాలు ఏంటి? అసలు సినిమాలు అంటే ఇష్టం లేని రాజ్ తరుణ్ మూవీస్‌నే కెరియర్‌గా ఎందుకు ఎంచుకున్నాడు? నిజంగానే లావణ్యను లవ్ పేరుతో మోసం చేశాడా? అసలు ఏంటీ రాజ్‌తరుణ్ లైఫ్ స్టోరీ? హావ్ ఏ లుక్..
చూడగానే మనోడే అనిపించే పర్సనాలిటీ. ఒక్కమాటలో చెప్పాలంటే పక్కింటి కుర్రాడిలా ఉంటాడు రాజ్ తరుణ్. అదే అతనికి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. చాలా షార్ట్ ఫిలిమ్స్‌లో నటించిన రాజ్ తరుణ్.. డైరెక్టర్ కావాలని హైద్రాబాద్ వచ్చాడు. రాజ్ తరుణ్‌కి సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఏమీ లేదు. రాజ్ తరుణ్ 1992లో మే 11వ తేదీన వైజాగ్‌లో పుట్టాడు. తండ్రి పేరు బసవరాజు బ్యాంకు ఉద్యోగం చేసేవాడు. తల్లి హౌస్ వైఫ్. వీరిద్దరికి ఏకైక సంతానం రాజ్ తరుణ్. తండ్రిది శ్రీకాకుళం కాగా, తల్లిది గోదావరి. తల్లి వారసత్వం బాగా వంటపట్టడంతో.. రాజ్ తరుణ్‌కి గోదావరి యాస వచ్చింది. తండ్రి ఉద్యోగం కారణంగా విశాఖపట్నంలో సెటిల్ అయ్యారు.
రాజ్ తరుణ్ తన స్కూలింగ్ మెుత్తం వైజాగ్‌లోనే పూర్తి చేశాడు. ఇంటర్మీడియట్ పూర్తయ్యాక ఎంసెట్ రాశాడు. అందులో మంచి ర్యాంకు రావడంతో ఎంవిజిఆర్ కాలేజీలో ఇంజినీరింగ్ సీటు వచ్చింది. కానీ ఆరు నెలల మాత్రమే కాలేజీకి వెళ్లాడు. రాజ్ తరుణ్‌కు మొదట్లో సినిమాలంటే అస్సలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అయితే అతను 8వ తరగతి చదువుతున్న టైమ్‌లో కాలికి దెబ్బ తగిలింది. దీంతో మూడు నెలల పాటు కంప్లీట్ బెడ్ రెస్ట్ ఇవ్వటంతో ఇంటికే పరిమితమయ్యాడు. దీంతో తన ఫ్రెండ్స్‌కి చెప్పి రోజుకు మూడు సినిమాలను సిడీలు తెప్పించుకుని మరీ చూసేవాడట. అలా సినిమాలపై ఆసక్తి పెంచుకున్నాడు రాజ్ తరుణ్.
అయితే రాజ్ తరుణ్ ఇంజినీరింగ్ చదివే టైమ్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి మహేష్ బాబు యాక్ట్ చేసిన ఒక్కడు సినిమాకు వెళ్లాడు. అది తనకు బాగా నచ్చడంతో మళ్లీ మళ్లీ వెళ్లి చూసి వచ్చేవాడు. అప్పటి నుండి మహేష్ బాబుకు వీరాభిమానిగా మారిపోయాడు రాజ్ తరుణ్.
సినిమాలపై ఇంట్రెస్ట్‌తో ఇండస్ట్రీకి వెళ్లాలని అనుకున్నాడు. దీంతోనే డైరెక్టర్ అవుదామనుకుని, తానే స్వయంగా కథలు రాసుకుని, తన ఫ్రెండ్ సుభాష్‌తో కలిసి షార్ట్ ఫిల్మ్స్ తీయటం స్టార్ట్ చేశాడు. వాటిని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయటంతో.. ఫుల్ వైరల్‌గా మారాయి ఆ వీడియోస్.
ఆ వీడియోలను తన తండ్రికి చూపించగా ఆయన రాజ్ తరుణ్ ను మెచ్చుకుని, మంచి కెమెరా గిఫ్ట్‌గా ఇచ్చారు. అప్పటి నుండి పూర్తిస్థాయి షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్‌గా మారిపోయాడు రాజ్ తరుణ్. తానే డైరెక్షన్, కథ, మాటలు రాసుకొని, తన వీడియోస్‌లో తానే యాక్టింగ్ చేయటం మెుదలు పెట్టాడు. ఆ వీడియోస్‌కి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో.. మంచి డైరెక్టర్ కావాలని.. హైద్రాబాద్‌కు వచ్చేశాడు.
భాగ్యనరంలో రాజ్ తరుణ్‌కు తొలి ఆరునెలల పాటు అడుగడుగునా అవమానాలు ఎదురయ్యాయి. ఎన్ని ఆడిషన్లకు వెళ్లినా, ఎన్ని షార్ట్ ఫిల్మ్ లు చూపించినా నిరాశే ఎదురయ్యేది. కొన్నిరోజులైతే ఉండటానికి షెల్టర్ కూడా లేక పెట్రోల్ బంకులో పని చేసి అక్కడే పడుకునేవాడు. తినటానికి తిండి లేక, దాదాపు రోజుల తరబడి పస్తులున్నాడు. ఇన్ని కష్టాల పడటం కంటే ఇంటికి తిరిగి వెళ్లిపోవటం బెటర్ అంటూ ఫ్రెండ్స్ సలహా ఇచ్చినా.. తన సిచ్యువేషన్ ఇంట్లో తెలియకూడదు.. ఏదైనా సాధించే ఇంటికి వెళ్లాలని ఫిక్స్ అయ్యాడు రాజ్ తరుణ్. దీంతో పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ తన ఖర్చులు తనే చూసుకుంటూనే.. సినిమాల్లో ట్రైల్స్ కూడా చేయటం మెుదలు పెట్టాడు.
ఈ క్రమంలోనే ఉయ్యాల జంపాల మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా అవకాశం వచ్చింది. అలా ‘ఉయ్యాల జంపాల’ మూవీ స్టోరీ, డైరెక్షన్ డిపార్ట్ మెంట్స్ లో వర్క్ చేయటం స్టార్ట్ చేశాడు. ఆ సమయంలోనే ఆ మూవీ డైరెక్టర్ విరించి వర్మ సినిమాలో హీరో క్యారెక్టర్‌కు రాజ్ తరుణ్ అయితే బాగుంటుందని అనుకున్నాడు. అలా అనుకోకుండా ‘ఉయ్యాల జంపాల’ హీరో అయిపోయాడు రాజ్ తరుణ్. ఇది చాలా చిన్న సినిమా. కానీ, అక్కినేని నాగార్జున, దగ్గుబాటి సురేశ్ బాబు వంటి పెద్దవారు ఈ చిత్రం రూపకల్పన వెనుక ఉన్నారు. వీరికి తోడు పి.రామ్మోహన్ కూడా సినిమాకు భాగస్వామి. అవికా గోర్ హీరోయిన్‌గా నటించిన ‘ఉయ్యాల జంపాల’ మంచి విజయం సాధించింది. దాంతో రాజ్ తరుణ్ హీరోగా బిజీ అయిపోయాడు. ఆ తరువాత వచ్చిన సినిమా చూపిస్తా మావా, కుమారి 21F బ్యాక్ టూ బ్యాక్ బిగ్ హిట్స్ కావటంతో నెక్స్ట్ జనరేషన్ టాలీవుడ్ హీరో దొరికేశాడు అని అనుకోవటం మెుదలు పెట్టారు.
ఇలా వరుస విజయాలు చూసిన రాజ్ తరుణ్ కాల్ షీట్స్ కోసం డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ రావటం మెుదలు పెట్టారు. “సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు, ఈడో రకం ఆడో రకం, కిట్టూ ఉన్నాడు జాగ్రత్త, అంధగాడు, రంగుల రాట్నం, రాజుగాడు, లవర్, ఇద్దరి లోకం ఒకటే,ఒరేయ్ బుజ్జిగా, పవర్ ప్లే, అనుభవించు రాజా” వంటి చిత్రాల్లో నటించేశాడు రాజ్ తరుణ్. కానీ ఈ మూవీస్ ఏవీ యావరేజ్ అన్న టాక్ కూడా తెచ్చుకోలేదు. దీంతో ఒక్కసారిగా రాజ్ తరుణ్ ఫేమ్ పడిపోవటం స్టార్ట్ అయ్యింది.
సినిమా అవకాశాలు రాక, ఫేమ్ పడిపోయి.. మళ్లీ ఒక్క ఛాన్స్ అంటూ డైరెక్టర్స్ చుట్టూ తిరగటం మెుదలు పెట్టాడు రాజ్ తరుణ్.. ఈ క్రమంలోనే.. 2019లో హైదరాబాద్ శివారు అల్కాపురి టౌన్ షిప్ వద్ద కారు యాక్సిడెంట్ చేశారు. యాక్సిడెంట్ చేసిన వెంటనే రాజ్ తరుణ్ కారు వదిలి పారిపోయిన విజువల్స్ సీసీటీవీలో బయటకు రావడంతో పెద్ద రచ్చ జరిగింది.
ఈ వీడియో ఫుటేజ్ పలు చానళ్లకు దక్కడంతో ఇంకేముంది ఏదో జరిగిపోతోంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగిపోయింది. వేగంగా డివైడర్ను ఢీకొట్టిన కారు మూడు పల్టీలు కొట్టిన తరువాత రోడ్డు పక్కన ఉన్న ఒక గోడకు గుద్దుకుని ఒక ఖాళీ స్థలంలోకి వెళ్ళి ఆగింది. అయితే అది లగ్జరీ కారు కావడంతో రాజ్ తరుణ్ కు గాయాలు కాలేదు. దీంతో వెంటనే కారులోంచి దిగిన ఆయన అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ దగ్గర్లోనే ఉన్న తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ వీడియో అప్పట్లో తెగ వైరల్ అయ్యింది.
ఇదంతా ప్రజలు మర్చిపోతున్నారు అన్న టైమ్‌లో.. హీరో రాజ్ తరుణ్ లవర్ లావణ్య డ్రగ్స్‌తో పోలీసులకు పట్టుబడింది. గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు గుర్తించిన ఎస్‌వోటీ పోలీసులు.. ఆమె వద్ద 4గ్రాముల MDMA డ్రగ్స్ సీజ్ చేశారు. డ్రగ్స్ కేసులో ఈమె పట్టుబడటంతో.. అప్పటికే తగ్గిపోయిన రాజ్‌తరుణ్ ఫేమ్ కాస్తా గ్రౌండ్ లెవల్‌కి వెళ్లిపోయింది. ఇక అప్పటి నుంచి ఆమెకు దూరంగా ఉండటం మెుదలు పెట్టాడు రాజ్ తరుణ్. అయితే ఈ ఇష్యూ జరగకముందు అంటే దాదాపు 11 ఏళ్లు ఇద్దరూ లివ్ ఇన్‌లోనే ఉన్నారు.
తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి.. ఇప్పుడు తనను మోసం చేశాడంటూ లావణ్య పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో ఒక్కసారిగా రాజ్ తరుణ్ ట్రెండింగ్‌లోకి వచ్చేశాడు.
ప్రస్తుతం ‘తిరగబడరా సామి’ అనే సినిమాలో నటిస్తున్న రాజ్ తరుణ్.. ఈ సినిమాలో హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో ఎఫైర్ పెట్టుకుని, తనను పట్టించుకోవడం లేదంటూ నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది లావణ్య.
‘రాజ్ తరుణ్, నేను 11 ఏళ్లుగా రిలేషన్‌లో ఉన్నాం.. 2012లో మా ఇద్దరి రిలేషన్ మొదలైంది. 2014, మే 11 నుంచి ఇద్దరం సహజీవనంలో ఉంటున్నాం.. 11 ఏళ్లుగా ఒకే ఇంట్లో ఉంటున్నాం.. మా ఇద్దరి మధ్య శారీరకంగా, మానసికంగా విడదీయలేని అనుబంధం ఉంది.. నన్ను, గుడిలో రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నాడు. అయితే సినిమాల్లోకి వెళ్లిన తర్వాత మాల్వి మల్హోత్రా ఎఫైర్ పెట్టుకుని, నన్ను పట్టించుకోవడం మానేశాడు. ‘తిరగబడరా సామి’ సినిమా షూటింగ్ సమయంలోనే ఈ ఇద్దరూ డీప్ రిలేషన్‌లోకి వెళ్లారు. ఆమెని కలవడానికి రాజ్ తరుణ్ ముంబైకి వెళ్తున్నాడు. రాజ్, 3 నెలలుగా ఇంటికి రావడం లేదు. నాతో పరిచయం లేనట్టుగా ప్రవర్తిస్తున్నాడు.. అతను నా ప్రపంచం.. నాకు రాజ్ తరుణ్ కావాలి. హీరోయిన్ హైదరాబాద్‌కి వచ్చినప్పుడు డైరెక్టర్ సాంటో మోహన్ వీరంటి ఇంట్లో రాజ్ తరుణ్‌తో కలిసి ఉంటోంది. ఇద్దరూ కలిసి గోవా, చెన్నై, పుదుచ్చేరి వెళ్తున్నారు. నాకు ఈ విషయం తెలిసి రాజ్‌ని ప్రశ్నించాను.. అప్పటి నుంచి నన్ను పట్టించుకోవడం మానేశాడు. నేను గతంలో ఓ డ్రగ్స్ కేసులో ఇరుక్కుని, 45 రోజులు జైలులో ఉన్నాను. ఆ సమయంలో రాజ్ నాకు ఎలాంటి సహాయం చేయలేదు. ’ అంటూ నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో రిటన్ కంప్లైంట్ ఇవ్వటం ఇచ్చింది లావణ్య.
అయితే రాజ్ తరుణ్ ప్రస్తుతం ‘తిరగబడరా సామి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ కోసమే ఇదంతా చేస్తున్నారా? లేక నిజంగానే లావణ్య, రాజ్ తరుణ్ మధ్య రిలేషన్ నడిచిందా? అనేది త్వరలోనే తేలిపోనుంది..